Monday, May 9, 2011

గాయంతో ఐపీఎల్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ అవుట్‌

 ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కష్టాలు మరింత పెరగనున్నాయి. డేర్ డెవిల్స్ సారథి వీరేంద్ర సెహ్వాగ్ భుజం గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ నాలుగో సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సెహ్వాగ్ భుజం గాయానికి చికిత్స చేసుకునేందుకు గానూ వెంటనే లండన్ వెళ్లనున్నాడు. జూన్, జులై నెలల్లో జరిగే వెస్టిండీస్ టూర్‌కు కూడా సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెహ్వాగ్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ ప్రస్తుత సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆడిన 11 మ్యాచ్‌లలో ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.

Tuesday, May 3, 2011

ఐపీఎల్‌ -4లో గంగూలీ స్థానం ...

 ఐపీఎల్‌-4లో గంగూలీకి అడే అవకాశం దక్కింది. పూణే వారియర్స్‌ జట్టులో ఆశ్రిష్‌ నెహ్రా గాయంతో ఉన్నప్పటికి అతని స్థానంలో అడే అవకాశం దక్కింది. నిన్న రాత్రే సౌరబ్‌ని తీసుకోవాలిని తుదినిర్ణయం తీసుకున్నాం. అని పూణే వారియర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ సర్కార్‌ పేర్కొన్నారు.

27 ఏళ్ళ తర్వాత ప్రపంచ కప్‌ గెలిచిన తరువాత ప్రజల్లో ఉత్సాహం, అనందం, కేరితాలు అరోజు పండుగా చేశారు.

27 ఏళ్ళ తర్వాత ప్రపంచ కప్‌  గెలిచిన తరువాత  ప్రజల్లో ఉత్సాహం, అనందం, కేరితాలు అరోజు పండుగా చేశారు.

 
 
 
 
 

Thursday, April 28, 2011

క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ...

ఐపీఎల్‌-4లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరకుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయి. ఐదు మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అందరు సమిష్టగా రాణించడంతో విజయం సాధింస్తున్నారు. ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెహ్వాగ్‌, వార్నర్‌, వేణగోపాల్‌రావ్‌, ఫించ్‌, హౌప్ప్‌, నాయార్‌, ఓజా బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వీటికి తోడుగా పఠాన్‌ రాణించడంతో ఢిల్లీ జట్టు సంపూర్ణ, సమిష్టగా రాణిస్తుంది. బౌలింగ్‌లో మోర్కెల్‌, దిండా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యాదవ్‌ రాణించడంతో విజయం సాదిస్తున్నారు.
 దీన్నిలో ఒక మాట కూడ వాస్తవం కాదు 
 ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఒకరు కూడా సరిగా అడకపోవడంతో అట్టడుగునా ఉంది. ఈ సారి మాత్రము ఢిల్లీ జట్టులో ( దమ్మ్‌ లేదు, డేర్‌ అండ్‌ డ్యాష్‌ లేదు. ) గేలవాలన్నా ఓపికా లేదు. గెలిచిన ఆనందంము జట్టులో ఒక్క సభ్యుడుకు అ ఆనందంలేదు.  ఢిల్లీ జట్టు ఐపీఎల్‌ -1 లో సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -2లో కూడా సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -3 లో సెమీఫైనల్‌లో రాలేదు. ఇప్పడు ఇంకా అంతకన్నా ఘోరంగా అడుతుంది.
ఐపీఎల్‌-4లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు
మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 95 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది.
రెండోవ మ్యాచ్‌ రాజస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది.
మూడోవ మ్యాచ్‌ పూణే వారియర్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాల్గొవ మ్యాచ్‌ డెక్కన్‌ ఛార్జస్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదోవ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 29 పరుగులతో విజయం సాధించింది.
ఆరోవ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఏడవ మ్యాచ్‌లో కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Wednesday, April 27, 2011

భారత జట్టుకు కోచ్‌గా కిర్‌స్టెన్‌ స్థానంలో డంకన్‌ ప్లెచర్‌ ఎంపిక

 భారత్‌ జట్టుకు కోచ్‌గా కిర్‌స్టెన్‌ స్థానంలో డంకన్‌ ప్లెచర్‌గా ఎంపికయ్యాడు. ఇంతక ముందుకు షేన్‌ వార్న్‌, లాంగర్‌ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా బింబాబ్వే మాజీ కెప్టెన్‌ డంకన్‌ ప్లెచర్‌ని బీసీసీఐ ప్రకటించింది. కిర్‌స్టెన ఉన్నప్పుడు భారత జట్టు ప్రపంకప్‌ సాధించింది. భారత జట్టు కొత్త కొచ్‌ ప్లెచర్‌గా ప్రయోగాలు ఎలా ఉంటాయి చూడాలి. గంగూలి కెప్టెన్‌ ఉన్నప్పుడు గ్రెగ్‌ చాపెల్‌ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు తీవ్రమైన సమస్యలు ఇద్దరి మధ్య ఉన్నాయి. చివరికి గంగూలిని తప్పించాలని గ్రెగ్‌ చాపెల్‌ వ్యూహం ఫలిచింది. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, కోచ్‌గా డంకన్‌ ప్లెచర్‌గా ఉన్నారు.

' గమ్యం ' సినిమా రచయిత నాగరాజు మృతి

ప్రముఖ సినీ రచయిత గంధం నాగరాజు అనార్యోగంతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మెదడు, కాలేయ సంబంధిత సమస్యలతో గత రెండునెలలుగా బాధపడుతున్నారాయన. ఆయన పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. గమ్యం, బాణం, బెట్టింగ్‌ బంగార్రాజు సినిమాలకు రచయితగా పనిచేశారు.

Sunday, April 24, 2011

బాబా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

1926 : లో సత్యసాయిబాబా జననం
1936 : పదేళ్ల బాలుడైన సత్యనారాయణరాజు తన ఈడు పిల్లలతో ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేశాడు. తను రచించిన భక్తి గీతాలను వారితో కలసి ఆలపించేవాడు.
1938 : తన 12వ ఏట సత్యనారాయణరాజు ' చెప్పినట్లు చేస్తారా...' అనే ఒక జానపద రూపకాన్ని రచించి ప్రదర్శించేవారు. అది గ్రామస్తులను ఉత్తేజపరిచేది.
1940 : అక్టోబరు 20: పద్నాలుగో ఏట సత్యనారాయణరాజు తనను తాను సాయిబాబాగా ప్రకటించుకున్నారు.
1941: లో భవిష్యత్తు వాణిని ప్రకటించారు.
1946 :  వూటీ, తిరుపతి, హైదరాబాద్‌ సందర్శించిన బాబా వేలాదిమందికి తన సందేశాలను వినిపించారు. పరిసర గ్రామాల ముస్లింలు ఆయన ప్రసంగాల కోసం తరలివచ్చేవారు.
1947 : అక్టోబరు 25 : బాబా తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న కరూర్‌లో తొలిసారిగా బహిరంగ వాణిని వినిపించారు. చిట్టీల మీద భక్తుల నుంచి వారి ప్రశ్నలకు స్వీకరించడమనే సంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభించారు. దానిని చివరిదాకా కొనసాగించారు. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది.
1948 : లో ప్రశాంతి నిలయానికి పునాది వేశారు.
1950 : బాబా తన 25వ జన్మదినం సందర్భంగా నవంబరు 23న ప్రశాంతి నిలయం మందిరాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది ప్రపంచలోనే ఒక గొప్ప ఆథ్యాత్మిక, శాంతి కేంద్రంగా రూపొందింది.
1956:లో సత్యసాయి జనరల్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశాడు.
1957 : దేశంలో బ్రిటిష్‌ పాలన ముగిసిన దశాబ ్దం తర్వాత భారతీయ సనాతన ధర్మ ప్రచారంపై జరిగిన 9వ అఖిలభారత ఆధ్యాత్మిక సదస్సులో సాయిబాబా ప్రసంగించారు. ఆధ్యాత్మిక సదసుస్సలో దీన్నొక మైలురాయిగా పేర్కొంటారు.
1958 : తన 32వ ఏట బాబా మానవతా వాదంపై మార్గదర్శనాన్ని ప్రారంభించారు. నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఆయన భక్తులను ఆ దిశగా ఉత్తేజపరిచేవాడు. సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి 'సనాతన సారధి' పేరుతో సాయి ఆశ్రమం మాసపత్రిక ప్రచురణ ప్రారంభించింది.
చక్కటి చిక్కటి తెలుగు బాషలో ప్రేమ వాహిని, ధర్మవాహిన, ధాన్యవాహిన, ప్రశాంతి వాహిన, సందేహ నివారిణి అనే ఐదు సంపుటాలను రచించారు. ' సనాతన సారథి' మాస సంపుటి దేశ బాషలన్నింటితో పాటు ఆంగ్లం, సింధీ, నేపాలీ భాషల్లో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
1960 : బాబా జీవితంపై వచ్చిన గొప్ప పరిశోధన గ్రంధంగా పేరొందిన ' సత్యం, శివం, సుందరం' పుస్తకం తొలి సంపుటి ప్రచురితమైంది. చరిత్ర అధ్యాపకుడైన కస్తూరి దీనిని ప్రచురించారు.
1961: దసరా సందర్భంగా ' వేద పురష జ్ఞాన సప్తాహా ' యజ్ఞాన్ని నిర్వహించారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు నిత్య జీవితంలో ప్రశాంతతకు సనాతన ధర్మంలోని దార్శనికత గురించి వివరించారు.
1962 : బాబా తొలిసారిగా పనామాను సందర్శించి అక్కడ సాయి కేంద్రాన్ని ప్రారంభించారు.
1963 : జపాన్‌కు చెందిన రామచంద్రచుగాని తొలిసారిగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు.
1964 : ఆస్ట్రేలియాకు చెందిన హెవర్డ్‌ మర్ఫెట్‌ మద్రాసులో సాయిబాబాను కలిశారు. సాయి మహిమలు, సందేశాలపై ఆయన పరిశోధించి 1971లో వెలువరించిన ' సాయిబాబా-మేన్‌ అండ్‌ మిరాకిల్స్‌' అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. లక్షలాది మందిన సాయి భక్తులుగా మార్చింది.
1965 : అమెరికా వైద్యుడు డాక్టర్‌ జాన్‌ హిస్లాన్‌ సాయిని సందర్శించారు. ఆ తర్వాత అమెరికన్‌ సాయి ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి అక్కడ సాయిబాబా తత్వాన్ని వ్యాప్తిచేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
1966 : లో బాల వికాస్‌ పాఠశాల నిర్మాణం
1968 : లో ప్రపంచ మహాసభల నిర్వహణ. అనంతపురంలో బాలికల కళాశాల ఏర్పాటు
1969 : బాబా గుజరాత్‌ సందర్శించిన సందర్భంలో అక్కడి స్థానిక పత్రిక ' నవ కాల్‌ ' సాయి చేసే అద్భుతాల గురించి ధారావాహిక ప్రచురించింది. వీటిపై ఆ పత్రిక సంపాధకుడు పి.కె. సావంత్‌ సాయితో చర్చించి ఆ అద్భుతాల గురించి కథలు కథలుగా తన పత్రికలో ప్రచురించడంతో వాటిపై తీవ్రమైన విమర్శలు వెల్లువత్తాయి. వాటన్నింటికీ ఆ సంపాదకుడు సాయి నుంచి సమాధానాలు రాబట్టి ప్రచురించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.
ఇదే సంవత్సరం అక్టోబరులో ఇంద్రాదేవి కృషితో హాలీవుడ్‌ సాయి సెంటర్‌ ప్రారంభం ' అమెరికాలోని తొలి యోగా మహిళగా' ఆమె ఖ్యాతి పొందారు. అమెరికాలో బాబా ఖ్యాతిని పెంచింది ఆమే.
1970 : సాయి సందేశాలు, రచనలు, మహిమలు ప్రపంచ వ్యాప్తి చెందాయి.
లండన్‌లోని ఫ్రెడరిక్‌ ముల్లర్‌ ' సాయిబాబా... ద మేన్‌ ఆఫ్‌ మిరాకిల్స్‌ ' పుస్తకాన్ని ప్రచురించారు. వాటితోపాటు బాబాపై మరో మూడు పుస్తకాలను ఆయన రాశారు.
అమెరికా నిర్మాత, రచయిత, గేయ రచయిత అర్నాల్డ్‌ షల్‌మాన్‌ ' బాబా ' అనే పుస్తకాన్ని రాసి న్యూయార్క్‌లో ప్రచురించారు.
1971 : కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాయి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
1972 : శాస్త్రి అనే భక్తుడి ద్వారా హాంకాంగ్‌లో సాయి చైతన్యం మొదలైంది. నిర్భాగ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు.
కాలిఫోర్నియాకు చెందిన ఆధ్యాత్మికవేత్త మానసిక నిపుణురాలు ఫిలిస్‌ క్రిస్టల్‌ సాయి మీద రాసిన పలు పుస్తకాలు వేలాది మంది పాశ్ఛాత్యులను భక్తులుగా మార్చాయి.
1974 : సాయి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రారంభం. ఆ తర్వాత భారత్‌ వెలుపల బాబా ఆధ్యాత్మిక చింతనను వ్యాప్తిచేయడంతో ఈ సంస్థ కీలకంగా మారింది.
1975 : బెంగుళూరులో సత్యసాయి కళాశాల ఏర్పాటు.
1981 : లో డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాపన
1985 : లో సత్యసాయి నక్షత్రాశాల ఏర్పాటు
1990 : లో ప్రపంచ 5వ మహాసభలు జరిగాయి.
1990 : లో పుట్టపర్తిలో విమానాశ్రయం నిర్మాణం
1990 : లో మ్యూజియం నిర్మాణంa
1992 : లో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపన
1995 : లో అనంతపురం జిల్లాలో దాహార్తిని తీర్చడానికి రూ. 350 కోట్లతో సత్యసాయి తాగునీటి పథకం ప్రారంభం.
1997 : లో హిల్‌ వ్యూ స్టేడియం ఏర్పాటు
2000 : లో నూతనంగా ప్రశాంతి నిలియం రైల్వేస్టేషన్‌ ప్రారంభం
2001 :లో రూ. 500 కోట్లతో బెంగుళూరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు.
2001 : లో సంగీత కళాశాల ఏర్పాటు.

సత్యసాయి బాబా అస్తమయం

 భగవాన్‌ సత్యసాయి బాబా (86) ఆదివారం తుది శ్వాస విడిచారు. బౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. శ్వాస ఇబ్బందులతో మార్చి 28న ఆసుపత్రిలో చేరి ఆయన ఆ రోజు ఉదయం 7.40 గంటలకు బాబా కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయకపోవడం వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.ఆ రోజు సాయంత్రం 6 గంటకు నుంచి సత్యసాయి బాబా భక్తులు ఆయన బౌతికకాయాన్ని దర్శించుకోవచ్చు. సత్యసాయి బాబా పార్థివదేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కోసం సాయి కుల్వంత్‌ హాల్‌లో బాబాను ఉంచుతారు. బుధవారం