నువ్వా..
నేనా..
ఇద్దరూ భీకర
ఫామ్‌లో ఉన్నారు. ఒంటి చేత్తో తమ జట్లను గెలిపిస్తున్నారు. ఆయా జట్ల
తరఫున వారే టాప్ స్కోరర్లు. కెప్టెన్లుగా జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు.
అందుకే ఫైనల్ పోరులో విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్ మధ్య పోరాటం అత్యంత
ఆసక్తి రేపిస్తోంది. అసాధ్యమనుకున్న దశ నుంచి బెంగళూరును కోహ్లి
తన అద్భుత బ్యాటింగ్, నాయకత్వంలో ప్లేఆఫ్స్‌కు చేరిస్తే.. వార్నర్
ఆరంభం నుంచి తన జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. కోహ్లి విధ్వంస
విన్యాసాల వల్ల మరుగుపడిపోయాడు కానీ..వార్నర్ కూడా ఎంతో విలువైన
ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరి తుది పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
బెంగళూరుకు
బ్యాటింగే బలం
రెండు
జట్లూ తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నవే. రెండూ స్ఫూర్తిదాయక
విజయాలతో ముందంజ వేసినవే. ఎవరి బలం వారిది. కోహ్లి రూపంలో బెంగళూరుకు,
వార్నర్ రూపంలో సన్‌రైజర్స్‌కు స్ఫూర్తిదాయక నాయకులున్నారు.
ఐతే ఫైనల్లో ఆర్‌సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టుకు
రెండు సార్లు 2009, 2011లో ఫైనల్ ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు
సన్‌రైజర్స్ అత్యుత్తమ ప్రదర్శన ప్లేఆఫ్ (2013) మాత్రమే. పైగా బెంగళూరు
భీకర ఫామ్‌తో ఫైనల్ చేరింది. ఆరంభంలో తడబడ్డ బెంగళూరు ఫ్లేఆఫ్
ముంగిట అత్యుత్తమ ఫామ్‌ను అందుకుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే నెగ్గాల్సిన చివరి
నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపించింది.
ఆ జట్టు ఇప్పుడు జోరుమీదుంది. ముఖ్యంగా బ్యాటింగే బెంగళూరు ప్రధాన
బలం. కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్‌లు భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు.
ఈ సీజన్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. గేల్ కూడా టచ్‌లోనే
ఉన్నాడు. కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. తీవ్రంగా తడబడ్డ
బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌ల్లో కుదురుకోవడం, ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు
సంతోషాన్నిచ్చే అంశం. లెగ్ స్పిన్నర్ చాహల్ 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి
అత్యధిక వికెట్ వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ వాట్సన్
కూడా 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా
రాణించాలని బెంగళూరు ఆశిస్తోంది.

సన్‌రైజర్స్‌కు
బౌలింగే ఆశ
సన్‌రైజర్స్
కూడా చక్కని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు.. విరాట్
కోహ్లిపై ఆధారపడ్డట్లే సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో తన కెప్టెన్ వార్నర్‌పై
బాగా ఆధారపడి ఉంది. 16 మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేసిన వార్నర్ జట్టును
ముందుండి నడిపిస్తున్నాడు. క్వాలిఫయర్-2లో ఛేదనలో జట్టును దాదాపుగా
ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఓపెనర్ ధావన్ కూడా అతడికి చక్కని సహకారాన్నిస్తున్నాడు.
ఐతే కొన్ని విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన యువరాజ్ ఫైనల్లో తన అత్యుత్తమ ఆటతీరు
ప్రదర్శించాలని, హెన్రిక్స్ మరోసారి ఆల్‌రౌండ్ సత్తా చాటాలని సన్‌రైజర్స్
ఆశిస్తోంది. బెంగళూరుతో తలపడ్డ గత మ్యాచ్‌లో గెలవడం సన్‌రైజర్స్‌కు
సానుకూలాంశమే. ఐతే సన్‌రైజర్స్ అసలు బలం మాత్రం బౌలింగ్‌లోనే ఉంది.
ఫైనల్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య
పోరుగా అభివర్ణించవచ్చు. సీమర్లు భువనేశ్వర్ (16 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు),
ముస్తాఫిజుర్ రెహ్మాన్ (15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌తో
ఈ సీజన్‌లో హైదరాబాద్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎంత
గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా వారి బౌలింగ్‌లో పరుగులు చేయడం కష్టమవుతోంది.
ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో వారి బౌలింగ్ అద్భుతం. నెహ్రా గాయంతో దూరమైనా
భువి, ముస్తాఫిజుర్ తమ జట్టు పదును తగ్గకుండా చూశారు. బరిందర్
శరణ్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఐతే ముస్తాఫిజుర్ ఫిట్‌నెస్
సన్‌రైజర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. అతడు ఫిట్‌గా లేకపోతే బౌల్ట్
మ్యాచ్ ఆడతాడు.
తుది జట్లు(అంచనా)
ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఏబీ
డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ,
జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా, ఎస్ అరవింద్, చాహాల్
హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధవన్,
హెన్రీక్యూస్,యువరాజ్ సింగ్,దీపక్ హూడా,కట్టింగ్,నమాన్ ఓజా,బిపుల్ శర్మ,
భువనేశ్వర్ కుమార్,బరిందర్ శ్రవణ్, ట్రెంట్ బౌల్ట్
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో
నాగశౌర్య, నారా రోహిత్ ప్రధాన
పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న
చిత్రం ‘జ్యో అచ్యుతానందా’.
ఈ చిత్రం సెట్‌లో యూనిట్ సభ్యులు
చాలా సరదాగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా దిగిన ఒక ఫొటోను
శ్రీనివాస్ అవసరాల తన ఫేస్‌బుక్
ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అందులో నాగశౌర్య స్కెచ్‌లు
పట్టుకుని ఉండగా.. శ్రీనివాస్
అవసరాల చేతికి కట్టుకట్టి ఉంది.
ఈ కట్టుపై ‘సువర్ణ’ అని రాసి
ఉంది. దీనికి శ్రీనివాస్ క్యాప్షన్‌గా...
‘నేను అతడి కోసం రెండు స్క్రిప్టులు
రాశాను. నా కోసం అతడు ఇది రాశాడు’
అని పోస్ట్ చేశారు. మరి ఆ ‘సువర్ణ’
అనే పేరు సినిమాలో హీరోయిన్‌దా..
లేక మరేదైనా ఉందా అన్న విషయం
తెలియాల్సి ఉంది.
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు భారీ విజయం తర్వాత విడుదలైన ఆయన
సినిమా బ్రహ్మోత్సవంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్
అభిమానుల అంచనాలను బ్రహ్మోత్సవం అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచిన ఈ
సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు దర్శకుడిని నిందించరాదని మహేష్ బాబు అన్నాడు. ఓ
జాతీయ వార్త సంస్థతో మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా పరాజయానికి పూర్తిగా
తనదే బాధ్యతని చెప్పాడు. ఓ సినిమా హిట్ కావడానికి, కాకపోవడానికి ఎన్నో
కారణాలుంటాయని అన్నాడు. దర్శకుడిని ఎంచుకోవడమన్నది తన నిర్ణయమని, నా
అభిప్రాయం తప్పుకావచ్చని మహేష్ చెప్పాడు.
మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా సత్యారాజ్,
రావు రమేష్, నరేశ్, రేవతి, సాయాజీ షిండే తదితర భారీ తారగణం నటించారు.
తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా
చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా
చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి.
ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది.
దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు
ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్ జిత్' లో
నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని
చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ
కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు
తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే
మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్
సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే
స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే.
ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్-9 తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో
కామెంట్లు పోటెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి గుజరాత్
లయన్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ట్విటర్ లో పుంఖాను
పుంఖాలుగా సరదా కామెంట్లు వచ్చాయి. పంచ్ లు విసిరారు, సలహాలు ఇచ్చారు.
ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా
ట్వీట్లు వదిలారు.
కోహ్లి సేనను కంగారు పెట్టిన ధవళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24)
అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్ కూడా ఇన్ని
వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి
ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వజ్ ఇట్ వెరీ షాట్? అంటూ
ప్రశ్న సంధించారు. లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్ ను లాగేసుకున్నాడని ప్రీతి
జింతా ట్వీట్ చేసింది.
సున్నాకే అవుటై కోహ్లి మిషన్ కాదు మనిషినని రుజువు చేసుకున్నాడని ఇంకొరు
వ్యాఖ్యానించారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్
ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని పంచ్
విసిరారు. మ్యాచ్ గెలిపించి కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ విమర్శల బారిన
పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు కామెంట్ చేశారు.
కోహ్లి-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ
'టైటానిక్'ను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్
సాంగ్ లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని సలహాయిచ్చారు.
వచ్చే బిగ్‌బాష్ సీజన్లో క్రిస్ గేల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతడితో
కాంట్రాక్టును పునరుద్ధరించకోబోమని మెల్‌బోర్న్ రెనగేడ్స్ జట్టు
ప్రకటించింది. గత బిగ్‌బాష్ సీజన్లో రెనగేడ్స్ తరఫున ఆడిన గేల్..
తనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ మహిళా టీవీ వ్య్లాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకర
వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు చాలా మంది
గేల్ ప్రవర్తనను తప్పుపట్టారు. రెనగేడ్స్ జట్టు కూడా గేల్‌కు జరిమానా
విధించింది. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమవ్వకుండా చూసుకోవాలని
గేల్‌ను హెచ్చరించింది కూడా. ఐతే ఈ హెచ్చరికలేవీ ఈ విండీస్ క్రికెటర్‌పై
పనిచేయలేదు. తాజాగా గేల్ మళ్లీ నోరు జారాడు. ఈ సారి తనను ఇంటర్వ్యూ
చేయడానికి వచ్చిన బ్రిటన్ పత్రికకు చెందిన ఓ మహిళా విలేకరితో అసభ్యకరంగా
సంభాషించాడు. దీంతో గేల్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు రెనగేడ్స్
జట్టు ప్రకటించింది. రెనగేడ్సే కాదు... గేల్‌తో కాంట్రాక్టు ఉన్న కౌంటీ
జట్టు సోమర్సెట్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని వార్తలొస్తున్నాయి.
మహిళలు పురుషులతో అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. మగవాళ్లకు దీటుగా
రాణిస్తున్నారు. సినిమాల్లో అయితే హీరోలతో పోటీపడి హీరోయిన్లు డ్యాన్స్ లు,
ఫైట్లతో అదరగొడుతున్నారు. అయితే సినీ పరిశ్రమలో మగవాళ్లదే ఆధిపత్యమని
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటోంది. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఎక్కడైనా
వాళ్లదే రాజ్యమని చెబుతోంది.
'సినీ పరిశ్రమంలో మహిళలు, పురుషులు సమానమన్న మాటే లేదు. బాలీవుడ్ లేదా
హాలీవుడ్ ఏదైనా మగవాళ్లదే డామినేషన్. ఈ నిజాన్ని దాచలేము' అని కాజోల్ అంది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కాజోల్ సినిమాలకు
దూరమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కాజోల్.. గతేడాది
దిల్ వాలే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై కనిపించింది. పెళ్లి, వయసు
అన్నవి తన కెరీర్ కు ఎప్పుడూ ప్రతిబంధకం కాదని ఆమె చెప్పింది.
ఒక స్మార్ట్‌ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. తాము త్వరలో
విడుదల చేయబోయే ఎం3 నోట్ కోసం రెండు వారాల్లో 3 లక్షల మందికి పైగా
రిజిస్టర్ చేసుకున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మెయిజు ప్రకటించింది.
రూ. 9,999 ధరలో ఉన్న ఈ ఫోన్ ఈనెల 31వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో
ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...
స్క్రీన్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పి10
సామర్థ్యం: 1.8 గిగాహెర్ట్జ్
ఫోన్ మందం: 5 మిల్లీమీటర్లు
ఓఎస్: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
స్టోరేజి: 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం
అదనపు హంగులు: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి860 జీపీయూ కూడా ఉందట.