Wednesday, December 3, 2014

వరల్డ్‌కప్‌కు భారత ప్రాబబుల్స్ ఎంపిక నేడే


ఇప్పటికే జాతీయ జట్టులో స్థానం కోల్పోయి రెండు సంవత్సరాలైనా... తిరిగి సాధించుకోవడంలో విఫలమవుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో జరుగనన్న ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేయనున్న 30 మందితో కూడిన ప్రాబబుల్‌‌సలో తన పేరుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరోసారి అవకాశమిసేం్త ఈ 36 ఏళ్ల క్రికెటర్‌ నాల్గోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆతృతతో ఉన్నాడు. ''ప్రతి క్రికెటర్‌ తన దేశం తరపున ప్రపంచ కప్‌ ఆడాలని కోరుకుంటాడు. నేను కూడా ఇప్పటికీ అదే విధంగా కలగంటున్నాను'' అన్న సెహ్వాగ్‌ అందుకే ప్రపంచ కప్‌ టోర్నీ కోసం ఎంపిక చేయనున్న 30 మంది క్రికెటర్ల ప్రాబబుల్‌‌సలో నా పేరు కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే (మూడుసార్లు) 2003, 2007, 2011 సంవత్సరాలలో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నీలో భారత్‌ తరపున సెహ్వాగ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి టైటిల్‌ సాధించగలదనే ధీమా వీరూ వ్యక్తం చేశాడు. 2011లో మేము టైటిల్‌ గెలుచుకున్నాము. 2015లో సైతం టైటిల్‌ నెగ్గే సత్తా భారత్‌కు ఉంది. టీమిండియా సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన ఆటతీరును వన్డేలో ప్రదర్శిస్తున్నారు. కాబట్టే భారత్‌కు మరో టైటిల్‌ సాధించే సత్తా ఉందని అంటున్నాను. అని అన్నాడు.
బౌన్‌‌సను నిషేదిస్తే క్రికెట్‌లో మజానే లేకుండా పోతుంది

Tuesday, December 2, 2014

లింగా సినిమా డిసెంబర్‌ 12 విడుదల


లింగా సినిమా డిసెంబర్‌ 12 విడుదలకు సిద్ధం కానున్నంది. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బర్తడే కూడా అదే తేది కావడం విషేషం. నవంబర్‌ 17 లింగా ఆడియో రీజిల్‌ అయినా విషయం తెలిసిందే. చాలా సినిమా ఎక్కువగా శుక్రవారం, తేదా గురువారం నాడు విడుదల చేస్తారు. లింగా సినిమా మాత్రం డిసెంబర్‌ 12 తేది నాడు శుక్రవారం వస్తుంది ఇది కూడా రజినీకాంత్‌కు కలిసిరావడం మరో విషేషం. 


Saturday, November 29, 2014

మేము సైతం


             హుదూద్‌ తుపాన్‌ బారిన పడి భారీగా నష్టపోయిన వైజాగ్‌ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ' మేముసైతం' పేరుతో ఓ ఈవెంట్‌ నిర్వహించనుంది. నవంబర్‌ 30న జరిగే ప్రోగ్రామ్‌ కోస ప్రత్యేకంగా మేముసైతం డాట్‌ కామ్‌ అనే పేరుతో వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్‌ని అందరూ లైవ్‌లో చేసే విధంగా జెమిని, మామూవీ చానల్స్‌ ద్వారా ప్రత్యేక సమాచారం అందిస్తున్నాం.
'' హుదూద్‌ తుపాన్‌ భాధితుల కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమ వంతుగా సాయాన్ని అందించారు. ఇప్పుడు మరికొంత సాయాన్ని ఇండిస్టీ నుంచి అందించాలన్న ఉద్దేశంతో నవంబర్‌ 30న మేము సైతం అనే ఈవెంట్‌ని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నాం. ఈ ప్రోగ్రామ్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ షోలో మ్యూజికల్‌ షోలు, గేమ్‌షోలు వుంటాయి. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు చూసేవిధంగా ఫ్లాన్‌ చేస్తున్నాం.

క్రికెట్‌ టోర్నమెంట్‌                        హుదూర్‌ తుపాన్‌ బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు నవంబర్‌ 30న '' మేము సైతం '' కార్యక్రమాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్‌ 30 మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి హైదరాబాద్‌లోని కోట్ల విజయబాస్కర్‌రెడ్డి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రికెట్‌ ట్రోఫీ మ్యాచ్‌లలో నాలుగు టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ టీమ్‌లను డ్రా పద్దతిలో సెలెక్ట్‌ చేశారు. నాలుగు టీమ్‌లకు కెప్టెన్‌గా నాగార్జున, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కెప్టెన్లుగా వ్యవహారించనున్నారు. ఒక్కో టీమ్‌లో 16 మంది సభ్యులుంటారు.
నాగర్జున జట్టుకి అఖిల్‌ వైస్‌ కెప్టెన్‌ : కల్యాణ్‌రామ్‌, నిఖిల్‌, నరేష్‌, సాయికుమార్‌, శర్వానంద్‌, సచిన్‌జోషి, నాగశౌర్య, రాజీవ్‌ కనకాల, శివాజీరాజా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత, సోనియా, దిశాపాండే, మధుశాలిని ప్లేయర్స్‌గా ఉంటారు.
వెంకటేష్‌ జట్టుకి మంచు విష్ణు వైస్‌ కెప్టెన్‌ : నారా రోహిత్‌, డా. రాజశేఖర్‌, నితిన్‌, మనోజ్‌ దాసరి, అరుణ్‌ నవీన్‌చంద్ర, సుశాంత్‌, మాదాలరవి, సమంత, ఆదర్శ్‌, మంచు లక్ష్మీ, సంజన, ప్రియబెనర్జీ, తేజస్వి, ప్లేయర్స్‌గా ఉంటారు.

ఎన్టీఆర్‌ జట్టుకి శ్రీకాంత్‌ వైస్‌కెప్టెన్‌ : రవితేజ, నాని, సాయిధరమ్‌తేజ, తనీష్‌, థమన్‌, ప్రిన్స్‌, సందీప్‌కిషన్‌, రఘు, సమీర్‌, అనుష్క, దీక్షాసేథ్‌, శుభ్రఅయ్యప్ప, నిఖిత, అస్మితాసూద్‌ ప్లేయర్స్‌గా ఉంటారు. 

రామ్‌చరణ్‌ జట్టుకి తారకరత్న వైస్‌కెప్టెన్‌ :
సుధీర్‌, సుమంత్‌, గోపీచంద్‌ వడ్డేనవీన్‌, వరుణ్‌సందేశ్‌, ఖయ్యూమ్‌, అజరు, కాజల్‌, ఛార్మి, పూనమ్‌కౌర్‌, ఆది, అర్చన, రీతూ వర్మ టీమ్‌ సభ్యులుగా ఉంటారు.



Wednesday, November 26, 2014

బొమ్మరిల్లు హాసినికి కొడుకు పుట్టాడు




  బొమ్మరిల్లులో హాసిని పాత్రలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన జెనీలియా గుర్తుందా. ఆమె ఈ రోజు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితీష్ ట్విట్టర్‌లో తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. కాగా 2003లో బాయ్స్ సినిమాలో జెనీలియా నటించినప్పటి నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. 2012లో వీరు వివాహం చేసుకున్నారు.

Sunday, November 23, 2014

ఇదో గొప్ప ఛాన్స్


అందాల శృతిహాసన్‌ ఓ అరుదైన అవకాశం అందుకుంది. తండ్రి కమల్‌హాసన్‌ సరసన నటించిన సీనియర్‌ నాయిక శ్రీదేవితో కలిసి నటించే గొప్ప ఛాన్‌‌స కొట్టేసింది. ఈ అమ్మడు విజయ్‌ హీరోగా చింబుదేవన్‌ దర్శకత్వంలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో విజయ్‌ సరసన ప్రధాన నాయికగా హన్సిక నటిస్తోంది.హనీకి తల్లి పాత్రలో శ్రీదేవి కనిపిస్తోంది. ఈ సినిమాలో శృతి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్‌‌స. శ్రీదేవితో కలిసి ఒకే ఫ్రేములో మాత్రం కనిపించే ఛాన్సుందని సమాచారం. అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పటికే సినిమాలు వదిలేసి 26 సంవత్సరాలైంది. రీఎంట్రీ సినిమా ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత ఇప్పుడిలా ఓ పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఇదే తరుణంలో శ్రీదేవితో కలిసి నటించే అవకాశం శృతిని వరించింది. ఇది నిజంగానే అమ్మడికి ఓ మధుర క్షణం. ఇలాంటి క్షణాల్ని ఆస్వాధించే అదృష్టం, అవకాశం వేరెవరికీ రానేరావు. ఇటీవలే విజయ్‌-హన్సిక జంటపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇటీవలే శృతితో సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం అమ్మడు ఆన్‌సెట్‌‌స ఉంది. ఇదో చక్కని ఫాంటసీ చిత్రం. కాబట్టి శృతి యాంజెల్‌లా కనిపిస్తుందేమో చూడాలి.

నాకు నేనే పోటీ!

             
          సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ సుందరి. కమర్షియల్ సినిమాలతో పాటు ఆడపాదడపా ప్రత్యేక గీతాల్లో సత్తా చాటుతోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆమె ఇతర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది.
                 అయితే కత్రినా కైఫ్ మాత్రం నాకు ఎవరూ పోటీకాదని చెబుతోంది. ఆమె మాట్లాడుతూ పోటీ అనేది మరోకరి ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. మంచి చేయకపోయినా... కానీ చెడు చేయకూడదన్నదే నా సిద్దాంతం. ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించను. అయినా సినిమాల పరంగా నేను ఎవరికీ పోటీకాదు. నాకు నేనే పోటీ.నా దృష్టిలో కాంపిటిషన్ అనేది నెగెటివ్ అంశమేమికాదు. పోటీ ఉంటేనే మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది. కెరీర్‌ను మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. నా మటుకు నేను ఇతర హీరోయిన్లు నటించిన సినిమాలు చూసే స్ఫూర్తి పొందుతాను. అలా ఉండటమే మంచిది అని చెబుతోంది. ప్రస్తుతం కత్రినాకైఫ్ ఫాంటమ్ జగ్గాజాసూస్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Tuesday, November 18, 2014

అమ్మాయి ప్రేమకోసం...

 జీవితం, ప్రేమపట్ల నిశ్చితాభిప్రాయాలున్న యువకుడతను. ధైర్యం, సమయస్ఫూర్తి అతని సొంతం. అలాంటి యువకుడు వలచిన చిన్నదాని ప్రేమకోసం ఏం చేశాడు? ప్రేమప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలేమిటి? అనే అంశాల సమాహారంతో చిన్నదాన నీ కోసం చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని చెప్పారు కరుణాకరన్. ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం చిన్నదాన నీ కోసం. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్‌గౌడ్ సమర్పణలో సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. మిస్త్రీ కథానాయిక. అనూప్ స్వరపరచిన పాటలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ప్రేమకథల్ని అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కరుణాకరన్ తనదైన శైలిలో అన్ని వర్గాలను అలరించేలా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియో వేడుకకు పలువురు సినీహీరోలు హాజరవుతారు అన్నారు.

Sunday, November 16, 2014

సిరీస్‌ భారత్‌ క్లీన్‌ స్వీప్‌

మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ విరాట్‌ కోహ్లీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా మ్యాథస్‌
1982 తర్వాత శ్రీలంకను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి
5-0తో లంక ఘోరపరాజయం
సెంచరీలతో సమదానం చెప్పిన భారత్‌
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ
మ్యాథస్‌ వన్డేలో తొలి శతకం

              వెస్టిండీస్‌ పర్యటన అర్థంతరంగా ముగిసిందని బాధపడిన వాళ్ళలో సరికొత్త హుషారు. ధోని గైర్హాజరీలో టీమిండియా ఎలా ఆడుతుందోనని సందేహించిన వాళ్లలో చెప్పలేని సంతోషం.. కుర్ర జట్టు ఏం చేస్తుందోనని ఆందోళన చెందిన వాళ్లలో పట్టలేని ఆనందం? బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మూడు విధంలో భారత్‌ పూర్తిస్థాయి రాణించి శ్రీలంకను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.
భారత్‌, శ్రీలంక మధ్య ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు శతకాలతో చెలరేగిపోయారు. మొదటి వన్డేలో శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానే, రెండో వన్డేలో అంబటి రాయుడు, మూడో వన్డేలో ధావన్‌ (91), కోహ్లీ ( 54) పరుగులు చేసి 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోంది.
నాల్గొవ వన్డేలో రోహిత్‌ శర్మ వచ్చిన ఆవకాశం వదులు కోలేక జట్టులో స్థానం మళ్లీ ఏలా అని సందేహం లేకుండా లంకపై ఏకంగా డబులు సెంచరీ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతడిదే అత్యధిక స్కోరు. ప్రపంచ క్రికెట్లో మాత్రం రోహిత్‌ది రెండో స్థానం. అలె బ్రౌని ( 268), సర్రే) ముందున్నాడు. ఐదో వన్డేలో ఇరు జట్టు కెప్టెన్‌ సెంచరీలతో చెలరెగిపోయారు. చివరికి మాత్రం టిమిండియాదే పైచెయ్యి సాధించింది. మ్యాథస్‌ ( 139), కోహ్లి ( 139) పరుగులతో సమానంగా నిలిచారు.
ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన లంక జట్టు చివరి మ్యాచ్‌లనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న ఆశలు నిరాశగా మారిపోయింది. భారత్‌, లంక మధ్య జరిగిని చివరి వన్డేలో భారత్‌ ఎనిమిది బంతులు మిగిలిఉండగానే విజయలక్ష్యం సాధిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంబటి రాయుడు అర్ధసెంచరీ రాణించడంతో చివరి వన్డేలో గెలిచింది. లంక బ్యాట్స్‌మెన్‌ మ్యాథస్‌ 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇరు జట్ల కెప్టెన్‌లు సెంచరీతో కదం తొక్కారు. లంక చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలన్న ఆశలు నిరాశగా మిగిలాయి. లంక కెప్టెన్‌ మ్యాథస్‌ వన్డే మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోద్‌ చేశాడు.
లంక బోర్డు సభ్యులు నిరాశగామిగిలింది. అనుకోకుండా అట్టహస్థంగా మారిన ఓప్పదం కనుకనే ఈ వన్డే మ్యాచ్‌ టి20 మ్యాచ్‌గా నిలిచింది. ప్రత్యర్థి జట్టు లంకపై అవలోక గెలిచింది. కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలువకూడా భారత జట్టు లంకను క్లీన్‌స్వీప్‌గా చేసింది. భారత జట్టు ప్రయోగాలతో బరిలోకి దిగింది. అనుకోని రీతిలో జట్టులో ఒకరు కాకపోతే మరోకరుగా రాణించి విజయం సాధించారు. శ్రీలంక జట్టు మాత్రం ప్రత్యర్థి జట్టుకు మంచి స్కోరు కూడా నమోదు చేయలేకపోయింది.

భారత్‌ బ్యాటింగ్‌లో అందరు ఫామ్‌లో కోనసాగుతున్నారు. భారత్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుతున్న సమయంలో భారత్‌ ఆటగాళ్లు అందరు ఫామ్‌లో ఉండడం విశేషం. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో... అదిరిపోయే ప్రదర్శన చేసింది. భారత్‌ ఓపెనింగ్‌ సమస్యలతో కుడుకున్న సమయంలో ఏకంగా ముగ్గురు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌లు సెంచరీతో లంకపై చెలరెగిపోయారు. గత కొని రోజులుగా రోహిత్‌ శర్మ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు నాల్గొవ వన్డే మ్యాచ్‌లో డబ్బులు సెంచరీతో జట్టులో స్థానం సంపాధించాడు.
వన్డేలో టాప్‌ -5
రోహిత్‌ శర్మ 264 కోల్‌కతా శ్రీలంక నవంబర్‌ 2014
సెహ్వాగ్‌ 219 ాండోర్‌ వెస్టిండీస్‌, డిసెంబర్‌ 2011
రోహిత్‌ శర్మ 209 బెంగళూరు ఆస్ట్రేలియా, నవంబర్‌ 2013
సచిన్‌ 200 గ్వాలియర్‌ దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 2010
కొవెంట్రి 194 బులవాయో బంగ్లాదేశ్‌, ఆగస్టు 2009


ఉప్పల్‌ స్టేడియంలో 6వేల పరుగులు దాటిన కోహ్లీ


ఉప్పల్‌ భారత్‌, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో విశిష్ఠ అతిధి వచ్చారు. అది మరెవరో కాదు. విరాట్‌ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క. ఆదివారం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చుని శ్రద్దగా మ్యాచ్‌ చూసిన అనుష్క. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది. కోహ్లీ 60 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్‌ సహాయంతో అర్థ సెంచరీ చేశాడు. అ సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందిచింది. అ సమయంలో విరాట్‌ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు?








Saturday, November 15, 2014

చీపురు పట్టి ఊడ్చిన సమంత

అందాల హీరోయిన్‌ సమంతా రూత్‌ ప్రభు చీపురు పట్టి చెత్త ఊడ్చింది. హీరో రామ్‌ ఆమెను స్వచ్చ భారత్‌ కార్యక్రమానికి నామినేట్‌ చేయడంతో ఆమె ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, పరిసరాల్లో చీపురు పట్టుకుని ఊడ్చిన సమంత ఆ ఫోటోలను తన ట్విట్టర్‌ అకౌంట్లో పోస్టు చేసింది. స్వచ్చ భారత్‌లో భాగంగా సమంత తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయి ఆమె చుట్టూ చేరారు. ట్విట్టర్లో ఈ ఫోటోలు షేర్‌ చేసిన సమంత స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొంది. పారిశుద్ద్య కార్మికులతో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్‌ చేసింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి సంబంధించిన చెత్త వారే శుభ్రం చేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చింది.

Wednesday, November 12, 2014

కేరాఫ్‌ కాజల్‌ అనాల్సిందే

కొందరికి మోడ్రన్‌ డ్రెస్సుల్లో లుక్‌ అదిరిపోతుంది. మరికొందరికి చీరల్లో సింగారం రెట్టింపవుతుంది. ఇంకొందరికేమో సాదాసీదాగా కనిపించినా అందం ఇనుమడిస్తుంది. ఈ మూడు రూపాల్లోనూ అందంగా కనిపించే భామలూ ఉన్నారు. టాలీవుడ్‌లో ఉన్న అరడజను ముద్దుగుమ్మల్ని పరిశీలిస్తే ఏ డ్రెస్సు వేసినా ఆ డ్రెస్సుకే కేరాఫ్‌ అడ్రస్‌ అనిపించే ముద్దుగుమ్మ కాజల్‌. అందుకే ఈ అమ్మడు ఎక్కువగా సాదాసీదా దుస్తుల్లోనే కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. లవ్‌ ఫెయిల్యూర్‌ ఫేం బాలాజీ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకƒత్వం వహిస్తున్నారు. చెన్నయ్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోందిప్పుడు. ఆన్‌సెట్‌‌స ఈ అమ్మడు ధరించిన ఓ కాస్టూ్యమ్‌ని ఆన్‌లైన్‌లో రివీల్‌ చేసింది. ఈ లుక్‌ చాలా బావుందని ప్రశంసలొస్తున్నాయి. కాజల్‌ వల్ల ఆ డ్రెస్సుకి అందం వచ్చిందా? డ్రెస్సు వల్ల కాజూకి అందం వచ్చిందా? అంటూ ఆన్‌లైన్‌లో అంతా పోటీ పెట్టుకున్నారు. ఈ తమిళ సినిమాతో పాటు పూరి, ఎన్టీఆర్‌ సినిమా కూడా ఆన్‌సెట్‌‌స ఉంది. కాజల్‌ రెండు చోట్లా బిజీగా ఉంది.

Saturday, November 8, 2014

తల్లి పాత్రలో శ్రీదేవి

 నటిగా అందరి మనసులను దోచేసుకున్న శ్రీదేవీ ఇక తల్లి పాత్రలో కనిపించబోతోంది. హీరోయిన్ హన్సికకు తల్లిగా నటించబోతోంది శ్రీదేవి. హన్సిక తమిళ చిత్ర పరిశ్రమలో బిజీబిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హన్సిక ఈ మూవీలో మహారాణి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మహారాణి తల్లి శ్రీదేవి. వచ్చే వారం షూటింగ్ ప్రారంభం కానుంది. చింబుదేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్‌తో కలిసి హన్సిక నటించబోతోంది. చెన్నై శివార్లలో చిత్ర షూటింగ్ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.

Friday, November 7, 2014

వెంకటేష్ సరసన నదియా?

ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ కథానాయిక నదియా ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో కీలక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. త్వరలో ఆమె హీరో వెంకటేష్‌కు జోడీగా కనిపించనుందని తెలిసింది. గోపీచంద్‌తో సాహసం వంటి వినూత్న చిత్రాన్ని అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 


           వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని, ఒక పాత్రకు జోడీగా నదియా నటించనుండగా మరో పాత్ర సరసన ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.  

Wednesday, October 29, 2014

నటి శ్వేతాబసుకు విడుదలకు నాంపల్లి కోర్డు ఆదేశం

 వ్యభిచారం కేసులో అరెస్టు అయిన హీరోయిన్‌ శ్వేత బసు గత కొంత కాలంగా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంలో ఉంటున్న విషయం తెల్సిందే. ఈమెకు టాలీవుడ్‌ నుండే కాకుండా అనేక భాషల నటీనటులు, దర్శకుల నుండి మద్దతు లభించింది. తన కూతురును విడుదల చేయాల్సిందిగా నాంపల్లి కోర్టులో శ్వేత బసు తల్లి పిటీషన్‌ దాఖలు చేసింది. శ్వేతబసు తల్లి పిటీషన్‌ విచారించిన కోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. శ్వేతబసు విడుదలయిన తర్వాత తమ సినిమాల్లో అవకాశమిస్తామంటూ పలువురు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు వారంత శ్వేతను పట్టించుకుంటారో చూడాలి.

Tuesday, October 28, 2014

కలిసి కనిపించిన బాలీవుడ్‌ ప్రేమపక్షులు

  ప్రేమపక్షులుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు కలిసి.. బహిరంగంగా ఒక చోట కనిపించారు. పుణెలో ఆదివారం జరిగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆటను చూసేందుకు వీళ్లిద్దరూ కలిసి వచ్చారు.ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ జట్లలో విరాట్‌ కోహ్లీ ఎఫ్‌సీ గోవా ఫ్రాంచైజీకి సహ యజమాని.తన జట్టు ఓటమి అంచుల్లో ఉండటంతో కోహ్లీ చాలా ఆందోళనగా కనిపించగా.. తన ప్రేమికుడి ఆందోళనను అనుష్క కూడా పంచుకుంది. ఇక విరాట్‌ జట్టును ఓడించిన ఎఫ్‌సీ పుణె జట్టు సహ యజమాని „హృతిక్‌ రోషన్‌ కూడా మరికొందరు నటులతో కలిసి ఈ ఆట చూసేందుకు వచ్చాడు. అర్జున్‌ కపూర్‌, ఈషాగుప్తాలతో కలిసి ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తూ „హృతిక్‌ కనిపించాడు.

Monday, October 27, 2014

మూడు రోజుల్లో వందకోట్లు...

 షారుఖ్‌ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులన్నింటినీ చేరిపి వేస్తూ మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు దాదాపు 44 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి బాలీవుడ్ వర్గాల్ని విస్మయపరిచిన ఈ చిత్రం వారంతానికి 108.86 కోట్ల వసూళ్లకు చేరుకోవడం గమనార్హం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటించింది.

Sunday, October 26, 2014

పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు విడుదల

            సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్న పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నివాసు, శ్రీహర్షిత్ నిర్మిస్తున్నారు. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ప్రతిని రామ్‌చరణ్, అల్లు అర్జున్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ
 రామ్‌చరణ్‌తో పాటు సాయిధరమ్‌తేజ్ నాకు మరో బిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. అల్లు అరవింద్, దిల్‌రాజు, బన్నివాసు, హర్షిత్‌ల నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం ఆనందంగా వుంది. నా మొదటి సినిమా పునాదిరాళ్లు కంటే ముందు రెండవ సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ విషయంలో పునరావృతం అవుతోంది. రామ్‌చరణ్ మగధీర ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే స్థాయి విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. నేను ఏదైతే ఫాలోఅయ్యానో అదే క్రమశిక్షణను మా కుటుంబంలోని హీరోలంతా అనుసరించడం ఆనందంగా వుంది. ఈ ఇండస్ట్రీకి మరో ప్రకాష్‌రాజ్ లాంటి నటుడిగా జగపతిబాబు ఎదుగుతారు.  ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా, ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి, జగపతిబాబు,అనూప్ రూబెన్స్, బన్నివాసు, హర్షిత్, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, October 25, 2014

రెండూ సమానమే!

 తమిళంలో హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి.

ఈ సారి100కోట్ల హీరో ఎవరు?


 చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ .. వీళ్లంతా 50కోట్ల క్లబ్‌ హీరోలు. ఈ ఆరుగురిలో అరడుగుల బుల్లెట్టు పవన్‌ రికార్డుని అధిగమించే సత్తా ఎవరికి ఉంది? ఉన్నఫళాన ఎవరికైనా 100కోట్ల వసూళ్లు సాధించే సీనుందా? అంటే ఒకే ఒక్కరికి సాధ్యం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ ఒక్కరు ఎవరు? అనేదే ఈ కథాకమామీషు ... 

             టాలీవుడ్‌లో ఇప్పటివరకూ 100కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం `అత్తారింటికి దారేది' పేరు వినిపిస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాత్రమే ఇలాంటి ట్రెండ్‌ని సెట్‌ చేయగలను అని నిరూపించాడు. మరి ఆ తర్వాత ఆ రికార్డును కొట్టే మొనగాడే టాలీవుడ్‌లో లేడా? అంటే ఉన్నాడనే డిస్కషన్‌‌స సాగుతున్నాయి. చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ ఈ ఆరుగురిలో ఒక్కరికే ఆ ఛాన్సుందనేది నిజం. అయితే లేటెస్టు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్‌, మహేష్‌ ట్రాక్‌ రికార్డు ఏమంత బాలేదు. ఈ ఇద్దరూ వరుస ప్లాప్‌లతో రేసులో పూర్తిగా వెనుకబడ్డారు. అందువల్ల ఒక్కసారే అంత పికప్‌ సాధ్యపడదు. వంద కోట్లు అని రాసేసినంత సులువు కాదు వసూళ్లు రాబట్టడం. రికార్డులు తిరగరాయడం. కచ్ఛితంగా సినిమాలో స్టామినాతో పాటు, హీరో, దర్శకుడు కాంబినేషన్‌లోనూ ఆ రేంజు ఉండాలి. అలాగే చరణ్‌ ఇప్పటికే మగధీర సినిమాతో దాదాపు 88కోట్ల వసూళ్లు సాధించాడు. 100కోట్లకు చేరువలోనే ఉన్నా చరణ్‌కి ఆ స్థాయి సినిమాని ఇచ్చే దర్శకుడు టాలీవుడ్‌లో వేరెవరూ కనిపించడం లేదు. మళ్లీ రాజమౌళితో సినిమా చేస్తేనే ఆ స్థాయి వస్తుందేమో! అలాగే బన్నీ రేసుగుర్రం సినిమాతో దాదాపు రూ.65కోట్ల వసూళ్లు సాధించాడు. అతడికి ఇదే `జులాయి' తర్వాత 50కోట్ల వసూళ్లు దాటించిన సినిమా. బన్నీకి కూడా సరైన దర్శకుడు పడితే 100కోట్లు సాధ్యమే. కానీ అది అంత ఈజీ కానేకాదు. మాస్‌రాజా రావితేజ కొట్టాలంటే మ్యాజిక్‌ చేసే కథాంశం కావాల్సిందే. మరి యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కొట్టేస్తాడా? కచ్ఛితంగా .. ఆ ఛాన్‌‌స కనిపిస్తోంది. టాలీవుడ్‌ నంబర్‌ 1 డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బాహుబలి' చిత్రంతో 100కోట్లు బెంచ్‌మార్‌‌కను ప్రభాస్‌ సునాయాసంగా అధిగమిస్తాడు. ఈ సినిమా భారీ కాన్వాసుతో 300 రేంజులో తెరకెక్కుతోంది.
సౌత్‌లోనే `ఐ' చిత్రం తర్వాత దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అలాగే శంకర్‌ తర్వాత దక్షిణాదిన ఆ స్థాయి ఉన్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు ఉంది. మగధీర, ఈగ సినిమాలతో ప్రపంచస్థాయి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళి ఈసారి అంతకంటే పకడ్భందీ స్క్రిప్టుతో యూనివర్శల్‌ అప్పీల్‌తో ఉన్న సినిమాతో ముందుకొచ్చాడు. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకంగా ప్రభాస్‌ ఒక్కడే ఇప్పటికి పవన్‌ రికార్డును కొట్టేసే ఛాన్సుందన్నమాట! 

Friday, October 24, 2014

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ విన్యాసాలు!

 విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దక్షిణ భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్‌మీడియాలో విశేష ఆదరణ లభించింది. మనిషి, మృగరూపం సమ్మిళితంగా వున్న విక్రమ్ ఆహార్యం సర్వత్రా చర్చనీయాంశమయింది. హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో ప్రచార చిత్రం వుందని జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి.


భారతీయ చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో విక్రమ్ పాత్ర చిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగుతుందని తెలుస్తోంది. థ్రిల్, ఫాంటసీ మేళవించిన ఈ చిత్రంలో సమకాలీన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అంతర్లీనంగా చర్చించారని చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివిధ భాషా హక్కులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయినట్లు చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tuesday, October 21, 2014

పెళ్లికి గ్రీన్‌సిగ్నల్!

రణభీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఐదేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. ఇదిలావుండగా ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. వివాహం చేసుకోకుండానే కొన్నేళ్లుగా ఈ ప్రేమికుల జంట సహజీవనం చేస్తోంది. ప్రియురాలి కోసం రణభీర్‌కపూర్ తన సొంతం ఇంటిని విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్రినాకైఫ్‌తో వివాహానికి రణభీర్ కపూర్ తండ్రి రిషికపూర్ తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే కొందరు బాలీవుడ్ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆయన వివాహానికి అంగీకరించారని అంటున్నారు. పెళ్లి ఫిబ్రవరి నెలలో జరగొచ్చని తెలుస్తోంది. అత్యంత వైభవంగా విహాహాన్ని జరిపించేందుకు రిషికపూర్ కుటుంబం సన్నాహాలు చేసుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Wednesday, October 15, 2014

త్రిష తొలిసారిగా ఐటెంసాంగ్



తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగువెలిగింది చెన్నై చిన్నది త్రిష. వర్ధమాన కథానాయికల జోరుతో ఈ సుందరికి అవకాశాలు కరువయ్యాయి. అయితే తమిళంలో మాత్రం ఇప్పటికీ ఈ సొగసరికి మంచి క్రేజ్ వుంది. అక్కడ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇదిలావుండగా సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రత్యేకగీతాల్లో నర్తించని త్రిష తొలిసారిగా అందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...రజనీకాంత్ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లింగా. సోనాక్షిసిన్హా, అనుష్క కథానాయికలు. ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ ప్రత్యేకగీతం వుందట. ఇందులో నర్తించే కథానాయిక కోసం పలువురు అగ్రనాయికలు పేర్లను పరిశీలించారు. చివరకు త్రిషను ఎంపికచేశారు. రజనీకాంత్ చిత్రం కావడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక గీతాన్ని చేయడానికి త్రిష అంగీకరించిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. త్వరలో భారీస్థాయిలో ఈ స్పెషల్‌సాంగ్‌ను తెరకెక్కిస్తారని, సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని అంటున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. 

Tuesday, October 14, 2014

తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మోడీ ప్రకటన

 
                    హుద్‌హుద్‌ తుపాను కారణంగా త్రీవంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెయ్యికోట్ల రూపాయలు ప్రకటించారు. సర్వే అయిన తర్వాత పూర్తిస్థాయి సాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. విద్యుత్తు, తాగునీటి సరఫారా, కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్దరణే తమ ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. మంగళవారం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు సుమారు 1.30 గంటలకు చేరుకున్నారు. నగరంలో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ సాదారణ పరిస్థితులు నెలకొనే వరకూ విశాఖవాసులకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన విషయాన్ని కూడా బీమా సంస్థలతో మాట్లాడుతానన్నారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా చేస్తానని అమెరికాలో చెప్పానని, అలాంటిది ఊహకందని రీతిలో నష్ట ంజరిగిందని వాపోయారు. ఇప్పుడు నష్టం జరిగినంత మాత్రాన నిరుత్సాహ పడక్కర్లేదని కూడా మోడీ ఊరటనిచ్చారు. తర్వలోనే పరిస్థితులు సాధారణ పరిస్థితులకు చేరుకుంటుదని ప్రధాని భరోసా ఇచ్చారు.
అంతక ముందు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకున్న మోడీ గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజుతోపాటు పలువురు రాష్ట్రమంత్రులు స్వాగతం పలికారు. నగరంలో తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలో ప్రధాని పర్యటించారు. అలాగే కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుఫాను ప్రభావిత ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ పరిశీలించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ రైల్వేలు, విమానాశ్రయం మరమ్మతు, జాతీయ రహదారులు తదితరాలను కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. మృతులకు లక్షరూపాయాలు, క్షతగాత్రులకు రూ. 50వేలు సాయంగా మోడీ ప్రకటించారు. 

 
తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన చిత్ర పరిశ్రమ 
హుదుర్‌ తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయాన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకువచ్చింది. కథానాయకులు, ఇతరులు విరాళాలు ఇచ్చి తమ పెద్ద మనుసును చాటుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వారు ప్రకటించిన విరాళాలు
పవన్‌ కల్యాణ్‌ రూ.50 లక్షలు
మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు
ప్రభాస్‌ రూ. 20 లక్షలు
జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 20 లక్షలు
అల్లు అర్జున్‌ రూ. 20 లక్షలు
రామ్‌చరణ్‌ తేజ రూ. 10 లక్షలు మరో 5 లక్షలు రామకృష్ట మిషన్‌కు ప్రకటించారు.
వెంకటసాయి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజశేఖర్‌ రూ. 30 లక్షలు

సంపూర్ణేశ్‌ బాబు రూ. 1 లక్ష
సూపర్‌ స్టార్‌ కృష్ణ రూ. 15 లక్షలు
విజయనిర్మల రూ. 10 లక్షలు


మూగబోయిన పోన్లు

                     ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మూగబోయిన ఫోన్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో వారం రోజులు పట్టే అవాకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. అవసరమైన కేబుల్స్‌, సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు పంపిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు హైదరాబాదు నుండి పలువురు ఉన్నతాధికారులు విశాఖపట్టం వెళ్లారు. ఈ మూడు జిల్లాలో ఉన్న మొత్తం సెల్‌టవర్లలో సగానికి పైగా విరిగిపోయాయని విశ్వసనీయ సమాచారం.
 

చిన్నారి గిరిజ చనిపోయింది



రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బోరు బావిలో పడిపోయిన చిన్నారి గిరిజ మృతి చెందిందని మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గిరిజ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ప్రాణాలతో తిరిగి వస్తుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఈ వార్త వినడంతో కుప్పకూలిపోయారు. అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గడిచిన రెండు రోజులుగా రెస్క్యూ టీం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించింది. ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో అడుకుంటున్న గిరిజ (5) ప్రమాదవశాత్తు 60 అడుగులున్న బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని వెలికి తీసేందుకు ప్రోక్లెయ్నిర్లు, సింరేణి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టారు. భూమి లోపల బండరాళ్లు అడ్డు తగిలాయి. దీనితో గ్రిల్స్‌ వేస్తూ చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు 4 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల లోతులో గొయ్యి తవ్వి 8 సిలిండర్ల ఆక్సిజన్‌ పంపించినా ప్రయేజనం లేకపోయింది. అత్యాధునికమైన సిసి కెమెరాల సాయంతో చిన్నారిని గుర్తించారు. ఆమె మృతి చెందిందని చేప్పారు. మృతదేహంపైన మూడు అడుగుల నీరు ఉందని గ్రహించారు.

Monday, October 13, 2014

కామెడీ హీరోతో అనుష్క రొమాన్స్


         టాలీవుడ్, కోలీవుడ్‌లలో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్క తాజాగా తమిళ హాస్యనటుడు సంతానంతో కలిసి ఓ సినిమాలో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుందన్న ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతోంది. ఇంతకుముందు ప్రముఖ తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆర్యతో పాటు అతడి స్నేహితుడిగా సంతానం కామెడీ పాత్రలో చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు రాజేష్ దర్శకత్వంలోనే తెరకెక్కే కొత్త చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సంతానం సరసన అనుష్కను నటింపజేయాలని చిత్రదర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. దర్శకుడు రాజేష్ లింగా చిత్రం షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ఆమెను సంప్రదిస్తే ఆమె వెంటనే ఒప్పుకుందని టాక్. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, హీరో ఆర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతున్న టాక్ ఏంటంటే ఎలాగు భారీ చిత్రాలు అయిపోతే తర్వాత అనుష్క చేతిలో పెద్ద ప్రాజెక్టులేమి లేవు. ఆమెకు ఇప్పటకే 34 సంవత్సరాలు వచ్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు వయస్సలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోపోతే ఎందుకన్నట్టు కామెడీ నటుల పక్కన కూడా హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పేసుకుంటుందని గుసగుసలాడుకుంటున్నారు.

గోపీచంద్‌ తండ్రయ్యాడు

 హీరో గోపీచంద్‌ తాజాగా తండ్రయ్యాడు. ఇటీవలే గోపీచంద్‌ తండ్రి కాబోతున్నాడనే విషయం మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.   తాజాగా నేడు ( అక్టోబర్‌ 13) గోపీచంద్‌ భార్య రేష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ' లౌక్యం' చిత్ర యూనిట్‌ మీడియాకు వెళ్లడించింది. గోపీచంద్‌ తాజాగా నటించిన ' లౌక్యం' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచిత్రం విజయంతో పాటు బాబు పుట్టాడనే సంతోషయంతో గోపీచంద్‌ ఉన్నాడు. గత సంవత్సరం హీరో శ్రీకాంత్‌ మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు.

Sunday, October 12, 2014

వణికించిన హుదూద్‌!

 తీవ్ర పెను తుఫాన్‌గా మారిన హుదూద్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరం దిశగా శరవేగంగా దూసుకొస్తున్నది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రచండమైన ఈదురుగాలులతో ఆదివారం మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరాన్ని ఢీకొట్టనుంది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.


తీరం దాటే సమయంలో భారీ వర్షాలు

                        హుదూద్ తుఫాన్ తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భావిస్తున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాన్.. గత కొద్ది గంటలుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. ఇది ఉత్తరాంధ్ర తీరం మీదుగా ప్రయాణించి విశాఖపట్టణం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుందని భారత వాతావరణశాఖ శనివారం తన బులిటెన్‌లో తెలిపింది.


 మరో 3 రోజులుకుంభవృష్టి    హుదూద్‌ తుఫాన్‌ ప్రభావం కారణంగా మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖలో పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్‌ ప్రభావం కొంతమేరకు తగ్గినా కూడా ఈ నెల 15 వ తేదీ వరకూ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో గాలులు తీవ్రత అంతగాలేదని, దక్షిణ ఒడిశాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.

తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హుదుద్‌ ప్రభావం
                హుదుద్‌ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంపై తీవ్రప్రభావాన్ని చూపించింది. మండలంలోని తిర్రియానం, పల్లంకుర్రు, వలసలతిప్ప గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పల్లంకుర్రు గ్రామంలోని పాఠశాలలో బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పునరావాలస కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుదుద్‌ తుఫాను నేపథ్యంలో విశాఖలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం తూర్పుగోదావరి జిల్లా నుండి లక్ష ఆహార పొట్లాలను ప్రభుత్వం తరలించింది. మరో పక్క విశాఖ నగరంలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. ఈదురుగాలులకు కూలిన కటౌట్లు, ఫ్లెక్సిలు, చెట్ల కొమ్మలతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలు వీధులు ద్విచక్ర వాహనాలను నడిపించే పరిస్థితి కూడా లేదంటున్నారు. 


విశాఖలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
                          హుదుద్‌ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తుఫాను తీరం దాటిన సమయం నుండీ భారీ ఈదురుగాలులతో విశాఖ నగరం అతలా కుతలం అయింది. దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రమే విద్యుత్‌ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. తుఫాను సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు రేడియోలను ఆశ్రయిస్తున్నారు. తుఫాను బాధితుల కోసం షెల్టర్లుగా రైలు బోగీలు కాగా తుపాను బాధితుల కోసం ఖాళీ రైలు బోగీలను షెల్టర్లుగా ఉపయోగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని కోసం రాజమండ్రి నుండి విశాఖ వరకు 55 ఖాళీ రైలు కోచ్‌లను పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిసా తీరంపై హుదుద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోపాల్‌పూర్‌, భవనేశ్వర్‌, కటక్‌, గంజామ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోపాల్‌పూర్‌ తీరంలో బలమైన అల ఒక యువతిని సముద్రంలోకి లాగేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.

Saturday, October 11, 2014

రెండో వన్డేలో భారత్‌ గెలుపు

 టీమిండియా పుంజుకుంది. విండీస్‌తో రెండో వన్డేలో ఘన విజయం సాధించి కోచి పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ధోనీసేన రెండో వన్డేలో 48 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1కు సమం చేసింది. విరాట్‌ కోహ్లి (62, 78 బంతుల్లో 5ఫోర్లు), సురేష్‌ రైనా (62, 60 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు), హాఫ్‌ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్‌ ధోని (51 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ స్మిత్‌ (97) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేదు. బౌలర్లు షమి, జడేజా, మిశ్రాలు విండీస్‌ పతనాన్ని శాసించారు.
263 పరుగుల ఛేదనలో విండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు డ్వేన్‌ స్మిత్‌ (97), డారెన్‌ బ్రావో (26) 64 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. లెండ్లీ సిమ్మోన్స్‌ గాయం కారణంగా ఓపెనర్‌గా వచ్చిన బ్రావో..స్మిత్‌తో కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. అర్థ సెంచరీ భాగస్వామ్యంతో సాఫీగా వెళ్తోన్న విండీస్‌ ఇన్నింగ్స్‌కు మహ్మద్‌ షమి బ్రేక్‌ ఇచ్చాడు. చక్కటి బంతితో బ్రావో వికెట్లను గిరాటేసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆల్‌ రౌండర్‌ పొలార్డ్‌ (40) పించ్‌ హిట్టర్‌గా ఎడాపెడా బౌండరీలు బాదాడు. మూడు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్‌..మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ ఏమాత్రం జోరు తగ్గించకుండా నిర్థాక్షిణ్యంగా బౌండరీలు బాదాడు. 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు సాధించిన స్మిత్‌ సెంచరీ ముంగిట షమికి వికెట్‌కు కోల్పోయాడు. తొలి వన్డే సెంచరీ హీరో శామ్యూల్స్‌ (16)ను ఉమేష్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దినేస్‌ రామ్‌దిన్‌ (3)ను మిశ్రా తన ఆఖరి ఓవర్‌లో ఔట్‌ చేశాడు. వరస ఓవర్లలో ఫామ్‌లో ఉన్న శామ్యూల్స్‌, రామ్‌దిన్‌లు ఔట్‌ కావటంతో విండీస్‌ ఒత్తిడిలో పడింది. కెప్టెన్‌ బ్రావో(10), డారెన్‌ సామీ (1), రస్సెల్‌ (4)లను వెంటవెంటనే పెవిలియన్‌ చేర్చిన ధోనీసేన మ్యాచ్‌పై పట్టు బిగించింది.
రాణించిన కోహ్లి, రైనా : టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, టీమిండియాకు కోచి వన్డేలాగా శుభారంభం మాత్రం దక్కలేదు. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌ చేరి నిరుత్సాహపరిచారు. ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ (1)ను టేలర్‌ బలిగొనటంతో టీమిండియా పరుగుల వేటలో వెనకంజ వేసింది. మరో ఓపెనర్‌ అజింక్య రహానే(12) సామీ బౌలింగ్‌లో సులభమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (32) మరోసారి చక్కటి శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచటంలో విఫలమయ్యాడు. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నంలో రాయుడు స్పిన్నర్‌ సులేమాన్‌ బెన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాయుడు నిష్క్రమణ అనంతరం కోహ్లికి జతకలిసిన రైనా టీమిండియాకు భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. కోహ్లి నెమ్మదిగా ఆడినా రైనా మంచి స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన కోహ్లి, రైనా నాల్గో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలోనే రైనా, కోహ్లిలు అర్థ శతకాలు పూర్తి చేశారు. ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన రైనా..మరో సెంచరీ దిశగా సాగుతున్నట్లే కనిపించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన రైనా పెవిలియన్‌ బాట పట్టాడు. హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన కోహ్లి..ఈఏడాది ఫిబ్రవరి తర్వాత (వన్డే, టెస్ట్‌ల్లో) నమోదు చేసిన ఏకైక అర్థ శతకం ఇదే కావటం విశేషం. కెప్టెన్‌ ధోని (51నాటౌట్‌, 40 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) ఆఖర్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 250 దాటించాడు. రవీంద్ర జడేజా (6) కీలక సమయంలో పరుగులు చేయటంలో విఫలమయ్యాడు.

Wednesday, October 1, 2014

అమీర్‌ఖాన్‌తో సినిమా!

 దర్శకుడు రాజమౌళికి బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వుంది. ఆయన దర్శకత్వం వహించిన విక్రమార్కుడు మర్యాద రామన్న చిత్రాలు హిందీలో పునర్నిర్మించబడి భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా షాహిద్‌కపూర్ హీరోగా సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో మగధీర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.             
                          ఇదిలావుండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ హీరోగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన వున్నట్లు రాజమౌళి వెల్లడించారు. హిందీ చిత్రాల్ని తక్కువగా చూస్తాను. అయితే అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్‌హీరాని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అమీర్‌ఖాన్ హీరోగా సినిమా చేయాలనే ఆలోచన వుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు రాజమౌళి.

Wednesday, September 24, 2014

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...?

mahashమహేష్ బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం సెట్స్‌పైకి రానుందని తెలిసింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం వచ్చే ఏడాది మహేష్, పూరి జగన్నాథ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం.

Monday, July 14, 2014

టెస్టు క్రికెట్‌కు మహేల గుడ్‌బై




శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్‌కు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. స్వదేశంలో ఈ నెల 16న దక్షిణాఫ్రికాతో, ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ఆనంతరం జయవర్ధనే టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

           దీనికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అశ్లే డిసిల్వాకు జయవర్ధనే(37) లేఖ రాసినట్లు లంక బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. గత 18 ఏండ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కాని టెస్టు కెరీర్ నుంచి వైదొలగడానికి ఇది సరైన సమయం అని జయవర్ధనే పేర్కొన్నాడు. 1997లో భారత్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ లంక దిగ్గజ బ్యాట్స్‌మన్ 145 టెస్టుల్లో 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక తొలిసారి నెగ్గిన అనంతరం సహచర ఆటగాడు సంగక్కరతో కలిసి మహేల టీ20లకు గుడ్‌బై చెప్పాడు.

జర్మనీ జట్టు విజేత


 బ్రెజిల్ వేదికగా జరిగిన జర్మనీ-అర్జెంటీనా సాకర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఎవ్వరూ ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో మరో 30 నిమిషాల అదనపు సమయానికి వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ 113వ నిమిషంలో జర్మనీ ఆటగాడు గోట్జే గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం మిగిలిన ఏడు నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా జట్టు గోల్ సాధించలేకపోయింది. దీంతో 1-0 ఆధిక్యంతో జర్మనీ జట్టు సాకర్ ప్రపంచ విజేతగా నిలిచింది. 

 నాలుగోసారి ప్రపంచకప్ గెలుచుకున్న జర్మనీ

             అర్జెంటీనాతో నేడు జరిగిన ఫైనల్‌మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా 24 ఏళ్ల తర్వాత జర్మనీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు జర్మనీ జట్టు నాలుగుసార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. సాకర్ ప్రపంచకప్ పోటీల్లో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరిన జర్మనీ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1954లో మొదటిసారి, 1974లో రెండోసారి, 1990లో మూడోసారి, 2014లో నాల్గొవసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 1966, 1982, 1986, 2002లో రన్నరప్‌గా నిలిచింది.

Wednesday, July 9, 2014

విజయ్ అజేయ సెంచరీ


  నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. ఓపెనర్ మురళీ విజయ్ (122 బ్యాటింగ్; 294 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. విజయ్‌కు జతగా కెప్టెన్ ధోనీ (50 బ్యాటింగ్; 64 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. ఇద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అంతకుముందు విజయ్‌కి పుజార (38), రహానే (32)లు చక్కగా సహకరించారు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయిన దశలో పుజార, రహానేలతో విజయ్ 73, 71 పరుగులు జోడించి ఇన్నింగ్‌ను గాడిలోపెట్టాడు. ధవన్ (12), కోహ్లీ (1)లు మాత్రం నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించేక్రమంలో భారత్‌కు రెండోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం. చేతిలో 6 వికెట్లు మిగిలివున్న దశలో 375-425 వరకు సాధిస్తే, తర్వాత బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు. అండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్‌ను పక్కనబెట్టారు.

స్కోరుబోర్డు  భారత్: విజయ్ (బ్యాటింగ్) 122, ధవన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12, పుజార (సి) బెల్ (బి) అండర్సన్ 38, కోహ్లీ (సి) బెల్ (బి) బ్రాడ్ 1, రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32, ధోనీ (నాటౌట్) 50, ఎక్స్‌ట్రాలు: 4,

మొత్తం: 90 ఓవర్లలో 259/4;
వికెట్ల పతనం: 1-33, 2-106, 3-107, 4-178;
బౌలింగ్: అండర్సన్ 21-6-70-2, బ్రాడ్ 19-8-26-1, స్టోక్స్ 19-4-47-0, ప్లంకెట్ 21-4-56-1, అలీ 9-0-50-0, రూట్ 1-0-6-0.

Tuesday, July 8, 2014

ప్రయివేటు దిశలో రైల్వే


మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్‌ ఓ వైపు సంపన్నుల సౌకర్యాలకు పెద్దÄపీట వేస్తూ మరో వైపు సామాన్యుడిని నిర్లక్ష్యం చేసింది. భారాలకు బాటలు వేసింది. బుల్లెట్‌, సెమీ బుల్లెట్‌ రైళ్లు, ప్రీమియం ఎసి రైళ్లు, రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు, బయో టాయిలెట్లు, ఆన్‌లైన్‌లో నిమిషంలో 7200 టికెట్లు బుక్‌ చేసుకునే వీలు..ఇలా బ్రహ్మాండమైన సౌకర్యాల రంగుల చిత్రం చూపించారు. అదే సమయంలో సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే చార్జీలు సంవత్సరానికోసారి బడ్జెట్‌ సమయంలో సమీక్షించే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై రైల్వే వాడే ఇంధనాలు-బొగ్గు, డీజిల్‌, విద్యుత్‌- ధరల ఆధారంగా తరచూ చార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు మంత్రి సదానంద గౌడ. దీనికి తోడు ఈ బడ్జెట్‌లో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యానికి(పిపిపి), విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచి పరిచారు. వీటి చరిత్ర మన దేశంలో కాని ఇతర దేశాల్లో కాని చూస్తే లాభాల వేటలో చార్జీల మోత భరించలేని స్థాయికి చేరడం ఖాయం. లైన్ల డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌లో తమ ప్రాధాన్యతని పేర్కొనడంలో ఉద్దేశం కూడా వీరికి లాభాలు చేకూర్చడమే. ఈ నిర్ణయంతో వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే లైన్లు వేసే సామాజిక బాధ్యతను విస్మరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు మోడీ సర్కార్‌ మొండి చేయి చూపినట్లే. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నవిధంగా ఓ కమిటీ వేశాం దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల నుండి వ్యతిరేకతను తగ్గించే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులున్నాయి వాటికి 20,690 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. కేటాయింపుల ప్రస్తావనే లేదు. భారత రైల్వేలను కార్పొరేటీకరించే దిశగా తొలి అడుగులు వేసింది మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్‌.

Monday, July 7, 2014

విలన్‌గా.. చేయాలనుంది..

'చాలా రోజుల తర్వాత మంచి కుటుంబ కథా చిత్రాన్ని చేశాను. 27 సంవత్సరాల కెరీర్‌లో 'హైటైం'లో చేసిన సినిమా ఇది. రైట్‌టైమ్‌ అనేది మనచేతుల్లోలేదు. కానీ హైటైం అనేది ఎప్పుడోవస్తుంది. ఈ విభాగంలో థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ ఉన్న కథను చేయలేదు. అది 'దృశ్యం'తోనే కుదిరింది' అని విక్టరీ వెంకటేష్‌ అన్నారు. రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన 'దృశ్యం' చిత్రం ఈనెల 11న విడుదలవుతుంది.
 
 

Sunday, June 29, 2014

బోనమెత్తి.. పరవశించి

శివసత్తులు ఊగంగా.. పోతరాజులు ఆడంగా.. తెలంగాణ ఆడపడుచులు బోనమెత్తి పరవశించిపోయారు. స్వరాష్ట్రంలో సగర్వంగా బోనమెత్తిన నగరం పులకించిపోయింది. గోల్కొండ కోట భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. గోల్కొండలో మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపునకు ఆత్మీయ స్వాగతం పలికారు. 


ఆలస్యంగా ప్రారంభం

బోనాల పండుగ మొదటి పూజ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మధ్యాహ్నం1.30కు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ రామకష్ణారావు పట్టువస్ర్తాలను తీసుకొని లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వస్ర్తాలను తీసుకెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ తీగుల్ల విజయ్‌కుమార్‌కు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి తొట్టెలకు పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌సింగ్, నాయకులు కావూరి వెంకటేష్, తూముకుంట అరుణ్‌కుమార్, కోడూరి శ్రీధర్‌సాగర్ తదితరులు నత్యం చేశారు.

విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు. 



కోట వద్ద పోతరాజుల విన్యాసాలు

గోల్కొండ కోట ప్రవేశ ద్వారం చౌరస్తా వద్దకు ఊరేగింపు చేరుకోగానే పోతరాజుల బందం చేసిన హడావుడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుపక్కల పోతరాజులు కలియతిరుగుతూ గోల్కొండ ఆలయం వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. అక్కడి నుంచి వేగంగా కోటపై ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు. దీంతో తొలి రోజు బోనాల ఉత్సవం ముగిసింది. 


ఊపిరిపీల్చుకున్న పోలీసులు

రంజాన్, బోనాల పండుగ తొలిపూజ ఆదివారమే కావడంతో నగర పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఉన్నతాధికారులు పలుమార్లు పీస్‌మైత్రి కమిటీ సమావేశాలను నిర్వహించారు. అంతేకాకుండా ఆదివారం భారీగా పోలీసులను మోహరించారు. బోనాల మొదటి పూజ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనలతో వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీలు లింబారెడ్డి, , గోషామహల్, ఆసిఫ్‌నగర్, ఏసీపీలు డి. శ్రీనివాస్, రాంభూపాల్‌రావు, బందోబస్తులో పాల్గొన్నారు. 

సందర్శకుల తాకిడి

బోనాల పండుగను పురస్కరించుకుని గోల్కొండ కోటలోని ఉచిత ప్రవేశం ఉండటంతో ఆదివారం రికార్డు స్థాయిలో గోల్కొండను సందర్శకులు సందర్శించారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు ఆదివారం ఒక్కరోజే గోల్కొండను సందర్శించడం విశేషం.    

Monday, June 16, 2014

'రన్‌ రాజా రన్‌' ఆడియో అవిష్కరణ

 ' రన్‌ రాజా రన్‌' ఆడియో అవిష్కరణలో ముఖ్య అతిధిగా ప్రభాస్‌, గోపిచంద్‌ హాజరయ్యారు. శర్వానంద్‌ హీరోగా యువిక్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ' రన్‌ రాజా రన్‌' ఈ సిఁమా ఆడియో ఆదివారం నాడు విడుదల జరిగింది. ఆడియో సీడీలను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఆవిష్కరించారు. గోపిచంద్‌ తొలి సీడీఁ అందుకఁన్నారు. ఈచిత్రంలో సంగీతం గిబ్రాన్‌, ఁర్మాతగా వి.వంశీకృష్ణరెడ్డి, దర్శకఁడు సుజిత్‌ అలాగే హీరోయిన్‌గా సీరత్‌ కపూర్‌గా నటించనున్నారు.
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ : '' ప్రమోద్‌, వంశీ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడు. కొరటాల శివను ఇంట్రడ్యూస్‌ చేసిన విధంగా ఇప్పుడు సుజిత్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. మది ఫోటోగ్రఫీ గురించి నేను ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీన్‌ ప్రెష్‌గా ఉంది. పాటలు బాగా కఁదిరాయి. శర్వానంద్‌ ఈ సిఁమా కోసం ఒక రూపాయి రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోలేదు. సిఁమా బాగా వస్తే చాలు తర్వాత చూద్దామఁ అన్న హీరో. ఇంకా బాహూబలికి కోసం అందరూ ఎందురు చూస్తున్నారు. అది వచ్చే సంవత్సరం జనవరి తర్వాత సిఁమా విడుదల అవుతుంది.

గోపిచంద్‌ మాట్లాడుతూ : '' ప్రమోద్‌ వంశీ చాలా కాలంగా తెలుసు. మంచి మిత్రులు. మిర్చి సిఁమాతో సూపర్‌హిట్‌ కొట్టి మంచి ప్రొడ్యూసర్స్‌గా పేరుతెచ్చుకఁన్నారు. ప్రతి సాంగ్‌లో వేరియేషన్‌ ఉంది. ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది. శర్వానంద్‌ నాకఁ తమ్ముడులాంటోడు. ఈ సిఁమా ఫస్ట్‌లుక్‌ చాలా బాగుంది. సిఁమా పెద్ద సెక్సెస్‌ అయ్యి యూవి క్రియేషన్స్‌ పెద్ద బ్యానర్‌గా పేరు తెచ్చుకోవాలి'' అఁ చెప్పారు.
శర్వానంద్‌ మాట్లాడుతూ : '' మా సిఁమాకి పఁ చేసిఁ ప్రతి ఒక్కరిఁ చాలా థాంక్స్‌. అందరూ చాగా కష్టపడి పఁచేశాం. సిఁమా అందరికి నచ్చుతుందఁ అనుకఁంటున్నారు.
చిత్ర దర్శకఁడు సుజిత్‌ మాట్లాడుతూ : హీరో శర్వానంద్‌ను నేనెలా చూపించాలనుకఁన్నానో అలాగే చూపించాను. హీరోయిన్‌ చక్కగా నటించింది. ఈ సిఁమాకి పఁచేసిన వాడిలో నేనే చిన్నవాణ్ణి మిగతా వారందరూ అనుభవంలో, వయసులో నాకంటే పెద్దవారు.అందరూ బాగా సపోర్ట్‌ చేశారు.







Saturday, June 14, 2014

తెలంగాణ శకుంతల కన్నుమూత

ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల కన్నుమూశారు. నిన్న( జూన్‌ 13) అర్థరాత్రి ఆమె హైదరాబాద్‌లో కొంపల్లిలోని ఆమె ఇంట్లో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించింది. సూరారంలోని నారాయణ హాస్పిటల్‌కు తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైధ్యులు తెలిపారు. గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతిచెందిన ప్రముఖ సినీ నటి తెలంగాణ శకఁంతలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నివాళులర్ఫించింది. అనంతరం ఆమె భౌతికకాయాఁకి అల్వాల్‌లోని శ్మశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
  శకు తల ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శకఁంతల భౌతికకాయాని అభిమానులు సందర్శనార్థం కొంపల్లిలోని ఆమె    నివాసం నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు తరలించారు. సినీ నిర్మాత డి. రామానాయుడు సహగద్దర్‌, వేణుమాదవ్‌, హేమా, ఝూన్సీ పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్బించారు. అనంతరం అంతిమయాత్ర             నిర్వహించి అల్వాల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె సుమారు 74 చిత్రాల్లో నటించిన శకు తల ప్రస్తుతం ఆర్‌. నారాయణమూర్తి నిర్మించిన రాజ్యాధికారం చిత్రంలో కీలకపాత్ర పోషించారు. మహారాష్ట్రలో పూనేలో 1949లో శకఁంతల జఁ్ని చింది. ఆవిడ పూర్తి పేరు కడియాల శకఁంతల ఒక బేబి, ఒక బాబు ఉన్నారు.

సినిమా రంగంలో 1979 నుంచి ...
1979లో మా భూమి ద్వారా తెలుగు సిని మా రంగంలో అడుగుపెట్టారు. 75కు పైగా సిఁమాలలో నటించారు. ఈమె నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద. ఈమెకు కుక్క సిఁమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.

Monday, June 9, 2014

ప్రారంభమైన ' గోపాల ... గోపాల '


విక్టరి వెంకటేష్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ల పవర్‌ పుల్‌ కాంభినేషన్‌లో సురేష్‌ ప్రోడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఁర్మిస్తున్న ' గోపాల ... గోపాల' చిత్రం వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోఁ రామానాయుడు స్టూడియో ప్రాంగణం చలన చిత్ర ప్రముఖుల సమక్ష్లఓ ఈ చిత్రం అత్యంత వైభవంగా చిత్రీకరణ మొదలైంది. దర్శకఁడు కిషోర్‌ పార్ధసాఁ ఈ చిత్రాఁకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ నాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకఁడు అనూప్‌ ఈ చిత్రాఁకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్‌ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్‌ పూర్తవుతుంది అఁ చిత్ర ఁర్మాతలు డి. సురేష్‌ బాబు, శరత్‌ మరార్‌లు తెలిపారు. వైభంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద ఁర్మాతలు డి రామానాయుడు. అల్లు అరవింద్‌, కె.ఎస్‌ రామావావు. జెమిఁ కిరణ్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి, బూరుగ పల్లి శివరామకృష్ణ, మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరి వెంకటేష్‌ తనయుడు మాస్టర్‌ ' అర్జన్‌' ప్రత్యేక ఆకర్షణగా ఁలిచారు.