Sunday, January 9, 2011

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

<b>మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మ లభించింది.</b>
 ఇక్కడ జరిగిన ఏకైక ట్వంటీ- 20 మ్యాచ్‌లో దణాఫ్రికాపై భారత్‌ 21 తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షాణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను వాన్‌విక్‌ దాటిగా ప్రారంభించాడు. ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 50 పరుగులు చేసింది. ఒక్క పక్క వికెట్లు పడుతుండగానే తన అర్థసెంచరీని పూర్తి చేశారు. ఆమ్లా 1, ఇంగ్రామ్‌ 2, డివిల్లియర్స్‌ 14, డుమినీ 0, పానెల్‌ 14, మిల్లర్‌ 10, బోథా 25, పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. థీయర్‌ 1 , ఎన్‌తిన్‌ 1 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత్‌ బౌలింగ్‌లో నెహ్రా, యూసుప్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌ , అశ్విన్‌ , యువరాజ్‌ సింగ్‌ తలో వికెట్టు తీసుకున్నారు. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 53, రైనా 41, కోహ్లీ 28, విజరు 14, యువరాజ్‌ సింగ్‌ 12, ధోనీ 10, పఠాన్‌ 6 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మ లభించింది.

రెండో రోజూ ఐపీఎల్‌ -4 వేలంలో సీనియర్లకు నిరాశే

బెంగుళూరులో జరిగిన రెండు రోజుల వేలంలో సీనియర్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రూ. 3.45 కోట్లతో ఉమేష్‌ యాదవ్‌ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ దక్కించుకుంది. రూ.3.22 కోట్లతో మునాప్‌ పటేల్‌ను ముంబయి ఇండియన్స్‌ కొనుక్కుంది. రూ. 3.22 కోట్లతో వేణుగోపాల్‌ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తీసుకుంది. రూ. 2.3 కోట్లతో లక్ష్మీపతి బాలాజీని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. రూ. 1.33 కోట్లతో వినరుకుమార్‌ను కోచి తీసుకుంది. రూ. 1.1 కోట్లతో త్యాగిని చెన్నై సూపర్‌కింగ్స్‌ తన జట్లులో చేర్చుకుంది. రూ. 1.73 కోట్లతో అశోక్‌దిండాను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రూ. 1.3 కోట్లతో అభిమాన్యు మిధున్‌ను బెంగుళూరు రాయల్స్‌ చాలెంజర్స్‌ దక్కించుకున్నాయి.

Saturday, January 8, 2011

గంభీర్‌ టాప్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-4 టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్‌ క్రీడాకారుల వేలంతో శనివారం నాడిక్కడ ప్రారంభమైంది. ఐపిఎల్‌ కమిషనర్‌ చిరాయు అమిన్‌ అధ్యక్షతన తొలి రోజు జరిగిన వేలంలో భారత జట్టు ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అగ్ర భాగాన నిలిచాడు. అతడ్ని కొల్‌కతా నైట్‌రైడర్స్‌ రికార్డు ధర 2.4 మిలియన్‌ డాలర్లకు 2.4 మిలియన్‌ డాలర్లకు, అంటే రు.11.04 కోట్లకు కొనుగోలు చేసింది.క్రికెటర్లు రెండు మిలియన్ల ధర పలికారు. కెవిన్‌ పీటర్సన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కంటే గంభీర్‌ ఎక్కువ ధర పలికాడు. కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గంభీర్‌తో పాటు హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లు యూసుఫ్‌ పఠాన్‌(రు.9.66 కోట్లు), జాక్స్‌ కల్లిస్‌(రు.5.06 కోట్లు)ను కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజర్లు కొనుగోలు చేసారు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌ మౌలిక ధర రు.92 లక్షల కంటే పన్నెండు రెట్లు అధిక ధర పలికాడు. భారత్‌కు చెందిన యూసుఫ్‌ పఠాన్‌, రోహిత్‌ శర్మ (రెండు మిలియన్లు), రాబిన్‌ ఊతప్ప కూడా రెండు మిలియన్ల మార్క్‌ను దాటారు. భారత జట్టులో స్థానం కోల్పోవడంలో విఫలమవుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకకుంది. అతడికి ఎవరూ ఊహించని రీతిలో రు.8.74 కోట్ల ధర పలికింది.

బెంగుళూరు జట్టులో జహీర్‌
భారత జట్టులో ప్రధాన స్ట్రైక్‌ బౌలర్‌గా మారిన జహీర్‌ ఖాన్‌ పట్ల ముంబయి ఇండియన్స్‌ ఎందుకు ఆసక్తి వ్యక్తం చెయ్యలేదో అర్థం కాలేదు. అతడ్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 900,000 డాలర్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక ఓపెనర్‌ తిలకరత్నే దిల్షన్‌కు 650,000 డాలర్ల ధర పలికింది. దక్షిణాఫ్రికా జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, ఇటీవలి కాలం వరకు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా ఉన్న డివిల్లీర్స్‌ను విజయ మాల్యా యాజమాన్యంలోని జట్టు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ డేనియల్‌ వెట్టోరీని కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రాస్‌ టేలర్‌ను రు.4.6 కోట్లకు సొంతం చేసుకుంది.కెవిన్‌ పీటర్సన్‌ను డక్కన్‌ ఛార్జర్స్‌ 650,000 డాలర్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో గరిష్ట ధర పలికిన ఆండ్రూ సైమండ్స్‌ను ముంబయి ఇండియన్స్‌ 850,000 డాలర్లకు కొనుగోలు చేసింది.

కోచ్చి జట్టులో లక్ష్మణ్‌
వివిఎస్‌ లక్ష్మణ్‌, శ్రీశాంత్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్‌పిసింగ్‌), బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మహేలా జయవర్ధనేలను కోచ్చి కొనుగోలు చేసింది. మెక్‌కలమ్‌ 475,000 డాలర్లకే అందుబాటులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రీమ్‌ స్మిత్‌ను సహారా పూనే వారియర్స్‌ 500,000 డాలర్లకే కొనుగోలు చేసింది. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కుమార సంగక్కర, జయవర్ధనే ఈ సారి ఆ జట్టులో ఆడటం లేదు.సంగక్కరను డక్కన్‌ ఛార్జర్స్‌, జయవర్ధనేను కోచ్చి కొనుగోలు చేసాయి. డక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పట్ల ఆ జట్టు సానుకూలత వ్యక్తం చెయ్యలేదు. అతడ్ని పూనే వేలం పాడింది. యువ క్రీడాకారుడు సౌరభ్‌ తివారీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు రు.7.36 కోట్లకు సొంతం ం చేసుకుంది.

గంభీర్‌ దక్కించుకున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌

 ఈ ఉదయం ప్రారంభమైన ఐపీఎల్‌ -4 వేలంలో గౌతమ్‌ గంభీర్‌ను కోలకతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. రూ. 11.04 కోట్లతో గంభీర్‌ను, రూ. 9.66 కోట్లతో యూసుఫ్‌ పఠాన్‌ను నైెట్‌ రైడర్స్‌ చేజిక్కించుకుంది. రూ. 2.9 కోట్లతో దిల్షాన్‌ను, రూ. 4.14 కోట్లతో జహీర్‌ఖాన్‌ను, రూ. 5 కోట్లతో డివిలియర్స్‌ను బెంగుళూరు రాయల్‌ ఛాలంజర్స్‌ దక్కించుకుంది. రూ. 4.6 కోట్లతో రాస్‌ టేలర్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది. రూ. 2.9 కోట్లతో కెవిన్‌ పీటర్స్‌న్‌ను డెక్కన్‌ ఛార్జర్స్‌ సొంతం చేసుకుంది. రూ.6.9 కోట్లతో మహేళ జయవర్థనేను కొచ్చి దక్కించుకుంది. రూ. 8.28 కోట్లతో యువరాజ్‌సింగ్‌ను పూణే చేజిక్కించుకుంది.

నేడు, రేపు ఐపీఎల్‌ -4 వేలం పాట

 బెంగుళూరు శని, అదివారాల్లో ఐపీఎల్‌-4 వేలంపాటు జరగనుంది. ఈసారి పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటున్నాయి. పూణే, కోచి జట్లు అదనంగా చేరాయి. 350 ఆటగాళ్లను బరిలో ఉంచారు. ఇందులో 48 మంది భారతీయులుండగా.......... 302 మంది విదేశీ అటగాళ్లు . నవంబరులో వేలం పాట జరగాల్సి ఉండగా........ మోడీ వ్యవహరం, ఐపీఎల్‌-4లో పాల్గొనే జట్ల విషయంలో సందిగ్దం నెలకొనడంతో జనవరికి వాయిదా పడింది.

Tuesday, January 4, 2011

మూడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 52/2

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 364 అలౌట్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 362 అలౌట్‌
సచిన్‌ 51వ సెంచరీ
గంభీర్‌ సెంచరీ మీస్‌
 
కేప్‌టౌన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లలో మూడో రోజు దక్షిణాఫ్రికా 52/2 పరుగుల చేసింది. ఇంకా కొద్ది సమయంలో ఆట ముగిసే సమయానికి స్మిత్‌ 29, హారిస్‌ 0 వికెట్లు కోల్పోయారు. పీటర్సన్‌ 22, ఆమ్లా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. హర్బజన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్‌ 364 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మూడో రోజు ఆటలో గంభీర్‌ ఏడు పరుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. సచిన్‌ టెండ్కూలర్‌ తన 51న సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లక్ష్మణ్‌ ( 15 ) దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. పూజారా 2, ధోనీ 0 పరుగులకే అవుట్‌ అయ్యారు. హర్బజన్‌ సింగ్‌ 40 , ఇష్మాంత్‌ శర్మ 1, జహీర్‌ ఖాన్‌ 23, పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయిన్‌ 5, మోర్కెల్‌ 2, హారిస్‌ 1 వికెట్లు తీసుకున్నారు. భారత్‌ లీడ్‌ 2 పరుగులు.

Monday, January 3, 2011

భారత్‌ 142/2

గంభీర్‌ అర్థసెంచరీ, సచిన్‌ 49
కల్లిస్‌ 161
దక్షిణాఫ్రికా 362

 భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ 142/2 పరుగులు చేసింది. సచిన్‌ 49, గంభీర్‌ 65 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా 362 పరుగులకే అలౌట్‌ అయ్యాంది. భారత్‌ రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే సెహ్వాగ్‌ వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ద్రావిడ్‌ కూడా రనౌట్‌గా అయ్యాడు. మరో వికెటు పడ్డకఁండా సచిన్‌, గంభీర్‌ ఇద్దరు జాగ్రత పడ్డారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో కల్లిస్‌ 161, ఆమ్లా 59, ప్రిన్స్‌ 47 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మైన్‌లు చెప్పుకోదగ స్కోరు చేయలేదు. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ 5, జహీర్‌ ఖాన్‌ 3, ఇష్మాంత్‌ శర్మ 2 వికెట్టు తీసుకఁన్నారు.

Sunday, January 2, 2011

ఒక్కేసారి మూడు సినిమాలు విడుదల : మరి గెలుపు ఎవరిది ?

 నందమూరి బాలకృష్ణతో అల్లరి నరేష్‌ తలపడుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ పరమవీచక్రం ఆడియో మొన్ననే విడుదల అయ్యాంది. మరి అల్లరి నరేష్‌ సినిమా ఇప్పటి వరకు ఆడియో విడుదల కాలేదు. మరో రెండు వారాల్లో సినిమా ఎలా విడుదల చేస్తారో మనకు తెలియదు. మరి సినిమా మాత్రం సంక్రాతిని విడుదల సిద్దం చేయనున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. సంక్రాతి రోజు రవితేజ సినిమా వస్తుంది. అని ఇంతక ముందు తేలుసు మరి ఈ ముగ్గురిలో ఎవరిది పైచేయి ఎవరిది ?