
ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి
టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట
సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న
ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330
పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్
చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్
చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము
ఆడతామని ప్రతిపాదించాడు.
కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని
తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో
2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2
సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన
వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు
సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్
పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే
ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన
క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ స్థానాన్ని బిగ్ బి అమితాబ్
బచ్చన్ రీప్లేస్ చేయబోతున్నారు. పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమం 'అద్భుత
భారత్(ఇన్‌క్రెడిబుల్ ఇండియా)' బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి
రంగం సిద్ధమైంది. త్వరలో అమితాబ్ నియామకంపై ప్రకటన వెలువడనుంది.
కాగా ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్
రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన
విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమీర్ వ్యాఖ్యలను
కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో
భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం
తెలిసిందే. దీంతో ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా,
చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించడంపై
ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు
పేర్కొన్నాడు.
‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని
‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం
చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా
పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల
నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.
ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని
బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు
భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని
టాక్. తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే,
పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు,
దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.
అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి,
దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన
‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన
ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని
అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!
సినీతారలకు సాధారణంగానే ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు
చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్
లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ
స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు
వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్ అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు
షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు.
అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన
‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై
ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు.
కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త
బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా
ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో
కాస్త ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్
పాటలు వింటూ రిలాక్స్ అవుతా. చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు
వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.
నటుడు శాంతనుకు షూటింగ్‌లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే
భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ
వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2 చిత్రాల్లో కథానాయకుడిగా
నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర
షూటింగ్‌లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్
సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన
నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా
బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.
దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి
ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది
అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్
చేస్తున్నానన్నారు.
సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణాష్టమి చిత్రం
ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు తన ఫేస్‌బుక్
ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాసు
వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్ సంగీతం సమకూర్చారు. త్వరలో
కృష్ణాష్టమి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి
అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను ఈ ఏడాది
కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక
మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది.
తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని
అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల
కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే
వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర
చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే
ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.
ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ
ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం
చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్‌గా
నంబర్‌ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్‌ఒన్
స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి
న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం
త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం.
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో
ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ తో
తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు
చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్
సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను
గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ
సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? అనుకొని పరిస్థితుల్లో
తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడ ప్రేక్షకులను
అలరిస్తున్న వీరప్పన్ ను తెలుగు ఆడియన్స్ చూడాలంటే మాత్రం వర్మ మరో డేట్
చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే......