ఉట్టిపడే రాజసం.. గ్రౌండ్‌లో అడుగిడుపెడితే ఆటకే ఒక కళ.. తప్పు జరిగితే జూనియర్లు సీనియర్లు అన్న తేడాలేకుండా అందరినీ హెచ్చరించే నైజం. గడ్డు పరిస్థితుల్లో ఉన్న క్రికెటర్లకు వెన్నంటి ఉండి వారిలో మనో మనోస్థైర్యాన్ని నింపి వారు మళ్లీ రాణించేలా ప్రోత్సాహాన్ని అందిచడం. ఎదుటి జట్టును ట్రిక్కులతో.. అవసరమైతే టెక్కులతో.. సైతం అధరగొట్టే తత్వం. అతను ఒక అనితరసాధ్యుడు బ్యాట్‌మెన్‌గా టన్నులకొద్దిపరుగులు సాధించి టెస్టుల్లో వన్డేల్లో అనేక సెంచరీలు, రికార్డులు సాధించి.. అవసరమైతే బాల్‌తోనూ అద్భుతాలు సృష్టించి... కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించి గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్‌రూంలో సభ్యులను ఏక తాటిపై నడపడం...
హాయ్ ప్రెండ్స్ తెలుగు బ్లాగులందరికి నాయొక్క సంక్రాంతి శుబాకాంక్షలు.
Thursday, January 13, 2011
ఆదిలోనే షాక్........
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లలో 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దక్షాణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఆమ్లా 50, డివిలియర్స్ 76, డుమినీ 73లు రాణించి దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించడంలో కీలకపాత్ర వహించారు. కెప్టెన్ స్మిత్ 11, ఇంగ్రామ్ 5 , జొహాన్ బోథా 23, వేన్ పార్నెల్ 21, మిల్లర్ 9, స్టెయిన్ 7, మోర్కెల్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియమ్ చేరుకున్నారు. రోహిత్ శర్మ 11, యువరాజ్ సింగ్ 2, కెప్టెన్ దోని 25, రైనా 32, హర్భజన్ సింగ్ 0, జహీర్ ఖాన్ 6, నెహ్రా 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కోహ్లి ఒక్కడే అర్థసెంచరీ చేశాడు. రైనా కొద్దిసేపు పోరాటం చేసి సొత్సొబె బౌలింగ్‌లో ఇంగ్రామ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Tuesday, January 11, 2011
నేటి నుంచి వన్డే సిరీస్
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డే సిరీస్ ప్రారంభం కానున్నంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 1-1తో సమానంచేసి, టి20 మ్యాచ్‌లో భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో బుదవారం మొదటి వన్డే ప్రారంభంకానుంది. సెహ్వాగ్, గంభీర్ ాద్దరు గాయలతో జట్టుకు దూరం కానున్నారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో కల్లిస్ తొలి రెండు వన్డేలకు దూరం.
వాంటెడ్ పాటలు విడుదల
గోపీచంద్ - దీక్ష జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ' వాంటెడ్' బి.వి.ఎస్ రవి దర్శకుడు ఆనంద్ ప్రసాద్ వెనిగళ్ల నిర్మాత. చక్రి సంగీత దర్శకుడు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పాటలు ఆవిష్కరించారు. ఆడియో వేడుకలో రామ్‌గోపాల్ వర్మ, చంద్రసిద్ధార్థ, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల, పోకూరి బాబూరావు, రానా, ప్రభాస్, భగవాన్, జయసుధ, బుజ్జి, సునిల్‌నారంగ్, స్మిత సహా గోపిచంద్, దీక్షసేత్, బి.వి.ఎస్.రవి, ఆనంద ప్రసాద్, భాస్కరభట్ల, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని ప్రభాస్ ఆదిష్కరించి జయసుధకి ఆందించారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ' రవి చాలా కష్టించి పనిచేసే దర్శకుడు విజయం సాధించాలి' అన్నారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ' చక్రి సంగీతం అద్బుతంగా ఉంది.
Monday, January 10, 2011
బెంగాలీ దాదాకు మళ్లీ నిరాశే
బెంగాలీ దాదాకు మళ్లీ నిరాశే ఎదురైంది. భారత క్రికెట్ చరిత్రల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన మాజీ సారధి సౌరబ్ గంగూలీకి రెండో రోజు ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీలు కూడా మొండిచెయ్యి చూపాయి. గంగూలికీ ఈ అనుభ వం ఒక రకంగా అవమానం లాంటిదని చెప్పవచ్చు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఈ ప్రిన్స్ ఆఫ్ కొల్‌కత కేవలం ఐపీఎల్ టోర్నీలో పాల్గొనడం కోసమే తన క్రికెట్ కెరీర్‌ను పొడిగించాడు.
లారా, జయసూర్యలది అదే పరిస్థితి
గంగూలీతో పాటు ఇతర క్రికెట్ దిగ్గజాలైన బ్రియాన్ లారా, సనత్ జయసూర్యల కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మొదటి రోజు తొలి రౌండ్లోనే తిరస్కారానికి గురైన వీరి పేర్లు అసలు రెండో రోజు ప్రస్తావన కూడా రాలేదు. ఇలాంటి అనుభవమే ప్రస్తుతం అంతర్జాయ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్న వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు కూడా ఎదురుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ ఏడాది ఐపీఎల్‌లో క్రొత్తగా చేరిన సహారా, పూణె వారియర్స్ జట్టు గంగూలీని కొనుగోలు చేయవచ్చని అందరు భావించినా.... అలా జరగడకపోవడం గమన్హారం.

ఎన్తినికి వీడ్కోలు
ఎన్తిని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం జరిగిన టీ20నే అతడికి చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 12 ఏళ్లు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. సచిన్తఓ కలిసి క్రికెట్ ఆడడం నాకు లభించిన గొప్ప గౌరవం అని ఎన్తిని చెప్పాడు.
Sunday, January 9, 2011
దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
<b>మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ లభించింది.</b>
ఇక్కడ జరిగిన ఏకైక ట్వంటీ- 20 మ్యాచ్‌లో దణాఫ్రికాపై భారత్ 21 తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షాణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను వాన్‌విక్ దాటిగా ప్రారంభించాడు. ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 50 పరుగులు చేసింది. ఒక్క పక్క వికెట్లు పడుతుండగానే తన అర్థసెంచరీని పూర్తి చేశారు. ఆమ్లా 1, ఇంగ్రామ్ 2, డివిల్లియర్స్ 14, డుమినీ 0, పానెల్ 14, మిల్లర్ 10, బోథా 25, పరుగులు చేసి అవుట్ అయ్యారు. థీయర్ 1 , ఎన్‌తిన్ 1 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత్ బౌలింగ్‌లో నెహ్రా, యూసుప్ పఠాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్ , అశ్విన్ , యువరాజ్ సింగ్ తలో వికెట్టు తీసుకున్నారు. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 53, రైనా 41, కోహ్లీ 28, విజరు 14, యువరాజ్ సింగ్ 12, ధోనీ 10, పఠాన్ 6 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ లభించింది.

రెండో రోజూ ఐపీఎల్ -4 వేలంలో సీనియర్లకు నిరాశే
బెంగుళూరులో జరిగిన రెండు రోజుల వేలంలో సీనియర్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రూ. 3.45 కోట్లతో ఉమేష్ యాదవ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. రూ.3.22 కోట్లతో మునాప్ పటేల్‌ను ముంబయి ఇండియన్స్ కొనుక్కుంది. రూ. 3.22 కోట్లతో వేణుగోపాల్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ తీసుకుంది. రూ. 2.3 కోట్లతో లక్ష్మీపతి బాలాజీని కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ. 1.33 కోట్లతో వినరుకుమార్‌ను కోచి తీసుకుంది. రూ. 1.1 కోట్లతో త్యాగిని చెన్నై సూపర్‌కింగ్స్ తన జట్లులో చేర్చుకుంది. రూ. 1.73 కోట్లతో అశోక్‌దిండాను ఢిల్లీ డేర్ డెవిల్స్, రూ. 1.3 కోట్లతో అభిమాన్యు మిధున్‌ను బెంగుళూరు రాయల్స్ చాలెంజర్స్ దక్కించుకున్నాయి.
Subscribe to:
Posts (Atom)