ఐపీఎల్‌లో ఆడాలని ఆశించిన భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చివరికి నిరాశ మిగిలిది. ఈ టోర్నిలో దాదా బ్యాటింగ్‌ను చూసే అవకాశం దాదాపుగా లేదు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుబోని ఆటగాళ్లను తీసుకోరాదని మూడు ఫ్రాంచైజీలు అభ్యంతర వ్యక్తం చేయడంతో గంగూలీకి అవకాశం లేకపోయింది. కొత్త ప్రాంచైజీ కొచ్చి.... గంగూలీని అతని ప్రాథమిక ధర 1.8 కోట్ల రూపాయలు చెల్లించి జట్టులోకి తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీసీకి లేఖ రాసింది. దీంతో ఈ విషయంలో తమ అభిప్రాయల్ని తెలియజేయాల్సిందిగా ఇతర ప్రాంచైజీలను బీసీసీఐ కోరింది. అయితే ఇతర ప్రాంచైజీల నుంచి అభ్యతరాలు రావడంతో వారిని తీసుకోరాదని పాలకమండలి సమావేశంలో నిర్ణయించింది.
No comments:
Post a Comment