Saturday, January 16, 2016

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ

 

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్ తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్ ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..?



కథ :
రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..?



నటీనటులు :
అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్ తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.



ఓవరాల్ గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

Thursday, January 14, 2016

డిక్టేటర్‌ : సినిమా రివ్యూ

 
సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్ తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్ గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..?
కథ :

చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్ తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు.

ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్ తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ.


నటీనటులు :
చంద్రశేఖర్ ధర్మగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్ లతో ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్ లో కూల్ గా, సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా రెండు షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి  క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్ గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు.


ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్

Wednesday, January 13, 2016

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

 టెంపర్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్ తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపించిన ఎన్టీఆర్, కథా కథనాల ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించాడు. ముఖ్యంగా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంతో నమ్మకంగా తన సినిమాను రిలీజ్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో అంటూ సక్సెస్ అయ్యాడా.. 'వన్ నేనొక్కడినే' లాంటి భారీ డిజాస్టర్ తరువాత సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ సాధించాడా..?
కథ :
అభిరామ్ (ఎన్టీఆర్) లండన్ లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్ లోనే తన ఎమోషన్ ను దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం(రాజేంద్ర ప్రసాద్)కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్న( రాజీవ్ కనకాల) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.

ఈ ఆపరేషన్ లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరామ్ ను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.


నటీనటులు :
సినిమా అంతా వన్ మేన్ షోగా నడిపించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడు. రిలీజ్ కు ముందు నుంచి చుపుతున్నట్టుగా చివరి 45 నిమిషాలు అద్భుతమైన నటనతో ఆడియన్స్ తో కంటతడి పెట్టించాడు. లుక్ విషయంలో కూడా ఎన్టీఆర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు మాస్ లుక్ లోనే కనిపించిన జూనియర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ విషయంలోనూ కొత్త దనం చూపించాడు. రకుల్ ప్రీత్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నటిగా ప్రూవ్ చేసుకునే 

ఛాన్స్ రానీ రకుల్ కు ఈ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది.

ఓవరాల్ గా నాన్నకు ప్రేమతో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఆశించే ఆడియన్స్ ను కాస్త నిరాశపరిచినా.. కొత్త కథా కథనాలను కోరుకునే వారిని మాత్రం అలరిస్తోంది. సంక్రాంతి బరిలోకి సక్సెస్ ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్

Tuesday, January 12, 2016

లుంగీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ధోనీ, ప్రభుదేవా!

 మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్‌ ఆడటంలో ఆయనది ప్రత్యేకమైన ధనాధన్‌ శైలి. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడమే కాదు.. లుంగీ కట్టుకొని ప్రభుదేవాతో పోటీపడి స్టెప్పులు కూడా వేయగలనని తాజాగా ఆయన నిరూపించాడు.
ఓ మోటార్‌ బైక్ వాణిజ్య ప్రకటన కోసం ధోనీ దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ యాడ్‌లో దక్షిణాది స్టైల్‌లో లుంగీ కట్టడే కాదు.. గ్రేట్‌ డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు వేశాడు. రజనీకాంత్‌ గౌరవార్థం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొన్‌ చేసిన 'లుంగీ' డ్యాన్స్ సూపర్‌హిట్‌. ఇప్పుడే అదే స్టైల్‌లో ధోనీ, ప్రభుదేవా లుంగీ మోకాళ్లపైకి కట్టుకొని డ్యాన్స్ చేశారు. ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు నేతృత్వం వహించిన ఈ జార్ఖండ్ డైనమేట్‌ ధోనీ.. దక్షిణాది వారికి సన్నిహితుడే. ఇప్పుడు చెన్నై జట్టు లేకపోవడంతో ధోనీ ఐపీఎల్‌లో పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ ధోనీకి దక్షిణ భారతంలోనూ భారీ అభిమానులు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుభాషలో ఈ యాడ్‌ను మోటార్‌ బైక్‌ కంపెనీ రూపొందించింది. అనుకున్నట్టుగానే అభిమానులను అలరించేలా ధోనీ, ప్రభుదేవా తమ 'లుంగీ డ్యాన్స్‌' స్టెప్పులతో దుమ్మురేపారు.

Monday, January 11, 2016

ఊరి కోసం వెబ్‌సైట్‌

గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతెచ్చిన యువకుడు

            పుట్టిన ఊరుకు ఎదో చేయాలనే తపన. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్వయం కృషితో చిన్నషాపు నడుపుకుంటూ కుటుంబా న్ని వెల్లదీస్తున్న ఓ యువకుడు. గ్రామం కోసం రూ.20 వేల వరకు ఖర్చుపెట్టి ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. అందులో గ్రామచరిత్రను పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తన సంపాద లోంచి ఖర్చు చేయడం పట్ల పలువురు అభినం దిస్తున్నారు. అతనే కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ గ్రామానికి చెందిన శ్రీను. చిన్నఘనపూర్‌ ఈ పేరు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. కొల్చారం మండలంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వందేం డ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన, జిల్లాలో ఏకైక మధ్యతరహా, సాగునీటి ప్రాజెక్టు అయిన ఘన పూర్‌ ఆనకట్ట ఈ గ్రామ పరిధిలోనే ఉండ టం విశేషం. దీనిద్వారా సాగునీటి రంగంలో గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం మరో ప్రత్యేకతను సంతరించుకుని ఊరి పేరు ప్రపంచ వ్యాప్తమైంది.

Sunday, January 10, 2016

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు


 సరదాగా షికారుకు వెళ్లాలంటే ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైకులోనో లేదా లగ్జరీ కారులోనో వెళ్లొచ్చు. అందులోనూ క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో. అయితే హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్ లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు. తన పిల్లలతో కలసి ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ హృతిక్ తెగ ఎంజాయ్ చేశాడు. కార్లు తప్ప ఆటో ఎక్కని హృతిక్ కొడుకులకూ ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. హృతిక్ తన కొడుకులతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో ఆటో ప్రయాణం తన పిల్లలకు కొత్త అనుభవమని హృతిక్ ట్వీట్ చేశాడు.

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!

  సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్‌తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు.
సో.. బిపాసా ఈ  హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు.
చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్‌ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే.

Thursday, January 7, 2016

ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం

 ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు.

  కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.