Tuesday, January 17, 2012

మార్చిలో జహీర్‌ ఖాన్‌ పెళ్లి

భారత క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ ఓ ఇంటివాడు కానున్నారు. చిరకాల స్నేహితులు, బాలీవుడ్‌ తార ఇషా షేర్వాణితో జహీర్‌ మార్చి నెలలో పెళ్లి జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జహీర్‌ ఖాన్‌ పెళ్లి జరిగే అవకాశముంది. ఒక వేళ మార్చి నెలలో సాధ్యపడకపోతే అక్టోబర్‌ నెలలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Friday, January 13, 2012

ఎవరు మారినా వీళ్లు మాత్రం మారారు ...

సచిన్‌, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌
ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లల్లో భారత్‌ అదే తీరు ఉంది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇండియా బ్యాట్స్‌మెన్‌లు సచిన్‌, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. కాని ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్‌లో కూడా పైచేయి సాధించలేకపోయారు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో కూడా రాణించలేకపోయారు. ఇప్పటికైనా అవకాశం ఉంది.

బిజినెస్ మెన్ రివ్యూ

 మహేష్, పూరి జగన్నాథ్ ల పోకిరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి అలాగే ఉంటుందా. దాన్ని తలదన్నే రేంజ్ లో ఉంటుందా. దూకుడు తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఆ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందా…., ఇలాంటి సందేహాలతో థియేటర్లో కూర్చున్న వారికి సందేహాలు తీర్చేసి, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సందేశం కూడా ఇచ్చెసాడు పూరి. చూసే ( దర్శకుడు చూపించే ) యాంగిల్ బావుంటే చెడులో మంచిని, విలన్ లో హీరోను చూడవచ్చు. బిజినెస్ మెన్ లో ఇదే చూస్తాం. ఫస్ట్ ఫ్రేం నుంచి చివర వరకు హీరో విలన్ లాగే చూస్తాడు. విలన్ లాగే మాట్లాడుతాడు. అయినా కూడా విలన్ లా కనిపించే హీరో నచ్చుతాడు. సింపుల్ గా చెప్పాలంటే యాంటీ హీరోయిజం. కథ పరంగా చెప్పుకోవాలంటే బిజినెస్ మెన్ లో కథ ఏమీ లేదు. ఉన్నదంతా హీరో క్యారక్టరైజేషన్ మాత్రమే. సూర్య (మహేష్ ) అనే వ్యక్తీ వంద కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు. అతననుకున్నది సాధించడా లేదా అనేదే సినిమా. ప్రతి మనిషికి ఓ గోల్ ఉండాలి. అది సాధించి తీరాలి అనే విషయాన్ని చాలా సినిమాల్లో చూసి ఉంటాం కాని, అదే విషయాన్ని బిజినెస్ మెన్ లో ఓ కొత్త కోణంలో చూస్తాం. ఓవరాల్ గా సినిమా బాగుంది. మహేష్ యాక్టింగ్ సూపర్. డైలాగ్ డెలివరీ లో మహేష్ స్టైల్ సూపర్ హిట్. మహేష్ స్టైల్ కు తగ్గట్టుగానే పూరి డైలాగ్స్ కూడా ఆదరగ్గొట్టా యి. డైలాగ్స్ అంటే కేవలం పంచ్ ల కోసమే మాత్రమే కాకుండా వాటిలో మంచి మీనింగ్ కూడా ఉండేలా పూరి డైలాగ్స్ ఉన్నాయి. కాజల్ గత సినిమాలకంటే గ్లామరస్ గా ఉంది. పూరి సినిమాల్లో ఉండే విధంగానే కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ పెంచింది కాజల్. అవసరమైన మేరకు యాక్షన్ ఉంది. ప్రత్యేకమైన కామెడీ ఏమీ లేకపోయినా ఎక్కడా ఆ లోటు కనిపించదు. మహేష్ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. చప్పట్లు కొట్టిస్తాయి. స్క్రీన్ మీద కనిపించే హీరో మహేష్ అయితే, స్క్రీన్ వెనుక ఉన్న హీరో తానె అంటూ పూరి తన డైలాగ్స్ తో చూపించాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ శృతి మించినా, మంచి డైలాగ్స్ ఎక్కువ ఉండటంతో అవే గుర్తుకు వస్తాయి. తమన్ మ్యూజిక్ దూకుడు స్థాయిలో లేదు. ఉన్నంత వరకు ఫర్వాలేదు. ఆడియో రిలీజ్ అవ్వగానే హిట్ అయిన సార్ వస్తారా…, బాడ్ బోయ్స్, ముంబాయి సాంగ్స్ మాత్రమే మంచి రెస్పాన్స్ సంపాదించాయి. మిగతా  సాంగ్స్ ఒకే. కాజల్ ఫ్రెండ్ క్యారక్టర్ డైలాగ్స్ ఇరిటేటి౦గ్ తెప్పిస్తాయి. కాజల్ కు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పేవారే బెటర్. లవ్ ట్రాక్, ఇంటర్వెల్ సీన్ పోకిరిని తలపిస్తాయి. టెక్నికల్ విషయలన్నింటిని డైలాగ్స్ డామినేట్ చేసేసాయి. సినిమాలో టెక్నికల్ మేటర్స్ అన్నీ సాధారణంగా కనిపిస్తాయి. ఓవరాల్ గా బిజినెస్ మెన్ డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది. సినిమాకి మళ్ళీ మళ్ళీ రప్పించే ఎంటర్ టైన్ మెంట్ లేదు, సినిమాను రిలీజ్ చేయడం అత్యంత భారీగా చేసారు  కాబట్టి రికార్డులు విషయంలో బిజినెస్ మెన్ మొదటి రోజు, మొదటి వారం రికార్డులు తప్ప పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.

Thursday, January 12, 2012

Monday, January 9, 2012

Sunday, January 8, 2012

కొత్త ఏడాది..కొత్తగ

 లవర్‌బోయ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా..ప్రేమకథకు యాక్షన్‌ జోడించిన చిత్రాలలో నటిస్తున్నా. కొత్త సంవత్సరంలో సరికొత్తగా మీ ముందుకొస్తున్నా’’ అన్నారు తరుణ్‌. ఆదివారం ఈ యువహీరో పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాజా సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ యాక్షన్‌ కథాంశం ఉన్నవే. చక్రి సంగీతం అందిస్తున్నారు. ‘అనుచరుడు’ 3పాటల చిత్రీకరణ సహా నాలుగు రోజుల షూటింగ్‌ మిగులుంది. నాపై యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేస్తున్నారిప్పుడు. తదుపరి ఓ పాటను సెట్‌లో, మిగతావి హైదరాబాద్‌ పరిసరాల్లో తెరకెక్కిస్తారు. ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తారు. మరో సినిమా ‘యుద్ధం’ 30శాతం పూర్తయింది. అనుచరుడు తర్వాత మిగతా చిత్రీకరణ సాగుతుంది. 
అలాగే కొన్ని స్క్రిప్టు దశలో ఉన్నాయి’’ అన్నారు. సినిమాల ఎంపిక విషయమై మాట్లాడుతూ -స్క్రిప్టు నచ్చి, పాత్రకు సూటవుతానని భావిస్తే ఏ తరహా చిత్రంలోనైనా చేస్తానని అన్నారు. వెంకటేష్‌ సారథ్యంలో ‘సిసిఎల్‌ సీజన్‌ 2’ క్రికెట్‌ కప్‌ను కచ్ఛితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తరుణ్‌. ఈ సారి టాలీవుడ్‌ టీమ్‌ మరింత బలంగా ఉందన్నారు. మ్యాచ్‌ ఫలితం ఏదైైనా..ఆటతో అందరికీ వినోదాన్ని పంచుతామన్నారు. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘దానికింకా టైముంది. రెండేళ్ల సమయం పట్టొచ్చు’ అన్నారు. తన పుట్టినరోజు వేడుకల కోసం విచ్చేసిన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.

Saturday, January 7, 2012

నిర్మాతగా పదేళ్ల ప్రయాణం!

DSC_0407-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘2002లో బాలాదిత్య నటించిన ‘చంటిగాడు’ చిత్రంతో నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లయ్యింది’ అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు. ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నిర్మాతగా నా ప్రస్థానం మొదలై ఈ ఏడాదితో పదేళ్లు కావడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ‘ప్రేమకావాలి’ ఫేమ్ ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లవ్‌లీ’ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నాను. బి. జయ దర్శకురాలు. శాన్వి నాయికగా నటిస్తోంది. నాలుగు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 2 నుంచి డబ్బింగ్ ప్రారంభించాం. ఓ పాటను ఈ నెల 8నుంచి కేరళలోని చాలకుడిలో సబీనా ఖాన్ నేతృత్వంలో చిత్రీకరించనున్నాం. మరో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.