Saturday, December 17, 2016

బన్నీనే నంబర్ వన్

 వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఆన్ లైన్ లోనూ రికార్డ్ లు సృష్టిస్తున్నాడు. 2016లో ఆన్ లైన్ లో అతి ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ. ఆ తరువాత స్ధానాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ లు నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇటీవల సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ప్రారంభించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు బన్నీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2017 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Friday, December 16, 2016

నేను చాలా మారిపోయా!

కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతీహాసన్‌ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ – ‘‘వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్‌ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని.
అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా కూడా నేనో నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చేశా. ‘ఇది మనకు నచ్చదు’ అని ఓ విషయం గురించి అనుకుంటే ఇక ఎప్పటికీ నచ్చదు. నచ్చినది ఎప్పటికీ నచ్చుతుంది. అంత బలమైన అభిప్రా యాలను కలగజేసిన సంవత్సరం ఇది. వయసు, అనుభవం వ్యక్తుల్లో పరిణతి తెస్తాయంటారు. 30 ఏళ్లొచ్చేశాయ్‌ కదా.. నాలోనూ పరిణతి వచ్చింది’’ అన్నారు.

కొంచెం టర్నింగ్‌ ఇచ్చుకో రఘువరా!

 సీనియర్‌ హీరోల్లో మామ రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌... యంగ్‌ హీరోల్లో అల్లుడు ధనుష్‌ తిరుగు లేని మాస్‌ హీరో. అల్లుడు సినిమాకి ఇప్పటివరకూ రజనీ క్లాప్‌ కొట్టలేదు. ఫస్ట్‌ టైమ్‌ అది జరిగింది. మామ ఎంతో ఆత్మీయంగా క్లాప్‌ ఇస్తుంటే.. అల్లుడు అలా వెనక్కి తిరిగాడేంటి? మరి అదే వెరైటీ. ‘మా సినిమా కొత్తగా ఉంటుంది’ అని ముహూర్తపు దృశ్యం నుంచే చూపించాలనుకుని ఉంటారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి రజనీ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీతో ఇటీవల ‘కబాలి’ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్, అమలాపాల్‌ నటించిన ‘విఐపీ’ (వేలై ఇల్లా పట్టదారి)కి ఇది సీక్వెల్‌. ‘వైలై ఇల్లా పట్టదారి 2’గా తమిళంలో, ‘వీఐపీ 2’గా తెలుగులో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగం తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’గా రిలీజై, ఇక్కడ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ‘వీఐపీ’లో ధనుష్‌ సరసన కథానాయికగా నటించిన అమలాపాల్‌ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు: ధనుష్, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సౌందర్యా రజనీకాంత్‌.

Thursday, December 15, 2016

బన్నీ ఫస్ట్‌.. మహేశ్‌ సెకండ్‌.. ప్రభాస్‌..

 ఏమిటీ లెక్క అని కంగారు పడుతున్నారా? 2016 అయిపోవచ్చింది కదా.. ఈ ఏడాది అభిమానులు తమ ప్రియమైన నటుల్లో ఎవరికోసం గూగుల్‌లో ఎక్కువగా వెదికారో.. ఆ లెక్క అన్నమాట ఇది. స్టైలిష్‌ స్టార్‌ అనిపించుకున్న టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న దక్షిణాది చిత్ర పరిశ్రమ నటుడిగా, ట్విట్టర్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ను చేరుకున్న నటుడిగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు మరో క్రెడిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 2016 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన తెలుగు నటుల జాబితాలో అల్లు అర్జున్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు.
 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు రెండో స్థానం, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మూడో స్థానం, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నాల్గో స్థానం, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. తమ అభిమాన హీరోలు ఇలా గూగుల్‌ ట్రెండింగ్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Wednesday, December 14, 2016

విలన్‌గా...మరో హీరో

  మహేశ్‌బాబు హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో దర్శకుడు కమ్‌ హీరో అయిన ఎస్‌.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు మరో హీరో కూడా ప్రకటించారు. అతను ఎవరో కాదు... ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్‌ భరత్‌. ఇప్పటివరకూ భరత్‌ నెగిటివ్‌ రోల్‌ చేయలేదు. మహేశ్‌ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్‌లో భరత్‌ కొన్ని రోజులు పాల్గొన్నారు.
ఈ షెడ్యూల్‌ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, పుణేలలో జరగబోయే షెడ్యూల్స్‌లోనూ పాల్గొననున్నారు. ‘‘మహేశ్‌ ఫ్రెండ్లీ కో–స్టార్‌. ఈ సినిమాలో ఛాన్స్‌ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా పాత్రను ఆసక్తికరంగా రాశారు’’ అని భరత్‌ తెలిపారు. ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారం.

Tuesday, December 13, 2016

విడాకుల దిశగా సిని నటి

 నటి మీరా జాస్మిన్‌ భర్త అనిల్‌ జాన్‌ టిటుస్‌ నుంచి విడాకులు కోరుతూ నోటీసులు పంపినట్లు సమాచారం. ఇకపై భారత్‌లోనే ఉండి సినీ కెరీర్‌పై దృష్టిపెట్టాలని మీరా అనుకుంటున్నారట. 2014లో దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైన అనిల్‌తో మీరా పెళ్లి జరిగింది. వివాహానంతరం మీరా నటనకు స్వస్తి పలికి భర్తతో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయారు. అయితే ఆమె తిరిగి భారత్‌కు వచ్చి త్వరలో విడుదల కాబోతోన్న ‘10 కల్పనకల్‌’ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె పోలీసు అధికారిణి పాత్ర పోషించారు. అంతేకాదు ‘పూమరం’ అనే మరో చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మీరా మళ్లీ సినిమాల్లో నటించడం అనిల్‌కి ఇష్టం లేదట. కానీ ఆమె మాత్రం భారత్‌లోనే ఉండి నట జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట. ఈ కారణంగా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది. విడాకులకు కారణంపై మాత్రం ఇద్దరూ నోరు విప్పడం లేదు.
అనిల్‌కి మీరాతో జరిగింది రెండో వివాహం. మొదటి వివాహంలో విడాకులు తీసుకోనందున మీరాతో పెళ్లి సమయంలో గొడవలు జరుగుతాయేమోనని అనిల్‌ పోలీసు సహాయం తీసుకున్నారు. అనంతరం తొలి వివాహం తాలూకు విడాకుల కాగితాలు చూపించనందువల్ల అనిల్‌-మీరాల వివాహం రిజిస్టర్‌ చేయడానికి అధికారులు అంగీకరించలేదు. ఈ విషయాలన్నీ కూడా అప్పుడు వార్తల్లో వచ్చాయి.

Monday, December 12, 2016

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

 మెగాస్టార్ చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో జతకట్టిన అమ్మడు మెగా స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించింది. 'మెగా ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు.నేను సెట్ లో కంఫర్టబుల్ గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారు. నేను నటించిన చిత్రాల్లోని ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ  కాజల్ తెగ సంబరపడుతోంది.

'డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటి ద్వారా నా డ్యాన్స్ లో మార్పు కూడా వచ్చింది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చు. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మెగాస్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.  అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం' అంటూ  కాజల్ మురిసిపోయింది.

సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్


మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు. 
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్‌ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్‌జే సూర్య, ఆర్‌జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.