Tuesday, May 17, 2016

సేమ్ టు సేమ్!



బిడ్డలు ఎంత ఎదిగినా అమ్మానాన్నలకు చిన్నపిల్లల్లానే అనిపిస్తారు. అలాగే, ఎదిగాక కూడా అమ్మానాన్నల ముందు చిన్నపిల్లలైపోతారు బిడ్డలు. ఇటీవల అనుష్క అలానే చేశారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేసిన ఈ బ్యూటీ బెంగళూరు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేశారు. ఏదో పూజలు కూడా చేశారట. హాలీడే ట్రిప్ చివరి రోజున అమ్మానాన్నతో సరదాగా అనుష్క సెల్ఫీ దిగారు. కూతురు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టమంటే అనుష్క తల్లితండ్రులు ప్రఫుల్ల, విఠల్‌లు సరిగ్గా అలానే ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ దాదాపు సేమ్ టు సేమ్ ఉన్నాయి కదూ.

లాస్ట్ ప్లేస్ నాదే అంటున్న రకుల్

 ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ అంటే.. హీరోతో ప్రేమ వ్యవహారాల కోసమే అన్నట్లుంటారు. తమ కెరీర్ మొత్తంలో ఒకటీ అరా మినహాయిస్తే.. మంచి రోల్స్ దొరికే ఛాన్సులు తక్కువ. అందరూ ఇదే దారిలో లేకపోయినా.. మెజారిటీ హీరోయిన్లు ఇదే బాపతు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు లవ్ అంటే చాలా చిన్న చూపు అంటోంది.

'ప్రేమ నా దృష్టిలో చాలా చిన్న విషయం. అసలు నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వను' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గత నెలలో రిలీజ్ అయిన సరైనోడులో చెప్పుకోదగ్గ పాత్ర చేసిన రకుల్.. . ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలతోపాటు.. ఓ హిందీ చిత్రంలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ కుర్ర హీరోయిన్ ని.. ప్రేమపై అభిప్రాయమేంటి అని అడిగితే 'అసలు  ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కూల్లో చదివే టైంలో ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు. నేనేంటి? ప్రేమించడం ఏంటి? అంటూ పెద్ద క్లాస్ తీసుకొన్నాను. అయితే కాలేజీ రోజుల్లో మాత్రం నా వెంట పడే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటబడ్డా నేను పట్టించుకోలేదు.' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

అసలు టైం వేస్ట్ చేయడం తనకు నచ్చదని.. స్కూల్లో చదివే టైంలో అయితే.. చదువులోనే కాదు ఆట పాటల్లోనూ నాకే ఫస్ట్ ర్యాంక్ అంటోంది ఈ భామ. అందరికంటే ముందుండాలి అని కోరుకొనే తత్వమే.. తనను ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రేమలో మాత్రం తనది లాస్ట్ ప్లేసే అంటోంది.

మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు

 బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన బుల్లెట్ రాజా, హమ్ షకల్స్, హ్యాపీ ఎండింగ్, ఫాంటమ్ తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సైఫ్ సినిమాలపై అతని తల్లి, ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా సైఫ్ సినిమాల ఎంపిక సరిగా లేదని షర్మిల అంది.
జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ తనకు కూతురు వంటిదని చెప్పింది. సైఫ్, కరీనాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరన్నప్రశ్నకు.. 'ఇద్దరూ మంచి నటులే' అంటూ నవ్వుతూ సమాధానిమిచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా వెలుగొందిన షర్మిల.. టీమిండియా మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీని వివాహం చేసుకుంది. తన భర్తతో గడిపిన క్షణాలు చిరస్మరణీయమైనవని గుర్తు చేసుకుంది.

Monday, May 16, 2016

మళ్లీ.. 6 సిక్సర్లు బాదేస్తా: యువీ


ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. సాధారణ మ్యాచ్‌ల్లోనే సులభంగా సాధ్యమయ్యే ఫీట్‌ కాదిది. అలాంటిది తొలి టీ20 ప్రపంచకప్‌లోనే బలమైన ఇంగ్లండ్‌ జట్టు బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో సాధించి చూపాడు రెండు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో హీరోగా నిలిచిన యువరాజ్‌. మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా అంటున్నాడు.

మొహాలిలో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌సింగ్‌ (42; 24 బంతుల్లో 3×4, 3×6) తన అద్భుత ఆటతీరుతో సన్‌రైజర్స్‌కు అసాధారణ విజయం అందించి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 179/4 పరుగులు చేసింది. ఛేదనలో రన్‌రేట్‌ పెరిగిపోతున్న దశలో దీపక్‌హుడా (34), బెన్‌కట్టింగ్‌(18) సహకారంతో మొహిత్‌శర్మ బౌలింగ్‌లో సిక్సర్లు బాది యువరాజ్‌ జట్టుకు విజయం అందించాడు.
మ్యాచ్‌ ముగిసిన తర్వాత యువీ క్యాన్సర్‌తో పోరాడుతున్న 17 మంది చిన్నారులతో ముచ్చటించాడు. ఈ సందర్భంలో ఓ చిన్నారి.. మీరు మళ్లీ ఆరు సిక్సర్లు కొడతారా అన్ని ప్రశ్నించగా... ‘నువ్వు ప్రార్థించు.. నేను మళ్లీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా’ అని అన్నాడు. ఐతే అప్పుడు ఆరు సిక్సర్లు ఎలా కొట్టగలిగానో తెలియదనీ, ఆ ఫీట్‌ సాధించి చాలా ఏళ్లు గడిచిందని అన్నాడు.
 

సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా!

కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మొదటి రోజు ఐశ్వర్యా రాయ్ అందర్నీ కనువిందు చేశారు. కానీ, రెండో రోజు మాత్రం మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘సరబ్‌జిత్’ చిత్రం ప్రీమియర్ షో ఆదివారం  జరిగింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆ చిత్రదర్శకుడు ఒమంగ్ కుమార్, చిత్రంలో కీలక పాత్ర చేసిన రిచా చడ్డా తదితరులు వెళ్లారు. ఐష్ నలుపు, బంగారు వర్ణంతో తయారు చేసిన పొడవాటి గౌను వేసుకున్నారు. డ్రెస్‌కి వాడిన మెటీరియల్ కొంచెం మందంగా ఉండటంతో ఆమె బొద్దుగా కనిపించారు.
దాంతో రెండో రోజు మైనస్ మార్కులు పడ్డాయి. మరోవైపు యంగ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశారు. నీలం, నలుపు రంగు చీరలో సోనమ్ చాలా క్యూట్‌గా కనిపించారు. ఫ్యాషన్ విషయంలో ఐష్‌కీ, సోనమ్‌కీ  ఎప్పుడూ... ముఖ్యంగా కాన్స్ ఉత్సవాల్లో పోటీ ఉంటుంది. ఎప్పుడూ సోనమ్‌కే మంచి మార్కులు పడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది.