Sunday, November 15, 2015

లక్కీ డ్రాలో సొంతం చేసుకున్న నాగేందర్‌ రెడ్డి : ( శ్రీమంతుడు) సైకిల్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించిన కాంటెస్ట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సైకిల్‌ విజేతను ఈరోజు డ్రా ద్వారా సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌, రవి, సివిఎం మాట్లాడుతూ - ''మా శ్రీమంతుడు చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతోంది. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో సైకిల్‌ విజేతను సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈరోజు డ్రా ద్వారా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేశ్వరరెడ్డి ఈ సైకిల్‌ను గెలుచుకున్నారు. విజేత జి.నాగేశ్వరరెడ్డికి మహేష్‌ చేతులమీదుగా సైకిల్‌ను అందజేయడం జరుగుతుంది'' అన్నారు.  

Saturday, November 14, 2015

' జబర్ధస్త్‌' యాంకర్‌గా చేయనున్న శ్యామల

తెలుగు బుల్లి తెరపై సంచల కార్యక్రంగా దూసుకు పోతుంది. ' జబర్దస్త్‌'. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ కామెడీ కార్యక్రమానికి నాగబాబు మరియు రోజా న్యాయ నిర్ణేతలు. ఇక ఈ కార్యక్రమంకు మొదట హాట్‌ యాంకర్‌ అనసూయ యాంకరింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రష్మి యాంకర్‌గా చేస్తోంది. గత కొంత కాలంగా రష్మికి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. దాంతో రష్మి కూడా జబర్ధస్త్‌ నుండి దూరంగా వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ స్థానంలో శ్యామల రాబోతున్నట్లుగా ఈటీవీ వర్గాల నుండి సమాచారం. గత కొంత కాలంగా పలు ఆడియో ఫంక్షన్స్‌తో పాటు బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుది శ్యామల. ఈమెను జబర్దస్త్‌ యాంకర్‌గా ఎంపిక చేయాలని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి తర్వలోనే జబర్దస్ల్‌ వేదికపై శ్యామలను చూపిస్తామేమో చూడాలి.

Thursday, November 12, 2015

హాజల్ కీచ్‌ తో యువీ నిశ్చితార్థం!

 టీమిండియా వన్డే వరల్డ్ కప్ హీరో,  ప్లే బాయ్ యువరాజ్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్నవార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. దీపావళి రోజున యువీ వివాహ శుభవార్త చెబుతాడని అభిమానులు ఎదురు చూపులు నిజం కాబోతున్నాయి. గత కొంతకాలంగా బ్రిటీష్ నటి హాజల్ కీచ్‌ తో ప్రేమాయణ సాగిస్తున్నయువీ..  ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.  వీరద్దిరి నిశ్చితార్థం బాలిలో జరిగినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హజల్ ఓ ఉంగరంతో దర్శనమివ్వడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

Tuesday, November 10, 2015

బ్లాస్టర్స్ లెక్క సరి చేస్తారా!

వారియర్స్‌తో నేడు రెండో టి20
  క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్

                 అమెరికాలోని క్రికెట్ అభిమానులు దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు మరో అవకాశం. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ జట్టు వార్న్ వారియర్స్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సచిన్ సేన సిరీస్‌లో నిలబడాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మొదటి మ్యాచ్‌లాగే దీనికి కూడా స్థానిక బేస్‌బాల్ మైదానం వేదిక కానుంది. ఇక్కడి మినట్ మెయిడ్ పార్క్‌లో టి20 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ తర్వాత వరుసగా క్రికెట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వెటరన్లు రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యారు.
                సచిన్ జట్టులో అతనితో పాటు సెహ్వాగ్ మాత్రమే గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉన్న సెహ్వాగ్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్‌కు బదులుగా గంగూలీ బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో షోయబ్ అక్తర్, మురళీలలో కాస్త మెరుపు కనిపించింది. పదును లేని ఆంబ్రోస్ స్థానంలో మెక్‌గ్రాత్‌కు అవకాశం దక్కవచ్చు.

'మరి కొన్నేళ్లు ఆ జోడిదే హవా'

  ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ నంబర్ వన్ క్రీడాకారిణులు సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లపై భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ తో సహా తొమ్మిది టైటిల్స్ ను గెలిచిన సానియా-హింగిస్ ల జోడి కొన్నేళ్ల పాటు అదే ఊపును కొనసాగించి మరిన్ని గ్రాండ్ స్లామ్స్ ను సొంతం చేసుకుంటారని భూపతి అభిప్రాయపడ్డాడు.
' సానియా ఒక స్ఫూర్తి.  గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రంగా కష్టపడుతూ  మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆ జోడి జైత్రయాత్ర ఈ ఏడాదికి మాత్రమే పరిమితం కాదు..  వారి హవా మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆటలో సానియా-హింగిస్ ల సహకారం నిజంగా అద్భుతం' అని భూపతి కొనియాడాడు. 2016 రియో ఒలింపిక్స్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల ద్వయం, పురుషల డబుల్స్ లో రోహన్ బోపన్న-లియాండర్ పేస్ ల జోడి పతకాలను సాధించే అవకాశం ఉందన్నాడు.

Sunday, November 8, 2015

మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!

                         ఇంటర్వ్యూ

                              కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు...

 మొదటిసారి మేకప్ వేసింది..?
                   ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్‌ని అయిపోయా! 
 నటిగా సెటిలవ్వాలని అప్పుడే  ఫిక్సైపోయారా?
                  లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా.
  మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా?
                     ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్‌గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను.
  మీరు యారొగెంట్ అనేది అందుకేనా?
                      ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం.
  ఎక్కువగా లేడీ డెరైక్టర్స్‌తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా?
                      అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా!   గ్లామర్ పాత్రలు చేయరేం?
 నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను. 
అలా అయితే అవకాశాలు తగ్గవా?
            నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా!
 లావుగా ఉంటారని... పొట్టి అని?
 (నవ్వుతూ) నేను ఫిజిక్‌ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు.
  పెళ్లెప్పుడు?
            ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది.
 
    ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా?
             లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో!

దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf

మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf

Saturday, November 7, 2015

సచిన్ @ వార్న్

 నేటి నుంచి క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్
     న్యూయార్క్‌లో తొలి మ్యాచ్

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ అద్భుత విన్యాసాలతో ఆటపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ టి20 లీగ్‌కు నేటి (శనివారం) నుంచి తెర లేవనుంది. దీంట్లో భాగంగానే ఆయా దేశాల మాజీ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. తమ సత్తా ఏమిటో నేటి తరానికి పరిచయం చేయనున్నారు.
సచిన్ జట్టే ఫేవరెట్
 ఇక జట్ల విషయానికొస్తే.. గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలతో సచిన్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉంది. భారత్ తరఫున గంగూలీతో పాటు సెహ్వాగ్‌తోనూ సచిన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈసారీ అలాంటి దృశ్యమే కనిపించనుందా లేక దాదా, వీరూ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారా అనేది వేచి చూడాలి. బ్రియాన్ లారా, జయవర్ధనే, ఆల్‌రౌండర్ క్లూసెనర్ ప్రత్యర్థిని ఎలా వణికిస్తారనేది ఆసక్తికరం. ఇక బౌలింగ్‌లో పేసర్లు అక్తర్, పొలాక్, మెక్‌గ్రాత్, స్పిన్నర్ మురళీధరన్, స్వాన్  సత్తా తెలిసిందే. వీరంతా తమ పూర్వపు స్థాయి అందుకుంటే గెలుపు ఖాయమే..

 సంగక్కరే కీలకం
 వార్న్ వారియర్స్ జట్టులో కుమార సంగక్కర కీలకంగా కనిపిస్తున్నాడు. ఇటీవలి వరకు క్రికెట్‌తో టచ్‌లో ఉండడంతో పాటు పొట్టి ఫార్మాట్‌లో మంచి అనుభవముంది. వార్న్ కూడా బిగ్‌బాష్‌లో మెరిసినవాడే. కలిస్ ప్రభావం చూపించవచ్చు. ఫీల్డింగ్‌లో జాంటీ రోడ్స్ పాదరసంలా కదిలితే సచిన్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చాల్సిందే. బౌలింగ్‌లో 49 ఏళ్ల వసీం అక్రమ్ మరోసారి తన యార్కర్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. స్పిన్నర్లు వెటోరి, సక్లయిన్ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

 జట్లు
 సచిన్ బ్లాస్టర్స్: సచిన్ (కెప్టెన్), గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, లారా, జయవర్ధనే, హూపర్, మొయిన్ ఖాన్, మురళీధరన్, స్వాన్, అంబ్రోస్, పొలాక్, మెక్‌గ్రాత్, క్లూసెనర్, అక్తర్.
 వార్న్ వారియర్స్: వార్న్ (కెప్టెన్), హేడెన్, వాన్, పాంటింగ్, రోడ్స్, కలిస్, సైమండ్స్, సంగక్కర, సక్లయిన్, వెటోరి, వాల్ష్, అక్రం, డొనాల్డ్, అగార్కర్.

Thursday, November 5, 2015

ఆల్-స్టార్ టీ 20 సిరీస్ వార్న్ vs సచిన్ టీమ్ ప్రకటన

సచిన్ బ్లాస్టర్స్ జట్టులో వార్న్ వారియర్స్ ప్లేయర్స్ జాబితా, ఆల్ స్టార్ T20 లీగ్ 2015  క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉంటాయి.
                   1st T20 మ్యాచ్ నవంబర్ 7, 2015 న మొదలు. 2nd T20 నవంబర్ 11 హాయౌస్టన్ లో మినట్ మైడ్ పార్క్ వద్ద ఆడతారు. మూడవ మరియు ఆఖరి T20 నవంబర్ 14 న లాస్ ఏంజిల్స్ లో మోసగాడు స్టేడియం ఆతిథ్యమిస్తుంది.