Friday, February 17, 2012

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

145854 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
రాష్ట్ర ప్రణాళిక వ్యయం 54030 కోట్ల రూపాయలు
ప్రణాళికేతర వ్యాయం 91,824కోట్ల రూపాయలు
ద్రవ్యం లోటు 20008 కోట్ల రూపాయలు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి.
  • జాతీయ వార్షక వృద్దిరేటుకన్నా రాష్ట్ర వార్షక వృద్దిరేటు అధికంగా ఉంది.

  • కేంద్రం నుంచి కరువు సాయంగా 3500 కోట్లు కోరినట్లు మంత్రి తెలిపారు.
  • జాతీయ విపత్తు పద్దు కింద 246 కోట్ల నిధులు రానున్నాయి.
  • ఆదాయ వనరుల సమీకరణ పెంపు.
  • రూపాయికే కిలో బియ్యం.
  • యువతకు ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు.
  • లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
  • రైతులకు స్వయం సహాయక బృందాలకు 1075 కోట్ల వడ్డిలేని రుణాలు
  • రాజీవ్ విద్యామిషన్‌లో 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు
  • 10లక్షల స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ రుణాలు
  • 1లక్ష పైబడిన వ్యవసాయ రుణాలకు పావలా వడ్డి
  • ఇందిర జలప్రభ క్రింద లక్ష బోరుబావుల తవ్వకం
  • రెండు రచ్చబండ కార్యక్రమంలో 50లక్షల మందికి లబ్ధి
  • తీర ప్రాంతాల్లో మౌలిక అంశాలు వసతుల కల్పనకు 25 కోట్లు
  • గ్రామిణ రహదారుల అభివృద్దికి ప్రత్యేక పథకం
  • గ్రామీణాభివృద్దికి 600 కోట్ల రూపాయల నిధులు
  • పంచాయితీరాజ్‌కు 200 కోట్ల నిధులు
  • చిన్ననీటి పారుదల శాఖకు 300 కోట్ల నిధులు
  • రైతాంగానికి వ్యవస్థాగత రక్షణ చర్యలు
  • నూనే గింజల దిగుబడి 25 శాతం తగ్గింది.
  • సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 1 లక్ష వరకు వడ్డీలేని రుణాలు
  • 2012-13 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 2572 కోట్ల నిధుల కేటాయింపు
  • పౌర సరఫరాల శాఖకు 3ద175 కోట్ల రూపాయలు
  • మాంసం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం రెండో స్థానం
  • పాల మిషన్‌లకు మొత్తం 100 కోట్లు కేటాయింపు
  • పశువుల వ్యాదినిరోదానికి 50 కోట్లు పేద రైతులకు పశువుకు కొనడానికి సగం సబ్సీడీ
  • పేద రైతులకు 42 వేల పశువులు అందజేయనున్న ప్రభుత్వం
  • సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం రాష్ట్ర ంనుంచి ఉత్పత్తి అవుతుంది.
  • మత్సకారుల బీమా పథకం క్రింద 234 కోట్ల రూపాయలు కేటాయింపు
  • గ్రామీణ ఉపాధి క్రింద 188 కోట్లు రూపాయలు
  • రాజివ్ యువకిరణాలు పథకం క్రింద ఉపాధి కల్పన
  • ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 104,232 మందికి ఉద్యోగాలు
  • స్వయం సహాయక బృందాలకు రుణాలకు స్త్రీనిధి ద్వారా నిధులు
  • 1146 స్త్రీ శక్తి భవనాలకు ఒక్కోదానికి 25 లక్షలు చొప్పున కేటాయింపు
  • వ్యవసాయ రుణాలు రూపాయలు 51020 కోట్లు
  • 2012- 13 లో గ్రామీణాభివృద్దికి రూ 4703 కోట్లు
  • జాతీయ ఉపాధి మిషన్, ఉపాధి హామి పథకం అమలులో రాష్ట్రనిదే అగ్రస్థాన
  • ఇందనం, విద్యుత్‌శాఖలకు రూపాయలు5937 కోట్లు కేటాయింపు
  • రవాణా రోడ్డు భవనాలు రూ. 5032 కోట్లు కేటాయింపు
  • పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
  • సాంఘీక సంక్షేమ శాఖ రూ. 2677 కోట్లు
  • గిరిజన సంక్షేమ శాఖ రూ 1540 కోట్లు
  • రాజీవ్ యువకిరణాలకు రూ. 777కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 3014 కోట్లు
  • మహిళా సంక్షేమశాఖ రూ. 2283 కోట్లు
  • వికలాంగుల సంక్షేమ రూ 66 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ. 489 కోట్లు
  • పాఠశాల విద్యా రూ. 15510 కోట్లు
  • సాంకేతిక విద్యా రూ. 1087 కోట్లు
  • ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
  • గృహ నిర్మాణం రూ 2302కోట్లు
  • కార్మిక ఉపాధి శాఖ 500 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖ 88 కోట్లు
  • మత్య శాఖ రూ . 234 కోట్లు
  • ఐటీ శాఖ రూ. 151 కోట్లు
  • నీటి పారుధల శాఖ రూ. 15010 కోట్లు
  • పరిశ్రమలు రూ. 633 కోట్లు
  • హోశాఖ రూ. 4832 కోట్లు
  • వైద్య, ఆరోగ్య, కుటుంభ సంక్షేమం రూ. 5889 కోట్లు
  • పర్యాటక, సాంస్కక్షుతిక శాఖ, క్రీడాలు రూ 280 కోట్లు
  • రెవిన్యూ మిగులు రూ. 4444 కోట్లు
  • పర్యటక, అటవీ శాఖ రూ. 524 కోట్లు
  • ఈ ఏడాది ఆర్టీసీ 6000 కొత్త బస్సులు
  • ఆర్టీసీ రాయితీల క్రింద రూ. 710 కోట్లు చెల్లింపు
  • వెనకబడిన 66 మండలాల్లో బాలికలకు కొత్త బడులు
  • 22 జిల్లాల్లో 876 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన
  • గోదావరిపై రాజమండ్రి వద్ద రెండో వంతెన నిర్మాణం పనులు 70 శాతం పూర్తి
  • డిమాండ్‌కు అనుగూనంగా 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • రాష్ట్రంలో 29.84 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ కేటాయింపు
  • ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో 65664 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
  • బోధన ఫీజు చెల్లిపునకు రూ. 2142 కొట్లు కేటాయింపు
  • వికలాంగుల వివాహాల ప్రోత్సాహం కోసం 50 వేలు పెంపు
  • ఇందనం విద్యుత్ శాఖకు రూ. 5937 కోట్లు
  • పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
  • ప్రతి శాసనసభా నియోజక వర్గంలో ఇండోర్‌స్టేడియం
  • జాతీయ తుఫాను విపత్తు ఉపసమనం క్రింద రూ. 2055 కోట్లు
  • హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మూడు ప్రాజెక్టులు అమలు
  • ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ. 6786 కోట్లు కేటాయింపు
  • ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 640 కోట్లు కేటాయింపు
  • క్రీడా రంగానికి రూ. 22 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు కేటాయింపు

Friday, February 10, 2012

టాలీవుడ్‌ బామ...

కాజల్‌ స్పీడ్గ రెట్టింపైంది. బిజినె స్‌మేన్‌ సెక్సస్‌తో తారా పథంలోకి దూసుకువెళ్లిన కాజల్‌కి తమిళం లో...తెలుగులో అవకాశాల వెల్లువ వచ్చిపడుతోంది. సూర్య, విజయ్‌ల చిత్రాల లో నటిస్తూ తమిళనాట తన హవా కొనసా గిస్తోంది. టాలీవుడ్గ లోనూ పెద్ద హీరోల చిత్రాలలో నటిం పజేసేం దుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.

Tuesday, January 31, 2012

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.

చెవిలో పూలు పెట్టుకోవడం ఎప్పుడైనా చూస్తారా ఇది చూడండి.
 



Monday, January 30, 2012

పవన్ సరసన్ కాజల్?


DSC55 talangana patrika telangana culture telangana politics telangana cinema‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో మేఘాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. గ్లామర్‌తో పాటు చక్కటి అభినయం కలబోసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని మురిసిపోతోంది ఈ వయ్యారి. అయితే యాక్షన్ సినిమాల కంటే తనకు స్వతహాగా కామెడీ సినిమాలంటే ఇష్టమని, ఫుల్‌పూంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నటించాలన్నది తన చిరకాల కోరికని సెలవిస్తోంది కాజల్ అగర్వాల్. ‘చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం వుండదు. అంతేందుకు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తా. అయితే సినిమాల్లోకి వచ్చాక యాక్షన్ సినిమాలకు తప్పనిసరిగా అలవాటు పడిపోవాల్సి వచ్చింది.
రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్‌మేన్’ సక్సెస్‌తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్‌గా ఓకే చేయనున్నట్లు సమాచారం.

Friday, January 27, 2012

మూడు భాషల్లో రాణిస్సా!

అంతా యువతీయువకులే ఉన్న టీమ్‌తో పనిచేస్తే హుషారొస్తుంది. ఫలితమూ అంతే బావుంటుంది’’ అంటున్నారు ‘కొలవెరి..డి’ ఫేం, ‘3’ సంగీతదర్శకుడు అనిరుధ్‌. 21ఏళ్ల ఈ యువకుడు ఒకే ఒక్క ‘కొలవెరి..’తో ప్రపంచ ప్రసిద్ధ సంగీతదర్శకుడైపోయాడు. తెలుగు, తమిళ్‌, హిందీలో నేడు వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ-‘ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ‘3’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. ఆల్బమ్‌లో రెండు పాటలు కూడా పాడాను. ‘కొలవెరి...’కి కోరస్‌ పాడాను. అసలు ‘కొలవెరి...’ అనేది ప్రేమలో విఫలమైనప్పుడు..విచారంలో పాడుకునే పాట. రొటీన్‌కి భిన్నంగా ఉండాలని బాణి కొత్తగా వినిపించాను. హాస్యం, విచారం ఒకే పాటలో ఉండేలా ట్యూన్‌ కట్టడం చాలా కష్టం. ప్రయత్నించి సక్సెసయ్యాను. అలాగే ‘3’ సినిమాకోసం ముందస్తు ప్రణాళికలెన్నో. సెట్స్‌కెళ్లడానికి ముందు 13 లఘుచిత్రాలు మేమంతా కలిసి రూపొందించాం. అందులోంచి ఓ లఘుచిత్రాన్ని పూర్తి స్థాయి ఫీచర్‌ సినిమా ‘3’ గా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ని విపరీతంగా అభిమానించే అనిరుధ్‌..బికాం పూర్తిచేసి లండన్‌ ట్రినిడాడ్‌ సంగీతకళాశాలలో మ్యూజిక్‌ కోర్స్‌ పూర్తిచేశారు. కర్నాటిక్‌ సంగీతంలోనూ మంచి ధిట్ట.

Sunday, January 22, 2012

ప్రిన్స్‌కు వదిన దొరికినట్లేనా!

వెంకటేష్‌, మహేష్‌బాబుల సంచలన కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయింది. అయితే గత కొంతకాలంగా వెంకటేష్‌ సరసన నటించే హీరోయిన్‌ విషయమై సందిగ్థం నెలకొంది. త్రిష, భూమిక, అమలాపాల్‌ లాంటి హీరోయిన్ల పేర్లు ఆ మధ్య వినిపించాయి. తీరా విషయానికి వస్తే అవన్నీ ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు అనూహ్యంగా అంజలి పేరు వినిపిస్తోంది. అంజలి అచ్చంగా తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ అచ్చతెలుగు అందాల అపరంజి బొమ్మను వెంకటేష్‌ పక్కన నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్‌ సరసన అయితే ఓకేగానీ హీరోయిన్లంతా ప్రిన్స్‌ మహేష్‌బాబుకు ఒదిన పాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు అంజలి కూడా అవకాశం ఉపయోగించుకుంటుందో లేక మిగతా హీరోయిన్ల మాదిరిగా వదులుకుంటుందో మరి వేచిచూడాలి.