Tuesday, June 25, 2013

'సింగమ్‌' గీతాలు


 తమిళ నటుడు సూర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం 'సింగమ్‌'( యముడు-2). హరి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా సమర్పిస్తున్నారు. చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగింది. చిత్రంలోని తొలిపాటను కార్తి, రెండోపాటను లక్ష్మణ్‌కుమార్‌, మూడో పాటను హరి, నాలుగో పాటను శశాంక్‌ వెన్నెలకంటి, ఐదో పాటను అనుష్క ఆవిష్కరించారు. సినిమా థియేటర్‌ ట్రైలర్స్‌ సూర్య ఆవిష్కరించారు. ఆడియో సిడిలను దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేసి, కార్తికి అందజేశారు.
గేయ రచయిత సాహితి మాట్లాడుతూ..'పవర్‌ ప్యాక్‌డ్‌ సినిమా ఇది. సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. పోలీస్‌ వ్యవస్థపై హరి పరిశోధన చేశారు. దేవిశ్రీ ఎనర్జిటిక్‌ పాటలిచ్చారు. ఆధునికంగా ఉన్నాయి. ఒకే ట్యూన్‌లో రెండు కోణాలున్న పాటలు కూడా ఉన్నాయి. ఇందులో ఓ ఐటెం సాంగ్‌, పోలీస్‌లోపలి వ్యక్తిని గురించి ఓ పాట రాశాను' అని అన్నారు.
 

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ..'యముడు' చిత్రాన్ని పెద్ద విజయం చేసినందుకు థాంక్స్‌. దర్శకుడు హరి, సూర్య, జ్ఞానవేల్‌రాజాకు ధన్యవాదాలు. 'సింగం' అనేది బ్రాండ్‌ అయింది. హిందీలో కూడా హిట్‌ అయింది. తెలుగువారు అందరూ ఆదరిస్తా'రని తెలిపారు.
శశాంక్‌ వెన్నెలకంటి మాట్లాడుతూ.. 'తోటకూర తినేవాడికి వేటకూర తిన్నట్టు ఉంటుంది..హరి సినిమాకు పనిచేయటం. ఈ సినిమాలో పంచ్‌ డైలాగ్స్‌ రాస్తుంటే, చాలా ఆనందంగా, పండుగలా అనిపించింది. ఇప్పటికీ కంపోజింగ్‌ను నమ్మి సంగీతం చేసే వ్యక్తి దేవిశ్రీప్రసాద్‌. 'గజని' సినిమాతో మా ప్రయాణం మొదలైంది. వారి బ్యానర్‌లో కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ..'సింగం' నా 12వ సినిమా. సూర్య, దేవిశ్రీప్రసాద్‌తో ఇది నా నాలుగో సినిమా. 'యముడు' నుంచి 'సింగమ్‌' వేరే డైమెన్షన్‌తో ఉంటుంది. వంద శాతం కమర్షియల్‌ మూవీ ఇది. విత్‌ లాట్‌ ఆఫ్‌ లాజిక్‌. అందరూ ఇష్టంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరి కష్టం సినిమాలో కనిపిస్తుంది. సినిమా బావుంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను' అని తెలిపారు.
తమిళ హీరో కార్తి మాట్లాడుతూ.. 'యముడు' చిత్రాన్ని చాలా పెద్ద సక్సెస్‌ చేశారు. ఈ సినిమాలో అంతకు మించి పవర్‌ ప్యాక్‌ ఉంది. అన్నయ్య 'సింగమ్‌' చూశాక నాక్కూడా ఖాకీ బట్టలు వేసుకోవాలనిపిస్తుంది' అని అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. 'నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మా కుటుంబంలో అందరూ నన్నూ గొప్పగా చూస్తున్నానంటే దానికి కారణం తెలుగువారి అభిమానమే. మంచి సినిమా ఇది. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజికల్‌ హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. నిజ జీవితంలో పోలీస్‌ అందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు.

No comments:

Post a Comment