ముంబయికి చెందిన ముషీర్ ఖాన్ అనే చిచ్చరపిడుగు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 114 ఏళ్ల గైల్స్ షిల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడిన అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సున్న ముషీర్ ఖాన్ మంగళవారం ముంబయిలో జరిగిన అండర్ -14, ఇంటర్ స్కూల్ గైల్ షీల్డ్ పోటీల్లో పాల్గొని అందరిని ఆశ్చర్య పరిచాడు. ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగిన ముషీర్ 28 బంతులాడి మూడు పరుగులు సాధించాడు. అంతేకాదు ఇతను మంచి లెఫ్ ఆర్మ్ స్మిన్నర్ కూడా. ఐదు ఓవర్లు వేసిన ముషీర్ 12 పరుగులిచ్చాడు. తొలి మ్యాచులో పెద్దగా రాణించనప్పటికీ ఈ బుల్లి క్రికెటర్ అందరిని ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ డానియల్ వెటోరి తన ఆదర్శమంటున్నాడు ఈ బుడతడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యమంటున్నాడు. ముషీర్ అంజుమన్ -ఈ- ఇస్లాం అల్లెనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతున్నాడు. ముషీర్ తండ్రి నౌషద్ ఖాన్ క్రికెట్ కోచ్ కాగా, అన్నయ్య సర్ఫ్‌రాజ్ ఖాన్ రెండేళ్ల క్రితం హరిస్ షీల్డ్ టోర్నమెంట్‌లో 438 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
Thursday, December 15, 2011
Wednesday, December 14, 2011
అరడజను సినిమాలు : సమంత
టాలీవుడ్ ప్రస్తుతం సమంత మాయలో పడిపోయింది. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో తన మాయని మొదలు పెట్టిన సమంత ఈ మధ్య మహేష్‌తో నటించిన ‘దూకుడు’ చిత్రంతో హీరోయిన్‌గా తన జోరు పెంచేసింది. ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు హీరోలనీ తన మాయలో పడేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు తెలుగు చిత్రాలు వుండటం విశేషం. అవి ఎస్8.ఎస్8. రాజమౌళి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈగ’, గౌతమ్‌మీనన్ మూడు బాషల్లో నిర్మిస్తున్న ‘నిత్య’, నాగచైతన్యతో దేవాకట్టా తెరకెక్కిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’, దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అలాగే రామ్‌చరణ్‌తో వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘ఎవడు’, సిద్ధార్థ హీరోగా ‘అలామొదలైంది’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించడానికి సమంత అంగీకరించింది.
ఈ చిత్రాలతో పాటు ‘ఏమాయ చేసావె’ చిత్రం ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ‘ఏక్ దీవానా థా’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న సమంత తన డైరీని పూర్తిగా ఫుల్ చేసేసింది. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఈ చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేసుకోవడం సమంతకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరు చిత్రాలు అంగీకరించిన సమంత ఈ ఆరు చిత్రాల్లో ఏ చిత్రానికి ఎన్ని డేట్స్ కేటాయించాలో తేల్చుకోలేక ఇబ్బందిపడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఈ చిత్రాలతో పాటు ‘ఏమాయ చేసావె’ చిత్రం ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ‘ఏక్ దీవానా థా’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న సమంత తన డైరీని పూర్తిగా ఫుల్ చేసేసింది. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఈ చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేసుకోవడం సమంతకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరు చిత్రాలు అంగీకరించిన సమంత ఈ ఆరు చిత్రాల్లో ఏ చిత్రానికి ఎన్ని డేట్స్ కేటాయించాలో తేల్చుకోలేక ఇబ్బందిపడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
కెరీర్‌లో ఇదే చివరి అవకాశం ...
సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ వీరి కెరీర్‌లో ఇదే చివ రి ఆసీస్8 పర్యటన కావొచ్చు! అక్కడ తొలిటెస్ట్ సిరీస్8 విజయమనే చారివూతక ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు చివరి అవకాశమన్నమాట! ఈ క్రమంలో ఇప్పటివరకు ఆసీస్8 టూర్‌లో వీరి రికార్డులు.. ఆపై తాజా ఫామ్‌పై ఓ లుక్కేద్దామా!
ద్రవిడ్: మన బ్యాట్స్‌మెన్‌లో ఈ ఏడాది అత్యంత నిలకడగా రాణిస్తున్నాడీ దిగ్గజం! ఈ ఏడాది ఇప్పటివరకు 13 టెస్టులాడిన ద్రవిడ్.. 52.31 సగటుతో 1151 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు బాదడం వి శేషం. ఇక ఆస్ట్రేలియాపై ద్రవిడ్ ఫామ్ అద్భుతంగా లేకున్నా.. పేలవంగా మాత్రం లేదు. ఆ జట్టుపై రాహుల్ ఓవరాల్‌గా 29 టెస్టులాడాడు. 41.08 సగటుతో 1972 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇక ఆసీస్8 గడ్డపై మాత్రం ద్రవిడ్‌కు కాస్త మెరుగైన గణంకాలే ఉన్నాయి. అక్కడ 12 టెస్టుల్లో 48.60 సగటుతో 972 పరుగులు చేశాడు. ఆ జట్టుపై ద్రవిడ్‌కు ఏకైక డబుల్ సెంచరీ (233) వారి దేశంలోనే రావడం మరో విశేషం. ఆసీ స్8 పర్యటన నేపథ్యంలో గతకొంతకాలంగా అద్భుతఫామ్‌లో కొనసాగుతున్న ద్రవిడ్‌పై ఈ సారి భారీ అంచనాలున్నాయి.
సచిన్: మాస్టర్‌కు ఆసీస్8 అత్యంత ప్రియమైన ప్రత్యర్థే! సచిన్ కెరీర్‌లో 51 టెస్ట్ సెంచరీలుంటే అందులో అత్యధికంగా 11 శతకాలు ఆసీస్8పైనే వచ్చా యి. ఓవరాల్‌గా ఆ జట్టుపై 31 టెస్టులాడాడు మాస్టర్. ఇందులో ఏకంగా 60.59 సగటుతో 3151 పరుగులు చేశాడు. ఇక కంగారుగడ్డపై 16 టె స్టుల్లో దాదాపు ఇంతే సగటు (58.53)తో 1522 పరుగులు రాబట్టాడు. మరోమాట.. ఆసీస్8పై చేసిన 11 సెంచరీల్లో ఆరింటిని సచిన్ వారిదేశంలోనే కొట్టాడు. ఇక గత ఏడాది కాలంగా కూడా సచిన్ ఫామ్ అద్భుతంగానే ఉంది. ఏడు టెస్టుల్లో దాదాపు యాభై సగటు (49.91)తో 599 పరుగులు చేశాడు. ఆసీస్8 పర్యటనలో ఈ సారి అందరి కళ్లూ నూరో శతకం వేటలో ఉన్న సచిన్‌పైనే ఉంటాయి. మరి.. గత 15 ఇన్నింగ్స్‌లు (టెస్టులు, వన్డేల్లో కలిపి)గా వందో వంద కోసం ఊరిస్తూవస్తున్న సచిన్ ఈ సిరీస్8లోనై నా అభిమానుల ఎదురుచూపులకు ముగింపు పలుకుతాడా? చూడాల్సిందే!
ద్రవిడ్: మన బ్యాట్స్‌మెన్‌లో ఈ ఏడాది అత్యంత నిలకడగా రాణిస్తున్నాడీ దిగ్గజం! ఈ ఏడాది ఇప్పటివరకు 13 టెస్టులాడిన ద్రవిడ్.. 52.31 సగటుతో 1151 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు బాదడం వి శేషం. ఇక ఆస్ట్రేలియాపై ద్రవిడ్ ఫామ్ అద్భుతంగా లేకున్నా.. పేలవంగా మాత్రం లేదు. ఆ జట్టుపై రాహుల్ ఓవరాల్‌గా 29 టెస్టులాడాడు. 41.08 సగటుతో 1972 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇక ఆసీస్8 గడ్డపై మాత్రం ద్రవిడ్‌కు కాస్త మెరుగైన గణంకాలే ఉన్నాయి. అక్కడ 12 టెస్టుల్లో 48.60 సగటుతో 972 పరుగులు చేశాడు. ఆ జట్టుపై ద్రవిడ్‌కు ఏకైక డబుల్ సెంచరీ (233) వారి దేశంలోనే రావడం మరో విశేషం. ఆసీ స్8 పర్యటన నేపథ్యంలో గతకొంతకాలంగా అద్భుతఫామ్‌లో కొనసాగుతున్న ద్రవిడ్‌పై ఈ సారి భారీ అంచనాలున్నాయి.
వీవీఎస్ లక్ష్మణ్: ఆస్ట్రేలియా వర్సెస్8 లక్ష్మణ్! ఆసీస్8తో భారత్ తలపడినప్పుడల్లా విశ్లేషకుల నుంచి తరచుగా వినిపించే మాట ఇది. గణాంకాలు పరిశీలిస్తే, ఇవి ఎంతమావూతమూ అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఆసీస్8పై ఇంటాబయటా కలిపి లక్ష్మణ్ 25 టెస్టులాడాడు. 55.58 సగటుతో 2279 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలున్నాయి. ఇక వారి దేశంలో ఆడిన టెస్టులు 11. పరుగులు 54.05తో 1081. అత్యుత్తమ స్కోరు 175తో కలిపి 4 సెంచరీలు బాదాడు. ఓ జట్టుపై ఇంటాబయటా ఈ స్థా యి రికార్డున్న బ్యాట్స్‌మన్ అరుదుగా కనిపిస్తారు. ఈసారి కూడా లక్ష్మ ణ్ ఇవే గణాంకాల్ని న మోదు చేస్తే, ప్రత్యర్థికి ‘కంగారు’ తప్పదు. గత 12 నెలల్లో ఆడిన టెస్టు ల్లో వీవీఎస్8 ఫామ్ కూడా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. 13 టెస్టుల్లో 43.76 సగటుతో 919 పరుగులు చేశాడు. అన్న ట్టు... టెస్టులో 9 వేల పరుగులకు 374 పరుగుల దూరంలో ఉన్న వీవీఎస్8 ఈ సిరీస్8లోనే ఆ మైలురాయిని అధిగమించొచ్చు.
Tuesday, December 13, 2011
2011 రౌండప్
డిసెంబర్ సగం రోజులు పూర్తరుుపోరుుంది. కొత్త సంబరాల నవ ఉత్సాహంతో 2012 సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం. ఈ సంవత్సరం అనూహ్యంగా పెద్ద హీరోలు నటించిన చిత్రాలకు కలెక్షన్ల రికార్డులు సృష్టించడం ఒక విశేషమైతే తెలుగు సినిమా స్టామినా పెంచిన చిత్రంగా ‘దూకుడు’ రికార్డుల పరంపర కొనసాగించింది.
ఇక మిగిలిన హీరోలను తీసుకుంటే బాలకృష్ణ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరమవీరచక్ర’ అంచనాలను అందుకోలేపోయింది.కాగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ హిట్ మూవీగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని స్టడీగా సాగిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ‘శక్తి’ చిత్రం పరాజయం కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచింది. ప్రభాస్‌కు ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌కళ్యాణ్ నటించిన ‘తీన్‌మార్’ చిత్రం ఫ్లాప్ కాగా ‘పంజా’ చిత్రం డివైడ్ టాక్‌తో నడుస్తోంది.
మరో వారం రోజులు గడిస్తేగానీ ఆ చిత్రం నిలబడిందో లేదో అనేది తెలియదు. నాగార్జున నటించిన ‘గగనం’ చిత్రం ప్రయోగాత్మకంగా ప్రశంసలందుకుందిగానీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నాగచైతన్యకు విడుదలైన మూడు చిత్రాలలో ఒకటి హిట్టుకాగా రెండు ఫ్లాపులయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100%లవ్’ హిట్టుకాగా ‘దడ’, ‘బెజవాడ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మరి కొందరు హీరోల జయాపజయాల గురించి తర్వాత తెలుసుకుందాం....
భజ్జీ కారులో దొంగతనం
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాస్‌పోర్టు, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎవరో దొంగిలించారు. కర్నాల్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. భజ్జీ, అతని స్నేహితుడు కలసి ఢిల్లీకి సోమవారం సాయంత్రం బయలుదేరిన సమయంలో వారు మధుబన్ దగ్గరే ఉన్న కర్నాల్‌లో ఆగారు. కాఫీ తాగుదామని ఇద్దరు ఆలా లోపలకి వెళ్లి పనిముగించుకుని వచ్చి చూస్తే కారు అద్దాలు పగిలిపోయి ఉండటం గమనించారు. సరికదా అనుకుని కారులోపలకెళ్లి చూస్తే పాస్‌పోర్ట్, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాయం చేశారు. ఈ సంఘటన మధుబన్ పోలీస్ అకాడమీ సమీపంలోనే జరగటం విశేషం. ‘ నేను , నా స్నేహితుడు మధుబన్ పోలీస్ అకాడమీ దగ్గరలో ఉన్న ‘ కేఫ్ కాఫీ డే’ లో కాఫీ తాగుదామని కారు దిగాం. కారుకు లాక్ వేసి కాఫీ షాపులోకి ప్రవేశించాం. ఐదు నిమిషాల తరవాత వచ్చే చూస్తే షాక్. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. బ్యాగ్‌లో ఉన్న వస్తువులన్ని కూడా మాయమైయిపోయాయి. ’ అని దొంగతనం అనంతరం భజ్జీ వాపోయాడు. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు భజ్జీకి చెందిన 10 క్రెడిట్‌కార్టులు దొంగలు ఎత్తుకుపోయారు. విషయాన్ని గ్రహించిన భజ్జీ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనీసం తన పాస్‌పోర్టునైనా వెంటనే తిరిగి తనకు అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.
Monday, December 12, 2011
జీవితంలో ఎలాంటి లక్షాలు పెట్టుకోలేదు
ఈ పుట్టిన రోజుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. అయితే ఈ మధ్యే మూడు వారాల పాటు కాశీలోని నందిదేవా ఆలయాన్ని, బుద్దుడు సంచరించిన సారనాథ్ ప్రాంతాన్ని, ఆయన సమాధి అయిన ప్రదేశాల్ని సందర్శించి వచ్చాను. ఈ యాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నాను. మనిషి వేటిని వదులుకున్నా ఫర్వాలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్ని నిరంతరం నేర్చుకోవాలన్నది నా ఫిలాసఫీ.
‘బాడీగార్డ్’ సినిమా విశేషాలేమిటి?
ఇంట్రడక్షన్ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్‌తో పాటు సినిమాలో మంచి సెంటిమెంట్ వుంటుంది. చివరి ముఫ్పై నిమిషాల ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా కొత్త తరహాలో వుంటుంది. నా శైలి వినోదం కూడా వుంటుంది.
‘బాడీగార్డ్’ మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విజయం సాధించింది. కథాంశం అందరికీ తెలిసిందే!..
ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?
మూడు భాషల్లో హిట్ అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్ల్లు సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీ కొత్తగా వుండేలా తీర్చిదిద్దాం. అదీగాక చాలా కాలం విరామం తర్వాత నేను ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను. సంగీతపరంగా కూడా మిగతా మూడు భాషల కంటే తెలుగులో పాటలు బాగా వచ్చాయి. సంగీత దర్శకుడు థమన్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ అంశాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
‘నాగవల్లి’ తర్వాత బెల్లంకొండ సురేష్‌తో రెండో సినిమా చేస్తున్నారు. మేకింగ్ పరంగా సినిమా ఎలా వుంటుంది?
ఉన్నత నిర్మాణ విలువలతో ‘బాడీగార్డ్’ తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని లొకేషన్స్ చాలా కొత్తగా వున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో అలాంటి లొకేషన్స్ చూసి వుండరు.
సల్మాన్‌ఖాన్ హిందీ ‘బాడీగార్డ్’ చిత్రంలో షర్ట్ విప్పేస్తాడు. మీరు కూడా ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా?
మనకంత సీన్‌లేదు... షర్ట్ విప్పడం లాంటి సన్నివేశాలేం వుండవు. నా కెరీర్‌లో ఇంతవరకూ షర్ట్ విప్పి నటించలేదు. ఇప్పుడు కొత్తగా విప్పితే బాగుండదు.
మహేష్‌బాబుతో కలసి చేస్తోన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఈ కథలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. మహేష్, నేను అన్నదమ్ముల్లుగా నటిస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఒకరికొకరు ప్రాణంగా సాగే వారి జీవిత ప్రయాణమే ఈ చిత్రం.
మహేష్‌బాబుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
హీరోగా ఆయనకంటూ ప్రత్యేకమైన సై్టల్ వుంది. తెలుగు సినిమా హీరోలందరిలో అందగాడు. మహేష్‌బాబు మంచి కామెడీని పండిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం మేమిద్దరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
మల్టీస్టారర్ సినిమాలపై మీ అభివూపాయమేమిటి?
హిందీలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేయాలి. మల్టీస్టారర్ సినిమాల వల్ల మంచి కథలు వస్తాయి. పరిక్షిశమ కూడా బాగుంటుంది.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ వివేకానందను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?
స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. వివేకానందుని తాత్విక చింతన, ఫిలాసఫీని నేను బాగా ఇష్టపడతాను. వివేకానందుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రవచనాలు మనల్ని జాగృత పరుస్తాయి. ఆయన జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది. వివేకానందుడు చెప్పినట్లు... మనలో ఏమైనా అశాంతి, బాధ వుంటే ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని బిగ్గరగా ఏడవండి...అలా చేయడం ద్వారా మీ మనసు కుదుటపడుతుంది. ఎందుకంటే నిరంతరం వేదనలతో మనం ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాం.
మీరు అలవర్చుకున్న ఆధ్యాత్మిక ధోరణి ఎలాంటి అనుభవాలనిస్తోంది?
ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అవసరమని నా అభివూపాయం. బుద్దుడినే తీసుకోండి..ఆయన మనలాంటి సాధారణ మనిషి. మనుషుల్లో మహాత్ముడు ఎందుకయ్యాడు? కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయగలిగాడు? అనే విషయాల్ని అందరూ ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే అందరూ బుద్దుడి అంతటి స్థాయికి చేరుకోవచ్చని నా నమ్మకం.
జయాపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు?
నిజాయితీగా మానవ ప్రయత్నం చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ప్రయత్నం చేయడం వరకే మన పని. అలాగే నేను జీవితంలో ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోను. ఎందుకంటే లక్ష్యాల్ని నిర్ధేశించుకోవడం వల్ల అనవసర ఆందోళనలు వెంటాడుతాయి.
మీ తనయుడు అర్జున్‌ని వెండితెరకు ఎప్పుడు పరిచయం చేస్తారు?
జాకీచాన్ ‘కరాటే కిడ్’ సినిమా అంటే వాడికి చాలా ఇష్టం. ఆ సినిమా చూసి నన్ను జాకీచాన్‌లా నటించమంటున్నాడు. వాడు నా శిష్యుడిగా నటిస్తాడట. అయితే అర్జున్ ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో రావడానికి చాలా టైముంది.
రానా కెరీర్ ఎలా వుందని భావిస్తున్నారు?
రానాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పాషన్. నా కన్నా ఎక్కువగా సినిమాని ప్రేమిస్తాడు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుతాడు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌పై కూడా దృష్టి పెడుతున్నాడు. ఏ విషయంలోనైనా రానా కొత్తగా ఆలోచిస్తాడు.
అగ్రహీరోలందరూ ఎక్కువ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా వచ్చే ఏడాది మూడు సినిమాలు చేయబోతున్నారు. మారుతున్న ఈ ధోరణిపై మీరెమంటారు?
ఇలా ఎప్పటినుంచో అగ్రహీరోలందరూ సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసి వుంటే ఇండస్ట్రీ ఎప్పుడో సెట్ అయ్యేది. ఈ పరిణామం పరిక్షిశమకు చాలా మంచిది. అదే సమయంలో బడ్జెట్ కంట్రోల్‌పై కూడా హీరోలు దృష్టి పెట్టాలి.
పౌరాణిక సినిమాలు చేసే ఆలోచన వుందా?
ఇప్పటి వరకు పౌరాణిక సినిమాలు చేద్దామని నన్నెవరూ సంప్రదించలేదు. ఎవరైనా నన్ను మంచి స్క్రిప్ట్‌తో ముందుకొస్తే చేయడానికి ఇబ్బందేమిలేదు.
మీ తదుపరి చిత్రం?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్ట తర్వాత మోహర్ రమేష్ దర్శకత్వంలో ఓ చిత్రం వుంటుంది. ఫుల్‌పూంగ్త్ యాక్షన్ చిత్రమది. ఎప్పటి నుంచే సై్టలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి స్క్రిప్ట్‌తో ముందుకొచ్చాడు దర్శకుడు మోహర్ రమేష్.
నేడు రజనీకాంత్ పుట్టిన రోజు
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈరోజు తన 62వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. పసి వయస్సు నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శివాజీరావ్‌గైక్వాడ్ స్వయం కృషితో రజనీకాంత్‌గా ఎదిగిన వైనం ఓ సినిమానే తలపిస్తుంటుందని సినీ విమర్శకులే అంటుంటారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తే, ఓ విజయవంతమైన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయపడుతుంటారు. ఐదేళ్ల వయస్సులోనే తల్లిని పొగొట్టుకున్న రజనీకాంత్ కడుపు నింపుకునేందుకు అనేక కష్టాలు పడ్డాడు. గవర్నమెంట్ స్కూల్‌లో కన్నడ మాధ్యంలో చదువుకున్నారు. అనంతరం జీవన సమరం చేశాడు. చివరకు మూటలు మోసే కూలీగా అవతారమెత్తారు. అనంతరం బస్సు కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. రజనీకాంత్‌కు నాటకాలంటే పిచ్చి అభిమానం. ఎన్నో నాటకాల్లో నటించారు. సన్నిహితుల ప్రోత్సహంతో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ాఅపూర్వ రాగంగల్‌్ణ సినిమాలో నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడంతో శివాజీరావుగైక్వాడ్‌కు మంచి పేరు వచ్చింది. శివాజీరావుగైక్వాడ్ నుంచి రాజనీకాంత్‌గా పేరు మార్చింది బాలచందరే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్‌తో దక్షిణాదిలో దూసుకెళ్లారు రజనీకాంత్. ఆయన స్టైల్ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. విదేశాల్లో రజనీకాంత్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రష్యన్లకు రాజ్‌కపూర్ అంటే ఎంతో ఇష్టం. అలానే జపనీస్‌కు రజనీ అంతే ఇష్టంగా మారారు. రజనీకాంత్ ప్రతి చిత్రం జపాన్‌లో విడుదల కావాల్సిందే. అతిసామాన్యంగా ఉంటూ అందరికీ ఆయన ఆదర్శనీయంగా కనిపిస్తారు. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారని, మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Sunday, December 11, 2011
మల్లెమాల ఇక లేరు
ప్రముఖ నిర్మాత, రచయిత ఎం.ఎస్.రెడ్డి (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం.ఎస్.రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీపరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు. నేడు మల్లెమాల అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎం.ఎస్.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. నెల్లూరు జిల్లా..అలివిరి అనే గ్రామంలో 1952లో జన్మించారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎం.ఎస్.రెడ్డి ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా నిలిపేశారు.
1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.
స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.
2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.
ఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ..నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మృతిపట్ల తీవ్ర విభ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం గొప్ప వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
‘పల్నాటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు స్వయంగా పాటలు రాశారు. పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయింది.
ఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.
పరిశ్రమలో నన్నెంతగానో ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాను. ఇది పెద్ద విషాదం. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
మల్లెమాలకు అభిమానిని. తనో అద్భుత కవి. ‘భైరవద్వీపం’ సినిమా చూసి రాకుమారి అంటే ఇలా ఉండాలి అని అభినందించారు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా నిలిపేశారు.
1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.
స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.
2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.
-డా.అక్కినేని నాగేశ్వరరావు
-డా డి.రామా నాయుడు
-కృష్ణ, విజయనిర్మల దంపతులు
-బిజెపి నేత వెంకయ్య నాయుడు
-కృష్ణం రాజు
-రోజా
Subscribe to:
Posts (Atom)






