ప్రస్తుతం తెలుగు సినీ రంగానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వెండితెర మీద
నవ్వులు పూయించే ఎన్నో మహా వృక్షాలు ఒక్కటొక్కటిగా నెలకొరుగుతున్నాయి. అదే
వరుస మరో నవ్వుల నటుడు వెండితెరను వదిలివెళ్లారు. 'ఐతే ఓకె' అంటూ తెలుగు
ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటుడు కొండవలస
లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. సీనియర్ నటులు మాడా
వెంకటేశ్వరరావు మరణవార్త మరిచిపోకముందే కొండవలస మృతి తెలుగు ఇండస్ట్రీ
షాక్ కు గురైంది.
300 లకు పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన కొండవలస.. వేల నాటకాలతో
అలరించారు. రంగస్థల నటుడిగా ఎంతో అనుభవంతో పాటు అదే స్ధాయిలో పేరు
ప్రఖ్యాతలు కూడా సాధించిన ఆయన 378 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు
రంగస్థలంపై ఉత్తమ నటుడిగా రెండుసార్లు నంది అవార్డును సైతం అందుకున్నారు.
కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో 1946 ఆగస్టు 10న
జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో లక్ష్మణరావు విద్యాబ్యాసం
విశాఖలో జరిగింది. కళాశాలలో చదివే సమయంలోనే నాటక రంగం పట్ల ఆకర్షితులైన
కొండవలస ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలతో అలరించారు. చదువు పూర్తయి విశాఖ
పోర్ట్ర్ ట్రస్ట్ లో ఉద్యోగిగా మారినా.. నాటకరంగాన్ని మాత్రం
వదిలిపెట్టలేదు. ఎంతో మంది లబ్థప్రతిష్టులైన నటులతో కలిసి నటించిన కొండవలస
మూడు దశాబ్దాలకు పై రంగస్థలంపై తన ప్రతిభ కనబరిచారు.
ఉద్యోగానికి విఆర్ ఎస్ తీసుకొని హైదరాబాద్ లో ఉంటున్న తన కొడుకు దగ్గరకు
వచ్చిన కొండవలస లక్ష్మణరావు, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఔను వాళ్లిద్దరూ
ఇష్టపడ్డారు' సినిమాతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో
పొట్రాజుగా నటించిన ఆయన.. ఐతే ఓకే అంటూ ప్రేక్షకులను తన అభిమానులుగా
మర్చేసుకున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ కామెడియన్ గా మారిన కొండవలస
తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తుది శ్వాస వరుకు నటిస్తూనే ఉన్నారు.
అతి తక్కువ సమయంలో 300లకు పైగా సినిమాలతో కామెడియన్ గా తన క్రేజ్ ఏంటో
ప్రూవ్ చేసుకున్నారు. ఇలా వెండితెరపై తనదైన హాస్యాన్ని పండించిన కొండవలస
లక్ష్మణరావు మరణం తెలుగు సినిమాకు తెలుగు హాస్యానికి తీరని లోటు.
అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా ఇప్పుడు
చప్పగా తన కెరీర్ ని మార్చేసుకుంది. తెలుగులో సూపర్ గా నెంబర్ 1 పొజిషన్
ఎంజాయ్ చెయ్యాల్సిన ఆమె ప్రాజెక్ట్ ల మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా
బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కూడా తన పప్పులు ఉడక్కపోవడంతో మళ్ళీ వెనక్కి
వచ్చేసింది. ఇప్పుడు ఆమె కాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎక్కడా ఒక్క
సినిమా కూడా లేకా డీలా పడుతోంది. ఆ మధ్య రాం చరణ్ బ్రూస్ లీ లో ఆమె ఐటెం సాంగ్ చేస్తాను అని ప్రణాలికలు
సిద్దం కూడా చేసుకుంది కానీ పారితోషకం విషయంలో ప్రొడ్యూసర్ లు ఆమెకి
దణ్ణం పెట్టేసారు అని టాక్. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తమిళ సినిమా ‘తనీ
ఒరువన్’ తెలుగులో రిమేక్ అవుతూ ఉండడంతో ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ గా
ఇలియానాకి ఛాన్స్ ఉంది అని అంటున్నారు.ఇప్పటికే నయనతారతో పాటు మరొక బాలీవుడ్ అమ్మడి పేర్లు లిస్టులో ఉండగా
ఇలియానా పేరు తెరమీదకి రావడం చూస్తుంటే చరణ్ స్వయంగా ఆమెకి ఆఫర్ ఇచ్చే
ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం
ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ
అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను
ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్,
చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు
మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు.
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు.
హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ
రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
' బాహుబలి-2' తర్వాత ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు. ఇలీవల విడుదలైన '
బాహుబలి' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పడు అందరి దృష్టి ప్రభాస్
పెళ్లిపై పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు
సమాచారం. ఇంట్లో వారి ఒత్తిడి ఎక్కువగా
ఉండడంతో ఇక బ్యాచిలర్ లైఫ్‌కి
స్వప్తి చెప్పి మూడుముళ్లూ వేయాలని
డిసైడైపోయాడు తెలిసింది. ఇప్పుడు
మిగిలింది ' బాహుబలి-2' పూర్తవగానే వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని
సమచారం. ' బాహుబలి-2' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్
నటిస్తుందని
మీడియా సమాచారం.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ టూర్‌లో తన సత్తా
చాటింది. మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా
హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం
చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 6-0, 6-3 తేడాతో 8వ
సీడ్ ముగురుజ్జా-సూరేజ్ సవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. దీంతో ఈ
జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య 9కి చేరింది. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం
వచ్చి చేరింది. సానియా మీర్జాకు తన కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్.
హింగిస్‌కు 50వ డబుల్స్ టైటిల్.

దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్
స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు
జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే కావడంతో ఫలితం తేలలేదు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి
ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు
చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి
ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో
ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు
తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54) రాణించడంతో దక్షిణాఫ్రికా
గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్
థాకూర్ నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో
రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే
సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్
డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్..
మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో
43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49
నాటౌట్) ఆకట్టుకున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా
హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట
6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం
సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం..
రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ
తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.
ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ
ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్
టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్
ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే
సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా
చేరుతుంది.
నంబర్ వన్ ర్యాంకు పదిలం
డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్ ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో
సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు
చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో
నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా.. వరుస విజయాలను సాధిస్తూ
ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో
కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.
భారత క్రికెట్ ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్
సింగ్ కూడా త్వరలోనే తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడా?
దీపావళి రోజున వివాహ శుభవార్త చెబుతాడా? ఇప్పుడు యువీ అభిమానులంతా ఇదే
విషయం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ఓ ఇంటివాడైన
హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా యువీ తన పెళ్లిపై ఊహాగానాలకు తెర
తీశాడు. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి
దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్
చేశాడు. పనిలో పనిగా భజ్జీ శ్రీమతి గీతా బస్రా కూడా.. ఇక లైన్లో తర్వాత
ఉన్నది మీరే అంటూ యువీకి ట్వీట్ చేసింది. దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్‌లోకి రా.. ‘స్ట్రెయిట్’గా
ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే
సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే
ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో పండుగ రోజు తన పెళ్లి గురించి ఏమైనా
కబురు చెబుతాడా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.