Sunday, February 13, 2011

కనిపిస్తే కళ్యాణం ..............


ఫిబ్రవరి 14న రోజు అంటే ఎవరికైనా గుర్తువుండే రోజు అదే ప్రేమికులు రోజు
పార్కుల్లోనూ, కాఫీక్లబుల్లోనూ ఒక అమ్మాయి, అబ్బయి కనిపిసే పెళ్లి జరిపిస్తామని భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు తెలిపారు.
మరి మా ఫ్రెండ్‌ రేపు ఇందిరా పార్కుకు వెళ్ళుతున్నాడు. జాగ్రత్త అని  చేప్పాను.
వాడు నాకు ఏ సమాధానం చేప్పాడంటే ' పోరా వేదవ ' అని సమాధానం చేప్పాడు.
మరి వాడి పరిస్థితి ఏమవుతుందో చూద్ధాం.

కొందరికి ఇదే చివరి ప్రపంచకప్‌ ?

ఐసిసి పదవ ప్రపంచకప్‌ అనేకమంది క్రీడాకారులకు చివరి ప్రపంచ కప్‌ కానుంది. వీరు 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో సంయుక్తంగా జరగనున్న టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు ఉండకపోవచ్చునని పరిశీలకులు భావిస్తు న్నారు. ఇందులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరు కూడా వినపడుతోంది. రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని సచిన్‌ పదేపదే చెబుతున్నప్పటికీ అతడు మరో నాలుగు సంవత్సరాలు ఆడకపోవచ్చుననే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. సచిన్‌తోపాటు జహీర్‌ ఖాన్‌ పేరు కూడా ప్రస్తావనకు వస్తుండటం గమనార్హం. ఈ కప్‌ చివరి కప్‌ అయ్యే అవకాశాలున్న క్రీడాకారుల్లో ఈ కింది పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
1.స్టీవ్‌ టికోలో: కెన్యా ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన స్టీవ్‌ టికోలో తన కెరీర్‌లో ఐదో వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నాడు. విజయవంతమైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యా సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
2.రికీ పాంటింగ్‌: 36 ఏళ్ల ఆసీస్‌ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 1990 దశకం నుండి క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా మూడు ట్రోఫీలు గెలుచుకున్న ఆసీస్‌ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు. ఈ కప్‌ను ఆసీస్‌ నిలబెట్టుకుంటే వరుసగా మూడు సార్లు ట్రోఫీ సంపాదించిపెట్టిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. పాంటింగ్‌ స్వయంగా ప్రకటించక పోయినప్పటికీ ఇది అతడి చివరి ప్రపంచ కప్‌ అని భావిస్తున్నారు.
3. బ్రెట్‌ లీ: ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌కు ఈ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం అనుకోని రీతిలో వచ్చింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న తాను ఇంకా ఎంతోకాలం క్రికెట్‌ ఆడే అవకాశం లేదని బ్రెట్‌ లీ అనేక సార్లు చెప్పాడు. 2003, 2007లో విజేతగా నిలిచిన ఆసీస్‌ జట్లలో సభ్యునిగా ఉన్నాడు.
4.పాల్‌ కాలింగ్‌వుడ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌. ఇటీవల అంతగా రాణించ లేకపోతుండటంతో అందరూ రిటైర్‌ కావాలని సూచిస్తున్నారు.
5.స్కాట్‌ స్టయిరిస్‌: న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండర్‌ తదుపరి ప్రపంచకప్‌ జరిగే సమయానికి 40వ ప్రాయంలో పడతాడు. వరల్డ్‌కప్‌ల్లో మంచి రికార్డు ఉంది. అతడి సగటు 18 మ్యాచ్‌ల్లో 69.12.
5.షోయబ్‌ అక్తర్‌: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన అక్తర్‌ ఈ వరల్డ్‌కప్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా పేరుగాంచాడు.
6.జాక్స్‌ కల్లిస్‌: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌. అతడిపైనే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
7.ముత్తయ్య మురళీధరన్‌: ఈ వరల్డ్‌కప్‌ తరువాత వన్డే క్రికెట్‌కు స్వస్తి చెబుతానని ఇంతకుముందే ప్రకటించాడు. టెసÊఉటల్లో 800 వికెట్లు తీసుకున్న మురళి టెస్టు క్రికెట్‌కు ఇంతకుముందే గుడ్‌బై చెప్పాడు.
8.దిల్షన్‌ తిలకరత్నే: విధ్వంసక ఓపెనర్‌గా పేరుగాంచాడు. శ్రీలంక జట్టులో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌.
9.శివనారాయణ్‌ చంద్రపాల్‌:36 ఏళ్ల చంద్రపాల్‌ కెరీర్‌లో ఐదో ప్రపంచకప్‌ ఆడుతున్నాడు.1996 ప్రపంచకప్‌లో విండీస్‌ రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
10. జహీర్‌ ఖాన్‌: తరచూ గాయాలబారిన పడే జహీర్‌ ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్‌లోడ్‌ పెరిగిపోవడమే ఇందుకు కారణం. భారత జట్టు ప్రస్తుతం అతడిపై మితిమీరి ఆధారపడుతోంది.
11. సచిన్‌ టెండూల్కర్‌: అన్ని రకాల రికార్డులు, ట్రోఫీలు అందుకున్న సచిన్‌కు వరల్డ్‌కప్‌ ఒక్కటే వెలితిగా ఉంది. ఈ లోటును ఈసారి నెరవేర్చుకోగలడేమో చూడాలి.

Saturday, February 12, 2011

హర్భజన్‌ సింగ్‌కు గాయం?

భారత్‌ అభిమానులకు మరో దుర్వార్త. ఏస్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాడు ప్రాక్టీస్‌ చేస్తుండగా భజ్జీకి గాయం తగిలినట్లు ధృవీకరించని వార్తలు సూచిస్తున్నాయి. అందువల్లనే అతడు శుక్ర, శనివారాల్లో ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని అనధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల19న ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న తరుణంలో భారత్‌ ప్రధాన స్పిన్నర్‌ హర్భజన్‌ గాయ పడటం భారత జట్టుకు దెబ్బగానే చెప్పాలి. అయితే భజ్జీ గాయం స్వరూపం తెలియలేదు. అతడు ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆడుతాడా, లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. మూడో రోజు ప్రాక్టీస్‌కు భజ్జీ డుమ్మా కొట్టడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రాక్టీస్‌ హౌటల్‌ రూంలో విశ్రాంతి తీసుకున్నట్లు భారత జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలికాలంలో భారత జట్టు సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించిన మీడియం పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మోచేతి గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ప్రవీణ్‌ అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమేనని ధోనీ పేర్కొన్నాడు. అతడి స్థానంలో శ్రీశాంత్‌ జట్టులోకి వచ్చాడు.

నేడే 'డమరుకం' ప్రారంభం

 అక్కినేని నాగార్జున నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' ప్రారంభోత్సవం లాంఛనంగా శనివారంనాడు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...'సోషియోఫాంటసీ చేయాలనే చిన్నకోరిక ఉండేది. అది 'డమరుకం'తో తీరింది. రెండువేల సంవత్సరాలనాటి కథ. నేటికి ట్రావెల్‌ అవుతూ సాగుతుంది. ఇందులో నాలుగు గెటప్స్‌ ఉన్నాయి. 'హలోబ్రదర్‌'లో చేసిన మాస్‌ రోల్‌ ఇందులో చేస్తున్నా. ఏప్రిల్‌లో షూటింగ్‌లో పాల్గొంటా' అని చెప్పారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్‌, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్‌ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్‌ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్‌ హిట్‌ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.

Friday, February 11, 2011

డ్రగ్స్‌తో పట్టుబడ్డ జీవిత సోదరుడు

200 గ్రాముల కొకైన్‌ స్వాధీనం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ కొనుగోలు చేసి స్నేహితులతో వెళ్తున్న ప్రముఖ నటి జీవిత సోదరుడు, నిర్మాత మురళితోపాటు అతని ఇద్దరి స్నేహితులను పశ్చిమ మండలం డిసిపి స్పెషల్‌ టీమ్‌ శుక్రవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి నుంచి 200 గ్రాముల కొకైన్‌, కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మురళి గతంలో మగాడు, శేషు చిత్రాలు నిర్మించాడు. ఆశించిన స్థాయిలో రెండు సినిమాలూ ఆడలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆయన తన స్నేహితులైన రాంబాబు, ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కుమారుడు న్యాస్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఓ నైజీరియన్‌ నుండి 200 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఎపి 28 డిఎ 3540 కారులో వెళ్తుండగా పశ్చిమ మండలం డిసిపి స్పెషల్‌ టీముకు సమాచారమందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మురళి కారును ఆపి సోదా చేయగా కొకైన్‌ లభించింది. వారిని వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లలో ఉన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. వారికి కొకైన్‌ అమ్మిన నైజీరియన్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

తేడా తెలీందటోన్న కాజల్‌

 టాలీవుడ్‌ అయినా, కాలీవుడ్‌ అయినా, బాలీవుడ్‌ అయినా నటన ఒక్కటేన్ని చెబుతుంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్‌. ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాకి కమిట్‌ అయ్యింది. బాలీవుడ్‌ అవకాశం గురించి కాజల్‌ మాట్లాడుతూ, నేటివిటీని కొంచెం అర్థం చేసుకుంటే ఏ భాషలో అయినా నటించొచ్చననీ, తనకు బాగా తెలిసిన భాష హిందీ కావడంతో బాలీవుడ్‌ల్‌ పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదని కాజల్‌ పేర్కోనంది. ఫలానా లాంగ్వేజ్‌లో నాటిస్తే ఫలానా విధంగా వుండాలన్న తేడాలు తనకు తెలీవనీ, అక్కడి దర్శకులు ఆయా పాత్రల్ని మలచే తీరుని బట్టే తాన ఆ ప్రాజెకుట చెయ్యాలా ? వద్దా ? అనేది సైడ్‌ చేసుకుంటానంటోంది కాజల్‌.

Thursday, February 10, 2011

మరో సినిమా 'తెలంగాణ జిందాబాద్‌'

గతంలో 'హనీమూన్‌' అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఎం.ఎస్‌. గుప్తా ఈసారి తెలంగాణా పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. 'తెలంగాణ జిందాబాద్‌' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'గతంలో 'హనీమూన్‌' తీశాను. నాలుగు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణా బిడ్డగా తెలంగాణా అవసరం ఏమిటనేది... చూపించబోతున్నా. నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలు త్వరలో వెల్లడిచేస్తా'నని అన్నారు.

ఇలియానా ..... సైడ్‌ బిజినెస్‌

 సినీపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఇలియానకు డబ్బు పిచ్చి పట్టిందెమోగాని ఈ మధ్య ఎక్కువగా సైడ్‌ బిజినెస్‌ దృష్టిపెట్టుతుంది. కొంతమంది బామలు ఆఫర్లు లేక ఏమి చేయ్యలేని పరిస్థితిలో ఉంటే ఇలియానా మాత్రం సైడ్‌ బిజినెస్‌పై దృష్టి సాధింస్తుంది. ఇంతకీ ఇలియానా బిజినెస్‌ ఏమిటో తెలసా...? వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాలని సన్నాహాలు చేస్తుంది. అన్నట్లు వస్త్రాల పేరేమిటో తెలుసా ... ఇలియానా. తన తొలి బ్రాంచ్‌ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయబోతుందంట. తర్వాత గోవాలో కూడా ఆ బిజినెస్‌ ప్రారంభించిందట. ఎందుకు ఈ బిజినెస్‌ పెట్టాలనుదో తెలుసా ..... ఇలియాన తల్లి సమీరా ఆ వస్త్రాలను డిజైన్‌ చేస్తుందట. ఇప్పటివరకు ఇలియానా నటించిన సినిమాలకు సమీరానే డిజైనర్‌గా వ్యవహరించారట. చేతిలో పనే కదా అందుకే మరింత కాసులు దండుకోవాలని ఇలియానా ఈ ప్లాన్‌ చేసివుంటుందని అనుకుంటున్నారు పబ్లిక్‌.