కళ్ల్లుమిరుమిట్లు గొలిపేలా విద్యుద్దీపకాంతులు.. వాటిని చిన్నబుచ్చుకునేలా చేస్తూ బాలీవుడ్ ముగ్ధ అనుష్క శర్మ నృత్యవిన్యాసం.. ఆపై ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్ స్టెప్పులు.. మధ్య మధ్యలో హోస్ట్ సైఫ్ అలీఖాన్ మాటల విన్యాసాలు.. ఇలా సాల్ట్‌లేక్ వేదికగా మంగళవారం సాగిన ఐపీఎల్-8 ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఐపీఎల్ ఓపెనింగ్‌షోను వరుణుడు జల్లులు కురిపించి ఆశీర్వదిస్తే, ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ల నృత్యజల్లు సాల్ట్‌లేక్ స్టేడియాన్ని తడిపి ముద్దచేసింది. బాలీవుడ్ యువహీరో షాహిద్ కపూర్ డ్యాన్స్ షో ప్రారంభోత్సవానికి నాంది వాక్యం పలికింది. అప్పటిదాకా వరుణుడి ఆటంకంతో నిరాశపడిన ప్రేక్షకులు కమీనే మూవీలో పాటపై ఎనర్జిటిక్ స్టెప్పులతో షాహిద్ బృందం చేసిన ప్రదర్శనతో ఫుల్‌జోష్‌లోకొచ్చారు. ఇక ఆ తర్వాత పొట్టి దుస్తుల్లో అనుష్క శర్మ వేసిన స్టెప్పులకైతే సాల్ట్‌లేక్ స్టేడియం ఈలల మోతతోహోరెత్తిపోయింది. ఫర్హాన్ అక్తర్ బ్యాండ్ బాజా అయితే రాక్ ఆన్ అంటూ కార్యక్రమాన్ని ఒకస్థాయికి తీసుకెళ్లింది.
Tuesday, April 7, 2015
ఆరంభం అదిరె ఐపీఎల్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment