కాజల్ స్పీడ్గ రెట్టింపైంది. బిజినె స్‌మేన్ సెక్సస్‌తో తారా పథంలోకి దూసుకువెళ్లిన కాజల్‌కి తమిళం లో...తెలుగులో అవకాశాల వెల్లువ వచ్చిపడుతోంది. సూర్య, విజయ్‌ల చిత్రాల లో నటిస్తూ తమిళనాట తన హవా కొనసా గిస్తోంది. టాలీవుడ్గ లోనూ పెద్ద హీరోల చిత్రాలలో నటిం పజేసేం దుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.
Friday, February 10, 2012
Monday, February 6, 2012
Tuesday, January 31, 2012
Monday, January 30, 2012
పవన్ సరసన్ కాజల్?
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.
Friday, January 27, 2012
మూడు భాషల్లో రాణిస్సా!
అంతా యువతీయువకులే ఉన్న టీమ్‌తో పనిచేస్తే హుషారొస్తుంది. ఫలితమూ అంతే బావుంటుంది’’ అంటున్నారు ‘కొలవెరి..డి’ ఫేం, ‘3’ సంగీతదర్శకుడు అనిరుధ్. 21ఏళ్ల ఈ యువకుడు ఒకే ఒక్క ‘కొలవెరి..’తో ప్రపంచ ప్రసిద్ధ సంగీతదర్శకుడైపోయాడు. తెలుగు, తమిళ్, హిందీలో నేడు వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ-‘ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘3’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. ఆల్బమ్‌లో రెండు పాటలు కూడా పాడాను. ‘కొలవెరి...’కి కోరస్ పాడాను. అసలు ‘కొలవెరి...’ అనేది ప్రేమలో విఫలమైనప్పుడు..విచారంలో పాడుకునే పాట. రొటీన్‌కి భిన్నంగా ఉండాలని బాణి కొత్తగా వినిపించాను. హాస్యం, విచారం ఒకే పాటలో ఉండేలా ట్యూన్ కట్టడం చాలా కష్టం. ప్రయత్నించి సక్సెసయ్యాను. అలాగే ‘3’ సినిమాకోసం ముందస్తు ప్రణాళికలెన్నో. సెట్స్‌కెళ్లడానికి ముందు 13 లఘుచిత్రాలు మేమంతా కలిసి రూపొందించాం. అందులోంచి ఓ లఘుచిత్రాన్ని పూర్తి స్థాయి ఫీచర్ సినిమా ‘3’ గా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఏ.ఆర్.రెహ్మాన్‌ని విపరీతంగా అభిమానించే అనిరుధ్..బికాం పూర్తిచేసి లండన్ ట్రినిడాడ్ సంగీతకళాశాలలో మ్యూజిక్ కోర్స్ పూర్తిచేశారు. కర్నాటిక్ సంగీతంలోనూ మంచి ధిట్ట.
Monday, January 23, 2012
Sunday, January 22, 2012
ప్రిన్స్‌కు వదిన దొరికినట్లేనా!
వెంకటేష్, మహేష్‌బాబుల సంచలన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. అయితే గత కొంతకాలంగా వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ విషయమై సందిగ్థం నెలకొంది. త్రిష, భూమిక, అమలాపాల్ లాంటి హీరోయిన్ల పేర్లు ఆ మధ్య వినిపించాయి. తీరా విషయానికి వస్తే అవన్నీ ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు అనూహ్యంగా అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి అచ్చంగా తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ అచ్చతెలుగు అందాల అపరంజి బొమ్మను వెంకటేష్ పక్కన నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్ సరసన అయితే ఓకేగానీ హీరోయిన్లంతా ప్రిన్స్ మహేష్‌బాబుకు ఒదిన పాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు అంజలి కూడా అవకాశం ఉపయోగించుకుంటుందో లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా వదులుకుంటుందో మరి వేచిచూడాలి.
Tuesday, January 17, 2012
మార్చిలో జహీర్ ఖాన్ పెళ్లి
భారత క్రికెటర్ జహీర్ ఖాన్ ఓ ఇంటివాడు కానున్నారు. చిరకాల స్నేహితులు, బాలీవుడ్ తార ఇషా షేర్వాణితో జహీర్ మార్చి నెలలో పెళ్లి జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జహీర్ ఖాన్ పెళ్లి జరిగే అవకాశముంది. ఒక వేళ మార్చి నెలలో సాధ్యపడకపోతే అక్టోబర్ నెలలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Subscribe to:
Posts (Atom)




