తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా
చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా
చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి.
ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది.
దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు
ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్ జిత్' లో
నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని
చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ
కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు
తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే
మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్
సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే
స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే.
ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్-9 తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో
కామెంట్లు పోటెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి గుజరాత్
లయన్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ట్విటర్ లో పుంఖాను
పుంఖాలుగా సరదా కామెంట్లు వచ్చాయి. పంచ్ లు విసిరారు, సలహాలు ఇచ్చారు.
ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా
ట్వీట్లు వదిలారు.
కోహ్లి సేనను కంగారు పెట్టిన ధవళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24)
అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్ కూడా ఇన్ని
వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి
ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వజ్ ఇట్ వెరీ షాట్? అంటూ
ప్రశ్న సంధించారు. లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్ ను లాగేసుకున్నాడని ప్రీతి
జింతా ట్వీట్ చేసింది.
సున్నాకే అవుటై కోహ్లి మిషన్ కాదు మనిషినని రుజువు చేసుకున్నాడని ఇంకొరు
వ్యాఖ్యానించారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్
ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని పంచ్
విసిరారు. మ్యాచ్ గెలిపించి కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ విమర్శల బారిన
పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు కామెంట్ చేశారు.
కోహ్లి-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ
'టైటానిక్'ను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్
సాంగ్ లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని సలహాయిచ్చారు.
వచ్చే బిగ్‌బాష్ సీజన్లో క్రిస్ గేల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతడితో
కాంట్రాక్టును పునరుద్ధరించకోబోమని మెల్‌బోర్న్ రెనగేడ్స్ జట్టు
ప్రకటించింది. గత బిగ్‌బాష్ సీజన్లో రెనగేడ్స్ తరఫున ఆడిన గేల్..
తనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ మహిళా టీవీ వ్య్లాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకర
వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు చాలా మంది
గేల్ ప్రవర్తనను తప్పుపట్టారు. రెనగేడ్స్ జట్టు కూడా గేల్‌కు జరిమానా
విధించింది. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమవ్వకుండా చూసుకోవాలని
గేల్‌ను హెచ్చరించింది కూడా. ఐతే ఈ హెచ్చరికలేవీ ఈ విండీస్ క్రికెటర్‌పై
పనిచేయలేదు. తాజాగా గేల్ మళ్లీ నోరు జారాడు. ఈ సారి తనను ఇంటర్వ్యూ
చేయడానికి వచ్చిన బ్రిటన్ పత్రికకు చెందిన ఓ మహిళా విలేకరితో అసభ్యకరంగా
సంభాషించాడు. దీంతో గేల్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు రెనగేడ్స్
జట్టు ప్రకటించింది. రెనగేడ్సే కాదు... గేల్‌తో కాంట్రాక్టు ఉన్న కౌంటీ
జట్టు సోమర్సెట్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని వార్తలొస్తున్నాయి.
మహిళలు పురుషులతో అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. మగవాళ్లకు దీటుగా
రాణిస్తున్నారు. సినిమాల్లో అయితే హీరోలతో పోటీపడి హీరోయిన్లు డ్యాన్స్ లు,
ఫైట్లతో అదరగొడుతున్నారు. అయితే సినీ పరిశ్రమలో మగవాళ్లదే ఆధిపత్యమని
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటోంది. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఎక్కడైనా
వాళ్లదే రాజ్యమని చెబుతోంది.
'సినీ పరిశ్రమంలో మహిళలు, పురుషులు సమానమన్న మాటే లేదు. బాలీవుడ్ లేదా
హాలీవుడ్ ఏదైనా మగవాళ్లదే డామినేషన్. ఈ నిజాన్ని దాచలేము' అని కాజోల్ అంది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కాజోల్ సినిమాలకు
దూరమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కాజోల్.. గతేడాది
దిల్ వాలే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై కనిపించింది. పెళ్లి, వయసు
అన్నవి తన కెరీర్ కు ఎప్పుడూ ప్రతిబంధకం కాదని ఆమె చెప్పింది.
ఒక స్మార్ట్‌ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. తాము త్వరలో
విడుదల చేయబోయే ఎం3 నోట్ కోసం రెండు వారాల్లో 3 లక్షల మందికి పైగా
రిజిస్టర్ చేసుకున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మెయిజు ప్రకటించింది.
రూ. 9,999 ధరలో ఉన్న ఈ ఫోన్ ఈనెల 31వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో
ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...
స్క్రీన్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పి10
సామర్థ్యం: 1.8 గిగాహెర్ట్జ్
ఫోన్ మందం: 5 మిల్లీమీటర్లు
ఓఎస్: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
స్టోరేజి: 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం
అదనపు హంగులు: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి860 జీపీయూ కూడా ఉందట.
ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు
చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో
కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు
కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి
చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్ తో
మహేష్ కు షాక్ ఇచ్చారు.
ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్.
అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో చేశాడు
మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్ లో
మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు
మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్ లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా
డిజాస్టర్ టాక్ తో నిరాశ పరిచింది.
రీసెంట్ గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు
సినిమాతో మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో
అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే
నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ
దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు.
అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్.
మహేష్ తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత
బిజినెస్ మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు.
ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్ తాజా చిత్రం
'సరబ్‌జిత్' తొలిరోజు కలెక్షన్ల విషయంలో తుస్సుమంది. పాకిస్థాన్ జైలులో
మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్‌జిత్ సింగ్ జీవితకథ ఆధారంగా
దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్ 'సరబ్‌జిత్'. ఆయన గతంలో
ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్' సినిమా ఇటు విమర్శకులు, అటు
ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో రణ్‌దీప్ హుడా సరబ్‌జిత్‌గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా
ఎమోషనల్ డ్రామాగా 'సరబ్‌జిత్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా
కథపరంగా, ప్రధాన పాత్రల నటనపరంగా ఈ సినిమా ప్రేక్షకులను కదిలింపజేస్తోంది.
పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు 'సరబ్‌జిత్' సినిమా కేవలం
రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో మిగతా రెండు రోజుల్లో
వచ్చే కలెక్షన్లు ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఈ సినిమా హిట్టా.. ఫట్టా
అన్నది ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నది.
హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది.
అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన
పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే
వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్‌కు ప్లాస్టిక్ సర్జరీ
చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు
మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఈ
వార్తలకు స్పందించని అనుష్క సడన్‌గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి
అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ
స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి
సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని కాస్త
ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు
సెలైంట్ అయిపోయారట.