‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని
‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం
చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా
పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల
నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.
ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని
బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు
భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని
టాక్. తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే,
పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు,
దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.
అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి,
దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన
‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన
ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని
అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!
Wednesday, January 6, 2016
ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను అదే చేస్తా
సినీతారలకు సాధారణంగానే ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు
చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్
లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ
స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు
వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్ అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు
షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు.
అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన ‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో కాస్త ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్ పాటలు వింటూ రిలాక్స్ అవుతా. చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.

Tuesday, January 5, 2016
షూటింగ్‌లో యవ హీరోకు గాయాలు
నటుడు శాంతనుకు షూటింగ్‌లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే
భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ
వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2 చిత్రాల్లో కథానాయకుడిగా
నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర
షూటింగ్‌లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్
సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన
నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా
బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.
దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి
ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది
అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్
చేస్తున్నానన్నారు.
ఈ నెల 9న కృష్ణాష్టమి ఆడియో
సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణాష్టమి చిత్రం ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్ సంగీతం సమకూర్చారు. త్వరలో కృష్ణాష్టమి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sunday, January 3, 2016
మంచి నటి అన్న పేరు చాలు!
మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి
అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను ఈ ఏడాది
కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక
మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది.
తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.
ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్‌గా నంబర్‌ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్‌ఒన్ స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం.

Saturday, January 2, 2016
'కిల్లింగ్ వీరప్పన్' మూవీ రివ్యూ
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో
ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ తో
తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు
చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్
సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను
గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ
సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? అనుకొని పరిస్థితుల్లో
తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడ ప్రేక్షకులను
అలరిస్తున్న వీరప్పన్ ను తెలుగు ఆడియన్స్ చూడాలంటే మాత్రం వర్మ మరో డేట్
చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే......
అబ్బాయితో అమ్మాయి : రివ్యూ
కథేంటంటే:అభి
(నాగశౌర్య) ఇంజినీరింగ్ కుర్రాడు. ప్రేమంటే ఇతనికి ఓ సరదా వ్యాపకం.
అందుకే అందంగా కనిపించిన ప్రతీ అమ్మాయినీ ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆ దశలో ప్రార్థన (పల్లక్ లల్వాని) బస్‌స్టాప్‌లో తారపడుతుంది. ఆమెని ఆకట్టుకొని
ప్రేమలోకి దించేస్తాడు. ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఆ విషయం
ప్రార్థన ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో తండ్రి ఆమెని ఇంట్లో నుంచి గెంటేస్తాడు.
ఆ విషయం తెలిసినా అభి నుంచి స్పందన కనిపించదు. దీంతో అభి అసలు రూపాన్ని
తెలుసుకొన్న ప్రార్థన ఏం చేసింది? పవన్‌కల్యాణ్‌గా ఫేస్‌బుక్‌లో పరిచయమైన
కుర్రాడు ప్రార్థన కోసం ఏం చేశాడు? పవన్‌కల్యాణ్‌కీ, అభికీ మధ్య సంబంధమేమిటి?
అనే విషయాలను తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: సామాజిక అనుసంధాన వేదికల్లో తమ అంతరంగాల్ని ఆవిష్కరించుకొనే యువతరం.. వాళ్ల మనసుల్లోని గందరగోళం.. నేపథ్యంలో తీర్చిదిద్దిన కథ ఇది. ట్రెండ్‌కి తగ్గ అంశాన్నే ఎంచుకొన్నారు కానీ.. ఆ ఒక్క అంశమే సినిమా అయిపోదు కదా! దాని చుట్టూ బలమైన కథనాన్ని అల్లుకోవాలి. మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ జోడించాలి. ఆ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. తెరపై ఏ పాత్ర ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాత్రలు అటూ ఇటూ వేగంగా తిరుగుతుంటాయి తప్ప కథ మాత్రం ముందుకు నడవదు. అసలు ఈ సినిమాలో కథ ఉందా అన్న సందేహం కూడా వెంటాడుతూ ఉంటుంది. కానీ అడుగడుగునా పంచ్ డైలాగ్ వినిపిస్తుంటుంది. ప్రతీ పది నిమిషాలకో పాట వినిపిస్తుంటుంది. అందమైన లొకేషన్లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి ఎన్నున్నా ఏం లాభం?.. కథే లేనప్పుడు. ఉన్నట్టుండి హీరోయిన్ హీరో ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే హీరో హీరోయిన్ ఇంట్లోకి దూరిపోతాడు. హీరోకి బద్ధ శత్రువులా, ఒక శాడిస్ట్‌లా కనిపించిన హీరోయిన్ తండ్రి ఒక ఫైట్ పూర్తయ్యేలోపు మారిపోతాడు. ఏకంగా తన కూతురిని ఎలా ప్రేమలో దించాలో హీరోకి టిప్స్ ఇచ్చేస్తుంటాడు. సినిమాలో ఇలాంటి సిత్రాలు చాలానే ఉంటాయి. ప్రతీ సన్నివేశం గందరగోళంగానే అనిపిస్తుంటుంది. బ్రహ్మానందం, పృథ్వీ, తేజస్విలాంటి ప్రముఖ నటులున్నా వాళ్లంతా ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్లిపోతారో అర్థం కాకుండా ఉంటుంది. ఇలాంటి ప్రేమకథలకి భావోద్వేగాలు చాలా ముఖ్యం. అందుకే తెరపైన కనిపించే ప్రతీ పాత్రని సీరియస్‌గా చూపెట్టాడు దర్శకుడు... కానీ పాత్రల మధ్య భావోద్వేగాలు మాత్రం పండలేదు.
ఎవరెలా..: నాగశౌర్య పాత్రకి తగ్గట్టుగా బాగా చేశాడు. సినిమా సగభాగం నుంచి భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశాడు కానీ ఆ సన్నివేశాలకి అతకలేదు. పల్లక్ లల్వాని అందంగా కనిపించింది. కానీ ఆమె నవ్వినా, ఏడ్చినా ఒకలాగే అనిపిస్తుంటుంది. రావు రమేష్ పాత్ర సాగే విధానం ప్రేక్షకుడికి ఏమాత్రం రుచించదు. ఆ పాత్రలో ఆయన అంతకంటే ఏమీ చేయలేరేమో! సాంకేతికత విషయంలోకి వస్తే... శ్యామ్ కె.నాయుడు కెమెరా పనితనానికి వందకి వంద మార్కులేయాల్సిందే. ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించాడాయన. బ్రహ్మ కడలి కళా విభాగం కూడా మంచి పనితీరును కనబరిచింది. ఇళయరాజా సంగీతానికి ఓ ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. కానీ పాటలు, రీ రికార్డింగ్‌పై ఆయన ముద్ర అస్సలు కనిపించదు. దర్శకుడిగా రమేష్ వర్మ తనదైన ముద్ర వేయలేకపోయాడు. కథ, కథనాలతో ఏ దశలోనూ రక్తికట్టించలేకపోయాడు. మాటలు మాత్రం బాగానే పేలాయి. ప్రాసలపైనా, పంచ్‌లపైనా బాగానే కసరత్తులు చేశారు. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ సన్నివేశం రిచ్‌గా కనిపిస్తుంటుంది.

Friday, January 1, 2016
సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తే..
చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన
పరిస్థితి వస్తే.. అంటున్న సమంత తన మనోభావాల్ని మీడియాతో పంచుకున్నారు.
సంమంత క్రేజీ హీరోయిన్ అన్న విషయాన్ని చెప్పనక్కర్లేదు. తమిళ, తెలుగు
భాషల్లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అవన్నీ
ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న చిత్రాలే కావడం గమనార్హం.
ఈ చెన్నై చిన్నది ఇంత బిజీగా ఉన్నా ఇంకో పక్క సమాజ సేవ చేయడం తన
సేవాతత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను నటిగా
మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా
కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందువల్ల నాకు విశ్రాంతి లేకుండా పోయింది.
ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని
పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు.
లోకంలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నా కంటే ప్రతిభావంతురాళ్లు
ఎందరో ఉన్నారు. వాళ్లందరి మధ్యలో భగవంతుడు నాకు హీరోయిన్ స్టేటస్ ఇచ్చాడు.
కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నా ప్రేమకు ఎల్లలే
లేవు. ఎప్పుడూ షూటింగ్ స్పాట్‌లోనే ఉండాలనిపిస్తోంది. ఇంటికి వెళ్లడానికి
కూడా ఇష్టం ఉండటం లేదు.
షూటింగ్‌ల తోనే సంతోషం కలుగుతోంది. సినిమానే నా జీవితంగా మారిపోయింది.
ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నీ భగవంతుడు నాకు స్థాయికి మించి ఇచ్చాడు. ఆ
కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే,
చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా పూర్తి
జీవితాన్ని సమాజసేవకు అంకితం చేస్తాను.’ అని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)