Friday, October 2, 2015

వార్మప్‌ మ్యాచ్‌ను తిరగేసిన సౌతాఫ్రికా

రోహిత్‌ శర్మ సెంచరీ వృధ్దా
ఏబి డివిలర్‌ అర్థసెంచరీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ డుమిని


                 వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. ఇప్పుడు సౌతాఫ్రికా జట్టు టి20 మ్యాచ్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మధ్య జరిగిన మొదటి టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్‌మెన్‌ జె.పి. డుమిని కేవలం 34 బంతులల్లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోరు సహయంతో 68 పరుగులు చేసి విజయం జట్టుకు విజయం అందించాడు. అతని తోడు బిహర్‌డిన్‌ 23 బంతులల్లో ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లుతో సహయంతో 32 పరుగులు చేసి జట్టుకు సహయ పడ్డాడు. వీరిద్దరు కలసి నాల్గొవికెట్టుకు 105 పరుగుల బాగ్యస్వామం నెలకోల్పారు. అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. ఓపెనరు శిఖర్‌ ధావన్‌ 3 పరుగులకే రనౌట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు. రోహిత్‌కు తోడుగా విరాట్‌ కోహ్లి జతకలిశారు. రెండో వికెట్లుకు 138 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ మొదటి ఓవర్‌ నుంచి సౌతాఫ్రికాపై ఎదురుదాడి చేశాడు. ఆవాకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎడ్‌లో విరాట్‌ కోహ్లి కూడా అతని సమానంగా అడ్డాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్స్‌లతో రోహిత్‌ చేలరెగిపోయాడు. రోహిత్‌ సెంచరీ చేసి తర్వాత ఓవర్లల్లో అబాట్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. అదే ఓవర్లల్లో విరాట్‌ కోహ్లి   ( 43) ఔట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బ్యాట్‌మైన్‌ తక్కువ పరుగులు చేశారు. భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు భారీ లక్షాన్ని ఉంచింది. టీమిండియా మంచి స్కోరు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అబాట్‌ రెండు వికెట్లు తీయగా మౌరిస్‌ ఒక వికెటు లభించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డివిలర్‌ 42 బంతులల్లో ఒక సిక్స్‌, ఏడు ఫోర్లులతో అర్థసెంచరీ చేశాడు. ఆమ్లా 36 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. డుమిన్‌ 68, బిహర్‌డిన్‌ 32 పరుగులు చేసి విజయం సాధించారు.

Wednesday, September 30, 2015

సమంత,నయనతార,విజయ్ ఇళ్లపై ఐటీ దాడులు



సినీ తారలు సమంత.. నయనతార.. తమిళ యువనటుడు విజయ్ ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. తిరువనంతపురం.. కొచ్చి.. చెన్నైలతో పాటు.. దేశ వ్యాప్తంగా వీరికి ఆస్తులున్న 32 ప్రాంతాల్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్.. చెన్నైలలోని సమంత.. నయనతార ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక.. విజయ్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పేరుప్రఖ్యాతులున్న ముగ్గురు సినీతారల ఆస్తులపై తనిఖీలు జరపటం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సమాజ సేవ చేస్తూ.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సమంత ఆస్తులపైనా అధికారులు దాడులు జరపటం విపరీతమైన చర్చకు తావిస్తోంది. ఈ ముగ్గురు తారల ఇళ్లపై ఐటీ శాఖాధికారులు జరుపుతున్న దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tuesday, September 29, 2015

అక్టోబర్‌ 29న హర్బజన్‌ సింగ్‌ పెళ్లి...

 ఇండియాన్‌ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి గీతాబస్రాల పెళ్లి తేదీ ఖరారైంది. అవుననే అంటున్నాయి. మీడియా వర్గాలు వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్‌ 29న వీరు పంజాబ్‌లో పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుందట. నవంబర్‌ 1వ తేదీన దిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం గీతా లండన్‌లో ఉంది. ముంబయిలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నారట. హర్భజన్‌కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖారారు చేసినట్లు సమాచారం.

Monday, September 28, 2015

సిద్ధాపురం గ్రామాన్ని శ్రీమంతుడు చెసే పనులు

 సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని మహేష్ అన్నారు. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు తెరదించారు. మంత్రి కేటీఆర్, మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.

సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్‌బాబు

  సినీ నటుడు మహేష్‌బాబు పాలమూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొన్న విషయం విదితమే. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు తెరదించారు. మంత్రి కేటీఆర్, మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్‌బాబు పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని మహేష్‌బాబు అన్నారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు మహేష్‌బాబు అన్నారు. మహేష్‌బాబు సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Sunday, September 27, 2015

నిమజ్జనానికి బయలుదేరిన ఘన నాథులు


నగరంలో గణేష్ శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ఘన నాథుల విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. సుందరంగా అలంకరించిన వాహనాలపై వినాయకుని విగ్రహాలను కొలువు తీర్చారు. వీనుల విందైన సినిమా, భక్తి గీతాలతో బొజ్జ గణపయ్య విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ మూషిక వాహనున్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తీసుకు వస్తున్నారు. గణపతి బొప్ప మొరియా, తుల్జ మొల్చి నౌకరియా అని ఏక దంతున్ని కొలస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రానికల్లా హుస్సేన్‌సాగర్ ప్రాంతం వినాయకుని విగ్రహాలతో తరలివచ్చే వాహనాలు, భక్తులతో రద్దీగా మారనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు రోడ్లపైకి చేరుకున్నారు. శోభాయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.







Saturday, September 26, 2015

నిమజ్జనోత్సవం రెడీ

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వినాయక విగ్రహాలు ఊరేగింపుతో వచ్చే ప్రధాన శోభాయాత్ర రహదారులన్నింటిని మూసివేయనున్నారు. నగర వాసులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రధాన ఉరేగింపు ర్యాలీ జరిగే రూట్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదు, కేవలం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.








Thursday, September 24, 2015

యా .. ఆల్లా ..

 ముస్లింలకు పరమ పవిత్రమైన హజ్‌యాత్రలో మహా విషాదం చోటుచేసుకొంది. సౌదీ అరేబియాలోని మీనాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగిన తొక్కిసలాటలో 717 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో రాష్ర్టానికి చెందిన ఓ మహిళ సహా నలుగురు భారతీయులున్నారు. ఈ దుర్ఘటనలో 860 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు. మృతుల్లో అనేక దేశాల పౌరులున్నారని సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానిక మీడియా పేర్కొంది. 1990 తర్వాత హజ్‌యాత్రలో ఇంతటి విషాదం చోటుచేసుకోవటం ఇదే మొదటిసారి. ముస్లింల పవిత్ర నగరం మక్కాలో ఈ నెల 11న గ్రాండ్ మసీదుపై భారీ క్రేను కూలిన ఘటనలో 11మంది భారతీయులుసహా 115 మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే


సౌదీ అధికారులతో విదేశాంగ శాఖ మంతనాలుఈ సంవత్సరం హజ్‌ యాత్రలో మన దేశం నుంచి సుమారు లక్షన్నర మంది హాజరైనట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. మక్కాలో జరిగిన ఘోర ప్రమాదంపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్‌ స్వరూప్‌ మీడియాకు తెలిపారు. ఘటనపై కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా స్పందించారు. మక్కాకు లక్షన్నర మందికి పైగా భారతీయులు వెళ్లారని చెప్పారు. యాత్రకు ఎంత మంది వెళ్లారన్న దానిపై విదేశాంగ శాఖ, హజ్‌ కమిటీ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని, దాని ఆధారంగా అన్ని వివరాలు తెలుసుకుంటామన్నారు. విభిన్న కోటాల్లో రాష్ట్రాలు యాత్రికులకు సాయం చేస్తూ హజ్‌ యాత్రకు పంపిస్తున్నందున హజ్‌ సెల్‌ పేరిట విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తోందని వివరించారు.