Tuesday, February 5, 2013

Monday, February 4, 2013

అధికారంలోకొస్తే ... ఏడాదికి 10 సిలిండర్లు : చంద్రబాబు నాయుడు

టిడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకొస్తే ... ఏడాదికి 10 సిలిండర్లు సూచనలు.
అదికారంలోకి వస్తే మాత్రం ఏడాదికి 12 సిలిండర్లు, అలాగే డిజీల్‌ లీటరుకు 30 రూపాయాలు, పెట్రోల్‌ లీటరుకు 50 రూపాయాలు ఇస్తారా అలాగే పేద ప్రజలకు నిత్యవసరమైన ధాన్యలు తక్కువ రేట్టుకు వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి. నగరంలో గాంధీ ఆసుపత్రి వద్ద రోగాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని అందుకోనే వారు లేరు. విద్యుత్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, డిజీల్‌, పెట్రోల్‌, ఇలా చాలా వరకు ప్రభుత్వం రేట్లు పెంచుకుంట్లు పోతుంది. వారిని ఖండిచి ప్రజలో మార్పు తీసుకురావాల్సిందిగా మనవి.

Thursday, January 31, 2013

' ఛీ ' కొడతారు

కాంగ్రెస్‌ తీరు ఎప్పటి మారుతుందో. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైపోతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రజలల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌ను తిట్టిపోతున్నారు. ఎంత తిట్టినా కాని కాంగ్రెస్‌లో మార్పు ఉండదు అన్ని గట్టిగా చేబుతున్నారు. ఒకప్పుడు చెయ్యి గుర్తు అనగానే ప్రజల్లో అనందం కలిగేది. ఇప్పుడు అదే ప్రజలు ' ఛీ ' అంటున్నారు.   
ఎందుకు అనగా ... ?
కాంగ్రెస్‌ ప్రజల సమస్యలను తీర్చడం లేదు. అలాగే ప్రజలపై తీవ్ర భారాలు వేస్తున్నారు. ఓటేసిన పాపానికి అనేక రకాలుగా భారాలు మోపుతూ చక్కటి బుద్ధి చెబుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌, ఆర్టీసి ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతే ప్రజల జీవనం రోజురోజుకూ దుర్భరంగా మారిపోతోంది. కాంగ్రెస్‌ అధిరారంలో ఉన్నన్నిరోజులు ఈ నాటకాలు కొనసాగిస్తుందని సమాన్య ప్రజానికానికి చాలా భాగా అర్థమైంది. ఈ విధంగా అడ్డగోలుగా పరిపాలిస్తూ పోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారు.

Sunday, December 23, 2012

వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా సచిన్‌ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వన్డేలకు గుడ్‌బై చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. వన్డేలకు గుడ్‌బై చెప్పినప్పటికీ, టెస్టుల్లో కొనసాగుతానని ఆయన తెలిపారు. టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌ వ్యవహరించారు. సచిన్‌ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. పాక్‌ సిరీస్‌కు ముందుగానే ఆయన వన్డేలకు ఆడనని రిటైర్మెంట్‌ చేయడం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు చేశాడు. వన్డేల్లో సచిన్‌ అత్యధిక స్కోరు 200 నాటౌట్‌గా ఉన్నాడు. వన్డేల్లో 154 వికెట్లు తీశాడు. వన్డేల్లో సచిన్‌ బ్యాటింగ్‌ సగటు 44.86గా ఉంది. సచిన్‌ తన కెరీర్‌లో తొలి, చివరి వన్డేలను పాకిస్థాన్‌పైనే ఆడారు. 23 ఏళ్ల వన్డే క్రికెట్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. వన్డేలకు సచిన్‌ గుడ్‌బై చెప్పిన మాట నిజమేనంటూ బీసీసీ సచిన్‌ రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీంలో ఉండడం తన అదృష్టమని సచిన్‌ చెప్పారు. వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాట వాస్తమేనని ఆయన స్పష్టం చేశారు. టెస్టుల్లో కొనసాగుతానని సచిన్‌ ప్రకటించారు. తనకు అండగా నిలిచిన సహచరులు, బీసీసీఐ సభ్యులు, క్రికెట్‌ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వన్డేలకు గుడ్‌బై చెబుతూ సచిన్‌ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. వన్డేల్లో ఎంతో ప్రతిభకనబర్చిన సచిన్‌ అందరికీ ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు.
అందరికీ కృతజ్ఞతలు : సచిన్‌
క్రికెట్‌లో ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన వారందరికీ సచిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం సచిన్‌ మీడియాతో మాట్లాడారు. టీమిండియా భవిష్యత్‌ ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2015 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహక ప్రక్రియ ప్రారంభించాలని టీంకు సూచించారు.

Friday, December 21, 2012

తెలుగు హీరోయిన్లులల్లో నెం1 హీరోయిను హ్యాపీబర్త్‌డే

తెలుగు హీరోయిన్లులల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న తమన్న ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. 


Sunday, November 4, 2012

శాండీ తుఫాన్ లో ఆర్తి అగర్వాల్

  అమెరికాలో శాండీ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజెర్సీతో పాటు.. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా రాష్ట్రాలు ఈ భీకర తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాయి. న్యూయార్క్‌ సిటీ సగానికి పైగా నీటమునిగింది.
ఈ నేపధ్యంలో మన తెలుగు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ..శాండి తుఫానులో చిక్కుకుందనే వార్త అబిమానులను కలవరపెడుతోంది. అయితే శాండీ ఎఫెక్టు తో ఆర్తికి పెద్దగా నష్టమేమీ జరగలేదని సమాచారం. ఆమె బస చేస్తున్న మోటల్ తుఫాను తాడికికి చిక్కుకుంది. అక్కడ నుంచి అమెరికా పోలీసులు ఆర్తిని ఖాళీ చేయించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా..ప్రస్తుతం ఆమెను అమెరికా న్యూ జర్శీలో గల ఓ సీనియర్ సిటిజన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతోంది అన్ని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్...ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అమెరికాలో భర్తతో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ాముద్రః అనే చిత్రంలో నటిస్తోంది