వెస్టిండీస్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు.. కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ని ఎంపిక చేశారు. గంభీర్, కోహ్లీ, పార్థివ్ పటేల్, రహానే, మనోజ్‌తివారీ, రైనా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, వరుణ్ ఆరోన్, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్‌కుమార్, వినయ్‌కుమార్‌కు టీమ్‌లో స్థానం కల్పించారు. ధోనీ, సచిన్, యువరాజ్ సింగ్‌లకు విశ్రాంతి కల్పించారు. హర్భజన్‌కు చోటు దక్కలేదు.
Friday, November 25, 2011
Sunday, November 13, 2011
ఇంటివాడయిన క్రికెటర్ అశ్విన్
భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం ఇక్కడి రాఘవేంద్ర కల్యాణమండపంలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్‌ను సంప్రదాయబద్ధంగా అశ్విన్ వివాహం చేసుకున్నాడు. గత వారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 9వికెట్ల తీసిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట కోల్‌కతా వెళ్లే అవకాశం ఉంది. కోల్‌కతాలో సోమవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ అడాల్సి ఉన్న విషయం విదితమే.
Saturday, November 12, 2011
ఘనంగా 'దూకుడు' అర్థ శతదినోత్సవం
ప్రముఖ నటుడు మహేష్‌బాబు, నటి సమంత నటించిన 'దూకుడు' అర్థ శతదినోత్సవం శనివారం విజయవాడలో ఘనంగా జరిగింది. వేలాదిగా తరలొచ్చిన అభిమానులతో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల మైదానం హోరెత్తింది. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వేడుకలకు నటుడు మహేష్‌బాబు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా వచ్చారు. మహేష్‌బాబు, ఇతర సినీనటులను చూసేందుకు వచ్చిన వారితో బందరురోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒకానొక సమయంలో కళాశాల గేటువద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. హీరో మహేష్‌బాబును అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సుంకర అనీల్ నటీనటులు, సాంకేతికవర్గాన్ని అభినందించారు. సినీరంగంలో ఉన్న సగం మంది కానూరు కళాశాలకు రావడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ చిన్నతనంలోనే సినిమారంగంలో 'దూకుడు' ప్రదర్శించిన మహేష్‌బాబు పెద్దయిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన 'పోకిరి' అతని కీర్తిలో కలికితురాయని అన్నారు. దాని రికార్డులకు చేరువగా 'దూకుడు' వెళుతుందని అన్నారు. నటి సమంత మాట్లాడుతూ 'దూకుడు' సినిమా తనకు జీవితంలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిందన్నారు.
Friday, November 11, 2011
పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చిన స్నేహ
సినీ నటి స్నేహ పెళ్ళి తెరను అడ్డు తొలగించింది. సుమారు 3, 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్న స్నేహితుడు మరియు కోలివుడ్ నటుడు. ప్రసన్నను వివాహమాడనుంది. 2012 మార్చిలో పెళ్ళి చేసుకుంటున్నట్లు స్నేహ అధికారికంగా ప్రకటించింది. స్నేహ ప్రస్తుతం హీరో నాగార్జున చిత్రం ' రాజన్న' సినిమాలో నటిస్తుంది. ఇక ఎంగేజ్‌మెంట్‌ను అంగరంగ వైభవంగా చేసేందుకు త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు.
Thursday, November 10, 2011
11-11-11 నేడు అరుదైన తేదీ
నవంబర్ 10: అన్ని ఒకేరకమైన అంకెలతో, ఎటు నుంచి చూసినా ఒకేలాగ కనిపించే అరుదైన తేదీ 11-11-11.. నేడు అంటే శుక్రవారం ఈ తేదీకి వేదిక కానుంది. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి తేదీ దర్శనమిస్తుంది. అందులోనూ 11-11-11 తేదీన 11గంటల, 11నిమిషాల. 11 సెకన్లు సమయం మరీ ప్రత్యేకం. అరుదైన అంకెల గారడీ చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ముసురుకున్నాయి. ఈ ప్రత్యేక తేదీన ఔత్సాహికులు విహహాలు, వేడుకలు జరుపుతుండగా, హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంఖ్య అంతగా అచ్చిరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 11-11-11 తరహాలో తదుపరి అంకెలు (22-22-22) కాల్యెండర్‌లో లేకపోవడమే ఇందుకు కారణమని కొన్ని వెబ్‌సైట్లు ప్రవచిస్తున్నాయి. గతం ఈ తేదీ వచ్చినప్పుడు, అంటే 1911, నవంబర్ 11న పర్యావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి
Sunday, November 6, 2011
Saturday, October 29, 2011
ఐటమ్ సాంగ్‌కి 50 లక్షలు
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా ' ది బిజినెస్ మేన్ ' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ హిట్ అయిన ' దూకుడు' తర్వాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా కావడంతో ' ది బిజినెస్ మేన్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా వుంటే, ' ది బిజినెస్ మేన్ ' సినిమా కోసం మాస్ మసాలా ఐటమ్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఇందు కోసం ముంబై నుంచి శ్వేతా భరద్వాజ్ అనే సెక్సీ భామని టాలీవుడ్‌కి ఇంపోర్డ్ చేస్తున్నారు.
ఇక, ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్ జరుపుకుంటోన్న ' ది బిజినెస్ మేన్ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరగనుందట.
ఇక, ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్ జరుపుకుంటోన్న ' ది బిజినెస్ మేన్ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరగనుందట.
Subscribe to:
Posts (Atom)



