
ముంబయిలోని
వాంఖడే మైదానంలో భారత్,సౌతాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల్లో
దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది.
వన్డేల్లో మ్యాచ్‌ల్లో 443 అత్యధికంగా ఉంది. మరో ఆరు పరుగులు చేసి ఉంటే
సౌతాఫ్రికా జట్టు నెంబర్ వన్‌గా ఉండేది. సఫారీ బ్యాట్‌మెన్లు డికాక్ (
109), డుప్లెసిస్ ( 133), డివిలియర్స్ (119) శతకాలు బాది జట్టుకు
భారీ
స్కోరు అందించారు. సఫారీ బ్యాట్‌మెన్ల దాటికి భారత్ బౌలర్లు కెరీర్‌లోనే
దారుణమైన గణాంకాలు నమోదు చేసుకోన్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు
బ్యాటింగ్ ఎంచుకు
ది. ఓపెనరు ఆమాల్ల ( 23) పరుగులకే పెవిలియన్
చేరుకఁన్నాడు.మరో ఓపెనరు డికాక్ సెంచరీతో జవాజు ఇచ్చాడు.డికాక్ ( 109)
అతని తోడుగా డుప్లెసిస్ కూడా సెంచరీతో అదుకున్నాడు. 133 పరుగులు చేసి
రిటైర్డ్ హర్డ్ వెనుదిగిరాడు. డుప్లెసిస్ క్రీజులో కుదురుకునే వరకూ
నెమ్మదిగా అడినా శతకం తర్వాత విశ్వరూపం చూపాడు. మరో డైజర్‌అన్
బ్యాట్‌మైన్ ఎబి డివిలియర్స్ మరో సారి తన విశ్వరూపం బౌలర్లపై చూపాడు.
డివిలియర్స్ ( 119) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో మిల్లర్ (22),
బెహార్డీన్ (16) దాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు 438 పరుగులు
చేయగలిగింది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వన్డేల్లో ఆరోసారి 4 వందల పైచిలుకు స్కోర్ చేశారు.
ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..?
అంతర్జాతీయ క్రికెట్‌లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన
నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా
బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్‌మార్ వేయడం ఇష్టం లేదేమో..!
జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే
ఉరుకుతూ వచ్చేవాళ్లు.
పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా
భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే... స్టెయిన్
బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని
వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్
ఆడుతున్నాడని.
1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు
మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ
బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని.
అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం
వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు
ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా
ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత
గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న
పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు
దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు.

95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం
కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు
రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ
సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్‌లోనే అత్యంత
విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను
గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల
గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో
ప్రశంసల వెల్లువ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు
క్రికెట్ ప్రపంచంతో పాటు పలువురు ప్రముఖులు
శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్
అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు
బాగుండాలి’ -శశాంక్ మనోహర్
సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత
క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు
చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం
క్రికెటర్లు నేర్చుకోవాలి’ - అనురాగ్ ఠాకూర్
రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని
ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న
ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం
ప్రయత్నిస్తాడు’ -ధోని
వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ
మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్‌లో
నువ్వు దిగ్గజం’ -కోహ్లి
శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు -లక్ష్మణ్
ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన
ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా
సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి
వెళుతున్నాడు’ -సచిన్
టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు
కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’
-కుంబ్లే
ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది.
సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా.
టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు...
వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య.\
ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి
జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్‌లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక
దశలో మాస్టర్‌నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు
గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత
సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా
చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ
దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ
షాట్లు లాంటివి పట్టవు.
ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం
అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని
స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా
టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ
సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు.
భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని
‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని
భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని
ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు.
టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది.
అంతర్జాతీయ క్రికెటర్‌గా
సెహ్వాగ్‌ది మహోజ్వల కెరీర్! 12 ఏండ్ల కెరీర్‌లో 104 టెస్టుల్లో 49.34
సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు.
అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ
సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్
సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు
సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా
సెహ్వాగ్‌దే! వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో
బ్యాట్స్‌మన్ సెహ్వాగే!
ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖ పట్నం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొల్లూరు చిదంబరం ఆయన అసలు పేరు, 1989లో ఆయన నటించిన కళ్లు చిత్రంతో ఆయనకు కళ్లు చిదంబరంగా పేరు వచ్చింది. ఆయన స్వస్థలం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం. కళ్లు సినిమాలో నటనకు నందు పురస్కారం అందుకున్నారు.300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విశాఖపట్నం పోర్టులో చిదంబరం ఉద్యోగిగా పనిచేశారు. కళ్లు, కొండవీటి దొంగ, చంటి, గోవిందగోవిందా, అమ్మోరు, మనీ, ఎదురులేని మనిషి, మృగరాజు, శ్వేతనాగు, గ్లామర్, సివంగి, గంగపుత్రులు, కాలచక్రం, తొలిపాట, మైత్రి, ప్రేమకు సై సహా పలు చిత్రాల్లో నటించారు.
గవర్నర్ నరసింహన్‌తోనూ ప్రత్యేక సమావేశం
తెలంగాణ, ఆరధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం హైదరాబాద్‌లో
భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర శంకుస్థాపనకు రమ్మని
ఆహ్వానించేందుకు చంద్రబాబు కెసిఆర్‌ను కలవబోతున్నారు. ఆదివారం సాయంత్రం
5.30 గంటలకు ఆయన కెసిఆర్ నివాసానికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కెసిఆర్ అపాట్‌మెంట్
కోరింది. ఏడాది తర్వాత వారిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే
భగ్గుమన్న పరిస్థితి నెలకొంది. ఇక భవిష్యత్తులో భేటీ అయ్యే పరిస్థితులు
ఉండవని అనుకున్న నేపథ్యంలో ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వారిని
కలపబోతుంది. కెసిఆర్‌ను కలిసి ఆహ్వానించే బాధ్యతను ఏపీ సెక్రటేరియట్
చంద్రబాబుకు అప్పగించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌కు
జహీర్‌ఖాన్ గురువారం వీడ్కోలు పలికారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్
టైటిల్ సాధించడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో
జహీర్‌ఖాన్ ఒక్కడే 21 వికెట్లను పడగొట్టాడు. జహీర్‌ఖాన్ భారత్ జట్టులో
కీలక సభ్యుడిగా ఉన్న జహీర్‌ఖాన్ గాయాల కారణంగా జట్టులో స్థానంలో
కోల్పోయాడు. ఐపీఎల్‌లో ఢిల్లీడేర్ డెవిల్స్ తరపున ఆడుతున్నాడు. 2000
అక్టోబర్ 3న నైరోబీలో కెన్నాతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేసిన
జహీర్‌ఖాన్ సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు ఎనలేని
సేవలందిచాడు.
వన్డేలో 200 మ్యాచ్‌ల్లో 282 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో 92
మ్యాచ్‌ల్లో 311 వికెట్లు నేలకూల్చాడు. టీ20 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌లు ఆడిన
జహీర్‌ఖాన్ 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున టెస్టుల్లో
అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత
నాలుగేళ్లుగా తరచూ జట్టులోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. జహీర్‌ఖాన్ వీడ్కోలు
పలువురు హృదపూర్వకంగా అతడి భవిష్కత్ కెరీర్ బాగా సాగాలని
కోరుకుటున్నారు.
హీరో ప్రభాస్ క్రికెట్‌లో నాకు బాగా ఇష్టమైన బౌలర్లలో జహీర్‌ఖాన్ ఒకడుడని
పేర్కొన్నాడు.
మ్యాన్ ఆప్ ద మ్యాచ్ ధోని
బ్యాటింగ్‌లో తడబడిన బౌలింగ్‌లో ఎదురుదాడి
భారత్,
దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో
విజయం సాధించింది. ఇరు జట్టు 1-1 సమానంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన
భారత్ 9 వికెట్ల నష్టాఁకి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన
సౌతాఫ్రిక జట్టు 225 పరుగులకు
అలౌట్ అయ్యింది. చివరి వికెటు వరకు
పోరాడిన
సౌతాఫ్రిక జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. డుప్లెసిస్ 51, డికాక్ 34
పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మెన్స్ చెప్పుకోదగ స్కోరు చేయలేకపోయారు.
మిడిల్డార్ బ్యాట్‌మెన్ డెవిడ్ మిల్లర్ (0) అవుట్ అయ్యాడు. బారత్
బౌలింగ్ భూవనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా,
హర్బజన్ సింగ్ 2, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ చెరో వికెట్టు లభించింది.
భారత్ బౌలింగ్‌లో మంచి హర్బజన్ సింగ్, అక్షర్ పటేల్ ఇద్దరు మంచిగా
బౌలింగ్ చేశారు. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (3) పరుగులకు
రబాడా
బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వన్‌డౌన్‌గా రహనే వచ్చాడు. ధావన్
(23), పరుగులు చేయగా, కోహ్లి అనవసరంగా పరుగు కోసం వెళ్లి రనౌట్‌గా అయ్యాడు.
( 12), రైనా (0) నిరాశపరిచాడు. కెప్టెన్ ఈ మ్యాచ్‌లో ఓంటరి పోరాటం చేశాడు.
బౌలర్లతో కూడి ఒక్కోక పరుగు కోసం వెచ్చి చూశాడు. 86 బంతులల్లో నాలుగు
సిక్స్‌లు, ఏడు పోర్లు సహయంతో 92 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో
స్టెయిన్ మూడు వికెట్లు తీయగా, మోర్కెల్, తాహిర్ చెరో రెండు వికెట్లు
తీయగా, రబాడా ఒక వికెటు లభించింది.
టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు
సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో
వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే
సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది.
ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే
తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా
తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
హర్భజన్‌కు చాన్స్!
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్.
పక్కటెముకల గాయంతో గత మ్యాచ్‌లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ
మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా
మేనేజ్‌మెంట్‌నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది
జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం
జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ
స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ
పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్
రాణించలేకపోయింది.
రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం
ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి,
రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా
కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్
బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి
దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును
పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా
చాటాల్సి ఉంది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్,
డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర