అద్భుతమైన ఆటతీరుతో పాటు తన
లైఫ్‌స్టైల్‌తో ఎందరో అమ్మాయిలకు
ఆరాధ్యుడయ్యాడు భారత క్రికెటర్
విరాట్ కోహ్లి. బాలీవుడ్ హీరోలతో
సమానంగా క్రేజ్ సంపాదించుకుని
యూత్‌కు ఐకాన్ మారిపోయాడు.
బాలీవుడ్ హీరోయిన్లే అతడితో
డేట్‌కు వెళ్లాలని ఆశపడుతున్నారంటే
అతడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
‘విరాట్
అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అతడిని
ప్రేమిస్తున్నా. దీనిపై అనుష్క
ఏమనుకున్నా నాకు సంబంధం లేదు’
అంటూ కొద్దిరోజుల క్రితం ఐటెం
గర్ల్ రాఖీసావంత్ బహిరంగంగా
కామెంట్ చేసింది. తాజాగా బాలీవుడ్
బ్యూటీ ప్రాచీ దేశాయ్ కూడా
కోహ్లిపై మనసు పారేసుకుంది.
అతడితో డేటింగ్‌కు వెళ్లాలని
ఉందంటూ ‘అజర్’ ప్రచార కార్యక్రమంలో
తన మనసులో మాట బయటపెట్టింది.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న
మరో అందగత్తె నర్గిస్ ఫక్రి..
సచిన్‌తో డిన్నర్ చేయాలని
తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది.
వీరిద్దరూ ‘అజర్’ చిత్రంలో
ఇమ్రాన్ హష్మికి జంటగా నటించారు.
శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల
ముందుకు రానుంది.
ఇమ్రాన్
హష్మీ సినిమాల్లో ప్రధానంగా
ఆకర్షించేవి అదర చుంబన సన్నివేశాలే.
ఆయన సినిమాలు ఎలా ఉన్నా.. ఇమ్రాన్
నటించే చాలాసినిమాల్లో ముద్దు
సన్నివేశాలు మాత్రం కచ్చితంగా
ఉంటాయి. అందుకే ఆయన్ను బీటౌన్‌లో
సీరియల్ కిస్సర్ అంటారు. తాజాగా
ఈ సీరియల్ కిస్సర్.. ముద్దులు
ఎలా పెట్టాలో వివరించే పుస్తకం
రాయబోతున్నాడట.
ఇప్పటికే..
తన కుమారుడు అయాన్ క్యాన్సర్
చికిత్స సమయంలో తాను పడ్డ ఆవేదన..
ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి
ఇమ్రాన్ ‘ది కిస్ ఆఫ్ లైఫ్’
పుస్తకాన్ని రచించి విడుదల
చేశాడు. తాజాగా ముద్దులపై కూడా
ఓ పుస్తకాన్ని రాస్తానంటున్నాడు.
అందుకోసం.. ప్రత్యేకంగా రచనలో
శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.
‘పుస్తకం రచించాలన్న ఆలోచన
మాత్రమే ఉంది. ఇంకా మొదలుపెట్టలేదు.
ప్రస్తుతం నేను ఒప్పుకున్న
సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు
తెలిసి మార్కెట్లో ఇలాంటి అంశంపై
పుస్తకాలు ఏమీ లేవు. కాబట్టి
కచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్‌గా
తీసుకొని పుస్తకం రాయలని భావిస్తున్నా’ని
అన్నాడు.
వెండితెరపై
ముద్దుల వర్షం కురిపించే ఇమ్రానే
వాటిపై పుస్తకం రాస్తే.. అవి
హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం
ఖాయమంటున్నారు సినీ వర్గాలు.
ఎనిమిది నెలలుగా విశ్రాంతి
లేకుండా వరుస షూటింగ్‌లలో పాల్గొంటున్నానని
కథానాయకి సమంత అన్నారు. ఇటీవల
విడుదలైన ‘24’ చిత్ర ప్రచార కార్యక్రమంలో
భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఆమె మాట్లాడారు. ‘సమ్మర్‌లో
వరుసగా నాలుగు (పోలీస్, 24, బ్రహ్మోత్సవం,
అ..ఆ) సినిమాలు ఉన్నాయి. విభిన్న
కథలతో కూడుకున్న ఈ చిత్రాల్లో
నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది’
అన్నారు.
తరువాత
సూర్యతో జంటగా నటించిన ‘24’ గురించి
మాట్లాడారు. ‘24 కథ వింటున్నప్పుడు
ఈగ సినిమా గుర్తొచ్చింది. ఇంత
చిన్న ఈగను ఎలా స్క్రీన్‌పై
చూపిస్తారని అప్పుడు అనిపించింది.
కాలంతో కూడుకున్న ‘24’ కథను ప్రజలకు
అర్థమయ్యేలా ఎలా తీస్తారనే
సందేహం కలిగింది. దర్శకుడు విక్రమ్‌కుమార్
సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో నా పాత్ర చిన్నది
కావచ్చు. కానీ ఈ సినిమాలో నేను
ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇందులో నేను లవ్‌ట్రాక్‌లో
కనిపిస్తాను. ఆ ట్రాక్ చాలా
క్యూట్‌గా ఉంటుంది. కథ చాలా
ఆసక్తిగా సాగుతున్న సమయంలో
నాతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు
రిలీఫ్ ఇస్తాయి. కొత్తగా ఏ
సినిమా ఒప్పుకోలేదు. గత ఎనిమిది
నెలలుగా ఒక్క రోజు కూడా విరామం
లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాను.
కథ బాగా నచ్చితే తప్ప సినిమా
చేయడానికి ఒప్పుకోను. ప్రస్తుతం
‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్నాను.
దాని తరువాత కన్నడ సినిమా ‘యూటర్న్’
రీమేక్‌లో నటిస్తున్నారు’.
‘బ్రహ్మోత్సవం’
ఆడియోలో మీరు మహేశ్‌బాబు కుమార్తె
సితారతో చాలా క్లోజ్‌గా కనిపించారు
అని విలేకరి అడిగిన ప్రశ్నకు
సమంత సమాధానం ఇచ్చారు. ‘మేము
మంచి ఫ్రెండ్స్. సితార నవ్వు,
డ్యాన్స్ సూపర్‌గా ఉంటాయి.
మహేశ్‌బాబులా సితార కూడా మంచి
స్టార్‌గా ఎదుగుతుంది. గౌతమ్,
సితార ఫీచర్‌స్టార్స్’ అని
సమంత పేర్కొన్నారు.
‘దేవుడా.. శ్రుతీహాసన్‌కి పెళ్లయ్యిందా? ఏం పాపం చేశామని ఇప్పుడే పెళ్లి
చేసేసుకుంది. ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తుందా? లేదా.. కొంపతీసి
సినిమాలు మానేసే ఉద్దేశం ఏమీ లేదు కదా’ అని శ్రుతీహాసన్ అభిమానులు తెగ
ఫీలైపోయారు. వీళ్లు ఇంతగా బాధపడిపోవడానికి కారణం, సరదాగా శ్రుతీహాసన్ తన
ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్. ‘లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్’ అంటూ
శ్రుతి ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారమే
చెలరేగింది.
అది చూసి, ఆమె అభిమానులందరూ చెలరేగిపోయారు. ‘మీకు పెళ్లయిందా...? అతను మీ
భర్తా... ఇంతకన్నా హ్యాండ్‌సమ్ పర్సన్ మీకు భర్తగా వస్తాడు కదా... ఇంత
తొందరపడ్డారేంటి?’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రుతీహాసన్
‘‘నాకస్సలు పెళ్లి కాలేదు.. నిజం చెబుతున్నా... నన్ను నమ్మండి. సరదాగా
చేసిన ట్వీట్ అది’’ అని పోస్ట్ పెట్టడంతో అభిమానులు శాంతించారు.
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్,
కంగనా రనౌత్‌ల మధ్య వివాదం ఇంకా
ఏమీ తేలనే లేదు. మరో పక్క దాని
ప్రభావం మాత్రం ఇతరుల మీద బాగానే
పడుతోంది. తాజాగా ఈ విషయమై విద్యాబాలన్
స్పందన ఆమె భర్త సిద్దార్థ్
రాయ్ కపూర్‌కి ఇబ్బందికరంగా
పరిణమించింది. విషయమేమిటంటే..
తీన్ చిత్ర ప్రచార కార్యక్రమం
సందర్భంగా మీడియా కంగనా విషయంలో
స్పందించాల్సిందిగా విద్యాబాలన్‌ను
కోరింది.
ఇతరుల
గురించి మాట్లాడడం మర్యాద కాదంటూనే
కంగనా ధైర్యాన్ని మెచ్చుకుంది
విద్య. ఆమె తనకు తాను మద్దతుగా
నిలబడి పోరాడడం తనకు నచ్చిందని,
ఈ విషయంలో కంగనాని అభినందిస్తున్నానని
విద్య పేర్కొంది. సాధారణంగా
మహిళలు కుటుంబంలో వారందరి కోసం
పోరాడడం చూస్తాం కానీ ఇలా తమకోసం
తాము ధైర్యంగా నిలబడడం అరుదని
పేర్కొంది.
విద్య
అలా కంగనాకి మద్దతిస్తున్నట్లుగా
మాట్లాడటం భర్త సిద్దార్థ్‌కి
ఇబ్బందికరంగా మారిందట. ఎందుకంటే
హృతిక్ నటిస్తున్న కాబిల్
చిత్రానికి సిద్దార్థ్ నిర్మాతగా
వ్యవహరిస్తున్నాడు. అందులోనూ
ఓ నిర్మాతగా నటీనటులందరితో
కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ వివాదంతో హృతిక్‌కి,
తనకి మధ్య ఎక్కడ అభిప్రాయభేదాలు
వస్తాయోనని సిద్దార్థ్ కంగారుపడుతున్నాడని
బాలీవుడ్ సమాచారం.
‘జబర్‌దస్త్’ షోలో తనదైన యాంకరింగ్
శైలితో అందరినీ అలరించింది
రష్మి గౌతమ్. ఇటీవల ‘గుంటూరు
టాకీస్’లో కథానాయికగా ప్రేక్షకుల
ముందుకు వచ్చిన ఈ బ్యూటీ హాట్‌హాట్
అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.
ఇప్పుడు ‘చారుశీల’ చిత్రంతో
ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు
సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్
కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు.
కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై
రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని
రాజీవ్ తన ఫేస్‌బుక్ ఖాతా
ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘చారుశీల షూటింగ్‌లో రష్మి
నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ
ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని’
అంటూ రాజీవ్ పోస్ట్ చేశారు.
ఈ చిత్రంలో
రాజీవ్ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు
కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి
కారణం ఏమిటా అని నెటిజెన్లు
ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరిగిందో
రష్మినే చెప్పాలి మరి. ఇంకా
ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి.
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు
చిన్న సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘బాహుబలి’లో ఐటమ్
సాంగ్‌కి ముందు సీన్లో కాసేపు కనిపించారు. ఇప్పుడు నాని సినిమాలో
కనిపించడానికి రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా
మారింది. నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ
చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ దర్శకుడికి
అసిస్టెంట్ డెరైక్టర్ పాత్రలోకనిపించనున్నారు. ఆ దర్శకుడి పాత్రలో
కనిపించమని రాజమౌళిని అడిగితే, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
నాని హీరోనా... విలనా...? అంటూ ప్రేక్షకులకు పెద్ద పజిల్ ఇచ్చేశారు
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అదేంటీ అనుకుంటున్నారా? ఆయన దర్శకత్వంలో
నాని హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘జెంటిల్‌మన్’ సినిమా టైటిల్‌కి
‘హీరోనా? విలనా?’ అని ట్యాగ్‌లైన్ పెట్టిన విషయం గుర్తు చేయక్కర్లేదు.
మరి.. ఈ జెంటిల్‌మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి
తెలుసుకోవాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్
ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘ఈ నెల 12న టీజర్‌ను, 22న
పాటలను విడుదల చే యనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని
తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్,
సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా.