పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ కోచ్ అవతారం
ఎత్తనున్నాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు.
రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు.
ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు
ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్
సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్
ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు
ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం
చేశారు.
పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు.
పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే
పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు
తిరస్కరించాడు.
Wednesday, November 4, 2015
నిజమైన పెళ్లిలా అనిపించింది !
ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్
ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి
కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్
ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో
స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె
కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి
కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’
సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి
పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె
కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి
కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’
సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి
పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు.
Tuesday, November 3, 2015
బాహుబలిలో అందాల రాక్షసి
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా విషయంలో రోజుకో వార్త సినీ అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటికే తొలిభాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో ఉన్నాడు జక్కన్న.
తొలి భాగంలో భల్లాలదేవుడిగా రానాను, అతని కొడుకు పాత్రలో అడవి శేషును చూపించిన రాజమౌళి రానా భార్య పాత్రను మాత్రం చూపించలేదు. అయితే కథకు కీలకమైన పాత్రను రెండో భాగంలో చూపించనున్నాడట. ఇప్పటికే ఈ పాత్రకు తగ్గ నటికోసం వేట కూడా ప్రారంభించాడు రాజమౌళి. తొలుత ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ శ్రియను తీసుకోవాలని భావించినా, ఇప్పుడు మనసు మార్చుకున్నారట.
ప్రస్తుతం ఈ పాత్రకు అందాలు రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట బాహుబలి యూనిట్. ఇటీవల భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచిఫాంలో కనిపిస్తున్న లావణ్యకు ఇది గోల్డెన్ ఛాన్సే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి టీం కన్ఫామ్ చేయకపోయినా, సాయి కొరపాటి... లావణ్యను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజమౌళి ఎవరిని కన్ఫామ్ చేస్తాడో చూడాలి.
బన్నీకి జోడిగా ఐటెం సాంగ్ చేయనున్న ముగ్గురులో ఒక్కరు ఎవరు ... ?
సన్నాఫ్ సత్యామూర్తి సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' పేరుతో యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. బోయపాటి కూడా లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కెరీర్ లో కీ లకం కానుంది. అందుకే ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ వేట కొనసాగిస్తున్నారు ఈ స్టార్స్. ముందుగా ఈ పాటను ఇలియానాతో చేయించాలని భావించారు.
చాలా రోజులుగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా బన్నీతో ఆడిపాడటానికి సై అంది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమోగాని ఇలియానాను పక్కన పెట్టేశారు. బన్నీతో ఉన్న స్నేహం కారణంగా ఈ సాంగ్ ఛాన్స్ నాదే అని భావించిన గోవా బ్యూటికి నిరాశే మిగిలింది.
ఇలియానా తరువాత ఈ సాంగ్ కోసం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనుష్కను సంప్రదించారు. అనుష్క లీడ్ రోల్ లో నటించిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ క్యారెక్టర్ చేయటంతో అందుకు కృతజ్ఞతగా అనుష్క కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని భావించారు. అయితే తాజ సమాచారం ప్రకారం సీన్ నుంచి అనుష్క కూడా పక్కకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క, బాహుబలి 2 కోసం బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. దీంతో సరైనోడు సాంగ్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
ఫైనల్ గా హోమ్లీ బ్యూటి అంజలిని ఈ సాంగ్ కోసం ఫైనల్ చేశారట. గతంలో సింగం 2 సినిమా కోసం ఐటమ్ సాంగ్ లో ఆడిపాడిన అంజలి మరోసారి అదే పనికి రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన శంకరాభరణం ట్రైలర్ లో నెగె టివ్ లుక్ లో అలరించిన అంజలి ఐటమ్ నంబర్ తో కూ డా ఆకట్టుకోవాలని చూస్తోంది.
ఇలియానా, అంజలి, అనుష్క
Monday, November 2, 2015
మరో నవ్వు రాలిపోయింది
ప్రస్తుతం తెలుగు సినీ రంగానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వెండితెర మీద
నవ్వులు పూయించే ఎన్నో మహా వృక్షాలు ఒక్కటొక్కటిగా నెలకొరుగుతున్నాయి. అదే
వరుస మరో నవ్వుల నటుడు వెండితెరను వదిలివెళ్లారు. 'ఐతే ఓకె' అంటూ తెలుగు
ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటుడు కొండవలస
లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. సీనియర్ నటులు మాడా
వెంకటేశ్వరరావు మరణవార్త మరిచిపోకముందే కొండవలస మృతి తెలుగు ఇండస్ట్రీ
షాక్ కు గురైంది.
300 లకు పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన కొండవలస.. వేల నాటకాలతో అలరించారు. రంగస్థల నటుడిగా ఎంతో అనుభవంతో పాటు అదే స్ధాయిలో పేరు ప్రఖ్యాతలు కూడా సాధించిన ఆయన 378 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు రంగస్థలంపై ఉత్తమ నటుడిగా రెండుసార్లు నంది అవార్డును సైతం అందుకున్నారు.
కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో 1946 ఆగస్టు 10న జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో లక్ష్మణరావు విద్యాబ్యాసం విశాఖలో జరిగింది. కళాశాలలో చదివే సమయంలోనే నాటక రంగం పట్ల ఆకర్షితులైన కొండవలస ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలతో అలరించారు. చదువు పూర్తయి విశాఖ పోర్ట్ర్ ట్రస్ట్ లో ఉద్యోగిగా మారినా.. నాటకరంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంతో మంది లబ్థప్రతిష్టులైన నటులతో కలిసి నటించిన కొండవలస మూడు దశాబ్దాలకు పై రంగస్థలంపై తన ప్రతిభ కనబరిచారు.
ఉద్యోగానికి విఆర్ ఎస్ తీసుకొని హైదరాబాద్ లో ఉంటున్న తన కొడుకు దగ్గరకు వచ్చిన కొండవలస లక్ష్మణరావు, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పొట్రాజుగా నటించిన ఆయన.. ఐతే ఓకే అంటూ ప్రేక్షకులను తన అభిమానులుగా మర్చేసుకున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ కామెడియన్ గా మారిన కొండవలస తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తుది శ్వాస వరుకు నటిస్తూనే ఉన్నారు. అతి తక్కువ సమయంలో 300లకు పైగా సినిమాలతో కామెడియన్ గా తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇలా వెండితెరపై తనదైన హాస్యాన్ని పండించిన కొండవలస లక్ష్మణరావు మరణం తెలుగు సినిమాకు తెలుగు హాస్యానికి తీరని లోటు.

చరణ్ కు జోడీగా సీనియర్ హీరోయిన్
అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా ఇప్పుడు
చప్పగా తన కెరీర్ ని మార్చేసుకుంది. తెలుగులో సూపర్ గా నెంబర్ 1 పొజిషన్
ఎంజాయ్ చెయ్యాల్సిన ఆమె ప్రాజెక్ట్ ల మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా
బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కూడా తన పప్పులు ఉడక్కపోవడంతో మళ్ళీ వెనక్కి
వచ్చేసింది. ఇప్పుడు ఆమె కాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎక్కడా ఒక్క
సినిమా కూడా లేకా డీలా పడుతోంది. ఆ మధ్య రాం చరణ్ బ్రూస్ లీ లో ఆమె ఐటెం సాంగ్ చేస్తాను అని ప్రణాలికలు
సిద్దం కూడా చేసుకుంది కానీ పారితోషకం విషయంలో ప్రొడ్యూసర్ లు ఆమెకి
దణ్ణం పెట్టేసారు అని టాక్. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తమిళ సినిమా ‘తనీ
ఒరువన్’ తెలుగులో రిమేక్ అవుతూ ఉండడంతో ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ గా
ఇలియానాకి ఛాన్స్ ఉంది అని అంటున్నారు.ఇప్పటికే నయనతారతో పాటు మరొక బాలీవుడ్ అమ్మడి పేర్లు లిస్టులో ఉండగా
ఇలియానా పేరు తెరమీదకి రావడం చూస్తుంటే చరణ్ స్వయంగా ఆమెకి ఆఫర్ ఇచ్చే
ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం
Sunday, November 1, 2015
ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
' బాహుబలి-2' తర్వాత ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ...
' బాహుబలి-2' తర్వాత ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు. ఇలీవల విడుదలైన '
బాహుబలి' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పడు అందరి దృష్టి ప్రభాస్
పెళ్లిపై పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు
సమాచారం. ఇంట్లో వారి ఒత్తిడి ఎక్కువగా
ఉండడంతో ఇక బ్యాచిలర్ లైఫ్‌కి
స్వప్తి చెప్పి మూడుముళ్లూ వేయాలని
డిసైడైపోయాడు తెలిసింది. ఇప్పుడు
మిగిలింది ' బాహుబలి-2' పూర్తవగానే వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని
సమచారం. ' బాహుబలి-2' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్
నటిస్తుందని
మీడియా సమాచారం.
Subscribe to:
Posts (Atom)