Monday, January 11, 2016

ఊరి కోసం వెబ్‌సైట్‌

గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతెచ్చిన యువకుడు

            పుట్టిన ఊరుకు ఎదో చేయాలనే తపన. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్వయం కృషితో చిన్నషాపు నడుపుకుంటూ కుటుంబా న్ని వెల్లదీస్తున్న ఓ యువకుడు. గ్రామం కోసం రూ.20 వేల వరకు ఖర్చుపెట్టి ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. అందులో గ్రామచరిత్రను పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తన సంపాద లోంచి ఖర్చు చేయడం పట్ల పలువురు అభినం దిస్తున్నారు. అతనే కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ గ్రామానికి చెందిన శ్రీను. చిన్నఘనపూర్‌ ఈ పేరు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. కొల్చారం మండలంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వందేం డ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన, జిల్లాలో ఏకైక మధ్యతరహా, సాగునీటి ప్రాజెక్టు అయిన ఘన పూర్‌ ఆనకట్ట ఈ గ్రామ పరిధిలోనే ఉండ టం విశేషం. దీనిద్వారా సాగునీటి రంగంలో గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం మరో ప్రత్యేకతను సంతరించుకుని ఊరి పేరు ప్రపంచ వ్యాప్తమైంది.

Sunday, January 10, 2016

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు


 సరదాగా షికారుకు వెళ్లాలంటే ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైకులోనో లేదా లగ్జరీ కారులోనో వెళ్లొచ్చు. అందులోనూ క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో. అయితే హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్ లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు. తన పిల్లలతో కలసి ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ హృతిక్ తెగ ఎంజాయ్ చేశాడు. కార్లు తప్ప ఆటో ఎక్కని హృతిక్ కొడుకులకూ ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. హృతిక్ తన కొడుకులతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో ఆటో ప్రయాణం తన పిల్లలకు కొత్త అనుభవమని హృతిక్ ట్వీట్ చేశాడు.

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!

  సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్‌తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు.
సో.. బిపాసా ఈ  హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు.
చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్‌ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే.

Thursday, January 7, 2016

ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం

 ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు.

  కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.


బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధ ...


 ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ స్థానాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీప్లేస్ చేయబోతున్నారు. పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమం 'అద్భుత భారత్(ఇన్‌క్రెడిబుల్ ఇండియా)' బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది. త్వరలో అమితాబ్ నియామకంపై ప్రకటన వెలువడనుంది.
  కాగా ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై  చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో  ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్   నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు పేర్కొన్నాడు.

Wednesday, January 6, 2016

తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!

 ‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.  ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్.  తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.  అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!

ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను అదే చేస్తా

 సినీతారలకు సాధారణంగానే  ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్ లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్  అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు.
                 అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన ‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో  కాస్త  ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి  టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్ పాటలు వింటూ రిలాక్స్ అవుతా.  చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.

Tuesday, January 5, 2016

షూటింగ్‌లో యవ హీరోకు గాయాలు

 నటుడు శాంతనుకు షూటింగ్‌లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2  చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.