ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో
నాని కథానాయకుడుగా నటిస్తున్న
‘జెంటిల్‌మన్’ చిత్రం టీజర్
విడుదలైంది. నాని తన ట్విట్టర్
ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో
పంచుకున్నారు. ‘కనిపించేంత
మంచి వాడు మాత్రం కాదు’ అని
ట్వీట్ చేశారు. టీజర్‌ను బట్టి...
నాని చిత్రంలో విలన్‌గా కనిపిస్తారా...
లేక హీరోగా కనిపిస్తారా అన్న
అంశం ఆసక్తిని రేపుతోంది. ఈ
చిత్రంలో సురభి, నివేదా థామస్
కథానాయికలుగా నటిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక
కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. మణిశర్మ
చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
No comments:
Post a Comment