Sunday, February 28, 2016

టి20 ప్రపంచకప్ లో ఆడనివ్వరా?: ధోని

మైదానంలో కొత్త మంది అంపైర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగిస్తుండడంపై టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇయర్ పీస్ లాంటి వస్తువులను అంపైర్లు వాడుతుండడంపై అభ్యంతరం తెలిపాడు. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖుర్రం మంజూర్ కొట్టిన బంతిని తప్పించుకోవడంలో బంగ్లాదేశ్ అంపైర్ ఎస్ఐఎస్ సైకత్ విఫలమయ్యాడు. ఆ సమయంలో సైకత్ తన చెవికి ఇయర్ పీస్ తగిలించుకుని ఉన్నాడు.               దీని గురించి విలేకరులు అడిగినప్పుడు ధోని సరదాగా స్పందించాడు. 'టి20 ప్రపంచకప్ టోర్నీలో నన్ను ఆడకుండా చేయాలనుకుంటున్నారా. నాపై వేటు పడాలని కోరుకోవద్దు' అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. అంపైర్లు ఇయర్ పీస్ తగిలించుకుని మైదానంలో అంపైరింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాడు.            'అంపైర్లు వాకీ టాకీతో పాటు ఇయర్ పీస్ పరికరాలు వాడుతున్నారు. దీంతో ఒక చెవితోనే మైదానంలో పనిచేస్తున్నారు. ఒక చెవిని పూర్తిగా పరికరాలకు అప్పగించేయడంతో ఆటగాళ్లు చెబుతున్నది వారికి పూర్తిగా వినపడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆన్ ఫీల్డ్ లో అంపైర్లు రెండు చెవులతో పనిచేయడం మంచిదన'ని ధోని పేర్కొన్నాడు.

Saturday, February 27, 2016

'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం
ఆ సంస్థ అధినేత అశ్వనీదత్

  తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

 గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్‌టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు.

చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్‌టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
 

'క్షణం' మూవీ రివ్యూ


కర్మ, కిస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన అడవి శేష్ మరోసారి సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం క్షణం. టాలీవుడ్ లో చాలా అరుదుగా కనిపించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్, అంతా తానే అయి సినిమాను తెరకెక్కించాడు. అదాశర్మ గ్లామర్, అనసూయ పోలీస్ లుక్ లాంటి అంశాలతో పాటు పీవీపీ లాంటి భారీచిత్రాల నిర్మాణ సంస్థ కూడా తోడవ్వటంతో క్షణం సినిమా రిలీజ్ కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను ఈ క్షణం అందుకుందా..?
కథ : ఇండియాలో మెడిసిన్ చదవడానికి వచ్చిన ఎన్నారై కుర్రాడు రిషి (అడవి శేష్), అదే కాలేజ్ లో చదివే శ్వేత (అదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన వెంటనే ఆ విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. రిషి పద్ధతి శ్వేత తండ్రికి నచ్చదు. తను ఇక్కడివాడు కాదన్న కారణంతో వారి ప్రేమను అంగీకరించడు. శ్వేతను కార్తీక్ (సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేసి రిషి అమెరికా వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత శ్వేత, రిషికి ఫోన్ చేసి తనను కలవాలంటుంది. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని అడుగుతుంది. రిషి కూడా శ్వేతకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు.

ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, శ్వేత ఇరుగుపొరుగులను కలిసిన రిషి, వాళ్లు చెప్పిన సమాధానంతో షాక్ అవుతాడు. అసలు రియా అనే అమ్మాయే లేదని, శ్వేత మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్లే తనకు కూతురు ఉన్నట్టు ఊహించుకుంటుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్వేతతో చెబుతాడు రిషి. తను ఎంతో నమ్మకంగా సాయం చేస్తాడనుకున్న రిషి కూడా తన మాట నమ్మకపోవటంతో శ్వేత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత రిషి ఏం చేశాడు..? అసలు నిజంగా శ్వేతకు కూతురు ఉందా..? ఉంటే ఏమయ్యింది..? తనకు సాయం చేయమని శ్వేత, రిషినే ఎందుకు అడిగింది..? లాంటి అంశాలన్ని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే


నటీనటులు:
ప్రతి సినిమాకు ఎంతో మెచ్యూరిటీ చూపిస్తున్న అడవి శేష్, ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ మంచి వేరియేషన్స్ చూపించి, సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కూడా మంచి వేరియేషన్స్ చూపించాడు. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అదాశర్మ ఈ సినిమాతో నటిగా కూడా మంచి మార్కులు సాధించింది. కూతురి్న పొగొట్టుకున్న తల్లి బాధను మనసుకు హత్తుకునేలా చూపించింది. తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి అనసూయ ఫరవాలేదనిపించింది. తన నుంచి అద్భుతమైన నటన ఆశించేవారికి మాత్రం నిరాశ తప్పదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు. తన పాత్రతో సినిమాకు కాస్త కామెడీ యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.

Thursday, February 25, 2016

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కేటాయింపులివీ...

తెలంగాణలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్ లో కేటాయింపులు


పెద్దపల్లి-నిజామాబాద్ : రూ.70కోట్లు
మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు
ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి
మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు
గద్వాల్-రాయ్ చూర్ : రూ.5 కోట్లు
అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు
నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు
భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి
కొండపల్లి-కొత్తగూడెం: రూ.10
మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు
డిచ్ పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు
సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ కు: రూ.80 కోట్లు
బోధన్ నుంచి బీదర్ కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు
పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్ వేల నిర్మాణానికి రూ.5 కోట్లు
కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు
కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు
కాజీపేట-బలార్షా : రూ.30కోట్లు
సికింద్రాబాద్-మహబూబ్ నగర్ :రూ.80 కోట్లు

Wednesday, February 24, 2016

నామీదే నాకు ఈర్ష్య

 ఇదివరకు కథానాయికల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఒకే సినిమాలో నటించినా సరే... ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. ఇటీవల మాత్రం దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఐక్యతారాగం పాడుతున్నారు. ఎదుటి కథానాయిక ఒక మంచి పాత్ర చేసిందంటే చాలు... వెంటనే వాళ్లని అభినందించే పనిలో పడిపోతుంటారు. అనుష్క అయితే మొదట్నుంచీ తోటి కథానాయిలతో స్నేహంగా మెలుగుతోంది. అందుకే ‘అనుష్క నిజంగా స్వీటీనే’ అంటుంటారు ఆమెతో కలిసి ప్రయాణం చేసిన కథానాయికలు. హిందీ కథానాయిక సోనాక్షి సిన్హా మొదలు తమన్నా వరకు చాలామంది అనుష్కని బహిరంగంగా పొగిడినవాళ్లే. నిజంగా మీకెప్పుడూ, ఏ కథానాయికపైనా ఈర్ష్య పుట్టింది లేదా? అని అనుష్కని అడిగితే... ‘‘మేం స్నేహంగా ఉన్నంతమాత్రాన మామధ్య పోటీ ఉండదనుకోకండి. అసలు పోటీ లేకపోతే ఏ వృత్తినీ ఆస్వాదించలేం. మరింత మంచి పాత్రలు ఎంచుకోవాలి, వేరొకరి కంటే బాగా నటించాలనే తపన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఇక ఈర్ష్య, ద్వేషం కలగడం లాంటివంటారా?... ఒక మంచి అవకాశం అందినప్పుడు - ‘ఇలాంటి పాత్ర నాకు కాకుండా వేరొకరికి వెళ్లుంటే, నిజంగా వాళ్లని ద్వేషించేదాన్నేమో కదా. వాళ్లపై నాకు అసూయ పుట్టేదేమో కదా’ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలాంటి పాత్రలు నాకు చాలాసార్లే లభించాయి. అందుకే పుడితే గిడితే నామీదే నాకు ఈర్ష్య పుట్టాలి తప్ప వేరొకరిపై కాదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి- ది కన్‌క్లూజన్‌’లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Tuesday, February 23, 2016

నేటి నుంచే ఆసియా కప్



ఆఖరి పంచే కాదు, తొలి విజయం మనదైనప్పుడూ ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఆ కిక్కును సొంతం చేసుకోవాల్సిన సమయమిది. టీ20 ఆసియా కప్ మొదలయ్యేది నేడే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది టీమ్ ఇండియా. చలో మరి.. టోర్నీలో శుభారంభం చేద్దాం.. కప్పు వేటను దూకుడుగా మొదలెడదాం.
ఆసియా కప్‌కు సర్వం సిద్ధమైంది. బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ మొదలయ్యేది బుధవారమే. ప్ర పంచ క్రికెట్లో పసికూన స్థాయి నుంచి పరిణతి గల జట్టు స్థాయికి ఎగబాకుతున్న బంగ్లా జట్టుతోనే టీమ్ ఇండియా తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు వేదికగా ఇక్కడి షేర్-ఏ-బంగ్లా స్టేడియం ముస్తాబైంది. టీ20 ఫార్మాట్లో ఇప్పుడు భారత్ తిరుగులేని శక్తి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై క్లీన్‌స్వీప్ చేసి వచ్చి, భారత్‌లో లంకను 2-1తో ఓడించి బలంగా కనిపిస్తున్నది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముందు వరకూ కూడా టీమ్ ఇండియా అన్ని అంశాల్లో ఏ లోటూ లేకుండా కనబడింది. అయితే ప్రాక్టీస్‌లో ధోనీ వెన్నుకండరాల గాయానికి గురవడం ప్రస్తుతం జట్టును ఇబ్బంది పెడుతున్న అంశం. అలా అని ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడబోడన్నది ఇప్పుడే చెప్పలేంగానీ, అన్ని విధాలుగా ఆసియా కప్‌కు సమాయత్తమైన జట్టుకు ధోనీ గాయం కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైనా యువసారథి కోహ్లీ నేతృత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతుంది.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)/ పార్థివ్ పటేల్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
బంగ్లా: సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, సబ్బీర్, మహ్మదుల్లా, ముష్ఫికర్, షకిబల్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మోర్తజా (కెప్టెన్), అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమిన్ హుస్సేన్

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?

  చిట్టి గౌను ధరించి చేతిలో పువ్వు పట్టుకుని కూర్చున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?... ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. ఆమె తన చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని... నా చేతిలో ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నానో తెలియట్లేదు’ అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తూ... బోలెడన్ని కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని, తన కళ్లు చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌లో పేర్కొన్నారు.

Monday, February 22, 2016

సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!

 తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే  కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది.
         
కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.