టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్
రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన
హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్ గా ఉండడంలోనే కాదు
నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు.
బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న
ఫొటోను తన ఫేస్ బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.
ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి
అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్
చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు
కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని
వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్
చేశారు.
నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్'
రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని
ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు
హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.
No comments:
Post a Comment