Wednesday, December 9, 2015

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ ' రగడ'


                          ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వవహించరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనూ ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి తీరుతామని ప్రజాస్వామ్యం సాంస్న్క్రతిక వేదిక విద్యార్థి సంఘం నాయుకులు చెబుతున్నారు. హైకోర్టులో ప్రతివాదిగా పేర్కొన్న వ్యక్తి అసలు ఉస్మానియాలో విద్యార్థియే కాదంటున్నారు. అటువంటప్పుడు హైకోర్టు ఉత్తర్వులు తమకు వర్తించవని అంటున్నారు. ఈ నెల 10న తేదీన బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహణకు ఇప్పటికే విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి తీరుతామని విద్యార్థిసంఘం నేతలు పేర్కొవడంతో, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే యూఁవర్సిటీలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి.
                బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహణపై మొదటి నుంచి రగడ జరుగుతూనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలన్న విద్యార్థి సంఘాల నిర్ణయాని , హిందు, ధార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతీయ సంస్న్క్రతిలో గోవులకఁ ఎంతో ప్రత్యేక స్థానమున్నది, అటువంటి ఆవులను బహిరంగంగా వధించి తింటామంటే చూస్తూ ఊరుకఁనేది లేదని హిందు, ధార్మిక సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. అంతటితో ఆగకుడా ఈ నెల 10వ తేదీన ఉస్మానియా గో హారతి, గోసంరక్షణ దినోత్సవాని  పాటిస్తామని చెప్పారు.
               పాలు, పెరుగు, వెన్న ఇచ్చే ఆవులను పూజించాలని , వధించాలనుకోవడం అవివేకమవుతుందని చెప్పారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఇప్పటికైన తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని పరిసూచించారు. అయితే అంబేద్కర్‌, నెహ్రూలాంటి గోమాంసాన్ని తిన్నారని, వారికి ఎందుకో బుద్దిమాంద్యత లేదని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నించారు. బీఫ్‌ తినడం అన్నది దళిత, బహుజనుల సంస్న్క్రతిలో ఒక బాగమని చెప్పారు. అయితే నిన్న, మొన్నటి వరకు బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహణపై విద్యార్థి, హైంధవ సంఘాల మధ్య సాగిన మాటల యుద్దం ఒక ఎత్తయితే, నేడు నేరుగా కోర్టు జోక్యం చేసుకు ఆదేశించిన తరువాత కూడా బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహించి తీరుతామని విద్యార్థులు పేర్కొనడంతో ఉస్మానియాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment