Saturday, September 29, 2012

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి వైదొలగింది. సూపర్‌ ఎయిట్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ మరో మ్యాచ్‌ గెలిస్తే సెమిఫైనల్‌ చేరుకుంటుంది. అలాగే భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికి గ్రూప్‌-1 నుంచి పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రిపై పాకిస్థాన్‌ గెలిచింది అంటే నమ్మడం తక్కువ. భారత్‌ సెమిఫైనల్‌ వెళ్లడం దురదుష్టం. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక్కటి పాకిస్థాన్‌, మరోకటి సౌతాఫ్రికా రెండు టఫ్‌ మ్యాచ్‌ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ గెలిచిస్తే సెమిఫైనలో స్థానం దక్కుతుంది.

Wednesday, September 19, 2012

టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి అడుగు

 టీ 20 వరల్డ్‌కప్‌ రెండో రోజు భారత్‌ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లల్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగుల సాధించింది. కోహ్లీ 50, రైనా 38, యువరాజ్‌ సింగ్‌ 18 పరుగులు చేశారు. ధోని 18, శర్మ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌ 136 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ అప్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.

Tuesday, September 18, 2012

Sunday, August 26, 2012

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

 ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ ఇన్నింగ్‌ఇ్స 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు అలౌటయ్యింది. నాలుగు రోజుల్లోనే ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసింది. టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ విజయం సాధించింది. మెక్‌ కల్లమ్‌ (52), విలియమ్సన్‌ 42, మాత్రమే రాణించారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌చేసి 6 వికెట్లు నేలకూల్చాడు. ఓజా 3 వికెట్లు పడగొట్టాడు. యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 438 పరుగులు, కివీస్‌ 159 పరుగులు చేసింది. రెండో టెస్ట్‌ ఈనెల 31ను ఆహ్మదాబాద్‌లో రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.

Saturday, August 18, 2012

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా : లక్ష్మణ్‌

  అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌లోని హెచ్‌సీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్‌ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 16 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. 134 టెస్టుల్లో 8781 పరుగులు, 17 శతకాలు, 56 అర్ధ సెంచరీలు, 86 వన్డేల్లో 2338 పరుగులు, 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై ఈనెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక స్కోర్‌ 281 పరుగులు చేశాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. యువతకు అవకాశం కల్పించేందుకే రిటైర్మెంట్‌ అవుతున్నానని చెప్పారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, మిత్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి వాడినయ్యానని అన్నారు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మరవలేనిదని గుర్తుచేశారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Friday, July 20, 2012

మహేష్ కూతురికి పేరు పెట్టిన రాజమౌళి!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్ ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ కోసం ఓ పేరు కూడా సూచించారు.

ఆయన సూచించిన పేరు ాసితారః. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళి మహేష్ కూతురికి పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.

Tuesday, May 29, 2012

క్యాన్సర్‌ను జయించారు వీళ్లు ...

 యువరాజునూ మార్చేసింది
గౌతమి రొమ్ము క్యాన్సర్‌
యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ 
నెల్సన్‌ మండేలా 
సినీ నటి లీసారే  











http://www.prajasakti.com/coverstory/article-354838

'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరోగా నటించాను నేను ...

 ' దూకుడు ' సినిమాలో చేసిన క్యారెక్టర్‌ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీనువైట్ల గారు నా పాత్ర గురించి చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరో డైలాగుల్ని నాతో చెప్పించారు. థియేటర్‌లో ప్రేక్షకులు చూసిన ఆనందం చూసి సంతోషిచానాన్ను . అంతక ముందు చాలా సినిమాలో చేశాను. ఈ సినిమాలో చూసిన ఆనందం అంత ఇంత కాదు. ' మా నాన్న కు పెళ్లి', ' రామచక్కనోడు', ' సర్దుకుపోదాం' సినిమాలు నాకు నంది అవార్డుల్ని తెచ్చిపెట్టాయి.
http://www.prajasakti.com/cinema/article-354601