బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా
విజృంభించాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే
చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్
అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. నటుడు
అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో
ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఈ చిత్రంలో ఆదా
శర్మ, అడివి శేష్ కూడా నటించారు. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది.
షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Thursday, January 21, 2016
బాహుబలికి వధువు కోసం భల్లాల ప్రకటన!
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు 'బాహుబలి' ప్రభాస్. ఈ
ఏడాది పెళ్లి చేసుకుంటానని పెదనాన్న కృష్ణంరాజుకు ఈ ఛోటా రెబల్ స్టార్
హామీ కూడా ఇచ్చాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అన్ని విధాల తగిన వధువు కోసం
అన్వేషణ కూడా మొదలుపెట్టారు. 'బాహుబలి-2' షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రభాస్
పెళ్లిపీటలు ఎక్కుతాడని తెలుస్తోంది.
మరోవైపు 'భల్లాలదేవ' రాణా కూడా తనవంతుగా 'బాహుబలి'కి వధువును వెతికే పని పెట్టుకున్నాడు. ఓపక్క 'బాహుబలి' ప్రభాస్ గుణగణాలు వివరిస్తూనే.. మరోపక్క ఈ 'బాహుబలి'కి తగిన అవంతిక (అంటే వధువు) ఎలా ఉండాలో కొంత సరదాగా, కొంత వ్యంగ్యంగా వివరిస్తూ 'పెళ్లి ప్రకటన'ను ట్విట్టర్‌లో జారీ చేశాడు. ఊహించినట్టే 'బాహుబలి' వధువు కోసం భల్లాల ఇచ్చిన ఈ ప్రకటన ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. రాణా పెట్టిన ఆ ప్రకటన ఇది..
బహుబలి కోసం వధువు కావాలెను!
ఇక వధువు విషయానికొస్తే

- వరుడు 36 ఏళ్ల యుద్ధయోధుడు, సంచార తెగకు చెందిన సైనిక నాయకుడు..
- 6.2 అడుగుల ఎత్తుతో మాంఛీ బలిష్టంగా ఉండి ఇంట్లో పనులకు బాగా ఉపయోగపడతాడు..
- తనతో పెళ్లికి సరిపోయే అమ్మాయి కనిపిస్తే చాలు కొండలు, గుట్టలు ఎక్కుతాడు. కానీ అమ్మాయిల వెంటపడే ఆకతాయి కాదు.
- మేకప్ బాగావేస్తాడు. వధువుకు కూడా బాగా మేకప్ చేయగలడు
ఇక వధువు విషయానికొస్తే
- అమ్మాయి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండాలి.
- ఎంతగా అంటే.. ఆమె కోసం అడవులు, కొండలు, కొండచరియలు సైతం గాలించగలగాలి
- కత్తియుద్ధం, విలువిద్యతోపాటు ముఖాముఖి మల్లయుద్ధం సైతం తెలిసి ఉండాలి
- ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తను గౌరవించేదై ఉండాలి
-
ఇంటిపనుల్లోనే కాదు సైనిక వ్యూహాల్లో, శత్రువును చిత్తుచేసే ఎత్తుల్లో కూడా భర్తకు సాయం చేయగలగాలి.
Wednesday, January 20, 2016
అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నా!
నయనతార సినిమాల్లో తప్ప, బయట ఫంక్షన్లలోనూ ఇతర వేడుకల్లోనూ ఎక్కడా కనబడరు.
ఏడాదికి మహా అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా అవార్డు ఫంక్షన్‌లోనో, ఆడియో
ఫంక్షన్‌లోనో మెరుస్తారు. అంతకు మించి పబ్లిక్‌గా ఆమె దర్శనాలు ఉండవు.
ఆమెకు స్నేహితులు కూడా చాలా చాలా తక్కువ. ఇంత పెద్ద సినీ ప్రపంచంలో తక్కువ
మంది స్నేహితులు ఉండటమేంటి? నయనతారకు ఫ్రెండ్‌షిప్ చేయడం ఇష్టం ఉండదా?... ఈ
విషయం గురించి ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ -‘‘స్నేహితులు ఉండాలని
అందరికీ ఉంటుంది. స్నేహం చేయడం నాకిష్టమే. కానీ, కొంతమంది స్నేహితుల
కారణంగా బాధపడ్డాను. నా ముందు ఒకలా.. నా వెనకాల మరోలా మాట్లాడేవాళ్లు.
అలాంటి స్నేహితుల అవసరం లేదనిపించింది.
అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నాను. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నిజాయతీగా వ్యవహరిస్తాను. నాతో స్నేహం చేసేవాళ్లు కూడా అలానే ఉండాలని ఆశిస్తాను. లేకపోతే బాధపడిపోతాను. చివరకు వాళ్లతో స్నేహాన్ని వదిలేసుకుంటాను’’ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఒక విధంగా వరం.. మరో విధంగా శాపం అని కూడా నయనతార అన్నారు. ‘‘నాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండేవాళ్లు నన్ను ఇష్టపడతారు. లేనివాళ్లు తిట్టుకుంటారు. అందుకే, ముక్కుసూటితనం వరం.. శాపం.. అంటున్నా’’ అని పేర్కొన్నారామె.

ఆసీస్‌తో నాలుగో వన్డేలోనూ భారత్ ఓటమి
ధావన్, కోహ్లి శతకాలు వృథా
సిరీస్ 4-0తో ఆసీస్ ఆదిక్యం
రిచర్డ్‌సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎంపికయ్యాడు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 348 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో దూకుడుగా ఆరంభించిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు అలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 25 బంతులల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు సహయంతో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌గా కోహ్లి వచ్చాడు. దావన్, కోహ్లీ రెండో వికెట్లు 212 పరుగులు భాగ్యస్వామం నెలకొల్పారు. ఇద్దరు సెంచరీలతో కదం తోక్యారు. శిఖర్ ధావన్ 113 బంతులల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 92 బంతులల్లో 11 పోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు చేశారు. వీరిద్దరు దూకుడు అడుతుంటే మ్యాచ్ అవలోకగా గేలుస్తుందని బావించారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. ధావన్ అవుట్ అయినా తరువాత భారత్ బ్యాటింగ్ తడబడుతు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో నిలిచింది. కెప్టెన్ ధోఁ (0), గురకీరత్ ( 5), రహనే (2), రిషి ధావన్ ( 9), భువనేశ్వర్ (2), ఉమేష్ యాదవ్ (2), ఇషాత్ శర్మ (0) రెండంకెల స్కోరు కూడ చేయలేక పెవిలియకు క్యూ కట్టారు. చివరిగా జడేజా (24) అజేయంగా నిలిచిన జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్ 5, హెస్టింగ్ 2, మార్ష్ 2, లియాన్ ఒక వికెటు లభించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్ తొలి వికెటుకు ఏకంగా 187 పరుగుల బ్యాగస్వామం చేశారు. ఆరోన్ ఫించ్ 107 బంతులల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేశారు. మరో ఓపెనర్ డెవిడ్ వార్నర్ 92 బంతులల్లో 12 పోర్లు, 1 సిక్స్‌తో 93 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ కేవలం 29 బంతులల్లో 4 పోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్స్ (33), బెయిల్ (10), ఫాల్కనర్ (0), వెడ్ (0) పరుగులు చేశారు. చివరిలో మాక్స్‌వెల్ 20 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేశారు. బారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.

ప్రభాస్ నాకు మాట ఇచ్చాడు!
‘‘మంచి పాత్రలిస్తే నటించడానికి ఇప్పటికీ సిద్ధమే. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘రుద్రమదేవి’లో నేను చేసిన పాత్రలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. మరీ ముఖ్యంగా రామయ్య పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ కంట కనిపెడుతున్నా. వాటిలో ‘భలే భలే మగాడివోయ్’ నాకు బాగా నచ్చింది. కథానాయకుడిగా ఓ స్థాయిలో ఉన్న నాని, అలాంటి పాత్ర ఎంచుకోవడమే గొప్ప విషయం. నేను హీరోగా ఫామ్‌లో ఉన్న రోజుల్లో అయితే ఆ పాత్ర చేయకపోదునేమో? కథలు, పాత్రలు సమాజంలోంచి పుట్టాలి. అప్పుడే ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతాయి’’
గర్వంగా ఉంది
‘‘బాహుబలి’తో ప్రభాస్ స్థాయి పెరిగింది. తెలుగు సినిమా గురించి అమెరికాలోనూ గొప్పగా చెప్పుకొంటున్నారు. ‘ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు’ అని పిలుస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ప్రభాస్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తా. గోపీకృష్ణ సంస్థలోనే ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమవుతోంది. ప్రేమకథలో ప్రభాస్ తరహా యాక్షన్ జోడిస్తున్నాం. దర్శకుడెవరనేది త్వరలో చెబుతా. అందులో నేను నటిస్తానా, లేదా అన్నది కథని బట్టి ఉంటుంది. ‘ఒక్క అడుగు’ స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. కానీ దేనికైనా సమయం రావాలి’’.
ప్రభాస్ పెళ్లి..
‘‘బాహుబలి’ తరవాత పెళ్లి చేసుకొంటా అన్నాడు ప్రభాస్. ‘బాహుబలి’ వచ్చింది, వెళ్లిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ తరవాత చేసుకొంటా అంటున్నాడు. అందుకే మొన్న సంక్రాంతికి ప్రభాస్ దగ్గర మాట తీసుకొన్నా. ‘తప్పకుండా 2016లోనే పెళ్లి చేసుకొంటా పెదనాన్నా’ అని ఒట్టేశాడు.
ఈ యేడాది తప్పకుండా పెళ్లి కబురు వింటారు. అయితే ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది నేను చెప్పలేను. మేమే ఓ సంబంధం చూడాలనుకొంటున్నాం. తన మనసులో ఏముందో?’’
మినీ థియేటర్లు రావాలి
‘‘చిన్న సినిమాల్ని కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించాలి. ఆ పరిజ్ఞానాన్ని మనమే దిగుమతి చేసుకోవాలి. విదేశీ నిపుణులపై ఆధారపడే పరిస్థితి రాకూడదు. వంద, నూట యాభై మంది చూసేలా మినీ థియేటర్ల నిర్మాణం జరగాలి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 14 లక్షలమందికీ ఓ థియేటర్ ఉంది. అందుకే ఓ బృందం ద్వారా మినీథియేటర్లపై పరిశోధన చేయిస్తున్నా. ఇక రాజకీయాల విషయానికొస్తే... ప్రస్తుతం భాజపాలోనే ఉన్నా. ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగి ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలీదు. 2019 నాటికి నాలో ఓపిక ఉండకపోవచ్చు. ఎన్నికల ప్రచారం అంటే... చాలా హంగామా ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కనీసం 400 గ్రామాలైనా పర్యటించాలి. అంతలా తిరగలేనేమో అనిపిస్తోంది’’
Tuesday, January 19, 2016
అసిన్ పెళ్లికూతురాయెనే..!
తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన అందాల తార
అసిన్ వివాహం మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో మంగళవారం
ఉదయం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్ లో
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. గత కొంతకాలంగా
రాహుల్, అసిన్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం
క్రైస్తవ ఆచారం ప్రకారం జరిగిన పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు
సమాచారం.
సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ
డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ప్రత్యేకంగా
తయారుచేయిస్తున్న పది వరుసల ఎత్తున్న కేకును దంపతులు కట్ చేయనున్నారు. ఇక
పెళ్లి విందులో పూర్తి శాఖాహార భోజనం వడ్డించనున్నారు. అలాగే ఫిల్మ్
ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో జనవరి 23న ముంబైలో వీరి వివాహ రిసెప్షన్
జరుగనుంది.
Monday, January 18, 2016
టీ20 హీరోలు యూవీ = క్రిస్ గేల్ సమం
టీ20లో వేగవంతమైన అర్థశతకం రికార్డు సమం
క్రికెట్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు నిమిషాలో, రోజుల్లోనే గడిచిపోతుంటాయి. మరికొన్ని తరాలు మారినా, ఏళ్లు, దశాబ్దాలు గడిచినా చెక్కు చెదరగకుండా చరిత్ర పుటల్లో నిలిచి ఉంటాయి. అలాంటి వాటిల్లో భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ 2007లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సృష్టించి అరుదైన 12 బంతుల్లో అర్థ శతకం రికార్డు. 2007 సెప్టెంబర్ 19న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఫ్లింటాప్ బౌలింగ్ సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్‌తో వాగ్వాదాఁకి దిగాడు. దీఁపై యూవీ ఘాటుగా స్పందించాడు. ఫ్లింటాప్ తర్వాత బౌలింగ్‌కు వచ్చాన స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచేశాడు. 12 బంతులల్లో3/4,6/6 సాయంతో 50 పరుగులు చేసి టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ రికాడ్డు సమీపంలోకి చాలా మంది క్రికెటర్లు వచ్చినా దాన్ని బద్దలు కొట్టలేకపోయారు.
వెస్టిండీస్ వీరుడు సమం చేశాడు...?
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ టీ20 టోర్నీలో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ రికార్డును సమం చేశాడు. టోర్నీలో మెల్‌బోర్న్ రెఁగేడ్స్ తరపున బరిలోకి దిగిన క్రిస్‌గేల్ 12 బంతులల్లో 1/4, 7/6 సాయంతో 50 పరుగులు చేశాడు.

ఆ కుటుంబాన్ని కలవడం ఆనందం: నాగార్జున
బాలీవుడ్ నటుడు
అమితాబ్ బచ్చన్ దంపతులను
కలవడం ఎప్పటికీ ఆనందమేనని నాగార్జున
అన్నారు. ఓ వాణిజ్య సంస్థ ప్రకటన
షూటింగ్‌లో భాగంగా నటుడు ప్రభుతోపాటు
అమితాబ్, జయ బచ్చన్‌లను కలిసిన
ఫొటోను నాగార్జున తన ట్విట్టర్
ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు,
అమితాబ్, జయ బచ్చన్‌లను కలవడం
ఆల్‌వేస్ ప్లెజర్ అంటూ ట్వీట్
చేశారు. అదేవిధంగా వారితో దిగిన
ఓ ఫొటోను పోస్ట్ చేశారు. గతంలో
కూడా నాగార్జున బిగ్‌బి అమితాబ్‌తో
కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో
నటించిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Posts (Atom)