Wednesday, September 24, 2014
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...?
Monday, July 14, 2014
టెస్టు క్రికెట్‌కు మహేల గుడ్‌బై
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్‌కు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. స్వదేశంలో ఈ నెల 16న దక్షిణాఫ్రికాతో, ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ఆనంతరం జయవర్ధనే టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.
దీనికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అశ్లే డిసిల్వాకు జయవర్ధనే(37) లేఖ రాసినట్లు లంక బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. గత 18 ఏండ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కాని టెస్టు కెరీర్ నుంచి వైదొలగడానికి ఇది సరైన సమయం అని జయవర్ధనే పేర్కొన్నాడు. 1997లో భారత్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ లంక దిగ్గజ బ్యాట్స్‌మన్ 145 టెస్టుల్లో 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక తొలిసారి నెగ్గిన అనంతరం సహచర ఆటగాడు సంగక్కరతో కలిసి మహేల టీ20లకు గుడ్‌బై చెప్పాడు.
జర్మనీ జట్టు విజేత
బ్రెజిల్ వేదికగా జరిగిన జర్మనీ-అర్జెంటీనా సాకర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఎవ్వరూ ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో మరో 30 నిమిషాల అదనపు సమయానికి వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ 113వ నిమిషంలో జర్మనీ ఆటగాడు గోట్జే గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం మిగిలిన ఏడు నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా జట్టు గోల్ సాధించలేకపోయింది. దీంతో 1-0 ఆధిక్యంతో జర్మనీ జట్టు సాకర్ ప్రపంచ విజేతగా నిలిచింది.
నాలుగోసారి ప్రపంచకప్ గెలుచుకున్న జర్మనీ
అర్జెంటీనాతో నేడు జరిగిన ఫైనల్‌మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా 24 ఏళ్ల తర్వాత జర్మనీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు జర్మనీ జట్టు నాలుగుసార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. సాకర్ ప్రపంచకప్ పోటీల్లో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరిన జర్మనీ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1954లో మొదటిసారి, 1974లో రెండోసారి, 1990లో మూడోసారి, 2014లో నాల్గొవసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 1966, 1982, 1986, 2002లో రన్నరప్‌గా నిలిచింది.
Wednesday, July 9, 2014
విజయ్ అజేయ సెంచరీ
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. ఓపెనర్ మురళీ విజయ్ (122 బ్యాటింగ్; 294 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. విజయ్‌కు జతగా కెప్టెన్ ధోనీ (50 బ్యాటింగ్; 64 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. ఇద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అంతకుముందు విజయ్‌కి పుజార (38), రహానే (32)లు చక్కగా సహకరించారు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయిన దశలో పుజార, రహానేలతో విజయ్ 73, 71 పరుగులు జోడించి ఇన్నింగ్‌ను గాడిలోపెట్టాడు. ధవన్ (12), కోహ్లీ (1)లు మాత్రం నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించేక్రమంలో భారత్‌కు రెండోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం. చేతిలో 6 వికెట్లు మిగిలివున్న దశలో 375-425 వరకు సాధిస్తే, తర్వాత బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు. అండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్‌ను పక్కనబెట్టారు.
స్కోరుబోర్డు భారత్: విజయ్ (బ్యాటింగ్) 122, ధవన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12, పుజార (సి) బెల్ (బి) అండర్సన్ 38, కోహ్లీ (సి) బెల్ (బి) బ్రాడ్ 1, రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32, ధోనీ (నాటౌట్) 50, ఎక్స్‌ట్రాలు: 4,
వికెట్ల పతనం: 1-33, 2-106, 3-107, 4-178;
బౌలింగ్: అండర్సన్ 21-6-70-2, బ్రాడ్ 19-8-26-1, స్టోక్స్ 19-4-47-0, ప్లంకెట్ 21-4-56-1, అలీ 9-0-50-0, రూట్ 1-0-6-0.
Tuesday, July 8, 2014
ప్రయివేటు దిశలో రైల్వే
మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్ ఓ వైపు సంపన్నుల సౌకర్యాలకు పెద్దÄపీట వేస్తూ మరో వైపు సామాన్యుడిని నిర్లక్ష్యం చేసింది. భారాలకు బాటలు వేసింది. బుల్లెట్, సెమీ బుల్లెట్ రైళ్లు, ప్రీమియం ఎసి రైళ్లు, రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు, బయో టాయిలెట్లు, ఆన్‌లైన్‌లో నిమిషంలో 7200 టికెట్లు బుక్ చేసుకునే వీలు..ఇలా బ్రహ్మాండమైన సౌకర్యాల రంగుల చిత్రం చూపించారు. అదే సమయంలో సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే చార్జీలు సంవత్సరానికోసారి బడ్జెట్ సమయంలో సమీక్షించే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై రైల్వే వాడే ఇంధనాలు-బొగ్గు, డీజిల్, విద్యుత్- ధరల ఆధారంగా తరచూ చార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు మంత్రి సదానంద గౌడ. దీనికి తోడు ఈ బడ్జెట్‌లో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యానికి(పిపిపి), విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచి పరిచారు. వీటి చరిత్ర మన దేశంలో కాని ఇతర దేశాల్లో కాని చూస్తే లాభాల వేటలో చార్జీల మోత భరించలేని స్థాయికి చేరడం ఖాయం. లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్‌లో తమ ప్రాధాన్యతని పేర్కొనడంలో ఉద్దేశం కూడా వీరికి లాభాలు చేకూర్చడమే. ఈ నిర్ణయంతో వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే లైన్లు వేసే సామాజిక బాధ్యతను విస్మరించింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మోడీ సర్కార్ మొండి చేయి చూపినట్లే. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నవిధంగా ఓ కమిటీ వేశాం దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల నుండి వ్యతిరేకతను తగ్గించే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులున్నాయి వాటికి 20,690 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. కేటాయింపుల ప్రస్తావనే లేదు. భారత రైల్వేలను కార్పొరేటీకరించే దిశగా తొలి అడుగులు వేసింది మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్.
Monday, July 7, 2014
విలన్‌గా.. చేయాలనుంది..
'చాలా రోజుల తర్వాత మంచి కుటుంబ కథా చిత్రాన్ని చేశాను. 27 సంవత్సరాల
కెరీర్‌లో 'హైటైం'లో చేసిన సినిమా ఇది. రైట్‌టైమ్ అనేది మనచేతుల్లోలేదు.
కానీ హైటైం అనేది ఎప్పుడోవస్తుంది. ఈ విభాగంలో థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్న
కథను చేయలేదు. అది 'దృశ్యం'తోనే కుదిరింది' అని విక్టరీ వెంకటేష్ అన్నారు.
రాజ్‌కుమార్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన
'దృశ్యం' చిత్రం ఈనెల 11న విడుదలవుతుంది.

Sunday, June 29, 2014
బోనమెత్తి.. పరవశించి
శివసత్తులు ఊగంగా.. పోతరాజులు ఆడంగా.. తెలంగాణ ఆడపడుచులు బోనమెత్తి
పరవశించిపోయారు. స్వరాష్ట్రంలో సగర్వంగా బోనమెత్తిన నగరం పులకించిపోయింది.
గోల్కొండ కోట భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో
మార్మోగింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాల పండుగ
అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక
ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. గోల్కొండలో
మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపునకు ఆత్మీయ స్వాగతం పలికారు.
విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు.
ఆలస్యంగా ప్రారంభం
బోనాల పండుగ మొదటి పూజ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మధ్యాహ్నం1.30కు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ రామకష్ణారావు పట్టువస్ర్తాలను తీసుకొని లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వస్ర్తాలను తీసుకెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ తీగుల్ల విజయ్‌కుమార్‌కు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి తొట్టెలకు పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌సింగ్, నాయకులు కావూరి వెంకటేష్, తూముకుంట అరుణ్‌కుమార్, కోడూరి శ్రీధర్‌సాగర్ తదితరులు నత్యం చేశారు.
విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు.
కోట వద్ద పోతరాజుల విన్యాసాలు
గోల్కొండ కోట ప్రవేశ ద్వారం చౌరస్తా వద్దకు ఊరేగింపు చేరుకోగానే పోతరాజుల బందం చేసిన హడావుడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుపక్కల పోతరాజులు కలియతిరుగుతూ గోల్కొండ ఆలయం వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. అక్కడి నుంచి వేగంగా కోటపై ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు. దీంతో తొలి రోజు బోనాల ఉత్సవం ముగిసింది.
ఊపిరిపీల్చుకున్న పోలీసులు
రంజాన్, బోనాల పండుగ తొలిపూజ ఆదివారమే కావడంతో నగర పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఉన్నతాధికారులు పలుమార్లు పీస్‌మైత్రి కమిటీ సమావేశాలను నిర్వహించారు. అంతేకాకుండా ఆదివారం భారీగా పోలీసులను మోహరించారు. బోనాల మొదటి పూజ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనలతో వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీలు లింబారెడ్డి, , గోషామహల్, ఆసిఫ్‌నగర్, ఏసీపీలు డి. శ్రీనివాస్, రాంభూపాల్‌రావు, బందోబస్తులో పాల్గొన్నారు.
సందర్శకుల తాకిడి
బోనాల పండుగను పురస్కరించుకుని గోల్కొండ కోటలోని ఉచిత ప్రవేశం ఉండటంతో ఆదివారం రికార్డు స్థాయిలో గోల్కొండను సందర్శకులు సందర్శించారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు ఆదివారం ఒక్కరోజే గోల్కొండను సందర్శించడం విశేషం.
Friday, June 27, 2014
Subscribe to:
Posts (Atom)







