ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు. పుణె టీమ్ ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్ కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది. చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్ కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.
No comments:
Post a Comment