Sunday, January 2, 2011

ఒక్కేసారి మూడు సినిమాలు విడుదల : మరి గెలుపు ఎవరిది ?

 నందమూరి బాలకృష్ణతో అల్లరి నరేష్‌ తలపడుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ పరమవీచక్రం ఆడియో మొన్ననే విడుదల అయ్యాంది. మరి అల్లరి నరేష్‌ సినిమా ఇప్పటి వరకు ఆడియో విడుదల కాలేదు. మరో రెండు వారాల్లో సినిమా ఎలా విడుదల చేస్తారో మనకు తెలియదు. మరి సినిమా మాత్రం సంక్రాతిని విడుదల సిద్దం చేయనున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. సంక్రాతి రోజు రవితేజ సినిమా వస్తుంది. అని ఇంతక ముందు తేలుసు మరి ఈ ముగ్గురిలో ఎవరిది పైచేయి ఎవరిది ?

Thursday, December 30, 2010

పరమవీర చక్ర ఆడియో విడుదల

బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమవీరచక్ర' ఆడియో విడుదల అభిమానుల కోలాహలంమధ్య శిల్పకళావేదికలో బుధవారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో వికలాంగులైన మాజీ సైనికులకు బాలకృష్ణ చేతులమీదుగా ఆర్థిక సాయం జరిగింది. మరోవైపు దాసరి 150 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కె. బాలచందర్‌ దాసరిని సత్కరించారు.

యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'

 వరుణ్‌సందేశ్‌, నిషా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా అందర్నీ మా చిత్రం ఆకట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర సమర్పకులు అరిమిల్లి రామకృష్ణ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... నేను చేసిన తొలి సినిమానే సక్సెస్‌కావడం ఆనందంగా ఉందంటూ.. ప్రేక్షకులకు నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి.

Tuesday, December 28, 2010

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 111/3

లక్ష్యణ్‌ సెంచరీ మిస్‌ 96
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 228 అలౌట్‌
దక్షిణాఫ్రికా లక్ష్యం 303

 
 దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 303 పరుగుల లక్ష్మాన్ని ఉంచింది. ప్రస్తుతం ముడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 111/3 చేసింది. డివిల్లర్స్‌ 17, కల్లిస్‌ 12 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధిచాలంటే ఇంకా 192 పరుగుల చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకముందు ఆట ప్రారంభించిన భారత్‌ 228 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. లక్ష్మణ్‌ 96 పరుగుల చేసి చివరి బ్యాట్స్‌మైన్‌ అవుట్‌ ఆయ్యాడు. దక్షిణాఫ్రికా 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. స్మిత్‌ 37, ఆమ్లా 16, ఫిటరసన్స్‌ 26 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇంకా దక్షిణాఫ్రికా 192 పరుగులు చేయ్యాలి. క్రీజులో డివిల్లర్స్‌, కల్లిస్‌ ఇద్దరు బ్యాట్‌మైన్‌ ఉన్నారు. ఏ ఒక్కరు క్రీజులో ఉన్న విజయం దక్షిణాఫ్రికాదే. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ రెండు వికెట్లు హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెటు లభించింది. నాల్గవ రోజు ఆట బౌలర్లదా, లేక బ్యాట్‌మైన్‌దా ?

జనవరి 12న 'మిరపకాయ్'

 రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా నటిస్తోన్న 'మిరపకాయ్' జనవరి 12న రానుంది. ఈ విషయాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల తెలియజేశారు. ఎల్లో ఫ్లవర్స్‌ బ్యానర్‌పై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. థమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో హిట్‌ అయింది. కిక్‌ తర్వాత రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న పాటలవి. మా బ్యానర్‌లో ఎంతో రిచ్‌గా తీశాం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వస్తోంది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే స్టోరీ. సీనియర్‌ నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.

Monday, December 27, 2010

భారత్‌ 92/4

<b>ప్రస్తుత ఆధిక్యం 166 పరుగులు </b>
  భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ 32, మురళీవిజరు 9, ద్రావిడ్‌ 2, సచిన్‌ 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ 166 పరుగుల ఆధిక్యంతో ఉంది. స్టెయిన్‌, మార్కెల్‌ చెరో వికెట్‌ తీసుకోగా, సొత్సెబె రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతక ముందు రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 205 పరుగులకు అలౌట్‌ అయ్యాది. 

దక్షిణాఫ్రికా 131 అలౌట్‌
దక్షిణాఫ్రికా 131 పరుగులకే అవుట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాట్‌మెన్స్‌లో ఏఒకరు రాణించలేకపోయారు. పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, ఆమ్లా 33, కల్లిస్‌ 10, డివిల్లీర్‌ 0, ప్రిన్స్‌ 13, బౌచర్‌ 16, స్టెయిన్‌ 1, హరిస్‌ 0, మోర్కెల్‌ 10, సొత్సెబె 0 పరుగులు చేశారు. ఆమ్లా 33 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ 4, జహీర్‌ ఖాన్‌ 3, శ్రీశాంత్‌, శర్మ చెరో వికెటు తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల అదిక్యత సాధించింది. రెండో రోజు వికెట్లు పతనం మొదలైయింది. ఒక్కే రోజు రెండు జట్ల మధ్య 18 వికెట్లు పడ్డాయి. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ కనీసం 300- 350 పరుగులు చేస్తే విజయ అవకాశాలు ఉంటాయి.

Sunday, December 26, 2010

మళ్లీ అదే కథ : భారత్‌ 183/6

 డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకున్నది. తొలి రోజు భారత్‌ 183/6 పరుగులు చేసింది. హర్భజన్‌ సింగ్‌ 15, దోనీ 20 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. గంభీర్‌ స్థానంలో వచ్చిన మురళీ విజరుతో సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25, విజరు 19, ద్రవిడ్‌ 25, సచిన్‌ 13, లక్ష్మణ్‌ 38, పుజరా 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. రైనా స్థానంలో పుజరా అలాగే గంభీర్‌ స్థానంలో మురళీ విజరు జట్టులో ఉన్నారు. ఇద్దరు 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయాన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.

బాలయ్యతో రవితేజ కుస్తీ

 బాలయ్యతో, రవితేజ మళ్ళీ ఢ ఇంతక ముందు ఇద్దరు ఒక్కేసారి సినిమా విడుదల అయ్యాయి. ' ఒక్కమగాడు'తో బాలయ్య 'కృష్ణ' తో రవితేజ బరిలోకిగారు. ఇద్దరు కుస్తీ పడి చివరికి రవితేజ, సినిమా హిట్‌ కొట్టి బాలయ్యను ఓడించాడు. ఈ సారి బాలకృష్ణ సినిమా 'పరమవీరచక్ర' సంక్రాతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే అదే సమయంలో రవితేజ సినిమా ' మిరపకాయ' కూడా సంక్రాతికే బరిలోకి దిగనుంది. మరి ఈ సారి ఆసీన్‌ రివర్స్‌ అవుతుందో మళ్లీ రిపీట్‌ అవుతుందో జనవరి 15 వరకు వేచి చూడాలి.