హీరోయిన్లు
భలే అందంగా ఉంటారే.. పుట్టుకతోనే ఇంత అందంగా పుడతారేమో...
శరీరాకృతి మొదలు ఆకర్షణీయమైన మేని ఛాయ...చక్కటి జుత్తు
అన్నీ వందశాతం వాళ్లకే బాగుంటాయి.. నా ముఖం ఏం బాగాలేదు. మంచి రంగు
లేను.. జుత్తు సరిగా పెరగడం లేదు... ఇలా అర్ధరాత్రి అద్దం ముందు
కూర్చొని ఏడ్చే టీనేజ్ అమ్మాయిలు చాలామంది ఉంటారు. కథానాయికలు ఇందుకు
మినహాయింపు కాదని బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్‌కపూర్ మాటలు వింటే
అనిపిస్తుంది. సోనమ్ పేరు గ్లామర్ ప్రపంచంలో ఎక్కడో చోట వినిపిస్తూనే
ఉంటుంది. టీనేజ్ అమ్మాయిగా ఉన్నప్పుడు సోనమ్‌కపూర్ కూడా తన రూపం
గురించి చాలా బాధపడేదట. ‘‘చాలామంది అమ్మాయిలు ఉదయం నిద్రలేవగానే
తమ ముఖాన్ని చూసుకొని హీరోయిన్లలా లేదని బాధపడుతుంటారు. నిద్రలేవగానే
హీరోయిన్లు సాధారణ అమ్మాయిల్లానే ఉంటారు. దానికి నేనూ మినహాయింపు
కాదు. టీనేజర్‌గా ఉన్నప్పుడు అబ్బాయిల కంటే పొడుగ్గా.. లావుగా ఉండేదాన్ని.
దానికి తోడు నేను పెద్ద రంగు ఉండేదాన్ని కాదు. కుటుంబ వేడుకలకు వెళ్లినపుడు
ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా? అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌లోకి
అడుగుపెట్టేముందు చాలా ఆలోచించాను. నన్ను నేను మార్చుకున్నాను.
తిండిమీద పూర్తి నియంత్రణ తెచ్చుకున్నాను. అయినా తొలి చిత్రంలో వీపు కనిపించేలా
ఓ డ్రెస్ వేసుకోవాలంటే చాలా భయపడ్డాను’’అని చెప్పింది సోనమ్. ‘‘నేను
ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బయట కాలుపెట్టాలంటే ఓ గంటన్నర పాటు
మేకప్ ఛైర్‌కు అతుక్కుపోవాల్సిందే. ఒక్క నా మేకప్ కోసమే ఆరుగురు
పనిచేస్తారు’’అని చెప్పింది సోనమ్.
No comments:
Post a Comment