Monday, January 24, 2011

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు

భారత్‌ మిడిల్‌ ఆర్డర్స్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు అన్న సందేహాం. యువరాజ్‌ సింగ్‌, రైనా, ధోని, వీరి ముగ్గురి మీద బాధ్యత. ఓ పెనరు రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌, వన్‌డౌన్‌ విరాట్‌ కోహ్లీ, టుడౌన్‌ యువరాజ్‌ సింగ్‌, త్రీ డౌన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఫోరుత్తు డౌన్‌ సురేష్‌ రైనా అతరువాత అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ అతరువాత బౌలర్ల బాధ్యత. ఇలా వరుసగా వస్తుంటారు. ముఖ్యంగా ఓ పెనర్లు విఫలమైన వన్‌డౌన్‌ మీద భాధ్యత ఉంటుంది. అతరువాత టుడౌన్‌ వచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి జట్టును ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ కూడా నమోదు కాలేదు. యువరాజ్‌ సింగ్‌ ఐదు వన్డే సిరీస్‌లో కేవలం 91 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో మాత్రము రాణించగలగాడు. రోహిత్‌ శర్మ ఐదు వన్డేలో 49 పరుగుల చేశాడు. కనీసం అర్థ సెంచరీ కూడ నమోదు కాలేదు. రైనా ఐదు వన్డేలో 111 పరుగులు చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ మూడు వన్డేలో 166 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ చేశాడు. మురళీ విజరు మూడు మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఐదు వన్డేలో 195 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యూసుఫ్‌ పఠాన్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించగలిగాడు.

ముచ్చటగా మూడో విజయం

 ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టెస్ట్‌ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్‌ వన్డేలో మాత్రం వరుస పరాజయాలు మూట కట్టుకుంటోంది. 3-0 తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా అదిక్యతం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 48 ఓవర్లలో 214 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. ట్రాట్‌ 84 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. బ్రెట్‌లీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Sunday, January 23, 2011

కల కలగానే మిగిలిపోయింది. నిజం కాలేదు.

 చరిత్ర సృష్టించాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇక్కడ జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లలో సాతాఫ్రికా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా 3-2 తేడా సిరీస్‌ సోంతం చేసుకుంది.
యూసుఫ్‌ పఠాన్‌ ఒంటరి పోరాటం వృదా

 
జట్టు విజయం కోసం అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ విరోచితంగా పోరాడినా ఫలితం లేకపోయింది. యూసుఫ్‌ పఠాన్‌ క్రీజు వచ్చినప్పడు జట్టు స్కోరు 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయం సాధించాంటే 209 పరుగులు చేయాలి. ఇంకా ఆరు వికెట్లు మాత్రమే వున్నాయి. అందులో రైనా ఒక్కడె బ్యాట్‌మైన్‌ మిగితా బౌలర్లలు ఉన్నారు. రైనా 11, హర్బజన్‌ సింగ్‌ 13, చావ్లా 8 పరుగులకే అవుట్‌ అయ్యారు. యూసుఫ్‌ పఠాన్‌కు జహీర్‌ ఖాన్‌ తోడు అయ్యాడు. అవసరం వచ్చినడల్లా సిక్స్‌, ఫొర్లుతో జట్టు స్కోరు ముందుకు నడిపాడు. జహీర్‌ ఖాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు 100 బాగ్యసామ్యాన్ని నెలకొల్పారు. సౌతాఫ్రికా తన బ్యాట్‌ మరో సారి రూచి చూపాడు. స్మిత్‌ ఎని ప్రయత్నాలు ఉపయోగించిన యుసుఫ్‌ పఠాన్‌ తన దైన శైలిలో అడుతు ముందుకు నడిపాడు. బౌలర్లలను పదే పదే మార్పులు చేసి ఉపయోగం లేకపోయింది. చివరికి అతడు 70 బంతులలో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 105 పరుగులు చేసి మోర్కెల్‌ బౌలింగ్‌లో పైయిస్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు వున్నత సెంపు విజయం భారత్‌దే అనుకున్న అభిమానులకు ఒక్కసారి యూసుఫ్‌ పఠాన్‌ అవుట్‌ అవడంతో మళ్లీ కథ 

మొదటి వచ్చింది.

అంతక ముందు భారత్‌ టాస్‌ గెలచి బౌలింగ్‌ ఎంచుకున్నది. స్మిత్‌ 7 పరుగుల అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌ వచ్చిన వాన్‌వాక్‌ 63 బంతులలో 56 పరుగుల చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. డివిల్లిర్‌ 11 అవుట్‌ అయ్యాడు. డుమ్మిని 35 పరుగులు చేశాడు. మునాఫ్‌ పటేల్‌ పైయిస్స్‌ , బోథా ఇద్దరి ఒక్కే ఓవర్లలో అవుట్‌ చేశాడు. పీటర్సన్‌, స్టెన్‌, మోర్కెల్‌ ముగ్గురు జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. చివరికి ఆమ్లా సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రోహిత్‌శర్మ రూపంలో తొలి వికెటు కోల్పోయింది. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయ్యింది. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టారు. ఏమి చేయలేని పరిస్థితి టీమిండియాకు వచ్చింది. యూసుఫ్‌ పఠాన్‌ వచ్చే వరకు సగం బ్యాట్‌మెన్స్‌లు పెవిలియన్‌ చేరుకున్నారు. టీమిండియా 60/5 స్కోరు బోరు. ఒక్క పార్థవ్‌ పాటేల్‌ 38 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 5, కోహ్లీ 2, ధోని 5, యువరాజ్‌ సింగ్‌ 8, రైనా 11 హర్భజన్‌ సింగ్‌ 13, చావ్లా 8, జహీర్‌ ఖాన్‌ 24, పరుగులు చేశారు.

ప్రపంచకప్‌ ముందు షాక్‌ .....

ప్రపంచకప్‌ ముందు ఉదా : టీమిండియా బ్యాటింగ్‌ మరి పేవలంగా తయారైంది. అడితై అందరూ సెంచరీల మీద సెంచరీలు సాదిస్తారు. లేకపోతే 12, 18, 20, 28, 35 ఇలా పరుగులు చేసి అవుట్‌ అవుతారు. ఇప్పుడు పరిస్థితి కూడా ఇంతే. భారత్‌, దక్షిణాఫ్రికా మద్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లలో పరిస్థితి ఘోరగా తయారైంది. ఒక వేల గెలిస్తే మాత్రం సీనియర్లు లేకుండా జునియర్లు గెలిచాము అన్న దీమా వుంటుంది. ఇప్పుడు ఏమి ఏమీ లేదు. అనుకుంటేనే పరిస్థితి ఘోరంగా తయారైంది. వుంది.
భారత్‌ , దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ రోజు జరిగిన చివరి వన్డేలో భారత్‌ 234 పరుగులకే అలౌట్‌ అయ్యింది. చివరి వన్డే నేడు అనుకున్న అభిమానులకు నిరాశ చేదింది. టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది. మహేంద్రసింగ్‌ ధోని టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం అర్ధం కాలేదు. బ్యాటింగ్‌ తీసుకుంటే సమస్య ఏమిటి ? టీమిండియాలో నెహ్రా బదులుగా షియూ చావ్లా తీసుకున్నారు. ప్రపంచకప్‌ ముందు బారత్‌ బ్యాటింగ్‌ పేలవంగా వుంది. ఐదో వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ ఎంత హీనంగా వుందో అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్‌లో ఇలా అడితే మొదటి రౌండులో ఇంటికి వస్తుంది. ముఖ్యంగా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ దోని ఐదు వన్డే సిరీస్‌ ఒక్క అర్థ సెంచరీ కూడా చేయలేకపోయాడు. యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో ఎంతో అంత రాణింస్తున్నాడు. సురేష్‌ రైనా, ధోని, రోహిత్‌ శర్మ, కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేకపోతున్నారు. ఇలా వుంటే ప్రపంచకప్‌ రావడం కష్టమే. ప్రపంచకప్‌ నుండి దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు గట్టి పోట్టి ఇస్తుంది.

పోకిరి తర్వాత మరో హిట్‌ సినిమా

 మహేష్‌బాబు - పూరి జగన్నాథ్‌ కాంభినేషన్‌లో మరో హిట్‌ సినిమా వస్తుంది. వీరిద్దరి కాంభినేషన్‌ ఖరారైంది. తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసిన ' పోకిరి ' తరహాలోనే ఈ సినిమా వుంటుందని అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టైటిల్‌ ' ది బిజినెస్‌ మెన్‌ ' మే నెలలో ఘాటింగ్‌ ప్రారంభం కానుంది.

' గబ్బర్‌ సింగ్‌'గా పవన్‌కళ్యాణ్‌

 పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై హీరో పవన్‌కళ్యాణ్‌ ' గబ్బర్‌సింగ్‌' తీయబోతున్నారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ నటించిన ' దబాంగ్‌' ను రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ' గబ్బర్‌సింగ్‌' అనే పోలీస్‌ పాత్రను పోషిస్తున్నాడు. అతి త్వరలో ఈసినిమా ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ఇదే ఏడాదిలో విడుదలవుతుందని అన్నారు.

Saturday, January 22, 2011

సూనాయసన విజయం

 న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతన్న మొదటి వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన పాక్‌ 37.3 ఓవర్లలో 124 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. మిస్బాబుల్‌ హుక్స్‌ 50 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒక్కరు రాణించలేకాపోయారు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌లో సౌతీ 5 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బతీశాడు. న్యూజిలాండ్‌ 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఒక వికెటు మాత్రమే కోల్పోయి. 17.2 ఓవర్లలో లక్ష్యాని చేధింది. గుప్తిల్‌ 40, రైడర్‌ 55, టైలర్‌ 23 పరుగుల చేశారు. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ వన్డేలో మాత్రం అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో రాణించగలగిది. ఏడు వన్డే సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. సౌతీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఈవీవీ అంత్యక్రియలు పూర్తి

గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ ఈవీవీ నిన్న అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడసారి ఈవీవీ భౌతికకాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుండి ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈ రోజు మూడు గంటలకు మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో ఆయన అంతక్రియాలు జరుగున్నాయి. 
ఈవీవీ భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు 
సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈవీవీ భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు ఆయనను నివాళులర్పించారు.
ఈవీవీ కుటుంబసభ్యులకు ప్రముఖుల పరామర్శ 
శుక్రవారం అర్థరాత్రి హఠాత్తుగా కన్నుమూసిన సినీ దర్శకుడు ఈవవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, పరామర్శిస్తున్నారు. నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు. సి. కల్యాణ్‌, ఆశోక్‌కుమార్‌, నటులు శ్రీకాంత్‌, అలీ, శివారెడ్డి, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రాజశేఖర్‌, జీవిత, అల్లుఅర్జున్‌, రాజేంద్రపసాద్‌, రామ్‌చరణ్‌, కోటశ్రీనివాస్‌రావ్‌, నాగేశ్వర్‌రావ్‌, శ్రీహరి, బాలకృష్ణ, తదితరులు ఈవీవీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈవీవీ సత్యనారాయణ పలు విజయాల అదించాడు. ఆయన తీసిన సినిమాల్లో అప్పుల అప్పారావు. అలీబాబా అరడజను దొంగలు, చెవిలో పువ్వు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకడి పంబ సినిమాలు కామెడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
 ఈవీవీ అంత్యక్రియల ఫొటోస్