Sunday, June 30, 2013

ఒక వికెటు తేడాతో వెస్లిండీస్‌ విజయం

చార్లెస్‌ సెంచరీ మిస్‌ 18 పరుగులు చేస్తే విజయం సాధింస్తుంది. వెస్లిండీస్‌ చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. ఒకొక్కపరుగు సాధించి చివరికి బౌలర్లులు విజయం సాధించింది. 

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనరు క్రిస్‌గేల్‌ 9 బంతులల్లో రెండు ఫోర్లులతో 11 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో రైనా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన స్మిత్‌ పరుగులు ఏమిచేయకుండనే యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన శ్యాముల్స్‌ ఒక పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కష్టాలలో ఉన్న జట్టును చార్లెస్‌, బ్రావో ఆదుకున్నారు. నాల్గొవ వికెట్టుకు 116 పరుగుల బాగ్యస్వామం నెలకొల్పారు. బ్రావో 55 చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బాట్స్‌మెన్‌లు పొల్లాడ్‌ 4, రామ్‌దిన్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచారు. అప్పటి భారత్‌ విజయం ఆశలు నిరాశగఉన్నాయి. క్రీజులో చార్లెస్‌, స్వామి ఉన్నారు. స్వామి వచ్చి రావడంతో ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. 25 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కోట్టి మరో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. 36 పరుగులు చేస్తే వెస్టిండీస్‌ గెలుస్తుంది. చివరికి చార్లెస్‌ 100 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 97 పరుగులు చేసి మూడు పరుగుల వద్ద సెంచరీ మిస్‌ అయ్యాడు. చివరికి బౌలర్లు ఒక్కొక్కపరుగు జోడించి విజయ లక్ష్యం సాధించింది. భారత బౌలింగ్‌లో యాదవ్‌ మూడు, అశ్విన్‌, శర్మ చెరో రెండు వికెట్లు, రైనా, కుమార్‌ చెరో ఒక వికెటు లభించింది.

Saturday, June 29, 2013

సీఎం కాన్వాయ్‌పై కూలిన భారీ వృక్షం

 సచివాలయంలో సమత బ్లాక్‌ వద్ద సీఎం కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. సీఎం కాన్వాయ్‌లోని జామర్‌ వాహనం, అంబులెన్స్‌ పాక్షికంగా ధ్వంసమయ్యాయి.












Friday, June 28, 2013

లంకపై ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఘన విజయం

గేల్‌ సెంచరీ

 వెస్లిండీస్‌, లంక మధ్య జరుగుతున్న వెస్లిండీస్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన లంక 208 పరుగులకే అలౌట్‌ అయ్యింది. జయవర్థనే, మాథ్యూస్‌ ఇద్దరు అర్థసెంచరీతో జట్టును అదుకున్నారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు ఔట్‌ అయ్యారు. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో రామ్‌పాల్‌ మూడు, నరెన్‌ నాలుగు వికెట్లు తీశారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాదించింది. గేల్‌ సెంచరీ చేశాడు. చార్లేస్స్‌ 29, బ్రావో 27, పోల్లార్డ్‌ 0 పరుగులు చేశారు. శ్వాముల్స్‌ 15, బ్రావో 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో మరియు బ్యాటింగ్‌లో రాణించడంతో జట్టు విజయం సాధించింది.  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గేల్‌

Tuesday, June 25, 2013

'సింగమ్‌' గీతాలు


 తమిళ నటుడు సూర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం 'సింగమ్‌'( యముడు-2). హరి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా సమర్పిస్తున్నారు. చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగింది. చిత్రంలోని తొలిపాటను కార్తి, రెండోపాటను లక్ష్మణ్‌కుమార్‌, మూడో పాటను హరి, నాలుగో పాటను శశాంక్‌ వెన్నెలకంటి, ఐదో పాటను అనుష్క ఆవిష్కరించారు. సినిమా థియేటర్‌ ట్రైలర్స్‌ సూర్య ఆవిష్కరించారు. ఆడియో సిడిలను దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేసి, కార్తికి అందజేశారు.
గేయ రచయిత సాహితి మాట్లాడుతూ..'పవర్‌ ప్యాక్‌డ్‌ సినిమా ఇది. సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. పోలీస్‌ వ్యవస్థపై హరి పరిశోధన చేశారు. దేవిశ్రీ ఎనర్జిటిక్‌ పాటలిచ్చారు. ఆధునికంగా ఉన్నాయి. ఒకే ట్యూన్‌లో రెండు కోణాలున్న పాటలు కూడా ఉన్నాయి. ఇందులో ఓ ఐటెం సాంగ్‌, పోలీస్‌లోపలి వ్యక్తిని గురించి ఓ పాట రాశాను' అని అన్నారు.
 

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ..'యముడు' చిత్రాన్ని పెద్ద విజయం చేసినందుకు థాంక్స్‌. దర్శకుడు హరి, సూర్య, జ్ఞానవేల్‌రాజాకు ధన్యవాదాలు. 'సింగం' అనేది బ్రాండ్‌ అయింది. హిందీలో కూడా హిట్‌ అయింది. తెలుగువారు అందరూ ఆదరిస్తా'రని తెలిపారు.
శశాంక్‌ వెన్నెలకంటి మాట్లాడుతూ.. 'తోటకూర తినేవాడికి వేటకూర తిన్నట్టు ఉంటుంది..హరి సినిమాకు పనిచేయటం. ఈ సినిమాలో పంచ్‌ డైలాగ్స్‌ రాస్తుంటే, చాలా ఆనందంగా, పండుగలా అనిపించింది. ఇప్పటికీ కంపోజింగ్‌ను నమ్మి సంగీతం చేసే వ్యక్తి దేవిశ్రీప్రసాద్‌. 'గజని' సినిమాతో మా ప్రయాణం మొదలైంది. వారి బ్యానర్‌లో కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ..'సింగం' నా 12వ సినిమా. సూర్య, దేవిశ్రీప్రసాద్‌తో ఇది నా నాలుగో సినిమా. 'యముడు' నుంచి 'సింగమ్‌' వేరే డైమెన్షన్‌తో ఉంటుంది. వంద శాతం కమర్షియల్‌ మూవీ ఇది. విత్‌ లాట్‌ ఆఫ్‌ లాజిక్‌. అందరూ ఇష్టంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరి కష్టం సినిమాలో కనిపిస్తుంది. సినిమా బావుంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను' అని తెలిపారు.
తమిళ హీరో కార్తి మాట్లాడుతూ.. 'యముడు' చిత్రాన్ని చాలా పెద్ద సక్సెస్‌ చేశారు. ఈ సినిమాలో అంతకు మించి పవర్‌ ప్యాక్‌ ఉంది. అన్నయ్య 'సింగమ్‌' చూశాక నాక్కూడా ఖాకీ బట్టలు వేసుకోవాలనిపిస్తుంది' అని అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. 'నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మా కుటుంబంలో అందరూ నన్నూ గొప్పగా చూస్తున్నానంటే దానికి కారణం తెలుగువారి అభిమానమే. మంచి సినిమా ఇది. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజికల్‌ హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. నిజ జీవితంలో పోలీస్‌ అందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు.

Monday, June 24, 2013

ఛాంపియన్స్‌ ట్రోపీ భారత్‌

                వర్షం కారణంగా వన్డే మ్యాచ్‌ టీ 20
 ఛాంపియన్స్‌ ట్రోపీలో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న పైనల్‌ వన్డే మ్యాచ్‌కి వరుణుడి దెబ్బకి టీ 20గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించే అవకాశం ఉంది. మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన ఆటను టీ 20 మ్యాచ్‌గా కుదించారు. టాస్‌ గెలిచి ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్‌ ట్రోపీలో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో భారత్‌ 5 పరుగుల తేడాతో విజయ సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ చివిరి మూడు ఓవర్లలో 14 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యనికి దూరం అయ్యింది. ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ట నష్టానికి 124 పరుగులు చేసింది. ఆదిలోనే ఇంగ్లండ్‌ వికెటు కోల్పోయింది. కెప్టెన్‌ కుక్‌ 9 బంతులల్లో 2 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌గా ట్రాట్‌ వచ్చాడు. ఫామ్‌లో ఉన్న ట్రాట్‌ని అశ్విన్‌ స్పిన్‌ మాయజలంతో (స్టంప్‌) అవుట్‌ చేశాడు. అతడు 14 బంతులల్లో రెండు ఫోర్లుతో 20 పరుగులు చేశాడు. రూట్‌ 7 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇయాన్‌ బెల్‌ 13 పరుగులు చేసి (స్టంప్‌) అవుట్‌ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కష్టాలలో ఉన్న ఇంగ్లాండ్‌ని మోర్గాన్‌, బొపారా మరో వికెటు పడకుండ జాగ్రత పడ్డారు. విజయలక్ష్యం దిశగా పయనిస్తున్న సమయంలో ఇషాంత్‌ శర్మ ఓకే ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని కష్టాలల్లో నెట్టాడు. మోర్గాన్‌ ఇషాంత్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు 30 బంతులల్లో మూడు ఫోర్లు, ఒక సిక్‌తో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్‌ బొపారా 25 బంతులల్లో రెండు సిక్సతో 30 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. బట్టర్‌ 0, బ్రెన్నస్‌ 2 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. బ్రాడ్‌ 7, ట్రేడ్‌వెల్‌ 5 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ బౌలర్లకు సహకరించింది. ధావన్‌, రోహిత్‌ శర్మ ఆట ప్రారంభించారు. భారత్‌ మొదటి వికెటు 19 పరుగుల వద్ద కోల్పోయింది. రోహిత్‌ శర్మ 14 బంతులల్లో ఒక బౌండరీతో 9 పరుగులు చేసి బ్రాడ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌగా కోహ్లీ వచ్చాడు. వర్షం మాత్రం ఆటకు ఆడ్డం కలుగుతుంది. 6 ఓవర్లలో వర్షం రావడంతో ఆటను ఏకంగా 45 నిమిషాలు నిలిపివేశారు. అంపైర్లు ఫిచ్‌ను పరిశిలించి ఆట మళ్లీ ప్రారంభించారు. వర్షంతో ఫిచ్‌ పూర్తిగా తడిసింది. ఆట ప్రారంబంమైన కొద్దిసేపటికే ధావన్‌ బోపారా బౌలింగ్‌లో ట్రెడ్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు 24 బంతులల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌లతో 31 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్‌ దినేష్‌ కార్తిక్‌ 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. రవి బోపారా ఒకే ఓవర్లలో సురేష్‌ రైనా, ధోని ఇద్దరి అవుట్‌ చేసి భారత్‌పై ఒత్తిడిచేశారు. 



 సురేష్‌ రైనా స్లో బౌలింగ్‌లో కుక్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అదే ఓవర్లలో బోపారా బౌలింగ్‌లో ధోని భారీ షాట్‌కు వెళ్లి బౌండరీ దగ్గర ట్రేడ్‌వెల్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కోహ్లీకి అండగా జడేజా వచ్చాడు. కోహ్లీ 34 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్‌లతో 43 పరుగులు చేసి అండరసన్‌ బౌలింగ్‌లో బొపారా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అశ్విని 1 పరుగు చేసి రనౌట్‌గా అయ్యాడు. చివరిలో జడేజా 25 బంతులల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 33 పరుగులు చేశాడు.

స్కోరు బోర్డు భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (బి) బ్రాడ్‌ 9, ధావన్‌ (సి) ట్రేడ్‌వెల్‌ (బి) బొపారా 31, కోహ్లీ (సి) బొపారా (బి) అండరసన్‌ 43, దినేష్‌ కార్తిక్‌ ( సి) మోర్గాన్‌ ( బి) ట్రేడ్‌వెల్‌ 6, సురేష్‌ రైనా (సి) కుక్‌ (బి) బొపారా 1, ధోని ( సి) ట్రెడ్‌వెల్‌ ( బి) బొపారా 0, జడేజా 33 నాటౌట్‌, అశ్విన్‌ 1 రనౌట్‌, భువనేశ్వర్‌ కుమార్‌ 1 నాటౌట్‌ ( ఎక్స్‌ట్రా 4)
ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ : అండరసన్‌ 4-0-24-1, బ్రాడ్‌ 4-0-26-1, బ్రెన్నస్‌ 4-0-34-0 ట్రెడ్‌వెల్‌ 4-0-25-1, బోపారా 4-1-20-3
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ : కుక్‌ (సి) అశ్విన్‌ (బి) యాదవ్‌ 2, ఇయాన్‌ బెల్‌ ( స్టంప్‌) ధోని( బి) జడేజా13, టాట్‌ ( స్టంప్‌) ధోని( బి) అశ్విన్‌ 20, రూట్‌ (సి) ఇషాంత్‌ శర్మ (బి) అశ్విన్‌ 7, మోర్గాన్‌ (సి) అశ్విన్‌ (బి) ఇషాంత్‌ శర్మ 33, బొపారా ( సి) అశ్విన్‌( బి) ఇషాంత్‌ శర్మ 30, బుట్లర్‌ (బి) జడేజా 0, బ్రేన్నస్‌ రనౌట్‌ (రోహిత్‌ శర్మ , ధోని) 2, బ్రాడ్‌ 7, ట్రేడ్‌వెల్‌ 5 నాటౌట్‌ (ఎక్స్‌ట్రా 5)
భారత్‌ బౌలింగ్‌ : కుమార్‌ 3-0-19-0, ఉమేష్‌ యాదవ్‌ 2-0-10-1, జడేజా 4-024-2, అశ్విన్‌ 4-1-15-2, ఇషాంత్‌ శర్మ 4-036-2 , సురేష్‌ రైనా 3-019-0

Friday, June 7, 2013

ఐపిఏల్‌లో దొంగలు పడ్డారు ...

ఐపీఎల్‌లో దొంగలు పడ్డారు. అంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి. అన్న సమెత ఇప్పుడు అర్థమైయింది. టోర్నమెంట్‌ ప్రారంభంయినప్పటి నుంచి ఐపీఎల్‌లో స్ఫాట్‌ఫిక్సింగ్‌, బెట్టింగులకు పాల్పడ్డారు. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌ జట్టు గుర్తించారు. ఇప్పుడు కూడా రాజస్థాన్‌ జట్టులో ప్రస్తుతం ముగ్గురు సభ్యులు గుర్తించారు. రాజస్థాన్‌ జట్టు యాజమాని కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ పైసలతో కూడిన వ్యవహారం. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో నితి నిజాయితో అడిన మ్యాచ్‌లు తక్కువనే. కొన్ని మ్యాచ్‌లు మాత్రం బెట్టింగుకు పాల్పపడి చాలా వరకు పెద్ద మొత్తం డబ్బులుతో అడుకున్నారు. ఐపీఎల్‌-6లో చివరిలో చెన్నెరు జట్టు యాజమాన్యం కూడా ఇద్దులో హస్తం ఉంది. తెలిసింది.