హీరో గోపీచంద్ తాజాగా తండ్రయ్యాడు. ఇటీవలే
గోపీచంద్ తండ్రి కాబోతున్నాడనే విషయం మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం
తెల్సిందే. తాజాగా నేడు ( అక్టోబర్ 13) గోపీచంద్ భార్య రేష్మి పండంటి
బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ' లౌక్యం' చిత్ర యూనిట్ మీడియాకు
వెళ్లడించింది. గోపీచంద్ తాజాగా నటించిన ' లౌక్యం' చిత్రం ఇటీవలే
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచిత్రం విజయంతో పాటు బాబు పుట్టాడనే
సంతోషయంతో గోపీచంద్ ఉన్నాడు. గత సంవత్సరం హీరో శ్రీకాంత్ మేనకోడలును
పెళ్లి చేసుకున్నాడు.
Monday, October 13, 2014
Sunday, October 12, 2014
వణికించిన హుదూద్!
తీవ్ర పెను తుఫాన్‌గా మారిన
హుదూద్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరం దిశగా శరవేగంగా దూసుకొస్తున్నది. భారీ
నుంచి అతి భారీ వర్షాలు, ప్రచండమైన ఈదురుగాలులతో ఆదివారం మధ్యాహ్నం విశాఖ
సమీపంలో తీరాన్ని ఢీకొట్టనుంది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల
మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలు
చిగురుటాకులా వణికిపోతున్నాయి.
మరో 3 రోజులుకుంభవృష్టి హుదూద్ తుఫాన్ ప్రభావం కారణంగా మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖలో పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్ ప్రభావం కొంతమేరకు తగ్గినా కూడా ఈ నెల 15 వ తేదీ వరకూ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో గాలులు తీవ్రత అంతగాలేదని, దక్షిణ ఒడిశాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.
తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హుదుద్ ప్రభావం
హుదుద్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంపై తీవ్రప్రభావాన్ని చూపించింది. మండలంలోని తిర్రియానం, పల్లంకుర్రు, వలసలతిప్ప గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పల్లంకుర్రు గ్రామంలోని పాఠశాలలో బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పునరావాలస కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుదుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం తూర్పుగోదావరి జిల్లా నుండి లక్ష ఆహార పొట్లాలను ప్రభుత్వం తరలించింది. మరో పక్క విశాఖ నగరంలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. ఈదురుగాలులకు కూలిన కటౌట్లు, ఫ్లెక్సిలు, చెట్ల కొమ్మలతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలు వీధులు ద్విచక్ర వాహనాలను నడిపించే పరిస్థితి కూడా లేదంటున్నారు.
విశాఖలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
హుదుద్ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తుఫాను తీరం దాటిన సమయం నుండీ భారీ ఈదురుగాలులతో విశాఖ నగరం అతలా కుతలం అయింది. దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రమే విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. తుఫాను సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు రేడియోలను ఆశ్రయిస్తున్నారు. తుఫాను బాధితుల కోసం షెల్టర్లుగా రైలు బోగీలు కాగా తుపాను బాధితుల కోసం ఖాళీ రైలు బోగీలను షెల్టర్లుగా ఉపయోగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని కోసం రాజమండ్రి నుండి విశాఖ వరకు 55 ఖాళీ రైలు కోచ్‌లను పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిసా తీరంపై హుదుద్ ప్రభావం పాక్షికంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోపాల్‌పూర్, భవనేశ్వర్, కటక్, గంజామ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోపాల్‌పూర్ తీరంలో బలమైన అల ఒక యువతిని సముద్రంలోకి లాగేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.
తీరం దాటే సమయంలో భారీ వర్షాలు
హుదూద్ తుఫాన్ తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భావిస్తున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాన్.. గత కొద్ది గంటలుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. ఇది ఉత్తరాంధ్ర తీరం మీదుగా ప్రయాణించి విశాఖపట్టణం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుందని భారత వాతావరణశాఖ శనివారం తన బులిటెన్‌లో తెలిపింది.మరో 3 రోజులుకుంభవృష్టి హుదూద్ తుఫాన్ ప్రభావం కారణంగా మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖలో పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్ ప్రభావం కొంతమేరకు తగ్గినా కూడా ఈ నెల 15 వ తేదీ వరకూ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో గాలులు తీవ్రత అంతగాలేదని, దక్షిణ ఒడిశాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.
తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హుదుద్ ప్రభావం
హుదుద్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంపై తీవ్రప్రభావాన్ని చూపించింది. మండలంలోని తిర్రియానం, పల్లంకుర్రు, వలసలతిప్ప గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పల్లంకుర్రు గ్రామంలోని పాఠశాలలో బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పునరావాలస కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుదుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం తూర్పుగోదావరి జిల్లా నుండి లక్ష ఆహార పొట్లాలను ప్రభుత్వం తరలించింది. మరో పక్క విశాఖ నగరంలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. ఈదురుగాలులకు కూలిన కటౌట్లు, ఫ్లెక్సిలు, చెట్ల కొమ్మలతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలు వీధులు ద్విచక్ర వాహనాలను నడిపించే పరిస్థితి కూడా లేదంటున్నారు.
విశాఖలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
హుదుద్ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తుఫాను తీరం దాటిన సమయం నుండీ భారీ ఈదురుగాలులతో విశాఖ నగరం అతలా కుతలం అయింది. దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రమే విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. తుఫాను సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు రేడియోలను ఆశ్రయిస్తున్నారు. తుఫాను బాధితుల కోసం షెల్టర్లుగా రైలు బోగీలు కాగా తుపాను బాధితుల కోసం ఖాళీ రైలు బోగీలను షెల్టర్లుగా ఉపయోగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని కోసం రాజమండ్రి నుండి విశాఖ వరకు 55 ఖాళీ రైలు కోచ్‌లను పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిసా తీరంపై హుదుద్ ప్రభావం పాక్షికంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోపాల్‌పూర్, భవనేశ్వర్, కటక్, గంజామ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోపాల్‌పూర్ తీరంలో బలమైన అల ఒక యువతిని సముద్రంలోకి లాగేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.
Saturday, October 11, 2014
రెండో వన్డేలో భారత్ గెలుపు
టీమిండియా పుంజుకుంది.
విండీస్‌తో రెండో వన్డేలో ఘన విజయం సాధించి కోచి పరాజయానికి ప్రతీకారం
తీర్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ధోనీసేన
రెండో వన్డేలో 48 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1కు సమం చేసింది.
విరాట్ కోహ్లి (62, 78 బంతుల్లో 5ఫోర్లు), సురేష్ రైనా (62, 60 బంతుల్లో
5ఫోర్లు, 2సిక్స్‌లు), హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ ధోని (51
నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో విండీస్ ఓపెనర్ స్మిత్ (97)
రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేదు. బౌలర్లు షమి, జడేజా, మిశ్రాలు
విండీస్ పతనాన్ని శాసించారు.
263 పరుగుల ఛేదనలో విండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (97), డారెన్ బ్రావో (26) 64 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. లెండ్లీ సిమ్మోన్స్ గాయం కారణంగా ఓపెనర్‌గా వచ్చిన బ్రావో..స్మిత్‌తో కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అర్థ సెంచరీ భాగస్వామ్యంతో సాఫీగా వెళ్తోన్న విండీస్ ఇన్నింగ్స్‌కు మహ్మద్ షమి బ్రేక్ ఇచ్చాడు. చక్కటి బంతితో బ్రావో వికెట్లను గిరాటేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ పొలార్డ్ (40) పించ్ హిట్టర్‌గా ఎడాపెడా బౌండరీలు బాదాడు. మూడు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్..మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ ఏమాత్రం జోరు తగ్గించకుండా నిర్థాక్షిణ్యంగా బౌండరీలు బాదాడు. 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు సాధించిన స్మిత్ సెంచరీ ముంగిట షమికి వికెట్‌కు కోల్పోయాడు. తొలి వన్డే సెంచరీ హీరో శామ్యూల్స్ (16)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. దినేస్ రామ్‌దిన్ (3)ను మిశ్రా తన ఆఖరి ఓవర్‌లో ఔట్ చేశాడు. వరస ఓవర్లలో ఫామ్‌లో ఉన్న శామ్యూల్స్, రామ్‌దిన్‌లు ఔట్ కావటంతో విండీస్ ఒత్తిడిలో పడింది. కెప్టెన్ బ్రావో(10), డారెన్ సామీ (1), రస్సెల్ (4)లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చిన ధోనీసేన మ్యాచ్‌పై పట్టు బిగించింది.
రాణించిన కోహ్లి, రైనా : టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియాకు కోచి వన్డేలాగా శుభారంభం మాత్రం దక్కలేదు. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్ చేరి నిరుత్సాహపరిచారు. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (1)ను టేలర్ బలిగొనటంతో టీమిండియా పరుగుల వేటలో వెనకంజ వేసింది. మరో ఓపెనర్ అజింక్య రహానే(12) సామీ బౌలింగ్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (32) మరోసారి చక్కటి శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచటంలో విఫలమయ్యాడు. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నంలో రాయుడు స్పిన్నర్ సులేమాన్ బెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాయుడు నిష్క్రమణ అనంతరం కోహ్లికి జతకలిసిన రైనా టీమిండియాకు భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. కోహ్లి నెమ్మదిగా ఆడినా రైనా మంచి స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన కోహ్లి, రైనా నాల్గో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలోనే రైనా, కోహ్లిలు అర్థ శతకాలు పూర్తి చేశారు. ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన రైనా..మరో సెంచరీ దిశగా సాగుతున్నట్లే కనిపించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన రైనా పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన కోహ్లి..ఈఏడాది ఫిబ్రవరి తర్వాత (వన్డే, టెస్ట్‌ల్లో) నమోదు చేసిన ఏకైక అర్థ శతకం ఇదే కావటం విశేషం. కెప్టెన్ ధోని (51నాటౌట్, 40 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్) ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 250 దాటించాడు. రవీంద్ర జడేజా (6) కీలక సమయంలో పరుగులు చేయటంలో విఫలమయ్యాడు.

Wednesday, October 1, 2014
అమీర్‌ఖాన్‌తో సినిమా!
దర్శకుడు రాజమౌళికి
బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వుంది. ఆయన దర్శకత్వం వహించిన
విక్రమార్కుడు మర్యాద రామన్న చిత్రాలు హిందీలో పునర్నిర్మించబడి భారీ
విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా షాహిద్‌కపూర్ హీరోగా
సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో మగధీర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.
ఇదిలావుండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ హీరోగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన వున్నట్లు రాజమౌళి వెల్లడించారు. హిందీ చిత్రాల్ని తక్కువగా చూస్తాను. అయితే అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్‌హీరాని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అమీర్‌ఖాన్ హీరోగా సినిమా చేయాలనే ఆలోచన వుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు రాజమౌళి.

Wednesday, September 24, 2014
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...?
Monday, July 14, 2014
టెస్టు క్రికెట్‌కు మహేల గుడ్‌బై
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్‌కు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. స్వదేశంలో ఈ నెల 16న దక్షిణాఫ్రికాతో, ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ఆనంతరం జయవర్ధనే టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.
దీనికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అశ్లే డిసిల్వాకు జయవర్ధనే(37) లేఖ రాసినట్లు లంక బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. గత 18 ఏండ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కాని టెస్టు కెరీర్ నుంచి వైదొలగడానికి ఇది సరైన సమయం అని జయవర్ధనే పేర్కొన్నాడు. 1997లో భారత్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ లంక దిగ్గజ బ్యాట్స్‌మన్ 145 టెస్టుల్లో 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక తొలిసారి నెగ్గిన అనంతరం సహచర ఆటగాడు సంగక్కరతో కలిసి మహేల టీ20లకు గుడ్‌బై చెప్పాడు.
జర్మనీ జట్టు విజేత
బ్రెజిల్ వేదికగా జరిగిన జర్మనీ-అర్జెంటీనా సాకర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఎవ్వరూ ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో మరో 30 నిమిషాల అదనపు సమయానికి వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ 113వ నిమిషంలో జర్మనీ ఆటగాడు గోట్జే గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం మిగిలిన ఏడు నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా జట్టు గోల్ సాధించలేకపోయింది. దీంతో 1-0 ఆధిక్యంతో జర్మనీ జట్టు సాకర్ ప్రపంచ విజేతగా నిలిచింది.
నాలుగోసారి ప్రపంచకప్ గెలుచుకున్న జర్మనీ
అర్జెంటీనాతో నేడు జరిగిన ఫైనల్‌మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా 24 ఏళ్ల తర్వాత జర్మనీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు జర్మనీ జట్టు నాలుగుసార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. సాకర్ ప్రపంచకప్ పోటీల్లో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరిన జర్మనీ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1954లో మొదటిసారి, 1974లో రెండోసారి, 1990లో మూడోసారి, 2014లో నాల్గొవసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 1966, 1982, 1986, 2002లో రన్నరప్‌గా నిలిచింది.
Wednesday, July 9, 2014
విజయ్ అజేయ సెంచరీ
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. ఓపెనర్ మురళీ విజయ్ (122 బ్యాటింగ్; 294 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. విజయ్‌కు జతగా కెప్టెన్ ధోనీ (50 బ్యాటింగ్; 64 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. ఇద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అంతకుముందు విజయ్‌కి పుజార (38), రహానే (32)లు చక్కగా సహకరించారు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయిన దశలో పుజార, రహానేలతో విజయ్ 73, 71 పరుగులు జోడించి ఇన్నింగ్‌ను గాడిలోపెట్టాడు. ధవన్ (12), కోహ్లీ (1)లు మాత్రం నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించేక్రమంలో భారత్‌కు రెండోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం. చేతిలో 6 వికెట్లు మిగిలివున్న దశలో 375-425 వరకు సాధిస్తే, తర్వాత బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు. అండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్‌ను పక్కనబెట్టారు.
స్కోరుబోర్డు భారత్: విజయ్ (బ్యాటింగ్) 122, ధవన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12, పుజార (సి) బెల్ (బి) అండర్సన్ 38, కోహ్లీ (సి) బెల్ (బి) బ్రాడ్ 1, రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32, ధోనీ (నాటౌట్) 50, ఎక్స్‌ట్రాలు: 4,
వికెట్ల పతనం: 1-33, 2-106, 3-107, 4-178;
బౌలింగ్: అండర్సన్ 21-6-70-2, బ్రాడ్ 19-8-26-1, స్టోక్స్ 19-4-47-0, ప్లంకెట్ 21-4-56-1, అలీ 9-0-50-0, రూట్ 1-0-6-0.
Subscribe to:
Posts (Atom)