Wednesday, January 20, 2016

అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నా!

  నయనతార సినిమాల్లో తప్ప, బయట ఫంక్షన్లలోనూ ఇతర వేడుకల్లోనూ ఎక్కడా కనబడరు. ఏడాదికి మహా అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా అవార్డు ఫంక్షన్‌లోనో, ఆడియో ఫంక్షన్‌లోనో మెరుస్తారు. అంతకు మించి పబ్లిక్‌గా ఆమె దర్శనాలు ఉండవు. ఆమెకు స్నేహితులు కూడా చాలా చాలా తక్కువ. ఇంత పెద్ద సినీ ప్రపంచంలో తక్కువ మంది స్నేహితులు ఉండటమేంటి? నయనతారకు ఫ్రెండ్‌షిప్ చేయడం ఇష్టం ఉండదా?... ఈ విషయం గురించి ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ -‘‘స్నేహితులు ఉండాలని అందరికీ ఉంటుంది. స్నేహం చేయడం నాకిష్టమే. కానీ, కొంతమంది స్నేహితుల కారణంగా బాధపడ్డాను. నా ముందు ఒకలా.. నా వెనకాల మరోలా మాట్లాడేవాళ్లు. అలాంటి స్నేహితుల అవసరం లేదనిపించింది.
                      అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నాను. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నిజాయతీగా వ్యవహరిస్తాను. నాతో స్నేహం చేసేవాళ్లు కూడా అలానే ఉండాలని ఆశిస్తాను. లేకపోతే బాధపడిపోతాను. చివరకు వాళ్లతో స్నేహాన్ని వదిలేసుకుంటాను’’ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఒక విధంగా వరం.. మరో విధంగా శాపం అని కూడా నయనతార అన్నారు. ‘‘నాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండేవాళ్లు నన్ను ఇష్టపడతారు. లేనివాళ్లు తిట్టుకుంటారు. అందుకే, ముక్కుసూటితనం వరం.. శాపం.. అంటున్నా’’ అని పేర్కొన్నారామె.

ఆసీస్‌తో నాలుగో వన్డేలోనూ భారత్‌ ఓటమి

ధావన్‌, కోహ్లి శతకాలు వృథా
సిరీస్‌ 4-0తో ఆసీస్‌ ఆదిక్యం
రిచర్డ్‌సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఎంపికయ్యాడు



భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 348 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో దూ
కుడుగా ఆరంభించిన భారత్‌ 49.2 ఓవర్లలో 323 పరుగులకు అలౌట్‌ అయ్యింది. రోహిత్‌ శర్మ 25 బంతులల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు సహయంతో 41 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా కోహ్లి వచ్చాడు. దావన్‌, కోహ్లీ రెండో వికెట్లు 212 పరుగులు భాగ్యస్వామం నెలకొల్పారు. ఇద్దరు సెంచరీలతో కదం తోక్యారు. శిఖర్‌ ధావన్‌ 113 బంతులల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ 92 బంతులల్లో 11 పోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు చేశారు. వీరిద్దరు దూకుడు అడుతుంటే మ్యాచ్‌ అవలోకగా గేలుస్తుందని బావించారు. కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది. ధావన్‌ అవుట్‌ అయినా తరువాత భారత్‌ బ్యాటింగ్‌ తడబడుతు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో నిలిచింది. కెప్టెన్‌ ధోఁ (0), గురకీరత్‌ ( 5), రహనే (2), రిషి ధావన్‌ ( 9), భువనేశ్వర్‌ (2), ఉమేష్‌ యాదవ్‌ (2), ఇషాత్‌ శర్మ (0) రెండంకెల స్కోరు కూడ చేయలేక పెవిలియకు క్యూ కట్టారు. చివరిగా జడేజా (24) అజేయంగా నిలిచిన జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్‌ 5, హెస్టింగ్‌ 2, మార్ష్‌ 2, లియాన్‌ ఒక వికెటు లభించింది.
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచు
కుది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌ తొలి వికెటుకు ఏకంగా 187 పరుగుల బ్యాగస్వామం చేశారు. ఆరోన్‌ ఫించ్‌ 107 బంతులల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ 92 బంతులల్లో 12 పోర్లు, 1 సిక్స్‌తో 93 పరుగులు చేసి సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కేవలం 29 బంతులల్లో 4 పోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మిచెల్‌ మార్స్‌ (33), బెయిల్‌ (10), ఫాల్కనర్‌ (0), వెడ్‌ (0) పరుగులు చేశారు. చివరిలో మాక్స్‌వెల్‌ 20 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేశారు. బారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4, ఉమేష్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశారు.

ప్రభాస్‌ నాకు మాట ఇచ్చాడు!

 
‘‘మంచి పాత్రలిస్తే నటించడానికి ఇప్పటికీ సిద్ధమే. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘రుద్రమదేవి’లో నేను చేసిన పాత్రలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. మరీ ముఖ్యంగా రామయ్య పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ కంట కనిపెడుతున్నా. వాటిలో ‘భలే భలే మగాడివోయ్‌’ నాకు బాగా నచ్చింది. కథానాయకుడిగా ఓ స్థాయిలో ఉన్న నాని, అలాంటి పాత్ర ఎంచుకోవడమే గొప్ప విషయం. నేను హీరోగా ఫామ్‌లో ఉన్న రోజుల్లో అయితే ఆ పాత్ర చేయకపోదునేమో? కథలు, పాత్రలు సమాజంలోంచి పుట్టాలి. అప్పుడే ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతాయి’’
గర్వంగా ఉంది
‘‘బాహుబలి’తో ప్రభాస్‌ స్థాయి పెరిగింది. తెలుగు సినిమా గురించి అమెరికాలోనూ గొప్పగా చెప్పుకొంటున్నారు. ‘ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు’ అని పిలుస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ప్రభాస్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తా. గోపీకృష్ణ సంస్థలోనే ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమవుతోంది. ప్రేమకథలో ప్రభాస్‌ తరహా యాక్షన్‌ జోడిస్తున్నాం. దర్శకుడెవరనేది త్వరలో చెబుతా. అందులో నేను నటిస్తానా, లేదా అన్నది కథని బట్టి ఉంటుంది. ‘ఒక్క అడుగు’ స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. కానీ దేనికైనా సమయం రావాలి’’.
ప్రభాస్‌ పెళ్లి..
‘‘బాహుబలి’ తరవాత పెళ్లి చేసుకొంటా అన్నాడు ప్రభాస్‌. ‘బాహుబలి’ వచ్చింది, వెళ్లిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ తరవాత చేసుకొంటా అంటున్నాడు. అందుకే మొన్న సంక్రాంతికి ప్రభాస్‌ దగ్గర మాట తీసుకొన్నా. ‘తప్పకుండా 2016లోనే పెళ్లి చేసుకొంటా పెదనాన్నా’ అని ఒట్టేశాడు.
ఈ యేడాది తప్పకుండా పెళ్లి కబురు వింటారు. అయితే ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది నేను చెప్పలేను. మేమే ఓ సంబంధం చూడాలనుకొంటున్నాం. తన మనసులో ఏముందో?’’
మినీ థియేటర్లు రావాలి
‘‘చిన్న సినిమాల్ని కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించాలి. ఆ పరిజ్ఞానాన్ని మనమే దిగుమతి చేసుకోవాలి. విదేశీ నిపుణులపై ఆధారపడే పరిస్థితి రాకూడదు. వంద, నూట యాభై మంది చూసేలా మినీ థియేటర్ల నిర్మాణం జరగాలి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 14 లక్షలమందికీ ఓ థియేటర్‌ ఉంది. అందుకే ఓ బృందం ద్వారా మినీథియేటర్లపై పరిశోధన చేయిస్తున్నా. ఇక రాజకీయాల విషయానికొస్తే... ప్రస్తుతం భాజపాలోనే ఉన్నా. ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగి ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలీదు. 2019 నాటికి నాలో ఓపిక ఉండకపోవచ్చు. ఎన్నికల ప్రచారం అంటే... చాలా హంగామా ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కనీసం 400 గ్రామాలైనా పర్యటించాలి. అంతలా తిరగలేనేమో అనిపిస్తోంది’’

Tuesday, January 19, 2016

అసిన్‌ పెళ్లికూతురాయెనే..!

 తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన అందాల తార అసిన్ వివాహం మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్ లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. గత కొంతకాలంగా రాహుల్, అసిన్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం క్రైస్తవ ఆచారం ప్రకారం జరిగిన పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.                       సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న పది వరుసల ఎత్తున్న కేకును దంపతులు కట్ చేయనున్నారు. ఇక పెళ్లి విందులో పూర్తి శాఖాహార భోజనం వడ్డించనున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో జనవరి 23న ముంబైలో వీరి వివాహ రిసెప్షన్ జరుగనుంది.

Monday, January 18, 2016

టీ20 హీరోలు యూవీ = క్రిస్‌ గేల్‌ సమం

టీ20లో వేగవంతమైన అర్థశతకం రికార్డు సమం
 


క్రికెట్‌ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు నిమిషాలో, రోజుల్లోనే గడిచిపోతుంటాయి. మరికొన్ని తరాలు మారినా, ఏళ్లు, దశాబ్దాలు గడిచినా చెక్కు చెదరగకుండా చరిత్ర పుటల్లో నిలిచి ఉంటాయి. అలాంటి వాటిల్లో భారత బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ 2007లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సృష్టించి అరుదైన 12 బంతుల్లో అర్థ శతకం రికార్డు. 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఫ్లింటాప్‌ బౌలింగ్‌ సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్‌తో వాగ్వాదాఁకి దిగాడు. దీఁపై యూవీ ఘాటుగా స్పందించాడు. ఫ్లింటాప్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చాన స్టువర్డ్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచేశాడు. 12 బంతులల్లో3/4,6/6 సాయంతో 50 పరుగులు చేసి టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ రికాడ్డు సమీపంలోకి చాలా మంది క్రికెటర్లు వచ్చినా దాన్ని బద్దలు కొట్టలేకపోయారు.
వెస్టిండీస్‌ వీరుడు సమం చేశాడు...?
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ టీ20 టోర్నీలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ రికార్డును సమం చేశాడు. టోర్నీలో మెల్‌బోర్న్‌ రెఁగేడ్స్‌ తరపున బరిలోకి దిగిన క్రిస్‌గేల్‌ 12 బంతులల్లో 1/4, 7/6 సాయంతో 50 పరుగులు చేశాడు.

ఆ కుటుంబాన్ని కలవడం ఆనందం: నాగార్జున

 బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దంపతులను కలవడం ఎప్పటికీ ఆనందమేనని నాగార్జున అన్నారు. ఓ వాణిజ్య సంస్థ ప్రకటన షూటింగ్‌లో భాగంగా నటుడు ప్రభుతోపాటు అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలిసిన ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు, అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలవడం ఆల్‌వేస్‌ ప్లెజర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. గతంలో కూడా నాగార్జున బిగ్‌బి అమితాబ్‌తో కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే.

Saturday, January 16, 2016

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ

 

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్ తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్ ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..?



కథ :
రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..?



నటీనటులు :
అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్ తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.



ఓవరాల్ గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

Thursday, January 14, 2016

డిక్టేటర్‌ : సినిమా రివ్యూ

 
సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్ తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్ గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..?
కథ :

చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్ తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు.

ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్ తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ.


నటీనటులు :
చంద్రశేఖర్ ధర్మగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్ లతో ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్ లో కూల్ గా, సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా రెండు షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి  క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్ గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు.


ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్