Sunday, June 12, 2016

నాకెవరూ పోటీ కాదు

 నాకెవరూ పోటీ కాదు అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. తల్లి మేనక వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలోనే అనూహ్య విజయాలను అందుకుని విజయపథంలో కొనసాగుతున్నారు. కోలీవుడ్‌లో ఇప్పటికి ఈమె నటించిన చిత్రాలు విడుదలైనవి రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి ఓకే అనిపించుకున్నా, రెండోది ఘన విజయం సాధించింది. దీంతో కీర్తీసురేశ్ రేంజ్ కోలీవుడ్‌లో ఒక్కసారిగా పెరిగిపోయింది. నీ నవ్వే చాలు చామంతీ అన్నట్లు కీర్తీసురేశ్ నవ్వే పెద్ద వశీకరణం అని సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. రాబోయే చిత్రాలు ఈ సుందరి పేరును మరింత ఇననుమడింపజేస్తాయనే నమ్మకంతో ఉన్నారీమె. కారణం ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటి గురించి కీర్తీసురేశ్ తెలుపుతూ తాను ధనుష్‌కు జంటగా నటించిన తొడరి, బాబీసింహా నటించిన పాంబుసండై చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.

ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో విజయ్‌కు జంటగా నటిస్తున్న చిత్రం, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న రెమో చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. తొడరి చిత్రంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అన్నారు. ఈ పాత్రకు అవార్డు వస్తుందని అంటున్నారని, అలా వస్తే సంతోషమేనని అన్నారు. ప్రస్తుతానికి మలయాళం, కన్నడం చిత్రాల్లో నటించడం లేదని చెప్పారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని అయితే అధిక చిత్రాల్లో నటించాలనే ఉద్దేశమేమీ తనకు లేదని పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న మంచి బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇకపోతే తాను ఇతర హీరోయిన్లను పోటీగా భావించడం లేదన్నారు. తన ముందు చిత్రాల్లో పాత్రలనే పోటీగా తీసుకుని నటిస్తానని నటి కీర్తీసురేశ్ తెలిపారు.

‘ఆస్ట్రేలియా ఓపెన్‌ సిరీస్‌లో క్వీన్ సైనా నెహ్వాల్‌




హైద‌రాబాదీ స్టార్ ష‌ట్ల‌ర్‌, ఏడో సీడ్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌ను గెలుచుకుంది. ఫైన‌ల్లో అన్‌సీడెడ్ చైనా ప్లేయ‌ర్ సున్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా విజ‌యం సాధించింది. తొలి గేమ్‌లో త‌డ‌బ‌డి సునాయాసంగా త‌ల‌వంచిన సైనా.. రెండో గేమ్ నుంచి అనూహ్యంగా పుంజుకుంది. రెండో గేమ్ మొద‌టి నుంచీ దూకుడుగా ఆడిన సైనా.. ఆ గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణ‌యాత్మ‌క మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ నువ్వానేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డ్డారు. చివ‌రికి గంటా ప‌ద‌కొండు నిమిషాలు పోరాడిన సైనా టైటిల్ ఎగ‌రేసుకుపోయింది. సైనా ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెల‌వడం ఇది రెండోసారి. 2014లోనూ ఈ సూప‌ర్ సిరీస్ టైటిల్‌ను గెలిచింది సైనా. ఆమెకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావ‌డం విశేషం.
ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు
సైనా కెరీర్‌లో ఈ విజయం మరో మైలురాయి అని, 2016 రియో ఒలింపిక్స్‌కు ఈ విజయం ప్రేరణ కలిగిస్తుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్‌ దాస్‌ గుప్తా అన్నారు. సైనా కోచ్‌ విమల్‌ కుమార్‌, సిబ్బందిని అభినందించారు. ‘ఆస్ట్రేలియా ఓపెన్‌ సిరీస్‌లో అద్భుత విజయం సాధించిన సైనాకు అభినందనలు. నీ క్రీడా విజయాలతో దేశం యావత్తూ గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, శిఖర్‌ధావన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు సైనాకు శుభాకాంక్షలు తెలిపి ఒలింపిక్స్‌ మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.

ఆ హీరో ని పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి?

 తెలుగు ఇండస్ట్రీ లో అందాల రాక్షసి సినిమా తో పరిచయమయ్యి తన నటన తో అందం తో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.అందాల రాక్షసి సినిమా తర్వాత వచ్చిన దుసుకేల్తా,భలే భలే మగాడివోయి,సోగ్గాడు సినిమా లతో బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ అందుకుంది లావణ్య.తర్వాత వచ్చిన లచ్చిందేవికి ఒక లేక్కుంది సినిమా నిరాశపరిచిన లావణ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.లావణ్య ఒక తెలుగు హీరో ని పెళ్లి చేసుకోబోతుందంట్ట్ట.

Saturday, June 11, 2016

ఆ క్షణం... నాకే కొత్తగా!

 మనలో మనకు నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవసరం, అవకాశం వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాం. రాశీ ఖన్నా కూడా అలా ఎప్పట్నుంచో ఓ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. అది ఎంతకీ సాధ్యం కావడం లేదట. ఇంతకీ అదేంటి? అని ఆరా తీస్తే ‘సిగ్గు’ అని తేలింది. ‘‘చిన్నప్పట్నుంచి నేను సిగ్గరినే. పెద్దయ్యాకా ఆ విషయంలో మార్పు రాలేదు. కథానాయికని అయ్యాను కాబట్టి ఇక మెల్లమెల్లగా సిగ్గు, బిడియం లాంటివన్నీ దూరమవుతాయిలే అని మొదట్లో భావించేదాన్ని. ఇప్పటికీ అది అలాగే ఉంది. నా దర్శకులు నేను కలలోనూ ­హించని పాత్రలు సృష్టిస్తున్నారు. వాటిని విన్నప్పుడు ‘ఇంత సిగ్గరిని, ఈ పాత్రల్లో నేనా? అసలు సాధ్యమేనా?’ అనుకొంటుంటా. దర్శకుల నమ్మకం చూసి నేనూ ఓకే చెప్పేస్తుంటా. సెట్‌కి వెళ్లాక నేను ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటా. ఆ క్షణం నాకే కొత్తగా అనిపిస్తుంటుంది. తెరపై నన్ను నేను చూసుకొని ఎంత ఆశ్చర్యపోతుంటానో మాటల్లో చెప్పలేను తెలుసా?’’ అని చెప్పింది రాశీ ఖన్నా. ఆమె ప్రస్తుతం రామ్‌, గోపీచంద్‌తో కలిసి నటిస్తోంది

చుక్కలు చూపించిన దీపిక!

 అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్  హీరోయిన్ కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.
అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ, దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని వేరే హీరోయిన్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం.

అనుష్కకి జోడీగా?



‘సరైనోడు’తో విలన్‌గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్‌మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్‌.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

Thursday, June 9, 2016

ఒక ప్రశ్న... ముగ్గురి పోరాటం



చర్చి ఫాదర్‌ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు...
ఓ పోలీసు అధికారిణి న్యాయం కోసం చూస్తోంది...
ఓ తాత నిజం కోసం ఎదురుచూస్తున్నాడు...
ఈ ముగ్గురు కలసి ఒకే విషయమై పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వేధిస్తోన్న ఓ నిజాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ పోరాటం ఎవరిపై.. ఏ విషయంలో... ఎందుకు... అనే విషయాలు తెలియాలంటే ‘తీన్‌’ చూడాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రిబుదాస్‌ గుప్తా దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పాప గురించి ఏమైనా తెలిసిందా’’
- తన కళ్ల ముందే కిడ్నాపైన మనవరాలి కోసం తాత జాన్‌ బిశ్వాస్‌ ప్రశ్న!
‘‘ఎనిమిదేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు...’’
- ఇదీ పోలీసు అధికారిణి సరితా సర్కార్‌ సమాధానం!
‘‘అంతకుమించి నా దగ్గర ఇంకో ప్రశ్న లేదు...’’ కన్నీళ్లు తుడుచుకుంటూ జాన్‌ బిశ్వాస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చేస్తాడు.
ఇది పోలీసు స్టేషన్‌లో జరిగే ప్రధాన సన్నివేశం. పోలీసు స్టేషన్‌కు వచ్చేముందు జాన్‌ బిశ్వాస్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఓ టేపు రికార్డర్‌లో ఓ చిన్న పిల్ల మాటలు, ఏడుపు విని వస్తాడు. ఈ రోజే కాదు గత ఎనిమిదేళ్లుగా ఇంతే. స్టేషన్‌ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా రాత్రి వరకు వూరంతా ఓ పాప ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఓ రోజు ఇలా పోలీసు స్టేషన్‌కు వెళ్తుంటే జాన్‌ కళ్లముందే ఓ చిన్న పిల్లాడు అపహరణకు గురవుతాడు. దీంతో సరితా సర్కార్‌ (విద్యా బాలన్‌) నేతృత్వంలో పోలీసు బృందం గాలింపు ముమ్మరం చేస్తుంది. గతంలో పోలీసుగా పని చేసి ప్రస్తుతం చర్చి ఫాదర్‌గా ఉంటున్న మార్టిన్‌ దాస్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) సహాయం తీసుకుంటారు. అడ్డంకులు దాటి ఆ ముగ్గురు ఈ మిస్టరీ చేధించారా? అనేదే కథ. దక్షిణ కొరియాలో విజయవంతమైన ‘మాంటేజ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్‌ బచ్చన్‌ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.

హీరోయిన్‌ని ఇంట్లో నుంచి గెంటేశారు

మోడల్‌, బాలీవుడ్‌ నటి అలీసా ఖాన్‌ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మికిజంటగా అలీసా ఓ చిత్రంలో నడుస్తోంది. రాత్రి వేళ్లల్లో ఇంట్లో ఉండాల్సిన అలీసా దిల్లీ వీధుల్లో ఒంటరిగా తిరుగుతుండడం మీడియా గమనించి ఏం జరిగిందని ఆరా తీశారు. తన మాజీ ప్రియుడు అసభ్యకర వీడియోలన్నీ తీసి బెదిరిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ విషయం తెలిసి తల్లి, సోదరుడు తనని ఇంట్లో నుంచి గెంటేశాడని అలీసా మీడియాకి తెలిపింది. ఎటూ వెళ్లలేక గుళ్లలో, స్నేహితుల ఇళ్లలో తల దాచుకుంటున్నానని అలీసా తెలిపింది. పోలీసులు విషయం తెలుసుకుని అలీసా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు.