Tuesday, September 27, 2016
జోడీ కుదిరిందా?
బాహుబలిని చంపినప్పుడు నేనక్కడ లేను
మూడు భాషల్లో తెరకెక్కించే చిత్రాల్లో ఇకపై నటించనని మిల్కీబ్యూటీ తమన్నా
అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
‘అభినేత్రి పూర్తిగా హారర్ సినిమా కాదు, అది వినోదం కోసమే. ఈ సినిమాలో దయ్యం
ఉంటుంది, కానీ అది ఎవర్నీ భయపెట్టదు. మూడుభాషల్లో చిత్రాన్ని తెరకెక్కించడం
సులభమైన పని కాదు, అది చాలా కష్టం. దీన్ని తమిళం, హిందీ భాషల్లో మాత్రమే
తెరకెక్కించాలని అనుకున్నారు. తెలుగులో నాకు మంచి మార్కెట్ ఉందని నేను
సలహా ఇవ్వడంతో ఈ భాషలోనూ తీశారు. మూడు సినిమాల్లో నటించినట్లు అనిపించింది,
సినిమాని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం. ఈ మూడు భాషలు ఒకదానికొకటి చాలా
విభిన్నంగా ఉంటాయి కాబట్టి డైలాగ్ పలికే విధానం కూడా తేడాగా ఉంటుంది. తెలుగు
సన్నివేశం పూర్తి చేసిన తర్వాత తమిళ్, హిందీ చేసేదాన్ని. ఒకే సన్నివేశాన్ని
మూడుసార్లు మూడు భాషల్లో చేయడంతో చాలా అలసిపోయేదాన్ని’ అని చెప్పారు.
అనంతరం ‘జాగ్వార్’ చిత్రంలోని ప్రత్యేక గీతం గురించి ప్రశ్నించగా.. ‘ఇప్పటికే ఆ పాట షూటింగ్ పూర్తి చేశాం. ప్రేక్షకులు నా ప్రత్యేక గీతాల్ని ఇష్టపడతారనుకుంటున్నా. దక్షిణ చిత్ర పరిశ్రమలో ప్రజలు స్టార్ హీరోయిన్లు ప్రత్యేక గీతం చేస్తే ఎందుకు అసహనంగా భావిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటి ఇబ్బంది హిందీ చిత్ర పరిశ్రమలో ఉండదు. దీపికా, కత్రినా, కరీనా ప్రత్యేక గీతాల్లో నటించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ సమస్యను బ్రేక్ చేయాలి అనుకున్నా. పాటను హుందాగా కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎందుకు నటించకూడదు?’ అని ప్రశ్నించారు తమన్నా. ‘జాగ్వార్’ పాటకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే వెంటనే.. ‘నేను ఎప్పుడూ ఎక్కువ పారితోషికమే తీసుకుంటా’ అని చెప్పారు.
చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ తమన్నా బాహుబలి క్లైమాక్స్ సన్నివేశం చేయాల్సి ఉందన్నారు. దాంతో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తమన్నా ఇలా సమాధానం ఇచ్చారు. ‘బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేనక్కడ లేను, ఇంకెవరైనా ఉండి ఉంటారని అనుకోను. నాకు తెలిసి రాజమౌళి ఈ సన్నివేశం చిత్రీకరణను తొలి విభాగంలోనే పూర్తి చేసుంటారు. ఎవరికీ ‘బాహుబలి’ కథ తెలియదు’ అని చెప్పారు.

Monday, September 26, 2016
‘బాహుబలి 2’ ట్రైలర్ ఎప్పుడంటే?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.
రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
తెరకెక్కిస్తున్న ‘బాహుబలి
2’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం
పతాక సన్నివేశాల చిత్రీకరణను
జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల
కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు
చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే నవంబరులో చిత్రం షూటింగ్
పూర్తి కానుందని సమాచారం. హీరో
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా
అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను
విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా
మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి
కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై
భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’
ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన
24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది
వీక్షించడం గమనార్హం.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సమంత చేసిన పూజ ఏంటి?
‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఇటీవల విడివిడి ఇంటర్య్వూల్లో అక్కినేని నాగచైతన్య.. సమంతలు చెప్పేయటం తెలిసిందే. దీంతో వీరి వ్యవహారంపై ఇప్పుడు అందరికి స్పష్టత వచ్చేసింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
పక్కపక్కనే కూర్చున్న చైతూ.. సమంతలు కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపించారు. వీరికి చుట్టూ వేదపండితులు నిల్చుని ఉన్నారు. పెళ్లికి ముందుగా జరిపే పూజలో భాగంగా సమంత ఈ కార్యక్రమంలో చైతుతో కలిసి పాల్గొందని ఫిల్మ్ వర్గాల టాక్. మరి కొందరేమో.. దోష నివారణ నిమిత్తం ఈ పూజలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా ఏమీ మాట్లాడలేదు. సమంత, నాగచైతన్య హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
Sunday, September 25, 2016
Wednesday, September 21, 2016
సల్మాన్ నాతో నటించడానికి ఒప్పుకోలేదు
సెలబ్రిటీ
వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెడితే
వారికి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది.
అవకాశాలు.. పాపులారిటీ సులభంగా
వస్తాయి. అయితే దాన్ని నిలుపుకోవడం
మాత్రం వారి ప్రతిభపై ఆధారపడి
ఉంటుంది. సినీ నేపథ్యమున్న కుటుంబం
నుంచి వస్తే చాలా ఉపయోగాలు..
వెసులుబాటులుంటాయి. కానీ.. సోనమ్
కపూర్ మాత్రం అదే ఇబ్బందులను
తెచ్చిపెడుతోందని తెగ బాధపడిపోతోంది.
‘‘నా తండ్రి వల్ల నేను చాలా సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ సినిమాని తీసుకోండి. మొదట ఈ చిత్రంలో సల్మాన్ నాతో నటించడానికి ఒప్పుకోలేదు. ‘అనిల్ కపూర్ నా సన్నిహిత స్నేహితుడు. అలాంటిది అతని కుమార్తెతో నేను ఎలా రొమాన్స్ చేయగలను?’ అని సల్మాన్ అన్నాడు. అతికష్టం మీద నటించేందుకు ఒప్పుకున్నాడు. అలాగే ‘దర్శకురాలు ఫరాఖాన్ మా అమ్మకు స్నేహితురాలు. కానీ ఫరాఖాన్ చిత్రాల్లో ఒక్క దాంట్లో కూడా నేను నటించలేదు. చిన్నప్పట్నుంచి తెలిసిన అమ్మాయిని కాబట్టి తనకు నేను నటిగా కనిపించకపోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోనమ్.

Tuesday, September 20, 2016
సల్మాన్‌ని వెంటాడుతున్న వ్యాధి
‘దబాంగ్’ ఖాన్ సల్మాన్ 50
ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ని
కాపాడుకోవడానికి ఎన్నో కసరత్తులు
చేస్తుంటాడు. భాయ్ ఎంత బిజీగా
ఉన్నా తన డైట్‌ని చక్కగా అనుసరిస్తాడు.
అలాంటి సల్లూభాయ్ కొన్ని సంవత్సరాలుగా
ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట.
సల్మాన్ 2007లో పార్ట్‌నర్ సినిమాలో నటిస్తున్నప్పుడు దవడ భాగంలో తీవ్ర నొప్పి వచ్చిందట. దాంతో భాయ్ వైద్యులను సంప్రదిస్తే ట్రైజెమినల్ న్యూరల్జియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముందు దవడ భాగంలో తీవ్ర నొప్పి ఉంటుంది. తర్వాత అది నిదానంగా మెదడుపై ప్రభావం చూపుతుంది.
ఈ విషయం తెలిసి సల్మాన్ వెంటనే కొన్నాళ్ల పాటు షూటింగ్ వదిలేసి సీక్రెట్‌గా తన సోదరులతో కలిసి అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చినట్లు సమాచారం. అప్పటికి కనీసం ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలీదట. ట్రీట్‌మెంట్ పూర్తికాగానే సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే భారత్ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఈ వ్యాధి కారణంగా భాయ్ క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాడు. తనకు ఇలాంటి సమస్య ఉన్నా భాయ్ ధైర్యంగా, ‘సుల్తాన్’లా దర్జాగా లైఫ్‌ని ఎంజాయ్ చేయగలగడం విశేషం.

Friday, September 9, 2016
ఇటు 33..అటు 61!
ఇప్పుడు అమలా పాల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరి, ఇటు 33... అటు 61
ఏంటనుకుంటున్నారా? హీరోల వయసండీ. సిల్వర్ స్క్రీన్‌పై ఓ పక్క యంగ్ హీరోలతో
రొమాన్స్ చేస్తున్న ఈ మలయాళీ బ్యూటీ, మరో పక్క సీనియర్ హీరోల సరసన కూడా సై
అంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ నటిస్తున్న తమిళ సినిమా ‘వడ చెన్నై’ హీరో ధనుష్
వయసు 33 ఏళ్లు. యంగ్ హీరోల సినిమాల్లో మంచి చాన్సులు వస్తున్నప్పుడు
సీనియర్ హీరోల పక్కన నటించడానికి అమలా పాల్ వయసున్న హీరోయిన్లు
ఆలోచిస్తారు. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్ కింద ట్రీట్ చేసి, యంగ్ హీరోలు
చాన్సులు ఇవ్వరేమోననే భయం.
కానీ, అమలా పాల్‌కి అటువంటి భయాలు ఉన్నట్లు కనిపించడం లేదు. 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు. మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ను సత్యరాజ్ హీరోగా తమిళంలో ‘మురుగవేల్’గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు అమలా పాల్. 61 ఏళ్ల సత్యరాజ్ పక్కనే కాదు.. మరో నాలుగేళ్లు పెద్దైన రజనీకాంత్ సరసన కూడా ఆమె నటించనున్నారట.

Subscribe to:
Posts (Atom)