2012 సంవత్సరంలో టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ఉండబోతుంది. సంక్రాంతి ముందు రోజు అతర్వాత రోజు, మరుసటి రోజు, ఇలా నాలుగు రోజుల పాటు సినిమా సందడి వుంటుంది. జనవరి 11న మహేష్ బాబు, కాజోల్ నటించిన ' బిజినెస్ మేన్‌తో సందడి కాబోతుంది. ఆ తరువాత రోజు 12న వెంకటేష్, త్రిష్ కాంబినేషన్‌లో ' బాడీగార్డ్ ' బారీ అంచనాలతో విడుదల అవుతుంది. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్‌లో రెండు సినిమాలు విడుదల కాగా ఇంకా మూడో సినిమా హిట్ కోట్టి హాట్రిక్ సాదించాలని అశిస్తున్నారు. ఇంకా మరుసటి రోజు రవితేజ, థీక్షాసేధ్ కాంబినేషన్‌లో వస్తున్న ' నిప్పు' విడుదల సిద్దం అవుతుంది. వీటితో పాటు మరో సినిమా విడుదల సిద్దం కాన్నుంది. ' పులరంగడు' సునిల్ హీరోగా నటించిన సినిమా వీటితో పాటు విడుదలకు ' సై ' అంటున్నాడు. జనవరి 11 నుంచి 14 వరకు ధియేటర్లు మంచి కలెక్షన్‌లు, రికార్డులు బద్దలు కోట్టుకునే అవకాశం ఉంది. వీటి కన్నా ముందుగానే డిసెంబర్ 29న నందమూరి తారక్ నటించిన ' నందీశ్వరుడు' విడుదల సిద్దం కాన్నునంది. అలాగే 30న విక్రమ్ నటించిన సినిమా ' వీడింతే ' కూడా రిలీజ్ అవుతుంది.
Sunday, December 25, 2011
Saturday, December 24, 2011
Friday, December 23, 2011
బిజినెస్ మేన్ ఆడియో విడుదల మూడు బాషల్లో
మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్ జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ' బిజినెస్ మేన్' ఆడియో వేడుక హైదరాబాదులో జరిగింది. మూడు బాషల్లో ఆడియోను విడుదల చేశారు. తమిళ వర్షన్ ఆడియోను కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. మలయాళం ఆడియోను డి. రామానాయుడు, రాజమౌళి విడుదల చేయగా, తెలుగు వెర్షన్ పాటలను మహేష్, శ్రీను వైట్ల ఆవిష్కరించారు.
2011తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు ...
టాలీవుడ్ వివాదాపై ఓసారి లుక్కేద్దాం. రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓసంచలనం సృష్టించింది. సీమ ఫ్యాక్షన్ గొడవల యదార్ధ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో..నిజ జీవితంలో వ్యక్తులమధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్‌ను సినిమా రూపంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై కొన్ని రోజులకే సూరి హైదరాబాద్ నడి ఒడ్డున జనవరి 3న హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత చెప్పకోదగ్గది టాలీవుడ్ డ్రగ్ రాకెట్! పలువురు నిర్మాతలకు, నటులకు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించడమే కాదు, పలువురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కూడా. రవితేజ సోదరుడు రఘుబాబు, భరత్ డ్రగ్స్ కొంటూ పట్టబడగా, ఇద్దరు నిర్మాతలు డ్రగ్స్ అమ్ముతూ పట్టబడ్డారు.
నటి జీవిత సోదరుడు కూడా ఈకేసులో పోలీసులకు చిక్కాడు. ఇక హీరో వరుణ్ సందే్‌శకు డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలు సర్వత్రా చర్చనీయాంశం అయింది.మగధీర చిత్రం ద్వారా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ ఎఫ్ హెచ్‌ఎం పురుషుల మ్యాగజైన్ పై టాప్‌లెస్ గా దర్శనం ఇచ్చింది. కాజల్ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాజల్ మాత్రం అది నాఫోటోకాదు మార్ఫింగ్ అంటూ ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక... వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా హత్య కేసులో ఇరుక్కుంది ఇటీవల మరణించిన ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్ రెడ్డి రాసిన తన ఆత్మకథ పుస్త్తకం ాఇది నా కథ్ణ... ఈ పుస్త్తకంలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, గుణశేఖర్, రాజశేఖర్ తదితరుల మీద ఆయన రాసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఆ మధ్య రామ్‌చరణ్ తేజ్ దాసరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి.
నిర్మాతలకు, కార్మికులకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో కొంత కాలం సినిమా షూటింగులు ఆగిపోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమా షూటింగులపై దాడులు జరిగాయి. ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం నందమూరి, మెగా కుటుంబ హీరోల అభిమానుల వివాదాలు రచ్చకెక్కాయి. రామ్‌చరణ్, మహేష్‌బాబుల సినిమాల రికార్డుల విషయంలో కూడా రచ్చజరిగాయి.హీరో నాగార్జున తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఓ మహిళా జర్నలిస్ట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా వివరణ ఇమ్మంటూ నాగార్జునకు కోర్టు కోరింది.

Tuesday, December 20, 2011
వెంకటేష్ చిత్రంలో జగపతిబాబు
తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా మొదలైనట్లు కనిపిస్తోంది. ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు నటిస్తుండగా రామ్‌చరణ్ హీరోగా నిర్మిస్తున్న ' ఎవడు ' చిత్రంలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నా విషయం తెలిసిందే. వెంకటేష్ కథానాయకుడుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించడానికి జగపతిబాబు అంగీకరించనట్లు సమాచారం. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో ' హనుమాన్ జంక్షన్ ' , మనసులో మాట ' లాంటి మల్టీస్టారర్ చిత్రాల్లో జగపతిబాబు నటించారు.
Saturday, December 17, 2011
ఇద్దరూ... ఇద్దరే ( వీరేంద్ర సెహ్వగ్, జహీర్‌ఖాన్ )
ఈనెల 26న భారత, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమవుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వగ్, జహీర్‌ఖాన్ ఎంతో విలువైన పాత్రను పోషిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ భారీ స్కోరు చేయటానికి సెహ్వాగ్ ఉన్నాడు. ఐదువికెట్లు తీయటానికి జహీర్ సిద్ధం. ఇద్దరు తురుపుముక్కలు భారత జట్టులో ఉన్నారు.’ అని చాపెల్ తెలిపాడు. అయితే ఆసీస్ బౌలర్ పాటిన్‌సన్ సీరీస్‌ను ప్రభావితం చేయగలడని చాపెల్ అన్నాడు. ఇటీవల పాటిన్‌సన్ బౌలింగ్ గణాంకాలు చూస్తుంటే రాబోయే టెస్టు సీరీస్‌లోనూ అతను రాణిస్తాడని ఇయాన్ చెప్పాడు. స్వదేశీ పిచ్‌లు ఆస్ట్రేలియాకు అనుకూలంగానే ఉన్నా, జట్టు గాయలతో ఉండటం మూలంగా భారత్ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పరమచెత్తగా కూడా ఊహించుకోలేకపోతున్నామని చాపెల్ ఘాటుగా విమర్శించాడు. బౌలింగ్‌ను మెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఆసీస్ బ్యాటింగ్‌పై తీవ్రంగా విమర్శించాడు. అసలు ఫామ్‌లోనే లేని రికీ భవితవ్యాన్ని ఈ సీరీస్‌యే నిర్ణయిస్తుందని ఇయాన్ అన్నాడు.
ధోనికి సిఎన్‌ఎన్ - ఐబిఎన్ అవార్డు
ఈ సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్నప్పుడు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని ఎంతగా భావోద్వేగానికి గుర య్యాడంటే ఫైనల్ మ్యాచ్ తరువాత జట్టు సహచరులతో పాటు అతను కూ డా ఏడ్చే శాడు. ‘ఫైనల్ మ్యాచ్ అనంతరం క్రీడాకారులందరూ ఏడ్చేశారు. నేనూ ఏడ్చాను. అయితే, ఆ ఫుటేజ్ ఎక్కడా లేదు. ప్రపంచ కప్ గెలుచుకోవాలన్నది మా అందరి కల అయినందున భావోద్వేగాలను అణచు కోవడం చాలా కష్టమైంది’ అని ధోని చెప్పా డు. శుక్రవారం రాత్రి ధోనికి ‘సిఎన్‌ఎన్-ఐబిఎన్ స్పోర్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించారు.
ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్ట్ సీరీస్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లే ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ధోని ఈ విషయం తెలియజేశాడు. ‘నేను ఏడ్చేశాను. నేను తలెత్తి చూస్తే తక్కిన క్రీడాకారులు నా చుట్టూ చేరారు. నేను డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తాను. అని ధోని తెలిపాడు.ఈ అవార్డుకు ఇతర నామి నీలలో క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, ఆర్చర్ దీపికా కుమారి, షూటర్ రంజన్ సోధి, బాక్సర్ వికాస్ కృష్ణన్, బ్యాడ్మింటన్ జోడి జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప ఉన్నారు. సోధికి, క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ప్ర త్యేక ఘనత అవార్డులు ప్రదానం చేశారు.

Subscribe to:
Posts (Atom)