Sunday, December 23, 2012

వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా సచిన్‌ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వన్డేలకు గుడ్‌బై చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. వన్డేలకు గుడ్‌బై చెప్పినప్పటికీ, టెస్టుల్లో కొనసాగుతానని ఆయన తెలిపారు. టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌ వ్యవహరించారు. సచిన్‌ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. పాక్‌ సిరీస్‌కు ముందుగానే ఆయన వన్డేలకు ఆడనని రిటైర్మెంట్‌ చేయడం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు చేశాడు. వన్డేల్లో సచిన్‌ అత్యధిక స్కోరు 200 నాటౌట్‌గా ఉన్నాడు. వన్డేల్లో 154 వికెట్లు తీశాడు. వన్డేల్లో సచిన్‌ బ్యాటింగ్‌ సగటు 44.86గా ఉంది. సచిన్‌ తన కెరీర్‌లో తొలి, చివరి వన్డేలను పాకిస్థాన్‌పైనే ఆడారు. 23 ఏళ్ల వన్డే క్రికెట్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. వన్డేలకు సచిన్‌ గుడ్‌బై చెప్పిన మాట నిజమేనంటూ బీసీసీ సచిన్‌ రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీంలో ఉండడం తన అదృష్టమని సచిన్‌ చెప్పారు. వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాట వాస్తమేనని ఆయన స్పష్టం చేశారు. టెస్టుల్లో కొనసాగుతానని సచిన్‌ ప్రకటించారు. తనకు అండగా నిలిచిన సహచరులు, బీసీసీఐ సభ్యులు, క్రికెట్‌ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వన్డేలకు గుడ్‌బై చెబుతూ సచిన్‌ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. వన్డేల్లో ఎంతో ప్రతిభకనబర్చిన సచిన్‌ అందరికీ ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు.
అందరికీ కృతజ్ఞతలు : సచిన్‌
క్రికెట్‌లో ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన వారందరికీ సచిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం సచిన్‌ మీడియాతో మాట్లాడారు. టీమిండియా భవిష్యత్‌ ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2015 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహక ప్రక్రియ ప్రారంభించాలని టీంకు సూచించారు.

Friday, December 21, 2012

తెలుగు హీరోయిన్లులల్లో నెం1 హీరోయిను హ్యాపీబర్త్‌డే

తెలుగు హీరోయిన్లులల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న తమన్న ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. 


Sunday, November 4, 2012

శాండీ తుఫాన్ లో ఆర్తి అగర్వాల్

  అమెరికాలో శాండీ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజెర్సీతో పాటు.. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా రాష్ట్రాలు ఈ భీకర తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాయి. న్యూయార్క్‌ సిటీ సగానికి పైగా నీటమునిగింది.
ఈ నేపధ్యంలో మన తెలుగు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ..శాండి తుఫానులో చిక్కుకుందనే వార్త అబిమానులను కలవరపెడుతోంది. అయితే శాండీ ఎఫెక్టు తో ఆర్తికి పెద్దగా నష్టమేమీ జరగలేదని సమాచారం. ఆమె బస చేస్తున్న మోటల్ తుఫాను తాడికికి చిక్కుకుంది. అక్కడ నుంచి అమెరికా పోలీసులు ఆర్తిని ఖాళీ చేయించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా..ప్రస్తుతం ఆమెను అమెరికా న్యూ జర్శీలో గల ఓ సీనియర్ సిటిజన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతోంది అన్ని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్...ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అమెరికాలో భర్తతో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ాముద్రః అనే చిత్రంలో నటిస్తోంది

Thursday, October 25, 2012

ఫైనల్లో ఢిల్లీ ...

ఛాంపియన్‌ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు లయన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌ చేరుకుంది. టాస్‌ గెలిచి ఫీల్టింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ జట్టు. లయన్స్‌ బ్యాటింగ్‌ల్లో బోడి 49 బంతులల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ సహయంతో 50 పరుగులు చేశాడు. పీటర్స్‌న్‌ 24, కుక్‌ 11, ప్రీటోరిర్సు 3, సైముల్స్‌ 0 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్‌లో యాదవ్‌ రెండు వికెట్లు, మోర్కెల్‌, అగ్కర్‌, నెగి చెరో వికెటు లభించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. సెహ్వాగ్‌, వార్నర్‌ ఓపెనింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25 బంతులల్లో 41 పరుగులు చేశారు. మరో ఓపెనరు 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన పీటర్స్‌న్‌ కేవలం 10 పరుగులు చేసి నిరశపరిచాడు. చంద్‌ 30 , టేలర్‌ 10, పఠాన్‌ 35, ఓజా 10 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఉమేష్‌ యాదవ్‌. హా... హా... హా...
        ఇది మొత్తం అబ్బధం ఇప్పుడు చెప్పేంది నిజం 


ఢిల్లీ జట్టు రెండు ఫార్మట్‌లో విఫలమైయింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రెండు విదాలుగా నిరశపరిచారు. అలాగే ఫీల్గింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్‌ చేశారు. ఢిల్లి జట్టు బలం, బహీనత రెండు మిస్‌ చేశారు. ఒక సారి కూడా ఫైనల్‌ చేరుకోలేదు. ఇది విశేషం. ఢిల్లీ బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌, పీటర్స్‌న్‌, టేలర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, చంద్‌, జయవర్థన్‌, వార్నర్‌ వీరి పేర్లు వినడమే తప్ప చేతుల్లో చూప్పడం లేదు.





ముఖ్యంగా చెప్పడం మారిపోయా. ( ఉమేష్‌ యాదవ్‌ జన్మదిన శుభాకంక్షాలు )

              happy birthday

Tuesday, October 23, 2012

దసరా శుభాకాంక్షలు

                    దసరా శుభాకాంక్షలు



Sunday, October 21, 2012

బాలీవుడ్ డైరెక్టర్ యశ్‌చోప్రా కన్నుమూత

బాలీవుడ్ డైరక్టర్ యశ్‌చోప్రా (80) కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో లీలావతి ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందారు. యాశ్‌చోప్రా 1932 సంవత్సరంలో లాహోర్‌లో జన్మించారు. 1973లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం చలన చిత్ర రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా చోప్రాను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Saturday, October 20, 2012

అల్లు అర్జున్ భార్యకు గాయాలు

  హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Sunday, October 7, 2012

టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌ విజేత

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.

1 ) భారత్‌ 

2 ) పాకిస్తాన్‌ 
3 ) ఇంగ్లాండ్‌ 
4 ) వెస్టిండీస్‌ 

ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం