Saturday, February 20, 2016

ప్రభాస్‌ ఫియాన్సీ ఆమెనా.. కాదా?

 'బాహుబలి' ప్రభాస్ పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమా పూర్తవ్వగానే ఈ యంగ్ రెబల్‌ స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఫొటో ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌ గా మారిపోయింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
గులాబీ రంగు చీర కట్టుకొని ఓ భారీ వస్త్రనిలయంలో ఈ అమ్మాయి ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నదని, 2016లో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుందని అంటున్నారు. అయితే, ప్రభాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్‌కు కాబోయే వధువు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని, ఆ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు.

Wednesday, February 17, 2016

వాళ్ల బాటలోనే... అలీ కూడా

 ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ విషయంలో కామెడీ స్టార్ లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్ లో అలీ కూడా చేరిపోయాడు.              మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి, పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డ్ చేశారు.

Tuesday, February 16, 2016

నేనెవరికిస్తే మీకెందుకు..

 విరాట్‌కోహ్లి - అనుష్కశర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడికి అనుష్కకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి మంగళవారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా బహూకరించాల్సి వస్తే.. ఎవరికిస్తారంటూ ఓ విలేకరి కొంటెగా అడిగాడు. కోహ్లి మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తాను. ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా బహుమానంగా ఇస్తా. లేకుంటే జట్టు సహచరులకు ఇస్తా. అయినా ఎవరికిస్తే మీకెందుకు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలడగాలి కానీ.. విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు’’ అని అన్నాడు. మానవ సంబంధాల గురించి అడిగిన మరో ప్రశ్నకూ ఇలాగే స్పందించాడు కోహ్లి. ‘‘ఎవరితో సంబంధం గురించి అడుగుతున్నారు. అయినా ఇవి నన్నడగాల్సిన ప్రశ్నలు కాదు’’అని మండిపడ్డాడు.

ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది

 గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్ గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో సినిమాను నిర్మించనుంది.

Monday, February 15, 2016

అదృష్టం బాగుండి.. బతికిపోయా: అమితాబ్

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తాను అదృష్టం బాగుండి బతికిపోయానని.. లేకపోతే మంటల్లో చిక్కుకుని ఉండాల్సిన వాడినని బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అప్పుడే తన పెర్ఫార్మెన్స్ ముగించుకుని అక్కడి నుంచి కారులో బయల్దేరానని, కాసేపటికే అక్కడ మంటలు అంటుకున్నాయని అమితాబ్ చెప్పారు. అయితే అక్కడి వాళ్లు తనను కాసేపు అక్కడే ఉండి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరారని, కానీ పని ఉండటంతో వెళ్లిపోయానని చెప్పారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, తాను అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవుడి దయ వల్ల వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరూ మృతి చెందకపోవడం అదృష్టమని ట్వీట్ చేశారు. అయితే ఇది మాత్రం చాలా భయానకమైన అనుభవం అన్నారు.                   ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కూడా ఈ ప్రమాదం గురించి తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు. చౌపట్టిలో లైవ్ షో జరుగుతున్నప్పుడు అంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరం గానీ, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని అన్నాడు. ఎవరూ కంగారు పడి తొక్కిసలాట జరగకుండా వీఐపీల నుంచి సామాన్యుల వరకు అందరినీ నిమిషాల మీద గ్రౌండునుంచి పంపారని, చిట్టచివరి వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడే ఉన్నారని చెప్పారు.

Sunday, February 14, 2016

ముద్దు రద్దును వెనక్కి తీసుకున్న నటి!

‘‘పెళ్లయ్యాక నటన పరంగా కొన్ని హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నేను, మా ఆయన సైఫ్ అలీఖాన్ ముద్దు సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా కపూర్ పేర్కొన్నారు. కానీ, ముద్దు రద్దు అనే మాటను వెనక్కి తీసుకుని, అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో నటించారామె. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కి అండ్ క’. ఇందులో కబీర్ అనే యువకుడిగా అర్జున్ కపూర్, కియా అనే యువతిగా కరీనా నటించారు.

వీళ్ల పాత్రల పేర్లలోంచి ‘కి’, ‘క’ని తీసుకుని ‘కి అండ్ క’ అని పెట్టారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధం చుట్టూ సాగుతుంది. కథానుసారం లిప్ లాక్ ఉంటేనే బాగుంటుందని భావించిన కరీనా నటించారు. అర్జున్, కరీనాల లిప్ లాక్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.

హీరోయిన్ ప్రణీతకు గాయాలు


హీరోయిన్ ప్రణీతకు ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బైటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం ఖమ్మం జిల్లాలో ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్వల్పంగా గాయపడిన ప్రణీతను మోతేలోని ఆస్పత్రికి తరలించారు.
తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది.

బావ, అత్తారింటికి దారేదీ, డైనమైట్, రభస, పాండవులు పాండువులు తుమ్మెద తదితర చిత్రాల్లో ప్రణీత నటించింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. 'చుట్టాలబ్బాయి'లో ఆదితో జత కడుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది.

Saturday, February 13, 2016

రజనీ చిత్రం కోసం 20కోట్లతో సెట్

  సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కోసం చెన్నైలోని ఓ ప్రాంతం అత్యాధునిక నగరంగా మారుతోందన్నది తాజా సమాచారం.రజనీకాంత్ ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఏకకాలంలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. ఇది ఎందిరన్ చిత్రానికి సీక్వెల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అద్భుత సృష్టి 2ఓ చిత్రం అని చెప్పవచ్చు.ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలో రూపొందనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నమోదు కానున్న చిత్రం ఇది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ 250 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా మారుతున్నారు. చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

 హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో
 తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం. ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు.ఇది పలు ఏకరాల స్థలంలో ఒక ఆధునిక నగరంగా తయారవుతోందన్నది గమనార్హం.ఈ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు.
 
 సెల్‌ఫోన్స్ నిషిద్దం

 షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దర్శకుడు శంకర్ చిత్ర యూనిట్‌కు కొన్ని నిబంధనలను విధించారు. షూటింగ్ స్పాట్‌కు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. చిత్రానికి సంబంధించిన వారు మినహా బయటి వారెవరికి షూటింగ్ స్పాట్‌కు రావడానికి అనుమతి నిషిద్దం లాంటి నిబంధనలు విధించారట.