‘దేశముదురు’లో
సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించేసింది.
దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా
తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన
చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి.
ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి
ఇది కొనసాగింపు. సిద్ధార్థ్, త్రిష, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన
ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘చంద్రకళ’కి
కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా.
ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు?
అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష,
పూనమ్, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని
వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం.
ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి
దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా
చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని
చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే
మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
* నటిగా
నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే
అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే
నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా
అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా.
* ఖాళీ
సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్ పట్టుకొని...
కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే
ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన
నిర్వహించాలని ఉంది.
* నాకు
తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ)
నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని.
సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్ అయ్యా.
నా వ్యక్తిగత
విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి
మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి
వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి
కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి.
తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది.
మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం
సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన
ఆసీస్ 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్
ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్
వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5),ఫాల్కనర్ (10)లు నిరాశపరచడంతో
ఆసీస్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై
బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా
బౌలర్లలో బూమ్రా వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు
తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్
నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా
ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90
నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా,
అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.
ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే
క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ
జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు
వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.
అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి
దిగింది. ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా
కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల
భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే
చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్
ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188
పరుగులు చేసింది.
తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ
మంచి గుర్తింపు తెచ్చుకున్న
నటి అసిన్ మైక్రోమ్యాక్స్
సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను
ఇటీవల వివాహం చేసుకున్న సంగతి
తెలిసిందే. వీరి వెడ్డింగ్
రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
సినీ నటులు అక్షయ్‌కుమార్,
సుస్మితా సేన్, జాక్వెలిన్
ఫెర్నాండెంజ్, ఖుష్భు, రానా,
వెంకటేశ్, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర,
ప్రీతీ జింటా, మనీష్ పాల్,
మాధవన్ తదితరులు హాజరై సందడి
చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు
తెలిపారు. ఈ సందర్భంగా దిగిన
ఫొటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్
ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్ , తమిళ సూపర్ స్టార్
రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్ , ఈనాడు
సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ
లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను
అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ
ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి
పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ
నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ
వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం
చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు.
అవార్డులకు ఎంపికైన వారి వివరాలు..
పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్ మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ
గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం),
విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే
(సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్
పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ
కాగ్), బ్రిజేందర్ సింగ్, బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, రామ్ సుతార్,
ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్
పద్మశ్రీ: రాజమౌళి, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ
గత రెండు
ఐపీఎల్ సీజన్లలోనూ రూ.15 కోట్లకు పైగా ధర దక్కించుకుని లీగ్‌లోనే
అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్ సింగ్. నిరుడు
అతణ్ని ఎంచుకున్న దిల్లీ ఈసారికి అతణ్ని వదిలేసింది. దీంతో మళ్లీ అతను వేలంలోకి
రాబోతున్నాడు. ఈసారి యువీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు.
యువీతో పాటు కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా, దినేశ్
కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శాంసన్, ధవల్ కులకర్ణి, మైకేల్ హసిలు
కూడా రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. ఫిబ్రవరి 5న వేలం నిర్వహిస్తారు.
వేలంలోకి రానున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
కనీస విలువ రూ. 2 కోట్లు: యువరాజ్ సింగ్, పీటర్సన్,
వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్
బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి.
రూ. 1.5 కోట్లు: డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్.
రూ. 1 కోటి: ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌతీ.
రూ. 50 లక్షలు: మార్టిన్ గప్టిల్, జాసన్ హోల్డర్, బరీందర్ శరణ్
‘24’ చిత్రంలో నటుడు
సూర్య సరికొత్త లుక్ విడుదల
అయ్యింది. సైన్స్ ఫిక్షన్
థ్రిలర్ నేపథ్యంలో రూపొందుతున్న
ఈ చిత్రంలో ఇప్పటి వరకు విడుదలైన
సూర్య పోస్టర్లు ప్రేక్షకుల్లో
ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్‌తో
ఈ సినిమాలో సూర్య నటనపై అంచనాలు
మరింత పెరిగే అవకాశం ఉంటుందని
సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా
నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు
విక్రమ్ కుమార్ దర్శకత్వం
వహిస్తున్నారు. సంగీత దర్శకుడు
ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా
విజృంభించాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే
చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్
అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. నటుడు
అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో
ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఈ చిత్రంలో ఆదా
శర్మ, అడివి శేష్ కూడా నటించారు. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది.
షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు 'బాహుబలి' ప్రభాస్. ఈ
ఏడాది పెళ్లి చేసుకుంటానని పెదనాన్న కృష్ణంరాజుకు ఈ ఛోటా రెబల్ స్టార్
హామీ కూడా ఇచ్చాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అన్ని విధాల తగిన వధువు కోసం
అన్వేషణ కూడా మొదలుపెట్టారు. 'బాహుబలి-2' షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రభాస్
పెళ్లిపీటలు ఎక్కుతాడని తెలుస్తోంది.
మరోవైపు 'భల్లాలదేవ' రాణా కూడా తనవంతుగా 'బాహుబలి'కి వధువును వెతికే పని
పెట్టుకున్నాడు. ఓపక్క 'బాహుబలి' ప్రభాస్ గుణగణాలు వివరిస్తూనే.. మరోపక్క ఈ
'బాహుబలి'కి తగిన అవంతిక (అంటే వధువు) ఎలా ఉండాలో కొంత సరదాగా, కొంత
వ్యంగ్యంగా వివరిస్తూ 'పెళ్లి ప్రకటన'ను ట్విట్టర్‌లో జారీ చేశాడు.
ఊహించినట్టే 'బాహుబలి' వధువు కోసం భల్లాల ఇచ్చిన ఈ ప్రకటన ట్విట్టర్‌లో
హల్‌చల్ చేస్తోంది. రాణా పెట్టిన ఆ ప్రకటన ఇది..
బహుబలి కోసం వధువు కావాలెను!
-
వరుడు 36 ఏళ్ల యుద్ధయోధుడు, సంచార తెగకు చెందిన సైనిక నాయకుడు..
-
6.2 అడుగుల ఎత్తుతో మాంఛీ బలిష్టంగా ఉండి ఇంట్లో పనులకు బాగా ఉపయోగపడతాడు..
-
తనతో పెళ్లికి సరిపోయే అమ్మాయి కనిపిస్తే చాలు కొండలు, గుట్టలు ఎక్కుతాడు. కానీ అమ్మాయిల వెంటపడే ఆకతాయి కాదు.
-
మేకప్ బాగావేస్తాడు. వధువుకు కూడా బాగా మేకప్ చేయగలడు
ఇక వధువు విషయానికొస్తే
-
అమ్మాయి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండాలి.
-
ఎంతగా అంటే.. ఆమె కోసం అడవులు, కొండలు, కొండచరియలు సైతం గాలించగలగాలి
-
కత్తియుద్ధం, విలువిద్యతోపాటు ముఖాముఖి మల్లయుద్ధం సైతం తెలిసి ఉండాలి
-
ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తను గౌరవించేదై ఉండాలి
-
ఇంటిపనుల్లోనే కాదు సైనిక వ్యూహాల్లో, శత్రువును చిత్తుచేసే ఎత్తుల్లో కూడా భర్తకు సాయం చేయగలగాలి.