టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో
ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ తో
తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు
చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్
సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను
గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ
సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? అనుకొని పరిస్థితుల్లో
తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడ ప్రేక్షకులను
అలరిస్తున్న వీరప్పన్ ను తెలుగు ఆడియన్స్ చూడాలంటే మాత్రం వర్మ మరో డేట్
చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే......
Saturday, January 2, 2016
అబ్బాయితో అమ్మాయి : రివ్యూ
కథేంటంటే:అభి
(నాగశౌర్య) ఇంజినీరింగ్ కుర్రాడు. ప్రేమంటే ఇతనికి ఓ సరదా వ్యాపకం.
అందుకే అందంగా కనిపించిన ప్రతీ అమ్మాయినీ ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆ దశలో ప్రార్థన (పల్లక్ లల్వాని) బస్‌స్టాప్‌లో తారపడుతుంది. ఆమెని ఆకట్టుకొని
ప్రేమలోకి దించేస్తాడు. ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఆ విషయం
ప్రార్థన ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో తండ్రి ఆమెని ఇంట్లో నుంచి గెంటేస్తాడు.
ఆ విషయం తెలిసినా అభి నుంచి స్పందన కనిపించదు. దీంతో అభి అసలు రూపాన్ని
తెలుసుకొన్న ప్రార్థన ఏం చేసింది? పవన్‌కల్యాణ్‌గా ఫేస్‌బుక్‌లో పరిచయమైన
కుర్రాడు ప్రార్థన కోసం ఏం చేశాడు? పవన్‌కల్యాణ్‌కీ, అభికీ మధ్య సంబంధమేమిటి?
అనే విషయాలను తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: సామాజిక అనుసంధాన వేదికల్లో తమ అంతరంగాల్ని ఆవిష్కరించుకొనే యువతరం.. వాళ్ల మనసుల్లోని గందరగోళం.. నేపథ్యంలో తీర్చిదిద్దిన కథ ఇది. ట్రెండ్‌కి తగ్గ అంశాన్నే ఎంచుకొన్నారు కానీ.. ఆ ఒక్క అంశమే సినిమా అయిపోదు కదా! దాని చుట్టూ బలమైన కథనాన్ని అల్లుకోవాలి. మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ జోడించాలి. ఆ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. తెరపై ఏ పాత్ర ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాత్రలు అటూ ఇటూ వేగంగా తిరుగుతుంటాయి తప్ప కథ మాత్రం ముందుకు నడవదు. అసలు ఈ సినిమాలో కథ ఉందా అన్న సందేహం కూడా వెంటాడుతూ ఉంటుంది. కానీ అడుగడుగునా పంచ్ డైలాగ్ వినిపిస్తుంటుంది. ప్రతీ పది నిమిషాలకో పాట వినిపిస్తుంటుంది. అందమైన లొకేషన్లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి ఎన్నున్నా ఏం లాభం?.. కథే లేనప్పుడు. ఉన్నట్టుండి హీరోయిన్ హీరో ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే హీరో హీరోయిన్ ఇంట్లోకి దూరిపోతాడు. హీరోకి బద్ధ శత్రువులా, ఒక శాడిస్ట్‌లా కనిపించిన హీరోయిన్ తండ్రి ఒక ఫైట్ పూర్తయ్యేలోపు మారిపోతాడు. ఏకంగా తన కూతురిని ఎలా ప్రేమలో దించాలో హీరోకి టిప్స్ ఇచ్చేస్తుంటాడు. సినిమాలో ఇలాంటి సిత్రాలు చాలానే ఉంటాయి. ప్రతీ సన్నివేశం గందరగోళంగానే అనిపిస్తుంటుంది. బ్రహ్మానందం, పృథ్వీ, తేజస్విలాంటి ప్రముఖ నటులున్నా వాళ్లంతా ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్లిపోతారో అర్థం కాకుండా ఉంటుంది. ఇలాంటి ప్రేమకథలకి భావోద్వేగాలు చాలా ముఖ్యం. అందుకే తెరపైన కనిపించే ప్రతీ పాత్రని సీరియస్‌గా చూపెట్టాడు దర్శకుడు... కానీ పాత్రల మధ్య భావోద్వేగాలు మాత్రం పండలేదు.
ఎవరెలా..: నాగశౌర్య పాత్రకి తగ్గట్టుగా బాగా చేశాడు. సినిమా సగభాగం నుంచి భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశాడు కానీ ఆ సన్నివేశాలకి అతకలేదు. పల్లక్ లల్వాని అందంగా కనిపించింది. కానీ ఆమె నవ్వినా, ఏడ్చినా ఒకలాగే అనిపిస్తుంటుంది. రావు రమేష్ పాత్ర సాగే విధానం ప్రేక్షకుడికి ఏమాత్రం రుచించదు. ఆ పాత్రలో ఆయన అంతకంటే ఏమీ చేయలేరేమో! సాంకేతికత విషయంలోకి వస్తే... శ్యామ్ కె.నాయుడు కెమెరా పనితనానికి వందకి వంద మార్కులేయాల్సిందే. ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించాడాయన. బ్రహ్మ కడలి కళా విభాగం కూడా మంచి పనితీరును కనబరిచింది. ఇళయరాజా సంగీతానికి ఓ ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. కానీ పాటలు, రీ రికార్డింగ్‌పై ఆయన ముద్ర అస్సలు కనిపించదు. దర్శకుడిగా రమేష్ వర్మ తనదైన ముద్ర వేయలేకపోయాడు. కథ, కథనాలతో ఏ దశలోనూ రక్తికట్టించలేకపోయాడు. మాటలు మాత్రం బాగానే పేలాయి. ప్రాసలపైనా, పంచ్‌లపైనా బాగానే కసరత్తులు చేశారు. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ సన్నివేశం రిచ్‌గా కనిపిస్తుంటుంది.

Friday, January 1, 2016
సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తే..
చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన
పరిస్థితి వస్తే.. అంటున్న సమంత తన మనోభావాల్ని మీడియాతో పంచుకున్నారు.
సంమంత క్రేజీ హీరోయిన్ అన్న విషయాన్ని చెప్పనక్కర్లేదు. తమిళ, తెలుగు
భాషల్లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అవన్నీ
ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న చిత్రాలే కావడం గమనార్హం.
ఈ చెన్నై చిన్నది ఇంత బిజీగా ఉన్నా ఇంకో పక్క సమాజ సేవ చేయడం తన
సేవాతత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను నటిగా
మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా
కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందువల్ల నాకు విశ్రాంతి లేకుండా పోయింది.
ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని
పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు.
లోకంలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నా కంటే ప్రతిభావంతురాళ్లు
ఎందరో ఉన్నారు. వాళ్లందరి మధ్యలో భగవంతుడు నాకు హీరోయిన్ స్టేటస్ ఇచ్చాడు.
కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నా ప్రేమకు ఎల్లలే
లేవు. ఎప్పుడూ షూటింగ్ స్పాట్‌లోనే ఉండాలనిపిస్తోంది. ఇంటికి వెళ్లడానికి
కూడా ఇష్టం ఉండటం లేదు.
షూటింగ్‌ల తోనే సంతోషం కలుగుతోంది. సినిమానే నా జీవితంగా మారిపోయింది.
ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నీ భగవంతుడు నాకు స్థాయికి మించి ఇచ్చాడు. ఆ
కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే,
చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా పూర్తి
జీవితాన్ని సమాజసేవకు అంకితం చేస్తాను.’ అని చెప్పారు.నేను శైలజ సినిమా రివ్యూ
కథేంటి?
హరి(రామ్)కి ప్రేమ పిచ్చి. చిన్నప్పటి నుంచీ ప్రేమలో పడడం.. విఫలమవ్వడం హరికి అలవాటు.
శైలు (కీర్తి సురేష్)ని కూడా అలానే ప్రేమిస్తాడు. కానీ.. హరి కుటుంబం అంతా వైజాగ్ కి బదిలీ అవ్వడం వల్ల... శైలుకి దూరం అవ్వాల్సి వస్తుంది. హరి పెరిగి పెద్దవాడైనా ప్రేమకథల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రేమించిన ప్రతి అమ్మాయి తనకు దూరం అవ్వడం చూసి... ఇక ప్రేమ జోలికి వెళ్లొద్దనుకొంటాడు. కానీ.. తన జీవితంలోకి శైలు మళ్లీ వస్తుంది. ఈసారి శైలును మరింత సిన్సియర్‌గా ప్రేమిస్తాడు.కానీ.. శైలు మాత్రం హరి ప్రేమకు `నో` చెప్తుంది. దానికి కారణం ఏమిటి? శైలు ప్రేమని హరి ఎలా పొందాడు? అన్నదే మిగిలిన కథ.....

Thursday, December 31, 2015
Wednesday, December 30, 2015
చాలా బాధ కలిగింది
రెండేళ్ల కిందట (2013) ఆస్ట్రేలియాతో జరి గిన టెస్టు
సిరీస్ మధ్యలో తనను తీసేయడం బాధ కలిగించిందని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర
సెహ్వాగ్ అన్నా డు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచిగానీ, సెలక్టర్ల నుంచిగానీ
ఎలాంటి సమాచారం లేదన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు తర్వాత వీరూను
జట్టులో నుంచి తొలగించారు. అయితే చివరి రెండు టెస్టులు కూడా ఆడే అవకాశం
ఇచ్చి ఆ తర్వాత రిటైర్ అవ్వమని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో నేను సరిగా పరుగులు చేయలేదు. అయితే మరో రెండు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిలో మెరు గ్గా రాణించాలని భావించా. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా నన్ను తొలగించారు. ఒకవేళ చివరి రెండు టెస్టుల్లోనూ ఆడకపోతే తీసేసినా బాగుం డేది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లలో ఎవరి నుంచి సమాచారం రాలేదు. పత్రికల్లో ఈ విషయం రావడంతో చాలా బాధకు గురయ్యా’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నాడు. ఓపెనర్‌గా ఆడే సత్తా ఉందని చెప్పిన మేనేజ్‌మెంట్ ఓపెనింగ్ జోడిని మార్చే అవకాశం తీసుకోలేదన్నారు. పుజా రా, సచిన్, కోహ్లిలు వరుసగా మూడు, నాలుగు, ఐ దు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుండటంతో తనకు మిడిలార్డర్‌లో ఆడే అవకాశం రాలేదన్నాడు.

'మామ మంచు అల్లుడు కంచు' మూవీ రివ్యూ
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ హీరోగా,
సీనియర్ హీరో మోహన్ బాబు మరో లీడ్ రోల్ లో తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్
కామెడీ ఎంటర్ టైనర్ మామ మంచు అల్లుడు కంచు. మరాఠిలో ఘనవిజయం సాధించిన
సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి
దర్శకుడు.
అల్లరి నరేష్ 50వ సినిమాగా, మోహన్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత విడుదలైన సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన మామ మంచు అల్లుడు కంచు. రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ సక్సెస్ సాధించాడా,? చాలా కాలం తరువాత కామెడీ పాత్రలో నటించిన మోహన్ బాబు ఈ జనరేషన్ ను తన టైమింగ్ తో మెప్పించాడా..? వివరాల్లోకి వెళితే...
కథ : భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్ టెయిన్ చేయడానికి కష్టపడిపోతుంటాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఈ కష్టాల్లో నాయుడుగారికి సాయం చేస్తుంటాడు. భక్తవత్సలం నాయుడు మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్). ఇలా కష్టాల్లో సాగుతున్న భక్తవత్సలం నాయుడుకి పిల్లలు పెళ్లీడుకి రావటంతో కొత్త కష్టాలు మొదలవుతాయి. శృతి, గౌతమ్ ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.
ఇద్దరు పిల్లలకు పుట్టినరోజు కానుకలు ఇచ్చే క్రమంలో అడ్రస్ లు మారిపోవటంతో శృతి గిఫ్ట్, గౌతమ్ కు, గౌతమ్ గిఫ్ట్ శృతికి వెళుతుంది. గిఫ్ట్ మార్చుకోవటం కోసం శృతి, గౌతమ్ లు కలుసుకోవాలనుకుంటారు. అలా కలిస్తే తన నాటకం బయటపడుతుందని భావించిన నాయుడు వారు కలవకుండా ఉండేదుకు గౌతమ్ గిఫ్ట్ దొంగతనం చేసి దాన్ని బాలరాజు (అల్లరి నరేష్) తో శృతి దగ్గరకు పంపిస్తాడు. ఎలాగైనా గౌతమ్ అంటే శృతికి అసహ్యం కలిగేలా చేయమంటాడు.
శృతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ బాలరాజు, తానే గౌతమ్ అని శృతిని ప్రేమలోకి దించుతాడు. అలా మరింత కష్టాల్లో ఇరుక్కున్న నాయుడు, బాలరాజు నుంచి తన కూతురిని కాపాడుకోవటానికి, తన ఇద్దరు భార్యల రహస్యం బయటపడకుండా ఉండటానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. చివరకు ఆ విషయం ఎలా బయటపడింది. అనుకున్నట్టుగా బాలరాజు శృతి పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ.
నటీనటులు :
ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు గడుస్తున్నా మోహన్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటిపడి నటిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ క్యారెక్టర్ ను ఎంచుకున్న మోహన్ బాబు ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించీ ఇప్పటికీ తనలో అదే ఫాం ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక తనకు బాగా అలవాటైన క్యారెక్టర్ లో అల్లరి నరేష్ మరోసారి మెప్పించాడు. కామెడీతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించిన అలీ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, వరుణ్ సందేశ్, కృష్ణభగవాన్ లు తన పరిధి మేరకు మెప్పించారు.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి క్లారిటీ మెయిన్ టెయిన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, కన్ఫ్యూజింగ్ సీన్స్ లోనూ ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల కాలం వరుస సక్సెస్ లు సాధిస్తున్న మాటల రచయిత శ్రీధర్ సీపాన మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. కామెడీ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆకట్టుకోలేకపోయిన ఒకే ఒక్క అంశం సంగీతం. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినా.. థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండే పాట ఒక్కటీ ఇవ్వలేకపోయారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

Saturday, December 26, 2015
భలే మంచి రోజు : సినిమా రివ్యూ
తెలుగు సినీ రంగం నుంచి చాలా అరుదుగా వస్తుంటాయి కానీ క్రైమ్ కామెడీలకి ఇక్కడ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మనీ, అనగనగా ఒక రోజు, ఐతే, స్వామిరారా లాంటి సినిమాలు ఈ జోనర్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేసాయి. చూడ్డానికి మామూలుగా అనిపించినా కానీ ఇలాంటి సినిమాల్ని డీల్ చేయడం అంత తేలిక కాదు. దర్శకుడికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో పాటు థింకింగ్ బ్రెయిన్ కూడా కంపల్సరీ. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి ఆ రెండూ ఉన్నాయని ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో తెలుస్తుంది. రెగ్యులర్ హ్యూమర్ కాకుండా వివిధ రకాల హాస్యాన్ని పండించాడు. కొన్ని చోట్ల తెలివిగా, కొన్ని చోట్ల తింగరిగా, కొన్ని సందర్భాల్లో వెకిలిగా, కొన్ని సందర్భాల్లో పేరడీతో, మరికొన్ని చోట్ల అశ్లీలంతో (సాయికుమార్, ఐశ్వర్య ట్రాక్) నవ్విస్తుందీ చిత్రం.
శ్రీరామ్ ఆదిత్య ఖచ్చితంగా తన కథపై చాలా కసరత్తు చేసాడు. దీనిని ఆసక్తికరంగా మార్చేందుకు అతను చాలా సమయాన్ని వెచ్చించాడనే సంగతి తెలుస్తూనే ఉంటుంది. కథలోకి ఎంటర్ అయ్యే ఏ క్యారెక్టర్ టైమ్‌పాస్‌కి వచ్చినట్టుండదు. అన్నిటికీ ఒక పర్పస్ ఉంటుంది.. అన్నీ ప్లాట్‌లో ఇన్‌వాల్వ్ అయి ఉంటాయి. ప్రతి పాత్రనీ ఏదో విధంగా ఎంటర్‌టైనింగ్‌గా మలిచేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కేవలం కథనం, పాత్రల చిత్రణ విషయం మీదే కాదు.. దర్శకుడిగా తన టేకింగ్ గురించి మాట్లాడుకునేట్టు చేయడానికి తగ్గ విధంగా విజువలైజ్ చేసుకున్నాడు. ఎల్లో థీమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఛేజ్ సీన్ దర్శకుడి ఊహాశక్తిని తెలియజేస్తుంది. స్లమ్స్‌ని, విలన్ డెన్‌ని, హీరో గ్యారేజ్‌ని.. ప్రతి సెట్ పీస్‌కి డీటెయిలింగ్ చక్కగా కుదిరింది. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఉత్తమ శ్రేణిలో నిలుస్తాయి.
చక్కని కామెడీతో ఎలాంటి జర్క్స్ లేకుండా సాగిపోయే ఫస్ట్ హాఫ్ సూపర్బ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో ఇంకా క్యారెక్టర్లు ఎంటర్ అవడం, మరికొన్ని త్రెడ్స్ వచ్చి మెయిన్ ప్లాట్‌తో కలవడం వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే అన్నిటికీ తగ్గ ముగింపుని ఇవ్వడానికి, డాట్స్ అన్నీ కనెక్ట్ చేయడానికి దర్శకుడు ముందే ప్లాంటింగ్స్ వేసి పెట్టుకున్నాడు. వాటికి పే ఆఫ్స్ ఇస్తూ క్లయిమాక్స్‌ని వినోదాత్మకంగా మలిచాడు. అయితే ఎంటర్‌టైన్ చేసే ప్రాసెస్‌లో కొన్ని సార్లు అతను బ్యాలెన్స్ తప్పాడు. విలన్ పాత్రకి కూడా కామెడీ కోణం ఇవ్వడానికి అన్నట్టు అతని భార్యని (ఐశ్వర్య) సెక్స్ మేనియాక్‌గా చూపించడం కాస్త టూమచ్ అనిపిస్తుంది. అలాగే వేణు, అతని క్రైమ్ పార్టనర్ జోడీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. పైగా వారిపై ఒక పాట కూడా చిత్రీకరించారు. అవసరమే లేని చోట హీరోహీరోయిన్లపై ఒక మెలోడీ సాంగ్ వచ్చి విసిగిస్తుంది. కొత్త ఆలోచనలతో వస్తోన్న దర్శకులు కొన్ని పాత పద్ధతులని కూడా విడిచిపెట్టాలి. తప్పనిసరిగా పాటలు ఉండాలి, ఫైట్లుండాలి లాంటి మూస పోకడలు మానుకోవాలి.
సుధీర్‌బాబు తన పాత్రకి న్యాయం చేసాడు కానీ ఆ పాత్రకి అవసరం లేని ఫిజిక్‌తో కనిపించాడు. తన పాత్ర ఒక మామూలు కుర్రాడిగా కనిపిస్తే మరింత రక్తి కడుతుంది. పాత్రకి అనుగుణంగా ట్రాన్స్‌ఫర్మ్ అవడమనేది, బాడీ లాంగ్వేజ్‌లో సటిల్ ఛేంజెస్ చేయడమనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. వామిక బాగుంది. బాగానే చేసింది. పోసాని కామ్‌గా ఉండాల్సిన ఫాదర్ క్యారెక్టర్‌లో కాస్త కొత్తగా కనిపిస్తాడు. తన లౌడ్ డైలాగ్స్ అన్నీ మనసులోనే అనుకునేలా చేయడం నైస్ టచ్. దివాళా తీసిన విలన్‌గా సాయికుమార్, తింగరి కిడ్నాపర్లుగా వేణు, శ్రీరామ్, కన్నింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చైతన్య కృష్ణ, గ్రీడీ గాళ్‌ఫ్రెండ్‌గా ధన్య, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్‌గా పృధ్వీ, బాత్రూమ్ బ్రేక్ కోసం డెస్పరేట్‌గా ఎదురు చూసే వాడిగా ప్రవీణ్.. అందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ చిత్రాన్ని ఆసాంతం వినోదాత్మకంగా మార్చారు. క్లయిమాక్స్‌లో పృధ్వీ వీరవిహారం బాగా నవ్విస్తుంది.
సన్నీ మరోసారి తన నేపథ్య సంగీతంతో అలరించాడు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని త్రెడ్లు ఉన్నపుడు అన్నిటినీ తక్కువ నిడివిలో సెట్ చేసిపెట్టడం ఏ ఎడిటర్‌కి అయినా పరీక్షే. వర్మ తనకి అప్పగించిన పని బాగా చేసాడు. నిర్మాతల టేస్ట్‌ని, ప్యాషన్‌ని మెచ్చుకోవాలి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'భలే' అనిపిస్తాడు. కొత్త ఆలోచనలతో పాటు ప్రేక్షకులకి వినూత్న వినోదం అందించే తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈమధ్య పరిచయమైన దర్శకుల్లో అంచనాలు పెట్టుకోతగ్గ దర్శకుల్లో ముందు వరసలో ఉంటాడు. డిఫరెంట్ సినిమాలని, క్రైమ్ కామెడీ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులని మెప్పించే ఈ చిత్రం మసాలా లవర్స్‌ని మెప్పించలేకపోవచ్చు. ద్వితీయార్థంపై, ఆరంభంలో మందకొడి కథనంపై ఇంకాస్త శ్రద్ధ చూపించినట్టయితే ఈ జోనర్‌లో ఇదో మోడ్రన్ క్లాసిక్ అయి ఉండేది.
Subscribe to:
Posts (Atom)