Monday, December 12, 2016

మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్


మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు. 
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్‌ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్‌జే సూర్య, ఆర్‌జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Sunday, December 11, 2016

నటిగానే గుర్తుండిపోవాలి

 బాలీవుడ్‌తో పాటు తెలుగు.. కన్నడ భాషల్లోనూ నటించింది శిల్పాశెట్టి. 2007లో వచ్చిన ‘అప్నే’ చిత్రం తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా.. ఆ తర్వాత ఒకటి.. రెండు సినిమాల్లో అతిథి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం యోగా నిపుణురాలిగా రాణిస్తున్న ఈ భామ ‘బిజినెస్‌ టైకూన్‌’ అని పిలిపించుకోవడం కంటే.. అభిమానుల హృదయాల్లో నటిగా గుర్తుండిపోవాలని కోరుకుంటోందట.
‘‘ నాకు నచ్చినవి చేస్తున్నా. కొన్ని సక్సెస్‌ అవుతున్నాయి. ఇంకొన్ని ఫెయిలవుతున్నాయి. అంతేతప్ప బిజినెస్‌వుమెన్‌ అవ్వాలని అనుకోవడం లేదు. అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నటిగానే గుర్తుండిపోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి. మరి సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడిస్తారని అడిగితే.. దాని గురించి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.
 
ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘సూపర్‌ డ్యాన్సర్‌’కి న్యాయనిర్ణేతగా చేస్తోంది శిల్ప. జడ్జిగా వ్యవహరించడంపై తన అనుభవాన్ని చెబుతూ.. ‘‘మనం చేస్తున్న పనిలో విజయం సాధించినపుడు సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి ఆనందాన్నే పొందుతున్నా. ఈ షోలో నేను కేవలం మధ్యవర్తి లాంటిదాన్నే. ఇందులో డ్యాన్సర్లే నిజమైన స్టార్‌లు. వాళ్లలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది’’ అని చెప్పింది.

Saturday, December 10, 2016

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

 ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతున్నారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ 150 చిత్రంతో మరోసారి తన అభిమానుల్ని అలరించబోతున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది.
మరోసారి మెగాస్టార్‌ తనదైన స్టైల్‌తో, స్టామినాతో దూసుకుపోనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లీకైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'ఖైదీ నంబర్‌ 150' సినిమాలోని ఓ పాటకు చిరంజీవి, కాజల్‌ స్టెప్పులు వేస్తుండగా.. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి దానిని రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో ఇది బాగా హల్‌చల్‌ చేస్తోంది.

http://www.sakshi.com/news/movies/chiru-movie-shooting-video-leak-430812?pfrom=home-top-story

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ

 సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న  స్పందిస్తుంటుంది. త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్ ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది. తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్ లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది.

సినీ రంగంలో వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు తెర మీదకు రావడమే చాలా అరుదు. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ మాత్రం ఈ సాంప్రదాయాలకు మినహాయింపు. కలెక్షన్ కింగ్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన లక్ష్మీ  నటిగానే కాక నిర్మాతగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది.

Friday, December 9, 2016

వైభవంగా అఖిల్‌ నిశ్చితార్థం


ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్‌, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఓ ప్రైవేటు అతిథిగృహంలో వైభవంగా నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీయా భూపాల్‌ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌.

 

'ధృవ' మూవీ రివ్యూ



కథ :
ధృవ(రామ్ చరణ్)..  దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్‌ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు.

అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్ చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్ గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్, అరవింద్ స్వామి
స్క్రీన్ ప్లే
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
పాటలు
సినిమా లెంగ్త్

ఓవరాల్ గా ధృవ.. రామ్ చరణ్ స్థాయిని పెంచే చేసే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్
 

Thursday, December 8, 2016

సంతకం పెట్టిందోచ్!

  సమంత అంటే ఇష్టపడే తెలుగు సినిమా అభిమానులకు ఇది శుభవార్తే. అక్కినేని నాగచైతన్య (చైతూ)తో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చెన్నై బ్యూటీ నటన, సినిమాలకు స్వస్తి పలుకుతారనే పుకార్లు షికారు చేశాయి. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని చైతూ స్వయంగా చెప్పినా... ఈ పుకార్లకు అడ్డుకట్ట పడలేదు. దీనికి తోడు ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో మరో చిత్రానికి సమంత సంతకం చేయకపోవడంతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ... తెలుగులో కొత్త చిత్రాలకు సమంత సంతకం చేశారు. ఆ మాట ఎవరో కాదు... సాక్షాత్తూ సమంతే చెప్పారు. కానీ, ఆ కొత్త తెలుగు చిత్రాల ఏమిటన్నది మాత్రం చెప్పలేదు.
‘‘కొత్త చిత్రాల్లో ఎవరికి జోడీగా నటిస్తున్నాను, ఆ సినిమాలు ఏంటి, కాంబినేషన్ ఏమిటన్నది ప్రకటించడానికి నేనింక ఎదురు చూడలేను’’ అని సమంత ట్వీట్ చేశారు. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం చిన్న ఎన్టీఆర్- దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) సినిమా, రామ్‌చరణ్- దర్శకుడు సుకుమార్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా సమంత పేరు వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అలాగే, చైతూతోనూ త్వరలోనే సమంత కలసి నటిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. మరి, సమంత తెలుగులో అంగీకరించిన కొత్త సినిమాలు ఏమిటో? అబ్బ... సమంత మళ్ళీ ట్వీట్ చేసేదాకా జనం ఎదురుచూడలేరు బాబూ!

Wednesday, December 7, 2016

పూరి 'మూడు కోతులు.. ఒక మేక'

 పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్ కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు. మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్. సినిమా మేకింగ్ లోనే కాదు, సినిమా టైటిల్ ఎంపికలో కూడా పూర్తి కొత్తదనం చూపిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు పోకిరి, దేశముదురు లాంటి టైటిల్స్ పెట్టాలన్న, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్ తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది.
ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్ ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.